అవార్డులు

చిత్రోత్సవాల్లో అవార్డు గ్రహీతలు

The past – చిక్కుముడి

The past – చిక్కుముడి

ఇదో గమ్మత్తయిన కథ..ఇందులో ఎవరు తప్పు ఎవరు కరక్టో తెలియదు.అందరి అలోచనలూ..దృక్పథాలూ సరైనవే. కానీ నాటకీయత మాత్రం నిండుగా ఉంటుంది. అదే నాటకీయంగా మన సహానుభూతి ఒకరినించి ఒకరికి మారుతూ ఉంటుంది. అలా అని ఇలాంటివన్నీ మేం టివీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం అనకండోయ్. ఎందుకంటే సినిమాకు ఉండే లక్షణాలన్నీ బలంగా ఉన్న సినిమా. బాగా ఆకట్టుకునే సినిమా..!! మనం ఒక పనిచేసేముందు మనకున్న లాజిక్కు ప్రకారం ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందీ అని చేస్తాం..(…)

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు.. చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ?? ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !! ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ(…)

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి(…)

మౌనరాగం – మనసు తీరు

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .(…)

The hunt – వెంటాడే లోకం !!

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా. లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ(…)

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే. జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు. అమె తన ప్రియుడి(…)

where is my grandpa – సంపూర్ణ ఆనందం

where is my grandpa – సంపూర్ణ ఆనందం

ప్రేమ.. ప్రపంచంలో ప్రతివాళ్ళూ అంగలార్చేది ప్రేమకోసమే.  మంచి పండులో  తియ్యదనం ఎలా దాగుంటుందో…మంచి హృదయంలో ప్రేమ ఆలా దాగుంటుంది.  వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషికీ తన మనుషుల ..సాటి మనుషుల ప్రేమ కావాలి… కావాలని కోరుకుంటారు. ఏ మనిషి ‘ప్రేమ’ అక్కరలేదంటాదు చెప్పండి ?? ప్రేమ అనేది ప్యూర్ బ్లిస్..సంపూర్ణ ఆనందం. ప్రేమకోసమే పొత్తిళ్లలోని బిడ్డ కాసేపు తల్లి స్పర్శ ..పలకరింపు లేకుంటే ఏడుపు అందుకుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ నిరంతరం కోరుకుంటారు పిల్లలు. ఈ స్కూలూ(…)

Paris, Texas – కలిసిన దూరాలు.

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు(…)

ఆస్కార్:2014-నామినేషన్స్

ఆస్కార్:2014-నామినేషన్స్

The full list of Oscar nominations for 2014 is as follows, with links to reviews of each nominated film. BEST PICTURE: 12 Years a Slave Captain Phillips Gravity Philomena The Wolf of Wall Street Nebraska American Hustle Dallas Buyers Club Her BEST DIRECTOR: David O Russel – American Hustle Alfonso Cuaron – Gravity Alexander Payne(…)

rosetta – గులాబీ కొమ్మ

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!!  కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల(…)

A Separation – ఓ విడతీత

A Separation – ఓ విడతీత

రాత్రి 12 గంటలు. ఫేస్బుక్కుతో విసిగి..ఇహ పడుకుందాం అనుకుంటున్నా.. కానీ నిద్ర రావటం లేదు. ఏం చేయాలబ్బా.. సరే సినిమా చూద్దం కాసేపు..నిద్ర వచ్చేవరకు..  ఏదైనా.. దించుకున్న సినిమాల లిస్ట్ వెతుకుతుంటే కనిపించింది. ఈ సినిమా ‘ దించుకొని’  చాలా రోజులైంది. ఒకటో రెండు సార్లు అలా  ముందుకీ వెనక్కీ తిప్పి చూసాను. ఎక్కడా చూడు ఓ ఇద్దరు ముగ్గురు మనుషు, ఓ ముసలాడూ  ఏవో మాటలూ ….సర్లే ఏదో ఓపికతో చూడాల్సిన  సినిమాలాగా ఉన్నది అని(…)

The Man from the Earth

The Man from the Earth

ఏది సత్యం…ఏదసత్యం…ఓ మహాత్మా…ఓ మహర్షీ!!! జాన్ ఓల్డ్‌మ్యాన్ ఒక విశ్వవిద్యాలయంలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పని చేసి ఒక రోజు అకస్మాత్తుగా రాజీనామా చేసేశాడు. అతనితో పాటు పని చేస్తున్న మిగిలిన ప్రొఫెసర్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకో కొన్ని రోజుల్లో హిస్టరీ డిపార్ట్‌మెంట్ కి డీన్ గా పదోన్నతి పొందుతాడన్న విషయం దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో జాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారెవరికీ అర్థం కాలేదు. జాన్ ఇల్లు ఖాళీ చేసి(…)

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ? ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ. ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా(…)

shame – వాంచాలోలత్వం .

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే ! ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన (…)

revanche – ప్రశాంతోద్వేగం.

revanche – ప్రశాంతోద్వేగం.

ఒకరిమీద ఒకరికి ఉండే అపారమైన గౌరవం..ఇష్టాల కలగలుపే ప్రేమ.  ప్రేమకి క్షమించే గుణం ఉంటుంది.  ప్రేమకి అంగీకరించే గుణం ఉంటుంది.  ప్రేమ గుడ్డిది అని అంటారు ఎందుకంటే …ఎదుటివ్యక్తి మంచయినా చెడయినా  ఆ ప్రేమ కి తెలియదు, అలాగే  ప్రేమకోసం ఆ ప్రేమికులు ఏ దారిలో వెళుతున్నారో తెలియదు.  పక్కన ప్రేమించిన మనిషి ఉంటేనే ఎదురుగా ఉన్న లోకానికి అర్థం లేదా ఆ ప్రపంచం  ఎందుకూ పనికి రానిదే !! ఇది గొప్ప  కథ కాదు..విచిత్రమైన మలుపులూ లేవు. చాలా సరళమైన కథ. మెగ్గెప్పుడు వేసిందో..పువ్వెప్పుడు పూసిందో..కాయెప్పుడు కాసిందో తెలియదు. అలాగే(…)

smashed –  ఓ గెలుపు  కథ.

smashed – ఓ గెలుపు కథ.

                     మొదట వ్యసనం శరణార్థిలా వస్తుంది – తరవాత యజమానిలా శాశిస్తుంది. తాగినపుడు  ప్రపంచం కాళ్లకింద ఉన్నట్టనిపిస్తుంది… పెద్ద విషయం చిన్నదిగా..చిన్న విషయం పెద్దదిగా కనపడుతుంది. మనసులోని మాటలు అలా తన్నుకొస్తాయి…గుండెల్లోని ప్రేమ పెళ్ళుబుకుతుంది… కోపం కట్టలు తెగుతుంది… మనుషులని చూస్తే జాలేస్తుంది…కరుణ రసంపొంగి కన్నీళ్ళోస్తాయి.. మనమీద మనకి పిచ్చి నమ్మకం కలుగుతుంది.. ధైర్యం పొంగుతుంది.. ఆత్మవిశ్వాసం నాలుగింతలవుతుంది… కవిత్వం నోటివెంట పారుతుంది. కొత్తబాషలు వచ్చేస్తాయ్.. మొత్తంమీద మనకి మనం ఒక కొత్త మనిషిలా, మనం  ఎలా(…)

“అము” (2005): ఒక పరిచయం

“అము” (2005): ఒక పరిచయం

బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం,(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము. కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు. 1896లో ఆయన బొంబాయిలోని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీతం ,సాహిత్యం, శిల్పం మరియు ఇతర లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. చలనచిత్రానికి దర్శకుడు ముఖ్యమే కానీ ఒక చలనచిత్ర నిర్మాణం కేవలం దర్శకుడి ఒక్కడి వల్లే కాదు. నిజానికి చలనచిత్రం లోని అన్ని విభాగాల నిపుణుల చేత తనకు కావలసినట్టుగా పని చేయించుకోగలిగేవాడే దర్శకుడు. చలనచిత్ర కళలో చివరిగా మనకి తెరమీద కనిపించేది నటీనటులే అయినప్పటికీ తెర వెనుక దర్శకుడితో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కేవలం ఉత్తమ చిత్రాలను మాత్రమే గుర్తిస్తూ ఈ అవార్డులను అందచేసే వారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అంటే 1968 లో మొదటి సారిగా చలనచిత్రాల్లో నటించిన ఉత్తమ నటీనటులకు అవార్డులు అందచేయాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటీనటుల విభాగాల్లో మొత్తం మూడు అవార్డులు నటీనటులకు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కేటాయించారు. 1968 నుంచి 1974 వరకూ ఉత్తమ నటుడు అవార్డులను(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు. 1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

మొదటి రెండు సంవత్సరాల పాటు అవార్డులు వచ్చిన సినిమాల సంగతి ఒక ఎత్తైతే ఆ తర్వాత 1956 లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూడవ జాతీయ అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన తొలి చిత్రం “పథేర్ పంచాలి” జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. గతంలో ఇచ్చిన అవార్డులన్నీ కూడా కథా ప్రధానమైన, భక్తి ప్రధానమైన లేదా ప్రబోధాత్మక సినిమాలకే(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

ఇక మనం 1954 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు చూద్దాం. శ్రీ మంగల్ దాస్ పక్వాసా అధ్యక్షుడిగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నన్ని అవార్డులు ఆ రోజుల్లో లేవు. జాతీయ ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పతకం అందచేసేవారు. పీకే ఆత్రే దర్శకత్వంలో వచ్చిన మరాఠీ చిత్రం “శ్యాంచీ ఆయ్” ఈ అవార్డు గెలుచుకుంది. శ్యాం అనే అల్లరి కుర్రవాడిని అతని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందుతూండగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో అత్యధిక శాతం సినిమాలు హిందీ నిర్మించబడేవి. కానీ ఈ రోజు తమిళం మరియు తెలుగు సినీ పరిశ్రమలు హిందీ సినిమా పరిశ్రమకు ధీటుగా నిలిచాయి. ఈ మార్పుల కారణంగానే జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పు సంభవించిందనే చెప్పాలి. ముఖ్యంగా 1970 మరియు 1980 లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన మార్పులు ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్” గా పిలిచే వారు. నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి. 1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన(…)

ఒక “పోస్ట్ మ్యాన్” జ్ఞాపకాలు

ఒక “పోస్ట్ మ్యాన్” జ్ఞాపకాలు

ఈ మధ్య కాలం లో చాల రోజుల తర్వాత ఫేసుబుక్ మిత్రుని (మహేష్ కుమార్ కత్తి) పుణ్యమా అని రెండు అందమైన లఘు చిత్రాలు చూడగలిగాను. ఒకటి అద్వైతం(తెలుగు) రెండు పోస్ట్ మాన్ (తమిళం). ఈ రెండు నన్ను చాల అమితంగా ఆకట్టుకున్నాయి. పోస్ట్ మాన్ చిత్రం విషయానికొస్తే ఓ అందమైన గ్రామం లో ఆత్మీయ సందేశాలను చేరే వేసే ఓ ఇంటివ్యక్తిగా పరిగణించే పోస్ట్ మాన్ కథ. ఇంటింటికి వెళ్లి వారి ఉత్తరాలను చేర వేస్తూ.(…)

Adwaitham: Beautiful harmony

Adwaitham: Beautiful harmony

A refreshing change is blowing in Telugu Cinema. The change has come from unexpected quarters and this change has the potential to sweep the cinematic language of Telugu Cinema to another level. For the past few years, Telugu cinema was often ridiculed for not scoring at the National scene whenever the National Awards are announced.(…)

ADVAITHAM – A Director’s note

ADVAITHAM – A Director’s note

I started my career in the art form of story telling as an animator, later on with so many ups and downs now I am at this stage as a filmmaker. With the experience in filmmaking I’ve learnt that I just need to follow the discipline of a genre, let it be comedy, romance, drama(…)

మనకెందుకు అవార్డులు రావబ్బా?

మనకెందుకు అవార్డులు రావబ్బా?

అది త్రి.సి.స (త్రిలింగ సినిమా సంఘం) ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్‌ఫరెన్స్. ఒక వైపు త్రిలింగ సినిమా ఇండస్ట్రీకి చెందిన హేమాహేమీలంతా విచ్చేస్తే, ఇంకో వైపు టీవీ-999 లాంటి చానెల్స్‌కి, ఛాఛీ లాంటి దిన పత్రికలకి, చెందిన విలేఖరులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. “చాలా ఘోరం జరిగిపోయింది, ఈ సారి కూడా మన త్రిలింగ సినిమాకి విపరీతమైన అన్యాయం జరిగింది,” గద్గద స్వరంతో అన్నాడు సొల్లూ అరవింద్. ఆయన పక్కనే ఉన్న రె.కాఘవేంద్ర రావు అంగీకార(…)

Kerala State Film Awards 2011

Kerala State Film Awards 2011

Best Film Adaminte Makan Abu ( Produced by Salim ahamad & Ardhad ) Best Second Film Makaramanju ( Directed and Produced By Lenin rajendran ) Best Popular & Artistic Movie Pranchiyettan & The Saint ( Director Renjith ) Best Actor Salim Kumar ( Adaminte Makan Abu) Best Second Actor Biju Menon ( TD Dasan Std(…)

58 వ జాతీయ అవార్డులు

58 వ జాతీయ అవార్డులు

58వ జాతీయ సినిమ అవార్డులు ప్రకటించారు.  దక్షిణభారతీయ సినిమాలే ప్రముఖ  అవార్డులు అందుకున్న ఈ సంవత్సరపు జాబితలో “అద్వైతం” అనే ఒక తెలుగు సినిమాకూ స్థానం దక్కింది. అవార్డుల లిస్టు ఈ క్రింది విధంగా ఉంది. Best Actors: Salim Kumar (Adamante Makan Abu), Dhanush (Aadukalam). Best Actress: Mitalee Jagtap, Saranya Ponnvarnan Best Supporting Actress: Sukumari(Namma Gramam) Best Supporting Actor: J. Thambi Ramaiah (Mynaa ) Best(…)

లే…చి…పో…దా…మా (గీతాంజలి – 2)

లే…చి…పో…దా…మా (గీతాంజలి – 2)

” నీకు Congenital హార్ట్ అంటే ఏంటో తెలుసా  ? ఉ … ఉహు.. పక్కన ఉన్న పిల్లల గ్యాంగ్ మొత్తం టకా టకా అని చెప్పేస్తారు. తెలిసి ఇలా ఉండగాలిగావా ?? హా .. ఎలా ?? ” చూడు నువ్వు చచ్చిపోతావ్ .. ఈ చిత్రా చచ్చిపోతుంది.. ఆ శారద ఉందే… అదీ చచ్చిపోతుంది.. పల్లికిలుస్తుందే,  చంటిది..ఇదీ చచ్చిపోతుంది.ఈ చెట్లూ  చచ్చిపోతాయి… ఆ తీగా చచ్చిపోతుంది…నేనూ చచ్చిపోతాను.కాకపోతే ఓ రెండురోజుల ముందే చచ్చిపోతాను.  రేపు(…)

83 వ ఆస్కార్ అవార్డు నామినేషన్లు

83 వ ఆస్కార్ అవార్డు నామినేషన్లు

Actor in a Leading Role Javier Bardem in “Biutiful” Jeff Bridges in “True Grit” Jesse Eisenberg in “The Social Network” Colin Firth in “The King’s Speech” James Franco in “127 Hours” Actor in a Supporting Role Christian Bale in “The Fighter” John Hawkes in “Winter’s Bone” Jeremy Renner in “The Town” Mark Ruffalo in “The(…)

The Golden Globe Awards, 2011

The Golden Globe Awards, 2011

Best Motion Picture, Drama The Social Network Best Actor in a Motion Picture, Drama Colin Firth – The King’s Speech Best Motion Picture, Comedy or Musical The Kids Are All Right Best Actress in a Motion Picture, Drama Natalie Portman – Black Swan Best Actor in a Motion Picture, Comedy Paul Giamatti – Barney’s Version(…)

మనోహర్-మనవాడే!

మనోహర్-మనవాడే!

మొన్నీ మధ్యనే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో మగధీర కి రెండు అవార్డులు వచ్చినా అవి రెండూ కూడా ఇద్దరు తమిళ వాళ్ళకి వచ్చాయని, కాబట్టి ఆ కొద్ది పాటి సంతోషమైనా తమిళ్ వాళ్ళకి ఉండాలని కొంతమందంటే…అయినా కూడా వచ్చింది తెలుగు సినిమాకి కదా! కాబట్టి గర్వపడాల్సింది మనమే అని ఇంకొంతమంది అభిప్రాయం. అయితే ఈ మగధీర లాంటి మెగా సినిమా నీడలో మరో తెలుగు వాడికి (అచ్చమైన తెలుగు వాడు, మన నెల్లూరబ్బాయి ) జాతీయ అవార్డు(…)

57 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

57 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

57వ జాతీయ చిత్ర పురస్కారాలను ప్రకటించారు. ఉత్తమ జాతీయ చిత్రంగా మళయాళ చిత్రం ‘కుట్టిశ్రాంక్’ ఎన్నికయింది. ఉత్తమ నటుడిగా అమితాబ్ వరుసగా మూడోసారి ‘పా’ చిత్రానికి గానూ ఎన్నికయ్యారు. ఉత్తమ నటిగా అనన్యాఛటర్జీ(బెంగాళి) కి ‘అబోహొమన్’ చిత్రానికి లభించింది. ఉత్తమ సహాయ నటుడిగా లాహోర్ చిత్రంలో నటించిన ఫారూక్ షేక్ సహాయ నటిగాఅరుంధతీనాగ్(పా) ఉత్తమ బాలనటులు గా ‘పసంగ’ తమిళ చిత్రంలో నటించిన జీవ, అన్బుకరసు లకు అవార్డు లభించింది. ఉత్తమ సామాజిక చిత్రంగా శ్యామ్ బెనగల్(…)

And the award goes to…

And the award goes to…

గత సంవత్సరం ఫిభ్రవరిలో కరీంనగర్ నందు జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ క్రింది గైడ్ లైన్స్ తయారు చేసాము.(…)

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand(…)

82 వ ఆస్కార్ అవార్డులు

82 వ ఆస్కార్ అవార్డులు

ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.

ఆస్కార్ అవార్డులు, 2010-నామినేషన్స్

ఆస్కార్ అవార్డులు, 2010-నామినేషన్స్

Best Motion Picture of the Year Avatar (2009): James Cameron, Jon Landau The Blind Side (2009): Gil Netter, Andrew A. Kosove, Broderick Johnson District 9 (2009): Peter Jackson, Carolynne Cunningham An Education (2009): Finola Dwyer, Amanda Posey The Hurt Locker (2008): Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier, Greg Shapiro Inglourious Basterds (2009): Lawrence Bender Precious:(…)

మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge

మూససినిమా వంతెనకు అటువైపున్న మనిషి – The Man Beyond The Bridge

“The Man Beyond The Bridge” (పల్తదచో మునిస్) అనే కొంకణి భాషా చిత్రం 2009 టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సినీవిమర్శకులిచ్చే discovery award గెలుచుకుంది. ఈ 96 నిమిషాల నిడివిగల చిత్రం NFDC సహకారంతో లక్ష్మీకాంత్ షటగోంకర్ నిర్మించి దర్శకత్వం వహించారు. భారతీయ మీడియా, సినీపరిశ్రమ ఇదే చలనచిత్రోత్సవాల్లో ప్రిమియర్ జరుపుకున్న ఆశుతోష్ గొవరికర్ “Whats your Rashee”, యష్ రాజ్ సంస్థ నిర్మించిన “Dil bole Hadippa” లకు ఇచ్చిన కవరేజ్(…)

కన్నడ చిత్రానికి అరుదైన గౌరవం

Ireland International Film Festival లో 34 దేశాల నుంచీ వచ్చిన 200 సినిమాల మధ్యన ఉత్తమ చిత్రంగా నిలిచింది “ముఖపుట (The Cover Page)” అనే ఒక కన్నడ చిత్రం. ప్రముఖ నటి రూపా అయ్యర్ మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇదివరకే The California Film Festival లో Silver Sierra Best Feature Film Award అందుకుంది. HIV/AIDS తో జీవిస్తున్న చిన్నారుల భావనలకు,ఉద్వేగాలకు, జీవితాలకు అద్దం పట్టే చిత్రంగా ‘ముఖపుట’(…)

ఫిల్మ్ తెలంగాణ 2009:ఆహ్వానం

ఫిల్మ్ తెలంగాణ 2009:ఆహ్వానం

నవతరంగం పాఠకులకు నమస్కారం. “ఫిల్మ్ తెలంగాణ” పేరుతో నిర్వహించిన ఫిల్మ్ మేకింగ్ పోటీలో భాగంగా ఔత్సాహిక సినిమా కళాకారులు రూపొందించిన లఘు చిత్రాల ప్రదర్శనతో పాటు, ఈ పోటీలో పాల్గొన్న సినిమాలనుంచి విజేతలను ఎన్నుకుని వారికి ఈ నెల 12 మరియు 13 తేదీలలో (శని,ఆది వారాలు) కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు: Film Festival & Prize Distribution for ‘Film Telangana 2009′(…)

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

55 వ జాతీయ అవార్డులు (2007 సంవత్సరానికి)

ఉత్తమ చిత్రం: కాంచీవరం (ఈ తమిళ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు) ఉత్తమ నటుడు: ప్రకాష్ రాజ్ ( ‘కాంచీవరం’ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ నటి: ఉమశ్రీ (‘గులాబి టాకీస్’ అనే గిరీశ్ కాసరవళ్ళి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రంలోని నటనకు ఈ అవార్డు దక్కింది) ఉత్తమ సహాయనటుడు: దర్శన్ జరీవాలా (గాంధీ మై ఫాదర్ అనే హిందీ చిత్రంలో గాంధీ పాత్రకుగానూ ఈ నటుడికి ఈ అవార్డు దక్కింది) ఉత్తమ స్క్రీన్(…)

Cannes 2009-అవార్డులు

Cannes 2009-అవార్డులు

ఈ నెల 13 నుంచి ఫ్రాన్స్ లోని Cannes లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఈ రోజు తో ముగిసింది. ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించిన చిత్రాలలో ఉత్తమ చిత్రాలు, సాంకేతిక నిపుణులు మరియు నటీ నటులకు ఇచ్చే అవార్డులు ఈ రోజు ప్రకటించబడ్డాయి. 2001 లో Piano Teacher సినిమాకి గ్రాండ్ ప్రి అవార్డ్ అందుకున్న మైఖేల్ హనికి ఈ సంవత్సరం వైట్ రిబ్బన్ సినిమాకి గానూ ప్రతష్టాత్మకమైన Palme d’Or అవార్డు అందుకున్నారు.(…)

And the award goes to…

And the award goes to…

ఈ నెల (ఫిబ్రవరి, 2009) 19 నుంచి 22 వరకూ కరీంనగర్ లో జరిగిన National short and documentary చలన చిత్రోత్సవంలో భాగంగా నవ కల్పనలు చేసిన ఒక ఉత్తమ చిత్రానికి ’నవతరంగం’ అవార్డు కమీషన్ చెయ్యడం జరిగింది. ’నవతరంగం’ అవార్డు గా పిలవబడే ఈ అవార్డు కింద ఒక మెమెంటో, 5 వేల రూపాయల నగదు మరియు ప్రశంశా పత్రం విజేతలకు అందచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కోసం జ్యూరీ సభ్యులకు ఈ(…)

మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

మన వాడు మళ్ళీ (ఏఆర్‌ రెహ్మాన్‌కు ‘గోల్డెన్‌గ్లోబ్‌’ అవార్డు)

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ ప్రతిభకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సినీ సంగీత ప్రపంచంలో అత్యున్నతంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సాధించిన తొలి భారతీయునిగా రెహమాన్‌ రికార్డులకెక్కాడు. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డుకూడా లభించింది. సైమన్‌బ్యుఫోయ్‌ ఈ అవార్డు గెలుచుకున్నారు. ఇదే చిత్రంలోని జయహో పాటకుగాను గీత రచయిత గుల్జార్‌కు ఉత్తమ గీతరచయిత అవార్డు లభించింది. ఇంకా ఇదే చిత్రానికిగాను డాన్‌బోయ్ల్‌కు(…)

నంది అవార్డులు 2007

నంది అవార్డులు 2007

కంగ్రాట్స్ … రాష్ట్ర ప్రభుత్వం 2007 యేడాదికి గాను నంది అవార్డులు ప్రకటించింది. ‘మీ శ్రేయోభిలాషి’ ఉత్తమ చిత్రంగా, చందమామ ఉత్తమ కుటుంబకథా చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ద్వితీయ చిత్రంగా హ్యాపీడేస్‌ ఎంపికైంది. ఉత్తమ నటుడిగా వెంకటేష్‌(ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే), నటిగా ఛార్మికౌర్(మంత్ర)‌, ఉత్తమ దర్శకుడిగా కృష్ణవంశీ అవార్డులు అందుకోనున్నారు. ఉత్తమ సహాయనటుడిగా జగపతిబాబు(లక్ష్యం), సహాయ నటిగా జానకి, అల్లూరామలింగయ్య అవార్డుకు ఉత్తేజ్‌ ఎంపికయ్యారు.ఉత్తమ సంగీత దర్శకుడు మిక్కీ.జె.మేయర్(హ్యాపీడేస్) చిరుత సినిమాలో నటనకు రామ్‌చరణ్‌తేజ్‌ కు(…)

గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్

గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్

హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఉత్తమ చలనచిత్రాలకు అందించే గోల్డన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ ఈ రోజు ప్రకటించారు. తొలిసారిగా మన దేశానికి చెందిన ఒక సంగీత దర్శకుడి పేరు ఈ లిస్టులో చోటు చేసుకోవడం విశేషం. ఆ సంగీత దర్శకుడెవరో, ఏ సినిమాకి ఆయన నామినేషన్ అందుకున్నారో చెప్పక్కర్లేదనుకుంటాను. గోల్డన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్ అయిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు: Best motion picture – drama The curious(…)

52వ లండన్ చలనచిత్రోత్సవ విజేతలు

The Sutherland Trophy Winner: TULPAN directed by Sergey Dvortsevoy. The Sutherland Trophy is awarded to the director of the most original and imaginative first feature film screened at The Times BFI London Film Festival. In awarding the trophy, the Sutherland Jury said of the film: “A masterpiece: both intimate and epic, a film full of(…)

Cannes winners-2008

Cannes winners-2008

Palme d’Or (Golden Palm): Entre les Murs (The Class) directed by Laurent Cantet An evocation of contemporary society as seen through a year’s worth of events in a Paris junior high school. ———————————————- Special 61st Anniversary Award: Catherine Deneuve for Un conte de Noël (A Christmas Tale) Follows a family who becomes increasingly contentious and(…)

హైదరాబాదు చలనచిత్రోత్సవ విజేతలు

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం ఈ నెల 3 నుండి పది వరకూ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో కంటే ఎంతో వైభవంగా జరిగిన ఈ చలన చిత్రోత్సవం విజయవంతం కావడం రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు మరిన్ని ఉత్తమ చలన చిత్రాలు చూడగలిగే అవకాశం వుంది. ఈ చిత్రోత్సవంలో వరుసగా రెండో సారి అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారికి నవతరంగం ద్వారా అభినందనలు. అలాగే మిగిలిన విజేతలకూ నవతరంగం ద్వారా మా(…)

12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు

12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు

ఈ రోజు ముగిసిన 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవాల్లో విజేతలుగా నిలిచిన దర్శకులు మరియు చిత్రాల వివరాలు: ఉత్తమ చలన చిత్రం(మలయాళీ ): Ore Kadal/The sea within – R శ్యామప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ బెంగాళీ రచయిత సునీల్ గంగోపాధ్యాయ్ రచించిన ’హీరక్ దీప్తి’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఈయన నవలల ఆధారంగానే గతంలో సత్యజిత్ రే రూపొందించిన ప్రతిధ్వంది, అరణ్యార్ దిన్ రాత్ సినిమాలు కూడా గంగోపాధ్యాయ్(…)