|
భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”
ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే… (1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు [...] |
|
“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు
సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది [...] |
|
ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5
‘పాల మనసులు’ చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’ అన్న డా.నారాయణ రెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్.ఆర్.ఈశ్వరితో పాడేందుకు శ్రీ సత్యం గారి దగ్గరనుంచి ఆహ్వానం వచ్చింది. అదే ఆయన సంగీత దర్శకత్వంలో నే పాడిన తొలిపాట. ఆ పాట ఆయన ఆలపించిన పద్దతి ఆలకించి, అలాగే ఆలపించినా ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరకి ఆయన చిరాకుతో నా చేత పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. ప్రక్కన ఎల్.ఆర్. [...] |
|
సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి
ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఈ రోజు(ఆదివారం) ఉదయం స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు. ఆయన తొలి చిత్రం ‘మల్లెల మనసులు’. చివరి చిత్రం మేస్త్రీ(దాసరి). తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ టి.క్రిష్ణ ఈయనను బాగా ప్రోత్సహించేవారు. నేటి భారతం చిత్రంలో [...] |
|
ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4
సంగీత రాజేశ్వరులు శ్రీ రాజేశ్వరావుగారిని 1962 లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతలుగా కలిశాను. ఆ పోటీలలో నారు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా గాత్రం విని, నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీరు అనతికాలంలోనే గొప్ప నేపధ్య గాయకులవుతారు అని వ్రాశారాయన. ఆయన సంగీత దర్శక్తవంలో మొట్టమొదట నేను పాడినది వీరాంజనేయలో హనుమా..పావన రుద్రతేజమున అన్న -బ్రహ్మ పాడే పద్యం,పద్యాన్ని కానడ రాగంలో స్వరకల్పింతం చేశారు. ఆయన [...] |
|
కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2
“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు. ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది [...] |
|
కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర
చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు వ్రాసే [...] |
|
ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3
శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) [...] |
|
పఠాభి-Rebel with a cause
1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు [...] |
|
ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2
1966 డిసెంబర్ 14 ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను. ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా [...] |
|
విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు
“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది. నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కళ్ళముందు గింగిరాలు తిరుగుతాయి. సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్) …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్ ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ [...] |
|
తెలుగులో మహిళా దర్శకులు
తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |