Category: ప్రముఖులు

మొదటి సినిమా - కె. విశ్వనాథ్

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ వారం నుంచి నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన జీవనప్రయాణం గురించి తెలియచేస్తారు. ఈ వ్యాసాలు ఔత్సాహిక దర్శకులకు ఎంతో ఉపయోగకరంగానూ, సాధారణ పాఠకులకు ఆసక్తికరంగానూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ వ్యాసాలు ఇక్కడ ప్రచురించే [...]

త్రిష - సమంతాల అందమైన గొంతు: చిన్మయి

త్రిష – సమంతాల అందమైన గొంతు: చిన్మయి

తమిళంలో ‘విన్నైతాండివరువాయా’, తెలుగులో ‘ ఏ మాయ చేసావో’ సినిమాలు నచ్చినా నచ్చకపోయినా ప్రేక్షకులందరికీ నచ్చేది హీరోయిన్లు త్రిష-సమంత కు డబ్బింగ్ చెప్పిన గొంతు. ఆ అందమైన గొంతే లేకపోతే కథానాయిక పాత్రలోని సంక్లిష్టత ఎలివేట్ అయ్యుండదనేది సినిమా చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పే విషయమే. ఆ అందమైన గొంతు గాయని “చిన్మయి”ది. ఈ సినిమాల్లో డబ్బింగ్ చెప్పిన అనుభవాల్ని  తన బ్లాగులో ఇలా పంచుకుంది.

As always I write [...]

డాక్యుమెంటరీ సినిమా-జయధీర్ తిరుమల రావు-3

డాక్యుమెంటరీ సినిమా-జయధీర్ తిరుమల రావు-3

చైనా సినిమా – చరిత్ర – దశలు
అభ్యుదయ సినిమాలకి అభివృద్ధి నిరోధక సినిమాలకీ ఉన్న సంఘర్షణే చైనా సినిమా చరిత్ర. “పోరాటం – ఓటమి” పోరాటం – ఓటమి – గెలుపు” అన్న మావో సూక్తి చీకటి కోణంలో దాగిన సినిమా చరిత్రను చదవటానికి ప్రేరేపిస్తుంది.
చైనాలో 1896 లోనే సినిమా ప్రదర్శింపబడింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాతే చైనాలో సినిమాలు తీయడం ప్రారంభించారు.
చైనా సినిమా చరిత్రని సమగ్రంగా తెలుసుకోవడానికి అధ్యయనం చేయడానికి ఇప్పటిదాకా [...]

 డాక్యుమెంటరీ సినిమా-జయధీర్ తిరుమల రావు-1

డాక్యుమెంటరీ సినిమా-జయధీర్ తిరుమల రావు-1

డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటో ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా నేడు డాక్యుమెంటరీ సినిమాల నిర్మాణం జరుగుతోంది. అయితే డాక్యుమెంటరీ అనే పదాన్ని మొట్టమొదటిగా Robert Flaherty నిర్మించిన ’నానూక్ ఆఫ్ ది నార్త్’ అనే చలనచిత్రం గురించి వ్రాసిన ఒక సమీక్షలో వాడడం జరిగింది. ఇంతకూ డాక్యుమెంటరీ సినిమా అంటే ఏంటి? నిజజీవితంలోని విషయాలను ఉన్నదున్నట్టుగా విజువల్ గా డాక్యుమెంట్ చేయడమే డాక్యుమెంటరీ సినిమా అని చెప్పుకోవచ్చు.
బ్రిటిష్ డాక్యుమెంటరీ సినిమాకు ఆద్యుడిగా పిలవబడే [...]

Paranormal activity

Paranormal activity

Paranormal activity
ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు,
” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి.
ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య శక్తి తనని వెంబడిస్తున్నదని, [...]

మహా యోగి

మహా యోగి

రాసిన వారు: పూర్ణిమ
**********************
సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ రైటర్ [...]

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం "ఆరోచూ.. .."

భారతీయ చలన చిత్ర చరిత్రలో మొదటి లంబాడి చిత్రం “ఆరోచూ.. ..”

ఈ సంక్రాంతి కి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ సినిమాలు ఏమైన షూటింగ్ ప్రారంభమైతవా లేదా అని ఆనుకుంటున్న వారికి ఒక శుభ వార్త అదేంటంటే…
(1995 నుంచి) దశాబ్ద కాలాని కి పైనుంచే రవిరాజ పినిశెట్టి, సి కల్యాణ్,ఈ వి వి సత్య నారాయణ ,పూరి జగన్నాధ్, ఉషాకిరణ్ మూవిస్ లో ఇత్యాది ప్రముఖ నిర్మాతలు , దర్శకుల ఎన్నో కమర్షియల్ సినిమాలకు రచయితగా,మరియు దర్శకత్వ విభాగం లో ను పనిచేస్తు వచ్చిన నా మిత్రుడు ,మా [...]

"సినిమా విమర్శ" - కొడవటిగంటి కుటుంబరావు

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

‘పాల మనసులు’  చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’  అన్న డా.నారాయణ రెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్.ఆర్.ఈశ్వరితో పాడేందుకు శ్రీ సత్యం గారి దగ్గరనుంచి ఆహ్వానం వచ్చింది.  అదే ఆయన సంగీత దర్శకత్వంలో నే పాడిన తొలిపాట. ఆ పాట ఆయన ఆలపించిన పద్దతి ఆలకించి, అలాగే ఆలపించినా ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరకి ఆయన చిరాకుతో నా చేత పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. ప్రక్కన ఎల్.ఆర్. [...]

