చూడదగ్గ చిత్రాలు back to homepage

IB-The-Devils-Eye-poster-1 The Devil’s Eye (1960) – Ingmar Bergman

సైతాను ఆఫీసు గదిని, అందులో ఉన్న లైబ్రరీ ని చూసారా మీరెప్పుడైనా? సైతాను దూత ఒకటి – ఇద్దరు ప్రేమికుల మధ్య తగువులు పెట్టేసి, అక్కడే ఒక మూలన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వడం చూసారా? ఇంతటి దుష్ట దూతనూ, “వైన్ బాటిల్ కప్ బోర్డులో ఉంది. కాస్త తీసిస్తావా?” అని అడిగి, అది లోపలి వంగగానే, తోసేసి, కప్బోర్డు మూసేసి తాళం పెట్టేసిన వాడిని? సైతాను “డబ్బూ పోయే శనీ పట్టే” అన్న చందాన దిగులుగా [...]

220px-Dvd_hirak_rajar_deshe సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

ఒక నాలుగేళ్ల క్రితమేమో – ఈ సినిమా షూటింగ్ లో తన అనుభవాల గురించి రాయ్ “చైల్డ్ హుడ్ డేస్” అనే పుస్తకంలో రాసారు. చదివిన ఒక సంవత్సరం లోపే, ఆ వ్యాసాన్ని నేను నవతరంగంలో అనువదించాను. అప్పటికి నాకు కథ తెలుసుకానీ, సినిమా చూడలేదు. కథ చదివినప్పుడు పిల్లల సినిమానే అనుకున్నా కానీ, చూస్తూ ఉంటే అర్థమైంది – ఎంత వ్యంగ్యం ఉందో. ఆ ఏటి ఉత్తమ బెంగాలీ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుని, సైప్రస్ [...]

whit తెలుపు-నలుపుల తెరపై ’వైట్ నైట్స్’

సాహిత్యంలో అనుబంధం ఉన్నవారికి రష్యన్ రచయిత Dostoyevsky పేరు సుపరిచితం. వీరు 1848లో రాసిన కథ “వైట్ నైట్స్”ను ఆధారంగా తీసుకొని 1957లో తీసిన ఇటాలియన్ సినిమా, “Le notti bianche” గురించిన పరిచయ వ్యాసం ఇది. ఇదో త్రికోణ ప్రేమకథ. ఒక ఆసామి తన రోజువారి పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తుండగా, వాగుపై నున్న వంతెన మీద నిలబడి ఓ అమ్మాయి భోరు భోరున ఏడుస్తుంటుంది. చూస్తూ చూస్తూ ఆ అమ్మణ్ణి అలా వదిలిపోవటం [...]

Werner_Herzog_Bruxelles_02_cropped వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన

ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే [...]

amu1 “అము” (2005): ఒక పరిచయం

బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం, [...]

vlcsnap-2011-10-13-14h19m26s30 P O E T R Y – ఓ హృద్యమైన కవిత

పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది? [...]

a-k-tesad-fleri-sever-original “L O V E” – it just happens.

కొన్ని విషయాలు చాలా సరళంగా ఉంటాయి.. కాని ఆ సరళత్వం లోనే సంక్లిష్టత ఉంటుంది.జీవితం కూడా అంతే. చాలా సరళంగా కనపడుతుంది. ఈ స్నేహాలు,బాంధవ్యాలు.. ఒడిదుడుకులు..జీవితం విసిరే సవాళ్లు,కలయికలు..విడిపోవటాలు..తెలిసి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. తద్వారా మనం గొప్ప భావోద్వేగాలకి గురి అవుతూనే ఉంటాం.ఆ భావోద్వేగాలే మనకి గొప్ప అనుభూతిని  కలిగిస్తాయి,ఒకింత దృష్టి పెడితే తద్వారా గొప్ప జీవిత సత్యాలని గ్రహిచగలుగుతాం. Ask Tesadüfleri Sever  (Love Likes Coincidences) ఈ సినిమా కూడా అంతే… చాల సరళంగా [...]

OruCheruPunchiri ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు

ఈ సినిమా గురించి ఇదివరలోనే నవతరంగంలో రెండుసార్లు రాసారు. కానీ, నేను చెప్పుకోవాల్సింది కూడా కొంత ఉందని… ఈ సినిమా మన తెలుగు కథ “మిథునం” ఆధారంగా తీసారు. ఎం.టి.వాసుదేవన్ నాయర్ దర్శకుడు. మిథునం కథ నేను చదివి కొన్నాళ్ళైంది. కనుక, వాక్యాలు అవీ యథాతథంగా గుర్తు లేవు. దాని వల్లనే కాబోలు, ఏ విధమైన ప్రిజుడిస్ లేకుండా ఈ సినిమా చూడగలిగాను అని నాకు అనిపించింది. నిన్న సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో నవతరంగం తెరిచి ఈ [...]

trisna తృష్ణ-The next big thing?

స్లమ్ డాగ్ మిలియనీర్ తర్వాత ప్రపంచ సినిమా దృష్టి మన భారతదేశం పై పడిందని చాలా మందే అన్నారు. ఆ క్రమంలో మన దేశం బ్యాక్ డ్రాప్ లో కొన్ని సినిమాలు నిర్మింపబడ్డాయి కానీ ఏదీ కూడా స్లమ్ డాగ్ మిలియనీర్ అంత ప్రాచుర్యం పొందలేదు. కానీ ఈ మధ్యనే మన దేశంలోని రాజస్థాన్ నేపధ్యంలో నడిచే బ్రిటిష్ సినిమా ఒకటి ఫెస్టివల్ సర్క్యూట్ లో దుమ్ము దులిపేస్తుంది. ఆ సినిమా పేరే “తృష్ణ స్లమ్ డాగ్ [...]

Pinjar-Wallpaper-001 వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!

ఆధునిక భారత దేశ చరిత్ర లో ‘ దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలు చేసే సమయం, సందర్భం, సన్నివేశం.అప్పటి రక్తపాతం, హింస తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టించే భయానక దుస్వప్నం. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మనసుని దుఃఖంతో మెలిపెట్టే ఆ జ్నాపకాలు ఇండియా, పాకిస్తాన్ కి చెందిన ఏ ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేని కఠిన వాస్తవం. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న క్షణాలు అవి. ఒకరినొకరు చంపుకున్నారు. [...]

Zindagi-Na-Milegi-Dobara-2011-Movie-Posters జిందగీ న మిలేగీ దుబారా: Must watch

జీవననైరాశ్యాలని జీవితం చేసుకుని రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంజారి జీవన సత్యాల్ని నూతనజవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణం “జిందగీ న మిలేగీ దుబారా”. తప్పక చూడండి. మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని [...]

aakr Doc.Splash-12th July Programme

AKRUTI India, 1991, 11 min Director: B. Narsing  Rao  One of the earliest filmic attempts to artfully capture the rocks and rock-formations of the Deccan Plateau, Akruti brings to the fore the significance of the world of rocks to human beings and the mesmerism of their myriad forms and formations. The musical genius of Pandit [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories