విశ్లేషణ back to homepage

slumdog_millionaire మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

ముంబాయిలోని అతిపెద్ద (ఆసియాలోనే) మురికివాడ అయిన ధారవిలో పెరిగే పిల్లలు – సలీం, జమాల్. సలీం, జమాల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక మతకలహాల సందర్భంలో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అప్పటినుంచీ వాళ్ళు అనాథలవుతారు. వాళ్లకు మరో అనాథపిల్ల లతిక తోడవుతుంది. అనుకోకుండా ఒకసారి వాళ్లకు మామన్ అనే వ్యక్తితో పరిచయమవుతుంది. మామన్ వాళ్లకు తినడానికి మంచి తిండి పెట్టి, తన దగ్గరకు తీసుకువెళతాడు. తీరా అక్కడికెళ్ళాక వాళ్లకు అతను చిన్నపిల్లలను ప్రలోభపెట్టి, వాళ్ళను వికలాంగులను చేసి, వాళ్ళతో భిక్షాటన చేయించే ఒక ముఠానాయకుడని తెలుస్తుంది. మామన్ పిల్లలకు మత్తును కలిగించడానికి ఉపయోగించే క్లోరోఫాంను అతని అనుచరుడు పున్నోజ్ ముఖాన చిందించి వాళ్ళు అక్కడినించి తప్పించుకుంటారు. లతిక మాత్రం వాళ్ళు తప్పించుకోవటానికి పరుగెత్తుతూ ఎక్కిన రైలును అందుకోలేక అక్కడే ఉండిపోతుంది.

Q&A మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

ఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో మొట్టమొదట సమీక్షించినది సాయి బ్రహ్మానందం గారు (డిసెంబర్ 1, 2008). అప్పటికి ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. అప్పుడు ఈ సమీక్షకు రాసిన వ్యాఖ్యల్లో నేను ఇది ఎందుకూ పనికిరాని సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాశాను. ఆ తర్వాత ‘స్వాతి’ మాసపత్రికలో (జనవరి, 2009) ఈ సినిమా మాతృక అయిన వికాస్ స్వరూప్ రాసిన ‘Q & A’ నవల గురించిన సమీక్ష – [...]

reader కేట్ చదివించింది

కేట్ విన్‍స్లెట్ గొప్ప అందగత్తె. ఈ విషయం కొత్తగా ఎవరూ చెప్పనక్కర్లేదు. ఆనాటి టైటనిక్ నుంచీ ఈనాటి ద రీడర్ వరకూ ఏ సినిమా చూసిన అర్ధం అవుతుంది. కేవలం కేట్ కోసమే సినిమాలని చూసే వాళ్ళున్నారు. సరే అసలు విషయం. కేట్ కేవలం అందమే కాదు. నటనా ఉన్న నటి. (నటించేవారే నటులు అంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఇలియానా, అనుష్క, త్రిష, జెనీలియా, ప్రియమణి ఎట్సెట్రాదులు కేవలం అందంతోనే నెట్టుకొస్తున్నారు యువరానర్. అందుకే నటన [...]

rnda-noi-vivi-mini కిరా కనుమరుగైందా?

Kira Argounova. Ayn Rand వ్రాసిన ‘We the Living‘ అనే నవలలోని హీరోయిన్. ఆ నవలని సినిమాగా ఒక ఇటాలియన్ దర్శకుడు Ayn అనుమతి లేకుండా తీశాడు. అది తరువాత ఎలాగో Ayn కి తెలిసింది. చాలా కాలం తరువాత. దాని గురించి చాలా చోట్ల ఉంది. కనుక నేనా విషయాలను ప్రస్తావించ బోను. ఒక లింక్ ఇస్తే చాలు కదా. అందుకే నేను వేరే విషయాలని ప్రస్తావిస్తాను. కాస్త నవల గురించి, కాస్త సినిమా [...]

సిటిజెన్ కేన్-మరి కొన్ని విశేషాలు

ఈ నెలనవతరంగం ఫోకస్ శీర్షికలో ఆర్సన్ వెల్స్ గురించి ఆయన సినిమాల గురించి వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసే ఉంటుంది.ఆర్సన్ వెల్స్ గురించి మరియి సిటిజన్ కేన్ గురించి ఇప్పటికి నవతరంగంలో మూడు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. వాటి వివరాలు: సిటిజన్ కేన్ సిటిజన్ కేన్-కొన్ని విశేషాలు ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం ఈ సినిమా గురించి, ఆర్సనె వెల్స్ గురించి మరియు ఆయన మిగతా సినిమాల గురించి మీరూ వ్రాయొచ్చు. మీ వ్యాసాలు navatarangam[at]gmail[dot]com కు [...]

godfather-lead గాడ్‌ఫాదర్ – తెరవెనుక కథ

ప్రపంచ సినీ చరిత్రను తిరగరాసిన గాడ్‌ఫాదర్ సినిమా నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. మాఫియా ఆధారంగా తీయబడిన ఈ సినిమా చిత్రీకరణ మొదలవడానికి నిజమయిన మాఫియా ఎన్నో ఆటంకాలు కలిగించింది. అమెరికాలోని పలు నగరాల్లో ఇటాలియన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి ప్రముఖ మాఫియా బాస్ ఈ సినిమాను ఆపడానికి తన బలాన్ని బలగాన్ని ఉపయోగించాడు. నిర్మాత చివరకు మాఫియా చెప్పిన ఆంక్షలకు తలవంచవలసి వచ్చింది. ఒక వైపు న్యూయార్క్ [...]

సిటిజెన్ కేన్-కొన్ని విశేషాలు

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది 2009 లో మొదటి ’నవతరంగం’ వ్యాసం. ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలుపెడ్దాం. ప్రపంచ సినిమా చరిత్రలోనే న భూతో న భవిష్యతి అని కొనియాడబడుతూ అరవై ఏళ్ళుగా ప్రపంచంలో అత్యుత్తమ చలనచిత్రంగా నిలుస్తూ వచ్చిన సిటిజెన్ కేన్ గురించి ఈ సంవత్సరం మొదలుపెడదాం. ముందుగా, ఇది ఒక గొలుసు వ్యాసం లాంటిది. అంటే గొలుసు కథల్లాగా, గతంలో నవతరంగంలో వచ్చిన సిటిజెన్ కేన్ వ్యాసానికి ఇది సప్లిమెంటరీ [...]

మిస్ కాకూడని మిస్సమ్మ(ఒక సమగ్ర విశ్లేషణ) – 2

మొదట భాగం ఇక్కడ చదవండి. పాత్రలూ, పాత్రోచితాలూ ఇవన్నీ కథకుడి చేతిలో పుట్టినవే! తన ఊహాశక్తికి ప్రాణంపోసి వీటిని స్క్రిప్ట్ ( కథామూలం ) అనే దాంట్లో బంధిస్తాడు రచయిత. అదొక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది. సినిమాలో భాగమైన ఎవరైనా సరే, దాన్ని ఎంత కోరికతో తాకితే, అంతగా వారికి కావల్సిన అద్భుతాలు జరుగుతాయి. దానికి తగ్గట్టుగా వారి గొప్పతనం తెరమీద సాక్షాత్కరింస్తుంది. ఇదీ స్క్రిప్ట్ గొప్పదనం. ఈ స్క్రిప్ట్ నే సన్నివేశ పరంగా ముక్కలు [...]

splash02-copy హిందీ సినిమాలు – Politics of Representation

హిందీ చిత్రరంగమంతా, ఆస్కారు అవార్డులస్థాయిలో ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’- IIFFA ప్రారంభించుకున్న సమయంలో  (బహుశా 2005 అనుకుంటాను) మళయాళ నటుడు మమ్ముట్టిని NDTV పాత్రికేయుడు, What do you think of IIFFA ?ఆని ఒక ప్రశ్న అడిగాడు. దానికి మమ్ముట్టి  చెప్పిన సమాధానం ఏమిటంటే, “Its an utter arrogance on Hindi film Industry’s part to call themselves ‘Indian Film Industry’. Whom do they represent ? NONE. [...]

missamma-lead మిస్ కాకూడని మిస్సమ్మ ( ఒక సమగ్ర విశ్లేషణ )

“Story structure” is one of screenwriting’s most enduring cliches, and not without reason. Many of the most successful writers say that the story structure is the single most important function of the writing process, one that will ultimately determine the success or failure of the script and of the film itself. Linda Seger & Edward [...]

bicycle-thief The Bicycle Thief (Italian, 1948)

ఇది చాలా పేరు పొందిన క్లాసిక్ సినిమా. ఇటాలియను దర్శకుడు విట్టోరియా డిసికా 1948లో తీశాడు. ఈ సినిమా గురించి (సంక్షిప్త కథ దగ్గర్నించీ లోతైన విశ్లేషణల దాకా) జాలంలో సంచులకొద్దీ సమాచారం ఉంది, కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చెయ్యను. కేవలం, ఒక ప్రేక్షకుడిగా, ఈ సినిమా చూస్తుండగా నాకు కలిగిన భావాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. సినిమా గురించిన కొన్ని మౌలికమైన వివరాలకి కింది సైట్లు చూడచ్చు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ వికీపీడియా [...]

why-cinema-lead మనము సినిమాలెందుకు చూస్తాం?

ఇది పనికి రాని ప్రశ్నలా అనిపిస్తుంది, వినగానే. అవును, సినిమాలెందుకు చూస్తాము? టైం పాస్ కి అన్నది ఒక సమాధానం. వినోదానికి అన్నది ఇంకో సమాధానం. నిజ జీవితం నుంచి కొన్ని గంటలయినా దూరం పారిపోయి, కలల ప్రపంచంలో విహరించటానికి అన్నది కాస్త తెలివయిన సమాధానం. వినోదాత్మకంగా విఙ్నానాన్ని గ్రహించటానికి అన్నది ఆశాభావంతో కూడుకున్న ఆదర్శవాది సమాధానం. వ్యాపారులను బ్రతికించటానికి అన్నది గడుసు సమాధానం. పనిలేక అన్నది విసుగు సమాధానం. మనము చేయలేని పనులు వేరేవారు సాధిస్తూంటే, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories