చలన చిత్రోత్సవాలు back to homepage

kanchiPoster 55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు) ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది) ఉత్తమ స్క్రీన్ [...]

awards-cannes Cannes 2009-అవార్డులు

ఈ నెల 13 నుంచి ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు తో ముగిసింది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు మరియు నటీ నటులకు ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించబడ్డాయి. 2001 లో Piano Teacher సినిమాకి గ్రాండ్ ప్రి అవార్డ్ అందుకున్న మైఖేల్ హనికి ఈ సంవత్సరం వైట్ రిబ్బన్ సినిమాకి గానూ ప్రతష్టాత్మకమైన Palme d’Or అవార్డు అందుకున్నారు. [...]

cannes-2009 Cannes 2009

మరో Cannes సినిమా పండగ మొదలయింది. ఆర్థిక మాంద్యం, క్రెడిట్ క్రంచ్ మూలంగా సినిమా పరిశ్రమ కూడా బాగానే దెబ్బతిందని ఒక వైపు వినిపిస్తున్నా ఈ సారి Cannes లో ప్రదర్శించే సినిమాల లిస్టు చూస్తే మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టే అనిపిస్తుంది. ఈ సారి Cannes చలనచిత్రోత్సవంలో ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ దర్శకులు తమ చిత్రాలతో పోటీ పడుతున్నారు. Quentin Tarantino, Tasi-Min Lang, Michael Haneke, Johnnie To, Park-Chan Wook, Pedro Almodovar, [...]

kabuli-kid కబూలి కిడ్

చిత్రం: కబూలి కిడ్ దేశం:ఆఫ్ఘనిస్తాన్ దర్శకుడు: బర్కం అక్రం. అఫ్ఘనిస్తాన్ లో యుద్ధాల పుణ్యమా అని పెద్దగా చిత్రాలు తియ్యలేదు. San Francisco Film Festivalలో భాగంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.నేను చూసిన మొట్టమొదటి అఫ్ఘానీ చిత్రం ఇది. కధ: ఒక అమ్మయి ఒక చంటిపిల్లవాడిని ఒక టాక్సీలొ వదిలి వెళ్ళిపోతుంది. ఆ డ్రైవరుకు ఆ పిల్లవాడిని ఏమి చెయ్యాలో తెలియదు. ఆ పిల్లవాడి తల్లిని వెతకాడనికి ఇంకా ఆ పిల్లవాడిని వదుల్చుకోవడానికి పడే పాట్లే ఈ [...]

best B-est చలనచిత్రోత్సవం

రొమానియా దేశం రాజధాని బుకారెస్ట్ లో ఈ నెల 23-30 వరకూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు వుడి అలెన్ దర్శకత్వంలో ఈ మధ్యనే వచ్చిన వికీ, క్రిస్టీనా, బార్సిలోనా చిత్రం ఈ చలనచిత్రోత్సవం ప్రారంభోత్సవ సినిమా ప్రదర్శింపబడింది.ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, స్టూడెంట్ షార్ట్ ఫిల్మ్ – అనే నాలుగు విభాగాల్లో ఈ క్రింది చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. Feature Films Competition 1. Absurdistan (directed by Veit Helmer, [...]

kafiso-dairy భావోద్వేగాల ’పాలపిట్ట’లు

మన రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఫిలిం క్లబ్ లు రెండే. ఒకటి హైదరాబాద్ ఫిలిం క్లబ్. రెండోది కరీంనగర్ ఫిల్ం సొసైటి(కఫిసొ). ఈ రెండు చోట్లా ప్రతీనెలా కొన్ని మంచి సినిమాల ప్రదర్శనతోపాటు అప్పుడప్పుడు చిత్రోత్సవాలు నిర్వహించి మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులకు విందు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు కరీంనగర్ లో జరిగిన లఘు, డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో 41 సినిమాల్ని చూసి ’పాలపిట్ట అవార్డు’లను నిర్ణయించే [...]

loha And the award goes to…

ఈ నెల (ఫిబ్రవరి, 2009) 19 నుంచి 22 వరకూ కరీంనగర్ లో జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ [...]

arrahman-feature మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సాధించిన తొలి భారతీయునిగా రెహమాన్‌ రికార్డులకెక్కాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్‌ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు [...]

nandi-lead నంది అవార్డులు 2007

కంగ్రాట్స్ … రాష్ట్ర ప్రభుత్వం 2007 యేడాదికి గాను నంది అవార్డులు ప్రకటించింది. ‘మీ శ్రేయోభిలాషి’ ఉత్తమ చిత్రంగా, చందమామ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే), నటిగా ఛార్మికౌర్(మంత్ర)‌, ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు(లక్ష్యం), సహాయ నటిగా జానకి, అల్లూరామలింగయ్య అవార్డుకు ఉత్తేజ్‌ ఎంపికయ్యారు.ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్(హ్యాపీడేస్) చిరుత సినిమాలో నటనకు రామ్‌చరణ్‌తేజ్‌ కు [...]

kerala-film-festival-lead 13వ కేరళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం

కేరళ ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ చే నిర్వహించ బడే పన్నెండవ కేరళ చలన చిత్రోత్సవం ఈ సంవత్సరం డిశెంబరు 12 నుంచి 19 వరకూ జరగనుంది. తిరువనంత పురంలో జరిగే ఈ ఉత్సవంలో గత సంవత్సర కాలంలో ప్రపంచ దేశాల్లో నిర్మించబడిన అత్యుత్తమ చిత్రాలెన్నింటినో ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ చిత్రోత్సవంలో ’కాంపిటీషన్’ విభాగంలో 14 చలనచిత్రాలు ప్రదర్శిస్తుండగా, డాక్యుమెంటరీ విభాగంలో 18 చిత్రాలు, ’ఇండియన్ సినిమా టుడే’ విభాగంలో 5 ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, ’మలయాళం [...]

golden-globe-lead గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్

హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఉత్తమ చలనచిత్రాలకు అందించే గోల్డన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ ఈ రోజు ప్రకటించారు. తొలిసారిగా మన దేశానికి చెందిన ఒక సంగీత దర్శకుడి పేరు ఈ లిస్టులో చోటు చేసుకోవడం విశేషం. ఆ సంగీత దర్శకుడెవరో, ఏ సినిమాకి ఆయన నామినేషన్ అందుకున్నారో చెప్పక్కర్లేదనుకుంటాను. గోల్డన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్ అయిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు: Best motion picture – drama The curious [...]

iffi-2008 గోవా బంగారాలు ఇవే ..

గోవాలో నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్‌, గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ హాజరయ్యారు. ఈ ముఫ్ఫై తొమ్మిదివ ‘ఇఫి’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ముగింపు రోజు అవార్డుల ప్రకటన జరిగింది. అందులో కజకస్థాన్‌ చిత్రం ‘తల్పన్‌’ బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు.సెర్గి డివోర్ట్‌ సెవాయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఔత్సాహిక దర్శకుడి అవార్డును కూడా [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories