ప్రపంచ సినిమా

The lovely bones – వేదనా కావ్యం !

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ (…)

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి(…)

The hunt – వెంటాడే లోకం !!

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా. లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ(…)

the first grader – స్పూర్తి దాయకం

the first grader – స్పూర్తి దాయకం

  కెన్యాలో,  1953 వ సంవత్సరంలో బ్రిటీషుపాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు  సాయుధ పోరాటం జరిపాయి . ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేలకొద్దీ జైలుపాలయ్యారు. కొందరు  చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్దించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు..బాధలు..గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.   ఓ గుడిసె..  ఎనభైఏళ్ళ ముసలాడు   ఒంటరి జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. కొత్త ప్రభుత్వం అందరికీ  ఉచిత ప్రాధమిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి(…)

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే. జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు. అమె తన ప్రియుడి(…)

Ratcatcher – అంతర్మధనం

Ratcatcher – అంతర్మధనం

   సినిమా అనేది భావవ్యక్తీకరణ మాధ్యమం అయితే దాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించగలిగిన దర్శకులు కొందరే.   జేమ్స్ నీళ్ళకొలను దగ్గర ఆడుతూ ఉంటాడు. కిటీకీ లోంచి రయాన్ చూస్తాడు.తనకీ స్నేహితుడితో ఆడుకోవాలని అనిపిస్తుంది. కానీ తల్లి మాత్రం  జైల్లో ఉన్న తండ్రిని చూడటానికి బయలుదేరమంటుంది. వెంట నడిచినట్టే నడిచి తల్లిని ఏమార్చి స్నేహితుడిని చేరుకుంటాడు రయాన్.  జేమ్స్  రయాన్ని నీళ్లలోకి తోస్తాడు. రయాన్ జేమ్స్ మొహాన బురద కొడతాడు.  అలా సరదాగ మొదలై  కొంచం తీవ్రమవుతుంది.(…)

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

మన చుట్టూ వున్న ప్రపంచం,ఆ ప్రపంచంలో వున్న మనం…మన కుటుంబ నేపధ్యం,మన వృత్తి,ఇరుగు- పొరుగు,సంబంధ బాంధవ్యాలు వీటికి తోడుగా మన చుట్టూ అల్లుకు పోయిన సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు వాటి వల్ల మనం ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చే ఉత్పాతాలు,వాటికి మన ప్రతిస్పందన..స్థూలంగా మనం ఎదుర్కొనే సమస్యలు,వాటి ద్వారా మనం పొందే అనుభవాల సమాహారమే కథ. ప్రతి కథానాయకుడు సమస్యల్ని ఎదుర్కొంటాడు….కొందరు ధీరులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొందరు భీరువులు వాటికి లొంగిపోతారు(దేవదాస్)…ఇంకొందరు అవాస్తవిక దృక్పధాలతో సమస్యని తమదైన శైలిలో పరిష్కరించే(…)

Citizen Kane

Citizen Kane

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు “సిటిజెన్ కేన్”. ఈ సినిమా పేరు తెలియని ప్రపంచ సినిమా అభిమానులు ఉండరు. ఈ సినిమా తెలియనివారెవరైనా ఉన్నారంటే వారికి ప్రపంచ సినిమా గురించి ఇంకా అంత పరిచయం లేకుండా ఉండి ఉండాలి. వందేళ్లకు పైబడ్డ చలనచిత్ర చరిత్రలో నెంబర్ వన్ సినిమా ఏదంటే ఠక్కున నోటికొచ్చేది ఈ సినిమా పేరే! నేటికీ ఏ ప్రపంచ చలనచిత్రకారుడ్ని అడిగినా దాదాపు అందరూ ఏకకంఠంతో నెంబర్ వన్ సినిమా గా అంగీకరించే(…)

My dinner with Andre

My dinner with Andre

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రే” సినిమా వేరయా!!! సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆందోళన నిండిన మొహంతో షాన్ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. నడుస్తున్నంత సేపూ అతనికి ఎంతో పరిచయమైన ఆ నగరం ఎప్పటిలానే పలకరించింది. కానీ షాన్ ఇవేవే పట్టించుకునే స్థితిలో లేడు. నాటక రచయితగా కొద్దో గొప్పో పేరున్నా ఇప్పుడు(…)

Tokyo Story

Tokyo Story

ఇది నా కథ. మీ కథ. మనందరి కథ! జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే; అసలు అలాంటి(…)

Paris, Texas – కలిసిన దూరాలు.

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు(…)

rosetta – గులాబీ కొమ్మ

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!!  కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల(…)

One Flew Over the Cuckoo’s Nest

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.(…)

About Elly – మనసు నాటకం

About Elly – మనసు నాటకం

కొన్ని మనం వదిలేయాలనుకుంటాం..కొత్తగా జీవించాలని ఆశపడతాం.  కానీ అవి మనని వదలవు ..అంతలోనే కొత్తవి అల్లుకుపోతుంటాయి. ఏం చేయాలోతోచదు..  అప్పుడు మనని మనమే వదిలేయాలని నిర్ణయించుకుంటాం !! తమ సమస్యని కాలం కూడా పరిష్కరించలేదని భావించిన మనిషి ఏం చేస్తాడు ??? !! ఈ సినిమా డౌన్లోడు అవుతుండగా.. మధ్యలో ఒకసారి క్వాలిటీ చెక్ కోసం ప్లే చేసాను. చూడతగ్గ క్వాలిటీ లేకుంటే డౌన్లోడు వేస్ట్ కదా అందుకే !   క్వాలిటీ ఒకే..కానీ ప్లే అవుతున్న (…)

Getting Home

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే! కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్(…)

Bicycle Thieves

Bicycle Thieves

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం. అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే! మన కథకు(…)

The Man from the Earth

The Man from the Earth

ఏది సత్యం…ఏదసత్యం…ఓ మహాత్మా…ఓ మహర్షీ!!! జాన్ ఓల్డ్‌మ్యాన్ ఒక విశ్వవిద్యాలయంలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పని చేసి ఒక రోజు అకస్మాత్తుగా రాజీనామా చేసేశాడు. అతనితో పాటు పని చేస్తున్న మిగిలిన ప్రొఫెసర్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకో కొన్ని రోజుల్లో హిస్టరీ డిపార్ట్‌మెంట్ కి డీన్ గా పదోన్నతి పొందుతాడన్న విషయం దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో జాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారెవరికీ అర్థం కాలేదు. జాన్ ఇల్లు ఖాళీ చేసి(…)

Welcome

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.(…)

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

జ్ఞాపకాల్నీ, మనల్నీ కలిపే దారం గజిబిజిగా ఉంది కాబట్టి కొంత నయంగానీ, కుళ్లుమోతు విధి విధించిన సంకెళ్లకి ఇలా మిగిలాం గానీ, అదే కురచైన సరళరేఖైనట్లైతేనా ఇంకెంత నరకం? తుది- మొదలు తెలిసిపోయి, రెండు కొసల చివర్లలో ఏమీలేనితనం ఎడతెగని ఖాళీలా- అవును ప్రియా! ఇప్పుడు, వీడ్కోలు చెప్పుకోవల్సిన పరిస్థితులు దాపురించిన ఈ గుబులు పొగుళ్ల గుంజాటనే ఈవలి కొస అయితే, మన కలయికకి మొదలెప్పుడు? నిజానికి మనది కలయికేనా అసలు? అదొక తత్తర బిత్తరల తమి,(…)

Midnight in Paris

Midnight in Paris

నోస్టాల్జియా అంటే బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమేనా? వర్షం లో ప్యారిస్ నగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ప్యారిస్ నగరానికి వచ్చాడు గిల్. అమెరికాలో అతనో సినిమా కథలు రాసే రచయిత. కానీ ఇప్పుడు అతనికి సినిమా కథల మీద ఆసక్తి పోయింది. ఒక నవల రాయాలన్నది అతని ఆలోచన. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక కూర్చోని రాయడమే మిగిలుంది. అతని కథలో హీరో ఒక నోస్టాల్జియా షాప్ లో(…)

Werckmeister Harmonies – ఒక చింతన

Werckmeister Harmonies – ఒక చింతన

పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా(…)

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ? ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ. ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా(…)

Children of Heaven

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి(…)

ఏక్ డాక్టర్ కీ మౌత్

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే(…)

As it is in Heaven

As it is in Heaven

కళ నెరిగి, అనుభవైకవేద్యంగా తెలుసుకుంటే- దైవాన్ని ఎరిగినట్లే. పికాసో అనే చిత్రకారుడు ఒక రోజు సాయంత్రం సముద్రతీరాన నుంచొని ఒక తైలవర్ణచిత్రం చేస్తున్నాడు. అతను తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ యధాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా అని ఎందుకో అనుమానం కలిగి, ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు. అతడికే అర్థం కాని ఓ రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు పికాసో. ఆ(…)

shame – వాంచాలోలత్వం .

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే ! ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన (…)

Ikiru

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు. ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య(…)

when we leave – ఓ స్త్రీ కథ

when we leave – ఓ స్త్రీ కథ

పిల్లాడికి ఆమె కథ చెపుతోంది.  పిల్లాడు ప్రశ్నలు సందించాడు. అమ్మా మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ? కొన్నిసార్లు వదిలి  దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్లని కనుగొంటాం..వాళ్ళ ప్రేమని  కనుగొంటాం “ ” కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా ”  ఎప్పుడో తల్లి చెప్పిన మాటే తిరిగిచెప్పాడు వాడు. అవును అంది తల్లి. ………………………………………… బొమ్మగీస్తావా ? లేదు ఆడుకుంటావా ?? లేదు.. ఆకలేస్తోందా.? లేదు.. నాకు ‘అమ్మమ్మని’  చూడాలని ఉంది. …………………………………………… స్త్రీ కోరుకునేదేమిటి(…)

A Separation

A Separation

ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.   పై ఫొటో లో ఉన్న వీరి పేర్లు సిమిన్, నాదెర్.ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే! ఉద్యోగస్థులు; చాలామందితో పోలిస్తే బాగా ఉన్నవాళ్లు. పన్నెండేళ్ల కి పైగానే దాంపత్య జీవితం; పదకొండేళ్ల కూతురు. వీళ్లు నిన్నమొన్నటి వరకూ అన్యోన్య దాంపత్యంలో భాగస్వాములు; నేడు విడాకులు కావాలని కోర్టుకెక్కిన అర్జీదారులు. తమ దేశంలో కంటే విదేశాల్లోనే తమకీ, తమ కూతురుకీ సరైన భవిష్యత్తు ఉంటుందని భావించి,(…)

Dark Blue Almost Black

Dark Blue Almost Black

Azuloscurocasinegro /  Dark Blue Almost Black  is a 2006 Spanish drama film society is a collection of individuals united by certain relations or modes of behavior which mark them off form others who do not enter into these relations or who differ from them in behavior. – Ginsberg.  family is system of relationships, as a(…)

Blow-Up

Blow-Up

అంతా శూన్యమే, మనిషీ శూన్యమే ! ఉదయాన్నే వికసించి కళ్ళకు అందంగా కనిపించిన పువ్వు, సాయంకాలానికి వాడి నేల రాలుతుంది. బహుశా అశాశ్వతమైన ఆ పువ్వు అందాన్ని శాశ్వతం చెయ్యాలనుకోవడంలో కళ పుట్టి ఉండొచ్చు. ఆ పువ్వు యొక్క చిత్రాన్ని తనకి దొరికిన పనిముట్లతో కొండ గుహల్లో చిత్రీకరించి ఉంటాడు ఆదిమ మానవుడు. మానవుడి ఎదుగుదలతో పాటే ఎదుగుతూ వచ్చింది కళ. కళ్ళ ముందు కనిపించిన పువ్వు ని ఉన్నదున్నట్టుగా, ఇది నిజంగా పువ్వేమో అని అనుమానపడేంతగా(…)

smashed –  ఓ గెలుపు  కథ.

smashed – ఓ గెలుపు కథ.

                     మొదట వ్యసనం శరణార్థిలా వస్తుంది – తరవాత యజమానిలా శాశిస్తుంది. తాగినపుడు  ప్రపంచం కాళ్లకింద ఉన్నట్టనిపిస్తుంది… పెద్ద విషయం చిన్నదిగా..చిన్న విషయం పెద్దదిగా కనపడుతుంది. మనసులోని మాటలు అలా తన్నుకొస్తాయి…గుండెల్లోని ప్రేమ పెళ్ళుబుకుతుంది… కోపం కట్టలు తెగుతుంది… మనుషులని చూస్తే జాలేస్తుంది…కరుణ రసంపొంగి కన్నీళ్ళోస్తాయి.. మనమీద మనకి పిచ్చి నమ్మకం కలుగుతుంది.. ధైర్యం పొంగుతుంది.. ఆత్మవిశ్వాసం నాలుగింతలవుతుంది… కవిత్వం నోటివెంట పారుతుంది. కొత్తబాషలు వచ్చేస్తాయ్.. మొత్తంమీద మనకి మనం ఒక కొత్త మనిషిలా, మనం  ఎలా(…)

edge of heaven – LOVE

edge of heaven – LOVE

ఇది మనుషుల మనసుల్లో దాగున్న ప్రేమ కథ. ఓ తండ్రి కొడుకును ప్రేమిస్తుంటాడు.. ఆ కొడుకు తన  తండ్రిని ప్రేమిస్తున్నాడా ?? ఓ తల్లి కూతురిని ప్రేమిస్తుంది .. మరి ఆ కూతురు తన తల్లిని ప్రేమిస్తూందా ?? ‘ప్రేమ’ మానవసంభందాల్లో ముఖ్యమైనది, అందులోనూ  పిల్లల మీది వాత్సల్యం. తల్లి దండ్రులు పిల్లలని  కనీ పెంచి పోషిస్తారు.చదువు చెప్పిస్తారు,ప్రయోజకులని చేస్తారు, చేయాలని కలలు కంటారు. కానీ పిల్లలకి,  కొన్ని కారణాలవల్ల తమ తల్లిదండ్రుల  ప్రవర్తనో..చేసే పనులో..ఉద్దేశాలో ..మరోటో  నచ్చక పోవచ్చు. దాంతో వాళ్లకి(…)

Grave of the Fireflies

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా(…)

మూడు బెర్గ్‌మాన్ సినిమాలు

మూడు బెర్గ్‌మాన్ సినిమాలు

ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు మూడు వరుసగా చూసాను. ఈయన గురించి వినడమే కానీ, ఎప్పుడూ సినిమాలు చూడలేదు. బెర్గ్మాన్ చనిపోయిన వార్త చదివిన రోజు మొదటిసారి అరె! ఒక సినిమా అయినా చూడలేదే నేను! అనిపించింది. కొన్నాళ్ళ తరువాత సినిమాలు దొరికాయి. చూసాను. చూశాక తెలిసింది ఆ మూడింటిలో రెండు బెర్గ్మాన్ తీసిన మూడు అత్యుత్తమ సినిమాల్లో చోటు సంపాదించుకున్నవి అని. అవి – Persona(1966), Wild Strawberries(1957) మరియు(…)

Sansho Dayu

Sansho Dayu

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. కొన్ని వందల ఏళ్ల క్రితం….మనిషి జాతి ఇంకా పూర్తిగా మానవులుగా జాగృతం కానీ సమయం. జపాన్ దేశంలో ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యమేలుతోంది ఒక వైపు పదమూడు ఏళ్ళుగా ప్రజల్ని దహించి వేస్తున్న కరువు కాటకాలు; మరో వైపు యుద్ధాలతో రగిలిపోతున్న రాజ్యాలు. ప్రజలు కడుపు మంటలు ఏ మాత్రం పట్టని సైన్యాధికారులు చిన్నా పెద్దా అని తేడా లేకుండా సైన్యంలో(…)

Eternal Sunshine of the Spotless Mind

Eternal Sunshine of the Spotless Mind

జ్ఞాపకాలనే వృత్తంలో కేంద్ర బిందువు ఆమె ఆ రోజు సాయంత్రం బీచ్ లో… అంతమంది జనాల మధ్యన, గుంపులో ఒంటరిగా నేను. జనాలకు దూరంగా అలలకు చేరువులో, గలగలా మాట్లాడే నువ్వు. అన్నింటికీ ఒక లెక్క ఉండాలనే నేను. లెక్కలేకుండా జీవితాన్ని గడిపెయ్యాలనుకునే నువ్వు? నేనేమో ముక్కు మొహం లేని అనామక నాయకున్ని. నువ్వేమో అణువణువనా రంగుల కాంతులు విరజిమ్మే తారవి. నువ్వలా, నేనిలా! అయినా రెండు సగాలు కలుసుకున్నంత ఆనందం. ****** మనం కలుసుకున్న కొన్ని(…)

The Lives of Others

The Lives of Others

సౌందర్యోపాసనే లోకకళ్యాణానికి మార్గం 1984, తూర్పు జర్మనీ దేశం. సోవియట్ రష్యా అధ్వర్యంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ అధికారుల హింస తట్టుకోలేక ప్రజలు రహస్యంగా పశ్చిమ జర్మనీకి తరలివెళ్ళిపోతున్న సమయం. ఏ సమయంలోనైనా ప్రజలు తమ మీద తిరగబడి ఉద్యమ బాటలో నడుస్తారనే అనుమానంతో, ప్రభుత్వం అటువంటి విపత్తు ఏదీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంది; షుమారు లక్ష మందితో కూడిన రహస్య పోలీస్ వ్యవస్థతో పాటు, రెండు లక్షల మంది ఇన్ఫార్మర్స్ ని కూడా సమీకరించింది.(…)

Fitzcarraldo

Fitzcarraldo

—అతడు అడవిని జయించాడు— మనిషి ఎల్లప్పటికీ అపరిపూర్ణుడు! ఎప్పటికప్పుడు తనని తాను ఆవిష్కరించుకుంటూ పరిపూర్ణత వైపు పయనం సాగిస్తుంటాడు. కానీ ఈ ప్రయాణం ఎప్పటికీ పూర్తి కాదు; మనిషి ఎప్పటికీ గమ్యాన్ని చేరలేడు. కానీ, ఈ విధంగా ఒక స్థితి నుంచి మరో స్థితికి పోవాలనే ప్రయత్నంలోనే మనిషి స్వేచ్ఛా జీవి అయ్యాడు. తరువాతి స్థితి అనేది మరొకటి లేకపోతే మనిషికి స్వేచ్ఛే లేదు. కానీ ఆ తరువాతి స్థితి కి చేరుకోడానికి ఒక్క స్వేచ్ఛ మాత్రం(…)

పల్ప్ ఫిక్షన్-పరిచయం

పల్ప్ ఫిక్షన్-పరిచయం

ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief(…)

Stalker

Stalker

మనిషి నిత్యాన్వేషి. నిరంతరాన్వేషణలో మనిషి సత్యాన్నీ అన్వేషించాడు.ఈ భూమ్మీద మనిషి ఆవిర్భావం జరిగినప్పటినుంచీ ఈ అన్వేషణ సాగుతూనే ఉంది. ఒకానొక కాలంలో అసలీ సత్యం అంటే ఏంటి? అని ఎలా అయినా తెలుసుకోవాలని ఒక వ్యక్తి బయల్దేరాడు. ఎక్కడెక్కడో తిరిగాడు; దారిలో కలిసిన మనుషులనూ, మహర్షులనూ అడిగాడు; రాజులూ, రారాజులనూ దారి చూపమని ప్రాథేయపడ్డాడు. కొండలూ గుట్టలూ ఎక్కాడు. ఏడు సముద్రాలు దాటాడు; మహారణ్యాల్లోనూ తిరిగాడు. పగలనకా రేయనకా అతని అన్వేషణ కొనసాగింది. మనుషులెవ్వరూ చేరుకోలేని ఒక(…)

Shadows of Forgotten Ancestors

Shadows of Forgotten Ancestors

అనుభవించదగ్గదే కానీ వర్ణించలేనిది; చావూ బతుకుల తేడా తెలియనిది – ప్రేమ. ఈ విశాల ప్రపంచమంతా ఒక్క పురుషుడు ఒక్క స్త్రీ కోసమే సృష్టించబడిందా? అసలు అనంతమే రెండుగా విడిపోయి వారిద్దరి రూపాలు దాల్చిందా? చంద్రుడిని ఆకాశం కోసం చేయబడినట్లు, దేవుడు ఆమెను తన కోసం చేశాడా? ఇవాన్-మరీచ్కా ల జంటను చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. వారిద్దరూ ప్రేమించుకుంటే – కొండలేమిటి, నదులేమిటి, నక్షత్రాలేమిటి, ఈ చరాచర సృష్టి ఏమిటి – అన్నీ వారి ప్రేమ గీతానికి(…)

Kramer vs. Kramer

Kramer vs. Kramer

వాళ్లు కలిసి విడిపోయారు; విడిపోయి కలిసారు. ఎక్కడో పుట్టారు.ఎక్కడో పెరిగారు. జొయన్నా, టెడ్ అనబడే వారిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆత్మీయత పెరిగి ఒకే ప్రాణంగా మెలగుతూ ఒక వంశవృక్షానికి కొత్త కొమ్మలు, రెమ్మలు తొడిగారు. బిల్లీ అని నామకరణం చేశారు. జంట కట్టి, సంతానం వృద్ధి చేయడమొక్కటే లక్ష్యమయ్యుంటే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం లేదు. సంతాన వృద్ధికంటే కూడా ఇద్దరు ఒకటై కలిసి జీవించడంలోని ఆనందానికే వివాహ బంధంలో ప్రాముఖ్యత ఉంటుంది. టెడ్ ని(…)

Code Unknown

Code Unknown

ఎన్ని రంగుల్లో వికసించినా దాని పేరు మాత్రం గులాబి! రంగు నలుపైతే మాత్రం అతను మనిషి కాడా? శ్రీశ్రీ అంటారు, “ఎంతగా ఎడం ఎడంగా ఉన్నా/ఎంతగా పైపై భేదాలున్నా/ఎంతగా స్వాతిశయం పెరిగినా/ ఎంత బలం, ధనం, జవం పెరిగినా/అంతరంగం అట్టడుగున మాత్రం/అంతమందిమీ మానవులమే!” కానీ ఈ విషయాన్ని మనం ఎంత వరకూ ఆచరణలో పెడ్తున్నామనేదే పెద్ద ప్రశ్న. జాతి, కులం, ప్రాంతం, వర్ణం ఆధారంగానే ఇంకా మనుషులను అంచనా వేస్తున్న కాలం ఇది. ఈ అంచనాల ఆధారంగానే(…)

Wild Strawberries

Wild Strawberries

జ్ఞాపకాలు ప్రమాదకరమైన ఉచ్చులు; వాటిలో చిక్కుకుంటే అంతే ! సమయానికి అర్థం లేని చోట, బీటలు వారిన శిధిలాల నడుమ, అతను నడుస్తున్నాడు. వీధి నిండా ఏకాంతం. గడియారంలో ముళ్లు లేవు. తోడు కోసం అతని అన్వేషణ జ్వరాల గుర్రాల బండికి సందు చేసింది దారి. బండిలోనుంచి జారిపడిందో శవపేటిక శవం అతని చెయ్యిపట్టుకు లాగుతోంది…. ఉలిక్కిపడి నిద్రలేచాడు ప్రొఫెసర్ బోర్గ్. ఇంకొద్ది గంటల్లో అతను స్టాక్‍హోమ్ నుంచి విమానంలో బయలుదేరి లుంద్ పట్టణానికి చేరుకోవాలి. కానీ(…)

Poetry

Poetry

జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం! ఒక జ్ఞాపకం. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి(…)

Salaam Cinema

Salaam Cinema

సినిమానేజీవితం. జీవితమే సినిమా : మన చుట్టూ, మన చెంతన, మన లోలోపల. సినిమా! అరవై నాలుగు కళలనీ తనలో ఇముడ్చుకుని ఉధ్బవించిన ఒక సరికొత్త మహత్తర కళ! శతబ్దాలుగా కళారాధనలో జీవిస్తూ వస్తున్న మానవునికి గత శతాబ్దంలో మాత్రమే సాధ్యమైన ఒక వినూత్న కళ. ఈ ప్రపంచంలోని అరు వందల కోట్ల మంది జనాభాలో కనీసం సగం మందైనా ఎప్పుడోకపుడు ఈ కళ ను అనుభవించిన వాళ్లే అయ్యుంటారు. సినిమా అనే చలనచిత్రానుభవాన్ని రుచి చూశాక(…)

Taste of Cherry

Taste of Cherry

ఇక చాలు అని చాలించడానికి వంద కారణాలుంటాయి; కానీ చివరి దాకా కొనసాగించడానికి ఒక్క కారణం చాలు! ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారని అంటారు. నా గొయ్యి నేనే తీసుకున్నాను. కానీ నేను పడలేదు; పడుకున్నాను. నేను మెలుకవగానే ఉన్నాను. ఇది మెలుకవేనా? పైన ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల పల్లకి ఎక్కి విహరిస్తున్నాడు. నా ఆలోచనలు వెనక్కి పరిగెడుతున్నాయి. **** నేను మీకు తెలుసు! ఇవాళ ఉదయం ఎవరి కోసమో వెతుకుతూ కార్లో నగరమంతా(…)

Revolutionary Road

Revolutionary Road

అది ప్రేమాకాలం. అతడి కంటి వెలుగులో ఆమె. ఆమె చిరునవ్వులో అతడు. వారు వయసులో ఉన్నారు. ఎండ-వాన, పగలు-రాత్రి, తేడా తెలియని వయసు. గుంపును మరిచి జంట పిచ్చుకల్లా ప్రేమలో మునిగితేలారు. ప్రేమికులు భార్య భర్తలయ్యారు. జంట పక్షులు గుంపు ని వెతుక్కున్నాయి. వారిద్దరూ జన ప్రవాహంలో కలిసిపోయారు. జనం పెళ్ళంటే నూరేళ్ల పంట అన్నారు. అది పండాలంటే శ్రమించాలన్నారు. ఉండడానికి గూడు కావాలన్నారు. తినడానికి తిండి కావాలన్నారు. ఇవన్నీ కావాలంటే డబ్బు కావాలన్నారు. డబ్బు కావాలంటే(…)

In the mood for love

In the mood for love

ఎక్కడ మొదలు పెట్టను? పచ్చని పొలాలను, విశాలమైన ఇళ్లను వదిలి, పచ్చ నోట్ల అన్వేషణలో ఇరుకు గదుల పట్టణాలకు తరలివచ్చిన వారితో నిండిపోయిన జనసముద్రపు తాకిడికి తట్టుకోలేక, అలల్లో కొట్టుకొచ్చి ఒడ్డున మిగిలిపోయిన నా దగ్గరే మొదలుపెట్టాలని ఉంది. కానీ ఓడిపోయి ఒడ్డున చేరిన నా కథ ఎవరికి కావాలి? పోనీ మరోలా మొదలు పెడ్తే? వలస పక్షుల్లా పట్టణానికి తరలి వచ్చి ఏటికొక గూడు మారుతూ వలస జీవితంలోనూ వలస వెళ్తోన్న వింత జీవితం లో(…)

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు: సిటిజన్ కేన్ సిటిజన్ కేన్-కొన్ని విశేషాలు ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం ఆర్సన్ వెల్స్-రెండో భాగం ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ(…)

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం. ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ(…)

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష

రచన:నాగరాజు పప్పు షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ – కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది – బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. వీటికే రకరాకాల(…)

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

2006 లో వచ్చిన Prestige సినిమాలో ‘ మైకల్ కేన్’ ఒక మాట చెబుతాడు, “The Audience wants to be fooled” అని. భయంకరమైన పోటీ ఉన్న ఇద్దరు ఇంద్రజాలికుల మధ్య జరిగే అతి ఘోర మస్తిశ్కయుద్ధమే ” ప్రెస్టీజ్ “. చిన్నప్పటినుండి Algebra వల్ల నాకు గణితశాస్త్రం అంటే భయం. పెద్దయ్యాక క్వాంటమ్ మెక్యానిక్స్ వల్ల నాకు Physics అంటే చలిజ్వరం. వాటిని చూసి దూరం పరిగెత్తెవాన్ని. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక రోజు(…)

నన్ను దొంగిలించిన Malèna!

నన్ను దొంగిలించిన Malèna!

……….. నీడల గుట్టు మసకగా విప్పే కంతల వెనక నక్కిన లేతప్రాయంలో అర్థాలు తెలీని ఉద్విగ్నతని తిట్టావు తొలిగా- ఆ తత్తరపాటు క్షణాలకి ఎవరు చెప్పారు చీకటి కొంగు చేలాంచలాల కోసం ఏళ్ళుగా ఎదగమని. ఓరచూపులేసిన కొక్కేలకి చర్మం ఒల్చిన మాంసం ముద్దై వేలాడమని……. ……ఇది నా శారీరక గానాల దేహ చింతని nostalgicగా దశల వారీగా గుర్తు చేసుకుంటూ 1993లో నేను రాసుకున్న “నీడల్లేని చీకట్లో” కవితలోని ఓ భాగం. 2012లోంచి మాట్లాడితే, సుమారు 32(…)

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley

  ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు. బిల్ గేట్స్ కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన(…)

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda

సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం వ్యాసం. కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే(…)

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High

మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men  అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం. 1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల(…)

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men

మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను. 1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా(…)

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు

పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం.  (…)