డైరీ

చిత్రోత్సవ డైరీ

One Flew Over the Cuckoo’s Nest

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.(…)

Getting Home

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే! కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్(…)

2013 లో తెలుగు సినిమా

2013 లో తెలుగు సినిమా

కాలం నిత్య సంచారి. ‘నిన్న’నుంచి ‘నేటి’మీదుగా ‘రేపటి’వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎనె్నన్నో జ్ఞాపకాలను, అనుభవాలను మనకు మిగులుస్తుంది. అలా టాలీవుడ్‌కు కూడా 2013 సంవత్సరం ఎనె్నన్నో తీపి కబురులను, చేదు స్మృతులను తెచ్చింది. 82 ఏళ్ళ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎదురులేని స్థానాన్ని, అంతకుమించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఈ సంవత్సరం కూడా యధాశక్తి తమ ‘పరంపర’ను కొనసాగించే ప్రయత్నం చేసాయి. ఈ 365 రోజుల(…)

Grave of the Fireflies

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా(…)

Sansho Dayu

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు. ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో(…)

వెండి తెరపై ‘బాలానందం’

వెండి తెరపై ‘బాలానందం’

‘‘మెరుపు మెరిస్తే- వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అది మాకోసమే అనుకుని’’ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు- పిల్లలు… పాపలు… రేపటి పౌరులు! బాలలు నిత్యోత్సాహులు… నిరంతర కుతూహలురు! వారు ఆశ్చర్యపడే మెరుపును… వారు ఆనందపడే వానను… వారు తన్మయమై తారంగం పాడే హరివిల్లును వెండి తెరపై సృష్టిస్తే ఏమవుతుంది? బాలల చిత్రోత్సవం అవుతుంది…! అంతర్జాతీయ బాలల సినిమా పండగ అవుతుంది…! అలాంటి ఓ జిలుగువెలుగుల… జ్ఞానదీపాల… విజ్ఞాన వీచికల చిత్రోత్సవం నవంబర్ 14నుండి 21వరకూ హైదరాబాద్‌లో జరగబోతోంది…(…)

జాతీయస్థాయి విద్యార్థుల ఫిల్మోత్సవానికి స్వాగతం

జాతీయస్థాయి విద్యార్థుల ఫిల్మోత్సవానికి స్వాగతం

National-level student film festival The Department of Mass Communication, Loyola Academy Degree & P.G College, is organizing a national-level student film festival on December 7th, 8th, & 9th, 2010. The entries are invited in short-fiction, documentary, video public service message, and animation categories. The three-day film festival will have interactive session with leading film-makers from(…)

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

భావోద్వేగాల ’పాలపిట్ట’లు

మన రాష్ట్రంలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న ఫిలిం క్లబ్ లు రెండే. ఒకటి హైదరాబాద్ ఫిలిం క్లబ్. రెండోది కరీంనగర్ ఫిల్ం సొసైటి(కఫిసొ). ఈ రెండు చోట్లా ప్రతీనెలా కొన్ని మంచి సినిమాల ప్రదర్శనతోపాటు అప్పుడప్పుడు చిత్రోత్సవాలు నిర్వహించి మంచి సినిమాని అభిమానించే ప్రేక్షకులకు విందు చేస్తూ ఉంటారు. ఫిబ్రవరి 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు కరీంనగర్ లో జరిగిన లఘు, డాక్యుమెంటరీ చిత్రోత్సవంలో 41 సినిమాల్ని చూసి ’పాలపిట్ట అవార్డు’లను నిర్ణయించే(…)

IFFI – రిపోర్టు -1

IFFI – రిపోర్టు -1

గోవా లో జరుగుతున్న 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు ప్రదర్శించిన కొన్ని సినిమాల వివరాలు: భారతీయ సినిమాలు: పులిజన్మం:మలయాళీ సినిమా. ప్రియనందన్ ఈ సినిమాకి దర్శకుడు. 54 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో ఈ సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నుకోబడింది. Pulijanmam is about people who are haunted by justice and social good, people who can’t turn away from their world, life and times. At one(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 6

31)The Candidate డెన్మార్క్ సినిమా. చాలా బావుందీ సినిమా. సినిమాలో హీరో ఒక లాయర్. అతని తండ్రి కూడా ఒక పేరు మోసిన లాయర్. ఏడాది క్రితం తన తండ్రి ఒక కేసులో ఓడిపోయి ఇంటికెళ్తుండగా ఒక కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు. కానీ అది యాక్సిడెంట్ కాదనీ మర్డర్ అనీ అతని నమ్మకం. అది ఎలా నిరూపించాలో తెలియక అటు తన వృత్తి లోనూ ఇటు తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాడు. ఒక సాయంత్రం(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 5

21)Still Walking జపనీస్ సినిమా. ఓజు సినిమా ’The Tokyo Story’ కి ఈ సినిమాకీ కథా కథనంలోనే కాకుండా చాలా విధాలుగా పోలికలున్నాయి. తమ సోదరుని 15 వ వర్ధంతి సందర్భంగా Ryoto మరియు Chinami లు తమ కుటుంబాలతో తన తల్లి దండ్రుల ఇంటికి వస్తారు. ఆ సందర్భంగా ఆ కుటుంబ సభ్యుల మధ్య జరిగే వివిధ సంఘటనల సమాహారమే ఈ చిత్ర మూల కథ. టొరంటో చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా ఎన్నుకోబడింది ఈ(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 4

మూడో భాగం ఇక్కడ చదవండి. 16) W అమెరికన్ ప్రెసిడెంట్ George W. Bush జీవితం ఆధారంగా ఓలివర్ స్టోన్ రూపొందించిన సినిమా. ఇందులో చూపించిన విషయాలు ఎంత వరకూ నిజమో తెలియదు కానీ నిజమయితే మాత్రం ఈ సినిమా టైటిల్లోని క్యాప్షన్లో ఉన్నట్టు “Anyone Can Grow Up to Be President” అని ప్రేక్షకులకూ అనిపిస్తుంది. నాకు మరీ అంత నచ్చలేదు సినిమా. ప్రపంచ రాజకీయాలు ఇష్టమున్న వాళ్ళు చూడొచ్చు. ఈ సినిమా గురించి(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 3

రెండో భాగం ఇక్కడ చదవండి. లండన్ చిత్రోత్సవంలో నేను చూసిన మొదటి పది సినిమాల గురించి ఇది వరకే రిపోర్టు(లు) ప్రచురించాను. ఇక మిగిలిన సినిమాల గురించి చూద్దాం. మొదట చూసిన పది సినిమాల్లో కేవలం ఒకటో రెండో మాత్రమే నాలోని సినీ పిపాసిని తృప్తి పరచగలిగాయి. ఈ సారి చలనచిత్రోత్సవం ఏంటి డల్ గా ఉంది అనుకుంటుండగా నేను చూసిన ఒక సినిమా నా అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. యాదృచ్ఛికం అయ్యుండోచ్చేమో కానీ ఆ తర్వాత(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -2

మొదటి భాగం ఇక్కడ చదవండి. గమనిక:నేను చూసిన వరుసక్రమంలో ఈ సినిమాల గురించి రాయటం లేదు.అసలు ఏది ముందు ఏది తర్వాత చూసానో గుర్తుంటే కదా! అన్ని సినిమాలూ చూసేసాక ఒక సినిమా కథను మరో సినిమా కథలో పెట్టేసి కలగాపులగం చేస్తానేమోనని వీలున్నప్పుడు గుర్తుకొచ్చిన సినిమా గురించి రాస్తున్నాను. 6)రాం చంద్ పాకిస్తానీ ఇది నేను చూసిన రెండో పాకిస్తానీ సినిమా. చాలా బావుంది. వేషంలో నందితా దాస్ పాత్ర కమలి సినిమాలానే వుంది. కథ(…)

లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు -1

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ నెల పదిహేనవ తేదీ నుంచి లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురించి మీకు తెలిసే వుంటుంది. ఈ చిత్రోత్సవంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన 300 సినిమాలను ప్రదర్శిస్తున్నారు.పది పదిహేను రోజుల్లో అన్నీ సినిమాలు చూడడం కుదరకపోయినా కనీసం ఒక యాభై సినిమాలైనా చూడాలనే లక్ష్యం పెట్టుకుని నేనూ ఈ పండగ లో భాగం అయ్యాను.ఈ రోజు ఈ చిత్రోత్సవంలో ఆరవ రోజు. ఇప్పటి వరకూ ఈ చిత్రోత్సవం(…)

మూడవ కరీంనగర్ చలనచిత్రోత్సం-Call for entries

మూడవ కరీంనగర్ చలనచిత్రోత్సం-Call for entries

GREETINGS FROM KARIMNAGAR FILM SOCIETY we are very happy to inform all the film makers that karimnagar film society (affiliated to federation of film societies of india) is organising its regular annual event ‘ NATIONAL SHORT AND DOCUMENTARY FILM FESTIVAL-2009’ from 14-19 February 2009 at Karimnagar,Andhra Pradesh The festival consists of two sections: The regular(…)

52 వ లండన్ చలనచిత్రోత్సవం

52 వ లండన్ చలనచిత్రోత్సవం

52 వ లండన్ చలన చిత్రోత్సవం వచ్చే నెల 15 నుండి 30 వరకూ జరగనుంది.ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే 189 పూర్తి నిడివి చిత్రాలు, 108 లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శింపబడతాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రసిద్ధ సినీ కళాకారులతో మాస్టర్ క్లాసెస్, చిన్న పెద్దా అందరికీ సినిమా గురించి పరిజ్ఞానం కలుగచేసే వివిధ కార్యక్రమాలు ఈ చిత్రోత్సవంలో చోటు చేసుకుంటాయి. ఈ చలనచిత్రోత్సవం Ron Howard దర్శకత్వంలో వచ్చిన Frost/Nixon అనే సినిమాతో మొదలయ్యి(…)

కరీంనగర్ చిత్రోత్సవం – రిపోర్ట్

కరీంనగర్ చిత్రోత్సవం – రిపోర్ట్

వ్యాపార రంగానికి దూరంగా సామాజికతకు, సమ్స్యలకు అద్దంపడుతూ మానవ జీవన చిత్రాలను విలక్షణంగా ఆవిష్కరించిన 84 లఘు మరియు డాక్యుమెంటరీ సినిమాలతో కూడిన ద్వితీయ జాతీయ చిత్రోత్సవం మహానగరాలకు దూరంగా కరీంనగర్ లో నిర్వహించబడి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది, ఆలోచింపజేసింది. జాతీయవేడుకగా నిర్వహించిన ఈ చిత్రోత్సవం కొత్త దర్శకులకు వేదికగా కూడా నిలిచింది. ఉత్తమ డాక్యుమెంటరీలకు వేదికగా కరీంనగర్ ఫిలిం సొసైటీ నిర్వహిస్తున్న జాతీయ షార్ట్ మరియు డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివలకు ఇది రెండవ ఎడిషన్. గత(…)

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు

కరీంనగర్ చిత్రోత్సవంలో మొదటి రోజు న చిత్రోత్సవాల నిర్వహణ  గురించి మాట్లాడుతూ “ఉత్తమ విలువలు కలిగిన సినిమాలు ప్రదర్శించడం.ఔత్సాహికుల్ని ప్రోత్సాహించదం సాంస్కృతిక బాధ్యత” అని ప్రముఖ దర్శకులు బి.నరసింగ రావు అన్నారు.కరీంనగర్ చిత్రోత్సవాన్ని అయన ప్రారంభిచారు.మహానగరాలకు దూరంగా నాన్ మెట్రొ నగరంలొ చిత్రొత్సవం జరగడం ముదావాహం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ముఖ్య అతిథి జిల్లా  కలెక్టర్ యం. వి. సత్యనారాయణ ఫిల్మ్ సొసైటి వెబ్సైట్ ప్రారంభించారు.ఫిలింభవన్ కు ఎ సి వసతి కల్పిస్తామని చెప్పారు(…)

చిత్రోత్సవం స్థూలదృష్టి

చిత్రోత్సవం స్థూలదృష్టి

నేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు. ఐదు వందల రూపయల పాసుకి, అక్కడ ముప్పై ఐదు ఆటలలో వేస్తున్న నూటయాభై సినిమాలు ఎన్నైనా చూడవచ్చు.(…)

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 2

ఆదివారం ఉదయాన్నే ప్రెస్ స్క్రీనింగ్లో The Band’s visit అనే ఇజ్రాయిల్ సినిమా చూసాను.అవకాశం దొరికితే ఈ సినిమా తప్పక చూడండి. మానవ సంబంధాలను అధ్భుతంగా తెరకెక్కించారీ సినిమాలో. ఆ తర్వాత ఒంటిగంట కు మన Big B నటించిన The Last Lear సినిమా ప్రదర్శన జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్ళే సరికి మన జనాలు తండోపతండాలుగా అక్కడికి చేరి వున్నారు. ఎలాగో కష్టాలు పడి ఒక టిక్కెట్టు సాధించి లోపలికెళ్ళాక అమితాబ్ చాలా సేపు(…)

లండన్ చిత్రోత్సవం – నా అనుభవాలు – part 1

2005 లో నేను మొదటి సారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మొదటిసారిగా ఒక చలనచిత్రోత్సవానికి వెళ్ళే అవకాశం దొరికింది. ఆ సంవత్సరం జరిగిన 49 వ లండన్ చలన చిత్రోత్సవంలో రెండు సినిమాలు చూడడం జరిగింది.ఆ చిత్రోత్సవంలో మరిన్ని సినిమాలు చూడాలని వున్నా అప్పుటి ఆర్థిక పరిస్థుతులు కారణంగా ఆ కోరిక అలానే వుండిపోయింది. 2006 లో నేను మళ్ళీ ఇంగ్లాండు తిరిగి వచ్చినప్పటికీ అప్పటికి 50 వ చలన చిత్రోత్సవం ముగిసిపోయింది. కానీ ఈ సంవత్సరం 51(…)