సినీనటుడు  నర్రా వెంకటేశ్వరరావు మృతి

సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి

ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఈ రోజు(ఆదివారం)
ఉదయం స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు.
ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
సుమారు 500 చిత్రాల్లో నటించిన
నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు.
ఆయన తొలి చిత్రం ‘మల్లెల మనసులు’.
చివరి చిత్రం మేస్త్రీ(దాసరి).
తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి
గుర్తింపు తెచ్చుకున్నారు.
స్వర్గీయ టి.క్రిష్ణ ఈయనను బాగా ప్రోత్సహించేవారు.
నేటి భారతం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

సంగీత రాజేశ్వరులు  శ్రీ రాజేశ్వరావుగారిని 1962 లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతలుగా కలిశాను. ఆ పోటీలలో నారు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా గాత్రం విని, నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీరు అనతికాలంలోనే గొప్ప నేపధ్య గాయకులవుతారు అని వ్రాశారాయన.
ఆయన సంగీత దర్శక్తవంలో మొట్టమొదట నేను పాడినది వీరాంజనేయలో హనుమా..పావన రుద్రతేజమున అన్న -బ్రహ్మ పాడే పద్యం,పద్యాన్ని కానడ  రాగంలో స్వరకల్పింతం చేశారు. ఆయన సన్నివేశాన్ని [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు.
ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది కొసమెరుపు. [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) [...]

పఠాభి-Rebel with a cause

పఠాభి-Rebel with a cause

1942లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతుండగా అమెరికన్ ఆర్మీలో చేరమని పిలుపు వచ్చింది ఆయనకి.సైన్యంలో చేరితే మాంసాహారం తినాల్సొస్తుందని సైన్యంలో చేరకుండా FBI కి లొంగిపోయి ఆ తర్వాత అమెరికా వదిలిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి భారతదేశం చేరుకోవాలంటే ఓడమీదే చేరుకోవాలి. కానీ ఆ రోజుల్లో జర్మన్ యూబోట్ల నుంచి తప్పించుకుని సురక్షితంగా నౌకలో బయటపడడమంటే అత్యంత కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో నేల మార్గాన, తీర ప్రాంతాల నౌకలద్వారానూ మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీలకు [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-2

1966 డిసెంబర్ 14 ఉదయం 9 గంటలకు అలవాటు ప్రకారం ‘రేఖా అండ్ మురళి’ కార్యాలయం లోకి వెళ్ళగానే అక్కడ శ్రీమతి సుశీల,శ్రీయుతుల పి.బి.శ్రీనివాస్,రఘురామయ్యలు కనిపించారు. కాళ్ళు వణకటం అప్పుడే ప్రారంభమయింది. లోపలకి వెళ్ళగానే నన్ను వాళ్ళకు పరిచయం చేసారు. తిరిగి వాళ్ళ ముందు ‘దోస్తీ’ లోని పాట పాడాను. ఒకరేమో అపర కోకిల, మరొకరు తన మధుర గాత్రంతో రసికుల గుండెలను దోచేసుకున్న గానదాసు శ్రీనివాస్,మరి రఘురామయ్యగారు ఈలపాట ద్వారా..శరపరంపరను పోలిన స్వర ప్రస్తారాల ద్వారా [...]

విషాదాంతాలు -  బాలచందర్ సినిమాలు

విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది.  నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో  కళ్ళముందు  గింగిరాలు తిరుగుతాయి.  సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్)  …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి,  కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్  ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ  నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ [...]

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు. [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు..

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు..

నా తొలి పాట రికార్డింగ్ జరిగిన రోజు దాదాపు నా సంగీత(చిత్ర)జీవితానికే తొలి నాడు. ఆ నాటి ముచ్చట్లు ఏ నాటికీ నేను మరచిపోలేని పన్నీటి జల్లులు,ఆనాడు నేను పాడేందుకు అవకాశం కలిగించినవి..ఆ నాటికి ముందు జరిగిన ఎన్నో విశేషాలు…
1964 జూన్ లో మద్రాసు సోషల్ అండ్ కల్చరర్ క్లబ్ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీలో నేను పాల్గొన్నాను. నాటి ఆ  పోటీకి మేటి సంగీతజ్ఞులు,సంగీత దర్శకులు అయిన శ్రీ ఘంటసాల, శ్రీ పెండ్యాల శ్రీ [...]

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

గడుగ్గేయకారుడు: వేటూరి-రెండవ భాగం

వేటూరి మానవ జీవితంలోని అన్ని అనుబంధాలలోని అన్ని కోణాలను తనదైన కవి హృదయంతో దర్శించారు. దాంపత్య జీవితంలోని అనురాగాన్ని కంటి తడిలో చూపించి… భార్యాభర్తలే సిరులన్నింటినీ మించిన చిరునవ్వులనీ అత్యంత హృద్యంగా చెప్పారు. (మా ఇంటిలోన మహలక్ష్మి నీవే.)
వేటూరి కలం – సరస సరాగాల సుమవాణిని -శిలలతో సైతం వినిపించేలా చేసింది. పదం-పాదం కలిసిన నర్తనలో పరుగు గౌతమినే- పరవళ్లు తొక్కించింది. (నిన్నటి దాకా శిలనైన.)
వేటూరి ఎంతో హృద్యమైన పాటలను సైతం రాశారు. మాటలనే పాటలుగా లయాత్మక [...]

Page 1 of 812345...Last »
Powered By Indic IME