పరిచయం back to homepage

vlcsnap-53605 ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా…..

ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి సాధారణంగా ఒక కామన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది ఆ పాత్రతో సహా.. “అని గట్టిగా అనరాదు,వేరొకరు వినరాదు, అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం, ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదిరి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మాననీయుడూ,మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో,ఆపైన కొంచపు వంచన [...]

చక్రపాణీయం

చక్రపాణీయం-ఒక పరిచయం నూతనసంవత్శరం లో నవతరంగం పాఠకులకు ఒక అపురూపమైన కానుకను అందిస్తున్నాము.బహుముఖప్రజ్ఞాశాలి ‘చక్కన్న’గా అందరికీ చిరపరచితులైన దివంగతచక్రపాణి గారి ఆప్తులు,సన్నిహితులు,అభిమానులు,ఇలా ఎందరో తమతమ జ్ఞాపకాల దొంతరలను అపురూపంగా అందించిన ’చక్రపాణీయం’ నుంచి వ్యాసాలు ఇకపై నవతరంగంలో. ’చక్రపాణీయం’ శ్రీచక్రపాణి స్మృతిసంపుటిని చక్రపాణి-కొలసాని ఫౌండేషన్,4-22-27,ఐతానగరం, తెనాలి522 201వారు మార్చి,1997న ప్రచురించారు. సుప్రసిద్ధ పత్రికాసంపాదకుడు,అనువాదకుడు, స్క్ర్రీన్ ప్లే రచయిత,చలనచిత్రనిర్మాత,దర్శకుడు,విమర్శకుడు,మహామేధావి చక్రపాణి స్మృతిసంపుటి కి సంపాదకత్వం వహించినవారు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య, పిహెచ్.డి. వారు ఈ గ్రంధప్రారంభం లోనే The [...]

ఆర్సన్ వెల్స్ ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ప్రపంచాల యుద్ధం ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక [...]

nagaiah-lead నేడు నటయోగి నాగయ్య వర్థంతి

నటయోగి నాగయ్య Artistes are born, not made అన్న ఆంగ్ల ప్రవచనానికి నిదర్శనం మహానటుడు నాగయ్య. ఒకప్పుడు చిత్రసీమలో రారాజుగా వెలిగిన నాగయ్య గురించి నేటి యువతరానికి తెలియదు. మధ్యవయసు వారికి కూడ ఆయన కేవలం ఒక క్యారెక్టర్ నటుడిగానే స్మృతిపథంలో వుండవచ్చు.కాని ఒక దశాబ్దంపాటు ఆయన ప్రఖ్యాత హీరోగా వెలిగారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనదొక స్వర్ణయుగం. హావభావాలను ప్రదర్శించడంలోగాని, భావ రాగ తాళ యుక్తంగా పాడడంలోగాని ఆయనదొక విశిష్టశైలి, తనదైన వ్యక్తిత్వ ముద్ర [...]

bn-rao ‘ఆలోచన’కు అక్షరాభ్యాసం చేయించిన బి. నర్సింగరావు

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం అన్న ఈ శీర్షిక పేరు చూడగానే “అంటే! అంతకుముందు వచ్చిన చిత్రాలు ఆలోచనలను రేకెత్తించేవి కావా?” అని ఆవేశానికి లోనవకండి. కావొచ్చు. కానీ, ఆ ఆలోచనలకూ, నర్సింగరావు రేకెత్తించే ఆలోచనలకూ చాలా తేడా ఉంది. ఏ సగటు తెలుగు సినిమాను తీసుకున్నా, అది తయారుచేయటానికి ముడిసరుకు (ఫార్ములా అని మనం అనేది) ఒకటే. ఒక హీరో, హీరోయిన్, ఏదో ఒక రూపంలో విలన్ లేదా విలనిజం – ఇవి తప్పకుండా కావలసిన దినుసులు. బిర్యానీలో [...]

rajababu నవ్వుల (రాజు) బాబు…:)

“నీ జడ పిన్ను నా తలరాతకు పెన్ను నీ సిగపువ్వు అదేంటమ్మా… ఆ.. బుజబుజరేకుల నవ్వు” ” రాజమండ్రి స్టేషన్లో రైలెక్కి బొంబాయి స్టేషన్లో దిగుదామా!” “ఏయ్ ! వాన్ని నేను నలికేత్తాను తల్వాతేమయిందో చెప్పూ” “చాకిరేవుకాడా నీ సోకు, చూడగానే జిల్లంది నాకు” ఈ పాటలు వింటుంటే ఎవరు గుర్తొస్తున్నారు??  వెదురు బద్దలా గాలికి ఊగుతున్నట్టుగా అటు ఇటు ఊగుతూ, అమాయకపు నవ్వులతో మనకు కితకితలు పెట్టే నవ్వుల రాజు .. రాజబాబు.  అంతే ఈ [...]

abbas-lead అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం

అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో [...]

andrebazin ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం (50వ వర్థంతి సందర్భంగా)

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut, [...]

Image Courtesy:మరో సంధ్యారగం వెబ్ సైట్ శ్రీ గుమ్ములూరి శాస్త్రి గారికి నివాళులు

‘పడమటి సంధ్యారాగం’ సినిమాలో విజయశాంతి తండ్రి పాత్ర వేసిన గుమ్ములూరి శాస్త్రి గారిని మర్చిపోవటం కష్టం. ఆయన సోమవారం రాత్రి (Nov 24, 2008) నిద్రలో తుది శ్వాస వదిలారు. గుమ్ములూరు శాస్త్రి గారు గోదావరి జిల్లాలో గుమ్ములూరి సత్యనారాయణ గారికి జన్నించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎమ్.ఎస్.సి ని పూర్తి చేసి అక్కడే లెక్చరర్ గా చేరారు. ఆ తర్వాత 1965 లో ఆస్ట్రో ఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయటానికి యు.ఎస్.ఎ వెళ్ళారు. అక్కడే [...]

తూ హిందు బనేగా న ముసల్మాన్ బనేగా-బీ ఆర్ చోప్రా కు శ్రద్ధాంజలి!

అది హీరోలను తప్ప నిర్మాతలను గమనించే వయసు కాదు. అలాంటి వయసులో కూడా బీ ఆర్ చోప్రా నా దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆయన పట్ల నాకు ఆకర్షణ కలగటానికి ప్రధాన కారణం సాహిర్ లూధియానవీ అంటే నాకున్న అభిమానం. సాహిర్ లూధియానవీ ఎంత గొప్ప గేయ రచయితనో అంతకన్న గొప్ప కవి. ఇంకా గొప్ప అహంకారి. ఆయన అహంకారం గురించిన కథలు చదువుతూ, ఆత్మ విశ్వాసాన్ని అహంకారంగా భావించే సగటు మనుషులను చూసి నవ్వుకుంటూండేవాడిని. నేను [...]

ఆండ్రే వైదా ఆండ్రే వైదా-ఒక పరిచయం

పరిచయం: అయనకి సినిమా ఒక ఆయుధం.  ఆయనకి సినిమా ఒక సాధనం.  ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ [...]

b-r-chopra-lead బి.ఆర్ చోప్రా-ఒక నివాళి

భారత సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రముఖులలో ఒకరైన బి.ఆర్ చోప్రా(94) ఈ ఉదయం 8.15 నిముషాలకు ముంబయి, జుహు లోని తన స్వగృహంలో మరణించారు. గత కొంత కాలంగా అస్వస్ధతకుతో బెడ్ రెస్ట్ లో ఉన్న ఈ సిని కురు వృధ్ధుడు మరణానికి బాలీవుడ్ మొత్తం నీరాజనాలు అర్పిస్తోంది. ఆయన తన బి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై కెరీర్ లో క్లాసిక్ లుగా పరిగణించతగ్గ నయా దౌర్,ఏక్ హి రిస్తా,కానూన్,ధూల్ క ఫూల్,గుమ్రాహ్ వంటి చిత్రాలును [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories