Category: ప్రపంచ సినిమా

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

Movie Endings
ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్ [...]

మారుతున్న సినిమా కథనం

మారుతున్న సినిమా కథనం

సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ [...]

Paranormal activity

Paranormal activity

Paranormal activity
ఇది ఈ మధ్యే మా ఊళ్ళో విడుదలైన ఓ ఆంగ్ల చిత్రం పేరు,
” What happens when you sleep”, ” Don’t see it when you are alone” అన్న Captions చూసి చాలా ఆతృతగా వెళ్ళా థియేటర్ కి. తీరా వెళ్ళి చూసాక తెలిసింది! ఇది…….ఎందుకులెండి, క్రింద కథ రాసాను మీరే చదువుకోండి.
ఓ ఇంట్లోకి కొత్తగా పెళ్ళైన జంట దిగుతారు. అయితే ఆ అమ్మాయికి ఏదో అదృశ్య శక్తి తనని వెంబడిస్తున్నదని, [...]

అవతర్ - నాఽవీ నేవీల సంగ్రామం

అవతర్ – నాఽవీ నేవీల సంగ్రామం

కానీ అవతార్ నిజంగా ఎందుకు గొప్ప అంటే,
ఇది మహాభారతంలాగా ఒక పురాణం లాంటిది. చెడు పై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది, కాబట్టి మీరు సరైన పక్షాన వుండాలి అని హెచ్చరించే ఒక నీతి కథ.

The (Half) Man

The (Half) Man

Irving Wallace వ్రాసిన రాజకీయ నవల. ఒక black-man ని అమెరికా అధ్యక్షునిగా ఊహించి వ్రాసిన ఈ నవల అప్పట్లో పలుసంచలనాలకి కేంద్ర బిందువైంది.  అమెరికా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పుస్తకం ప్రతులని తగుల పెట్టారు. చాలా చోట్ల నిషేధానికి గురి అయింది.
1972 లో ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీశారు. ఈ సినిమా గురించి చెప్పే ముందు కాస్త Irving Wallace గురించీ, అతని నవలలు నాకు పరిచయం అయిన తీరు గురించి చెప్పాల్సి వస్తుంది.
నవలని [...]

"Adaptation" సినిమా మళ్ళీ చూడడం గురించి

“Adaptation” సినిమా మళ్ళీ చూడడం గురించి

చార్లీ కఫ్‌మన్ రాసిన సినిమాల్లో నాకు నచ్చేది అతని పద్దతైన ఉన్మత్తత; సొంత హద్దులున్న విశృంఖలత్వమూను. అతని సినిమాలు ఇవ్వగల పూర్తి అనుభూతిని ఒక్కసారి చూడ్డంతోనే సొంతం చేసుకోలేం. ఎందుకంటే వాటి కథలు పొరలు పొరలుగా వుంటాయి. తొలివీక్షణంలో పైపొర మాత్రమే అందుకోగలుగుతాం. మలివీక్షణాల్లో ఒక్కొక్క పొరా విడిపోవడం మొదలౌతుంది. తొలిసారి గమనింపుకు రానివి ఈ సారి స్పష్టంగా చూడగలుగుతాం.
చార్లీ కఫ్‌మన్ అభిప్రాయం ప్రకారం సినిమా ఒక మృత మాధ్యమం. నాటక మాధ్యమంలో ప్రదర్శన ప్రదర్శనకీ నటన [...]

యానిమేషను సినిమాలు ...

యానిమేషను సినిమాలు …

ఎందుకనో భారతంలో మామూలు సినిమాలను ఆదరించినట్టుగా యానిమేషను సినిమాలను ఆదరించరేమో అని నాకనిపిస్తుంది. (ఈ మధ్య ట్రెండు మారుతున్నట్టుంది). వాటి గురించి ఎంతో కొంత ఈ వ్యాసంలో చెబుదామని నా ప్రయత్నం.
యానిమేషను సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఇజాలు ఉండవు, స్టార్ నటులు ఉండరు, ఇగోలు చెల్లవు. పాత్రలు మాత్రమే ఉంటాయి.
ఆలోచించండి అసలు ఇవాళ మన సినిమాలలో ఇలాంటి అదృష్టం మనకుందా ? సర్లెండి అదో పెద్ద అంతులేని కథ.
ఇంతకీ యానిమేషను సినిమాలు ఒక [...]

Werckmeister Harmonies - ఒక చింతన

Werckmeister Harmonies – ఒక చింతన

పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా [...]

మన కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

ముంబాయిలోని అతిపెద్ద (ఆసియాలోనే) మురికివాడ అయిన ధారవిలో పెరిగే పిల్లలు – సలీం, జమాల్. సలీం, జమాల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక మతకలహాల సందర్భంలో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అప్పటినుంచీ వాళ్ళు అనాథలవుతారు. వాళ్లకు మరో అనాథపిల్ల లతిక తోడవుతుంది. అనుకోకుండా ఒకసారి వాళ్లకు మామన్ అనే వ్యక్తితో పరిచయమవుతుంది. మామన్ వాళ్లకు తినడానికి మంచి తిండి పెట్టి, తన దగ్గరకు తీసుకువెళతాడు. తీరా అక్కడికెళ్ళాక వాళ్లకు అతను చిన్నపిల్లలను ప్రలోభపెట్టి, వాళ్ళను వికలాంగులను చేసి, వాళ్ళతో భిక్షాటన చేయించే ఒక ముఠానాయకుడని తెలుస్తుంది. మామన్ పిల్లలకు మత్తును కలిగించడానికి ఉపయోగించే క్లోరోఫాంను అతని అనుచరుడు పున్నోజ్ ముఖాన చిందించి వాళ్ళు అక్కడినించి తప్పించుకుంటారు. లతిక మాత్రం వాళ్ళు తప్పించుకోవటానికి పరుగెత్తుతూ ఎక్కిన రైలును అందుకోలేక అక్కడే ఉండిపోతుంది.

మన కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

ఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో మొట్టమొదట సమీక్షించినది సాయి బ్రహ్మానందం గారు (డిసెంబర్ 1, 2008). అప్పటికి ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. అప్పుడు ఈ సమీక్షకు రాసిన వ్యాఖ్యల్లో నేను ఇది ఎందుకూ పనికిరాని సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాశాను.
ఆ తర్వాత ‘స్వాతి’ మాసపత్రికలో (జనవరి, 2009) ఈ సినిమా మాతృక అయిన వికాస్ స్వరూప్ రాసిన ‘Q & A’ నవల గురించిన సమీక్ష – మాలతి [...]

కేట్ చదివించింది

కేట్ చదివించింది

కేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె.
ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆనాటి టైటనిక్ నుంచీ ఈనాటి ద రీడర్ వరకూ ఏ సినిమా చూసిన అర్ధం అవుతుంది. కేవలం కేట్ కోసమే సినిమాలని చూసే వాళ్ళున్నారు. సరే అసలు విషయం. కేట్ కేవలం అందమే కాదు. నటనా ఉన్న నటి. (నటించేవారే నటులు అంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలియానా, అనుష్క, త్రిష, జెనీలియా, ప్రియమణి ఎట్సెట్రాదులు కేవలం అందంతోనే నెట్టుకొస్తున్నారు యువరానర్. అందుకే నటన లేక [...]

కిరా కనుమరుగైందా?

కిరా కనుమరుగైందా?

Kira Argounova.
Ayn Rand వ్రాసిన ‘We the Living‘ అనే నవలలోని హీరోయిన్. ఆ నవలని సినిమాగా ఒక ఇటాలియన్ దర్శకుడు Ayn అనుమతి లేకుండా తీశాడు. అది తరువాత ఎలాగో Ayn కి తెలిసింది. చాలా కాలం తరువాత. దాని గురించి చాలా చోట్ల ఉంది. కనుక నేనా విషయాలను ప్రస్తావించ బోను. ఒక లింక్ ఇస్తే చాలు కదా.
అందుకే నేను వేరే విషయాలని ప్రస్తావిస్తాను. కాస్త నవల గురించి, కాస్త సినిమా గురించి. ఇంకేమన్నా [...]

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు:

సిటిజన్ కేన్
సిటిజన్ కేన్-కొన్ని విశేషాలు
ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ వ్యాసాలు navatarangam[at]gmail[dot]com కు పంపించాల్సిందిగా మనవి.
గతంలో వచ్చిన వ్యాసంలో [...]

గాడ్‌ఫాదర్ - తెరవెనుక కథ

గాడ్‌ఫాదర్ – తెరవెనుక కథ

ప్రపంచ సినీ చరిత్రను తిరగరాసిన గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మాఫియా ఆధారంగా తీయబడిన ఈ సినిమా చిత్రీకరణ మొదలవడానికి నిజమయిన మాఫియా ఎన్నో ఆటంకాలు కలిగించింది. అమెరికాలోని పలు నగరాల్లో ఇటాలియన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి ప్రముఖ మాఫియా బాస్ ఈ సినిమాను ఆపడానికి తన బలాన్ని బలగాన్ని ఉపయోగించాడు. నిర్మాత చివరకు మాఫియా చెప్పిన ఆంక్షలకు తలవంచవలసి వచ్చింది. ఒక వైపు న్యూయార్క్ [...]

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం.
ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ లేదా [...]

The Bicycle Thief (Italian, 1948)

The Bicycle Thief (Italian, 1948)

ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు.
ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
సినిమా గురించిన కొన్ని మౌలికమైన వివరాలకి కింది సైట్లు చూడచ్చు.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్
వికీపీడియా
రాజర్ ఈబర్ట్ [...]

మనము సినిమాలెందుకు చూస్తాం?

మనము సినిమాలెందుకు చూస్తాం?

ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము?
టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, పరోక్షంగా [...]

Atticus Finch

Atticus Finch

Atticus ఒక పరమ బోరు తండ్రి. అతడు పుట్టుముసలి అని అతని పిల్లల అభిప్రాయం. పిల్లలతో Football ఆడడు, ఇతర తండ్రులలా వేటకి తీసుకువెళ్ళడు. తుపాకి పేలచడం కూడా వచ్చో రాదో! ఎన్ని సార్లు అడిగినా కొడుకు Jemకి తుపాకి కొనిపెట్టలేదు మరి! పిల్లలు ఎంత అల్లరి చేసినా కొట్టడు. కూతురు మగరాయడిలా overalls వేసుకు తిరుగుతుంది. అందరితోటి కొట్ట్లటలే ఆ అమ్మాయి కి, ఇంటి ఎ.దురుగా ఉండే ముసలావిడ దగ్గిరనించి పాఠశాలలొ పిల్లలు, ఉపాధ్యాయుల వరుకు. [...]

అవమానపరిచే సినిమాలు

అవమానపరిచే సినిమాలు

ఆర్టు సినిమాలు,హార్టు సినిమాలు, సమాంతర సినిమాలు,బూతుసినిమాలు, బాగుండే సినిమాలు, బాగలేని సినిమాలు, మంచి సినిమాలు, చెడ్డసినిమాలు అని మనం చాలా సినిమాల పేర్లువిన్నాం. చూసాం. చర్చించాం. విశ్లేషించాం. విస్తృతంగా సమాచారాల్ని పంచుకున్నాం. కానీ, గత రెండు వారాలలో నేను ఒక విభిన్నతరహా సినిమాల బారినపడి, ధియేటర్ల నుంచీ నిర్ధ్వందంగా “వాకౌట్లు” చేసాను. అవే…అవమానపరిచే సినిమాలు.
ఈ తరహా కొత్తేమీ కాకపోయినా, ఈ మధ్యకాలం హాలీవుడ్డూ,బాలీవుడ్డూ,కోలీవుడ్డూ, హైదరాబాదుడ్డూ…… గాడిదగుడ్డూ ఆన్నీ నిర్లజ్జగా మనమీదకి వొదులుతున్న వందలాది చిత్రాలు ఈ కోవకే [...]

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

డార్క్ నైట్ త్రిప్పిన మలుపులు

ఫ్రాంక్ మిల్లర్ వ్రాసిన గ్రాఫిక్కు నవల ‘డార్క్ నైటు రిటన్స్’ వల్ల బాట్మాన్ పాత్రకి తిరిగి ప్రాణం వచ్చిందనే చెప్పువచ్చు. అంతకు మునుపు, మరిం కెవరూ పెద్దగా పట్టించుకోక కుంటు పడుతున్న పాత్రయి కూర్చున్న బాట్మానుని పట్టుకుని వాడి ఉనికినే మార్చేసి, ఓ డార్క ఫోర్స్ గా తీర్చి దిద్దిన ఫ్రాంక్ మిల్లర్ కి డీసీ కామిక్సు వాళ్ళు ఎంతో ఋణపడి ఉండాలి.
ఒకానొక సమయంలో వెండి తెర మీద కూడా బాట్మాన్ కి తిలోదకాలందాయి. జోయెల్ షూమాకర్ [...]

Page 1 of 212