Menu

Featured Archive

బెజావాడ BLAK -2

నేను తప్ప అందరూ ఏమైపోయారు?ఇది నిజమైతే,ఎన్ని రోజులు?మళ్లీ అందరూ వచ్చేస్తారా ?వెనక్కి రావడానికి ఎక్కడికైనా వెళ్తే కదా,ఏదో జరిగింది,aliens వచ్చి ఎత్తుకుపోయారా ?నన్ను ఎందుకు వదిలేసారు?అదేదో willsmith సినిమా లాగ ఉంది,పేరు గుర్తుకు రావడం లేదు,కనీసం కుక్కలైనా ఉన్నాయా?అటు ఇటు చూసాడు, కుక్కలు లేవు.టీ అయిపొయింది,కప్ పక్కన పెట్టి ఇంకో సిగరెట్ అంటించాడు,పెట్టెలో చూస్తే ఇంకో మూడు ఉన్నాయి. సిగరెట్ తాగుతూ రోడ్ వైపే అటూ ఇటూ చూస్తున్నాడు,ఎవరు రావటం లేదు.ఎలాంటి చప్పుడు లేదు.cafe తీసే ఉంది

బెజవాడ BLAK

గమనిక : ఇది మేము తీయాలి అనుకుంటున్న Indie Sci-fi సినిమా స్టొరీ.as story progresses “మధ్య తరగతి సంస్కారులు” తట్టుకోలేని Obscenity ఉండే ఛాన్స్ ఉంది,మీ ఇష్టం. 48గంటల నుంచి ఆపకుండా వర్షం.హైదరాబాద్ మునిగిపోతుందేమో అనిపించేంత వర్షం.stanley.k రాత్రి half పైనే బ్రాందీ తాగాడు.time ఎంతైందో తెలియదు కానీ తెల్లారిపోయింది.stanley లేచాడు,రూంలో ఎవరూ లేరు….రాత్రి 10-12 మంది ఉండాలి. ఫోన్ చూసాడు,Dali పెయింటింగ్. రాత్రి బుల్బలు Salvador Dali గురించి చెపుతూ తన ఫోన్ లో

బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం

మొదటి భాగం ఇక్కడ చదవండి. బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు. రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ

అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్

నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో  వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవతరంగంలో మాత్రమే కాకుండా