భారతీయ సినిమా

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

వాణిజ్యపరంగా మిగతా దక్షిణ చిత్ర పరిశ్రమలకంటే వెనుకబడిన పరిశ్రమని, మూస చిత్రాలు ఎక్కువగా వస్తాయని కన్నడ చిత్ర పరిశ్రమ మీద విమర్శలున్నాయి. నేను ఎక్కువ కన్నడ చిత్రాలు చూడలేదు. నేను చుసిన మొదటి చిత్రం “చార్మినార్” (తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). కొన్ని రోజులుగా “మైత్రి” అనే చిత్రం గురించి వింటూనే ఉన్నాను. విమ్మర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు చూడటం జరిగింది. మైత్రి ఓ ద్విభాషా చిత్రం. కన్నడ మరియు(…)

జగమంత కుటుంబం – ఆనంద్ (1971)

జగమంత కుటుంబం – ఆనంద్ (1971)

 మనిషి జీవితంలో అనుకోని అతిథి “మృత్యువు”. కానీ దాని రాక ముందే తెలిసినప్పుడు దానికి ఆనందంగా ఆహ్వానం పలకాలి, అప్పుడే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ అంశాన్ని సూటిగా స్పృశించిన చిత్రం “ఆనంద్”. “హృషికేష్ ముఖర్జీ” దర్శకత్వంలో “రాజేష్ ఖన్నా”, “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ ను మంచి పాత్రతో పాటు పురస్కారాలను సైతం ఇచ్చి నిలబెట్టింది. మొదట ఈ చిత్రంలోని పాత్రలకు కిషోర్ కుమార్,(…)

సత్యమే శివం

సత్యమే శివం

పరిచయం కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం. ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా. సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని తెరిపించగలదు. నేను రోజు వారీ కూలీనో,(…)

అతడు – ఒక విశ్లేషణ

అతడు – ఒక విశ్లేషణ

చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. నా దృష్టిలో తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం 1957 లో విడుదల అయిన “మాయాబజార్”. తరువాత 1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” అనే పుస్తకం. ఆ తరువాత అలాంటి పుస్తకంలా అనిపించిన చిత్రం 2005 లో వచ్చిన “అతడు”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ చిత్రం వెండితెరపై పెద్ద విజయం సాధించకపోయినా ఎందరో మనసులకి హత్తుకుంది.(…)

Bahubali – A Magnum Opus?

Bahubali – A Magnum Opus?

Happened to watch Baahubali today to see its portrayal as a magnum opus. Disappointed as it is one more film reflecting much more heavily the present day media and market promotion of the stereotypical heavy muscled masculine body and a thin fair skinned feminine one through Prabhas, Rana and Tamanna. Though Tamanna (roles as Avanthika)(…)

ఓ సామాజిక పరిణామానికి అద్దం-తెవర్ మగన్

ఓ సామాజిక పరిణామానికి అద్దం-తెవర్ మగన్

భారతీయ సమాజంలోని పలు ప్రాంతాలు, సమూహాలు ఒకేసారి, ఒకేలా చట్టం, పాలనా వ్యవస్థలను అంగీకరించలేదు. అలాగని అవన్నీ నేరుగా విభేదించనూలేదు. వారి సామాజిక నేపథ్యంతోనో, అనూచానంగా వస్తున్న అలవాట్లతోనో, లేక రాజకీయ స్థితిగతులతోనో చట్టాలు నేరుగా విభేదిస్తున్న చోట వాటికి అమలు ఉండదు. అలాగని ఆ స్థితి యధాతథంగానూ నిలిచిపోయేదీ కాదు. క్రమంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు మారుతున్న కొద్దీ ఆ సమాజపు నడవడిక చట్టం పరిధిని అంగీకరిస్తూపోతుంది. సమాంతర వ్యవస్థలు రాజకీయ బలంతోనో, ఆర్థిక స్థితిగతులతోనో(…)

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు.. చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ?? ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !! ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ(…)

దృశ్యం – జీవితపు  నాటకీయత  !!

దృశ్యం – జీవితపు నాటకీయత !!

అవును.. జీవితంలో అన్నీ ప్లాన్డ్ గా జరగవు.. మనకి తెలియకుండా టపీమని జరిగిపోయే అనర్థాలనే ప్రమాదాలు అంటాం. జరిగేటప్పుడు తెలియకున్నా..జరిగింతరవాత మాత్రం మనకి కొంత టైం ఉంటుంది.. బాధ పడటానికీ,ఏడవటానికి.  జీవితంలో చాలా నాటకీయత ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం.. గుర్తించినా తీరిగ్గా కలియజూసుకోటానికి టైం ఆగదు..మెల్లిగా నడవదు. తన స్పీడ్ లో తాను వెళ్ళిపోతుంది.  అక్కడ మిస్సయిన  ఆ నాటకీయతని..ఆ భావోద్వేగాలనీ పట్టిచూపించేదే సినిమా !! సినిమాలో  ‘అవసరమైన’ సాగదీత లేకుంటే.. కిక్కు ఎక్కదు.(…)

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక అబ్బాయి-ఒక అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమస్య వాళ్ల స్వభావ వైరుధ్యం (ఖుషి)వల్లనైనా రావాలి లేదా బయటనుంచీ వచ్చే ప్రమాదం/అభ్యంతరం/పరిస్థితుల (జయం, నువ్వూ-నేనూ) ప్రభావం వల్లనైనా రావాలి. దాన్ని అధిగమించి ఇద్దరూ ఒకటవ్వాలి. ఒక హ్యాపీ ఎండింగ్ ఉన్న ప్రేమకథలకు అది అత్యంత అవసరం. ఆ ప్రేమ జంట ఒకటవ్వాలని జనాలు/ప్రేక్షకులు బలంగా కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే, వాళ్ళు ముచ్చటైన జంట అయుండాలి. సమస్యతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అయ్యుండాలి. వాళ్ల ప్రేమతో ఎంపతైజ్ అవగలగాలి.ఇవేవీ కాని సినిమా(…)

మౌనరాగం – మనసు తీరు

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .(…)

మా సినిమాలు:బాపు- చివరి భాగం

మా సినిమాలు:బాపు- చివరి భాగం

’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది. రేలంగి గారు చక్రపాణి దగ్గరకెళ్ళి “నాకెందుకు విజయాలో వేషం ఇవ్వలేదు? నేను రమణారెడ్డిలా కామెడీ విలన్ చెయ్యలేననా” అన్నారట. చక్రపాణిగారు – నువు చెయ్యగలవు గానీ జనం చూడద్దూ” అన్నారు. అలాగా – నువ్వు బులెట్టు బాగానే తీశావు – గానీ ఫలానా లాటి సినిమాలు మీనించి expect చేసే జనం చూడద్దూ! ’జాకీ’ రేసుల్లో సరిగ్గా పరిగెట్టలేదు. బాలుగారి సంగీతం “అలా మండిపడకే జాబిలీ” గుర్తుందా! “కళ్యాణ(…)

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే(…)

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ(…)

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో(…)

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు. డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ(…)

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా  అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను(…)

మా సినిమాలు:బాపు-మొదటి భాగం

మా సినిమాలు:బాపు-మొదటి భాగం

సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి…. నవతరంగం లో ఈ వ్యాసాల సీరీస్ ను ప్రచురించే అవకాశం కల్పించిన తెలుగునాడి సంపాదకులకు, మా తెలుగు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – TAL, ) సంపాదకులకు మరియు మనందరికీ (…)

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

మన చుట్టూ వున్న ప్రపంచం,ఆ ప్రపంచంలో వున్న మనం…మన కుటుంబ నేపధ్యం,మన వృత్తి,ఇరుగు- పొరుగు,సంబంధ బాంధవ్యాలు వీటికి తోడుగా మన చుట్టూ అల్లుకు పోయిన సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు వాటి వల్ల మనం ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చే ఉత్పాతాలు,వాటికి మన ప్రతిస్పందన..స్థూలంగా మనం ఎదుర్కొనే సమస్యలు,వాటి ద్వారా మనం పొందే అనుభవాల సమాహారమే కథ. ప్రతి కథానాయకుడు సమస్యల్ని ఎదుర్కొంటాడు….కొందరు ధీరులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొందరు భీరువులు వాటికి లొంగిపోతారు(దేవదాస్)…ఇంకొందరు అవాస్తవిక దృక్పధాలతో సమస్యని తమదైన శైలిలో పరిష్కరించే(…)

పూజాఫలము

పూజాఫలము

పగటి పూట వెన్నెల – ఒక అందమైన అబద్ధం. “కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులని రెచ్చకొట్టకూడదు. ఉత్తమ వులువలని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేసిన బి.ఎన్.రెడ్డి తెలుగు సినీరంగంలో ఓ చరిత్ర. ఆయన తీసింది పదకొండు సినిమాలే అయినా అందులో ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. ఆయన తీసిన చిత్రాల్లో అందరికీ నచ్చిన చిత్రాలు కొన్నయితే,(…)

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

యెన్నో రోజులు ఎదురు చూసాక, చివరికి ‘షిప్ ఆఫ్ థీసియస్’ చూసే అవకాశం దొరికింది. ఆ సినిమా దర్శకుడే సినిమాని ఆన్ లైన్ లో ఉంచి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. చాలా గొప్ప, అభినందనీయమైన విషయం అది. కీర్తీ , లాభాపేక్షా లేకుండా తన సినిమాని ఓపెన్ సోర్స్ పద్దతిలో ఆన్ లైన్ లో ఉంచి దాన్ని యెవరికి తోచినట్టుగా యెడిట్ చేసుకుని మరో కొత్త “షిప్ ఆఫ్ థీసియస్” తయారు చేయమనడం ద్వారా ఆనంద్ గాంధీ(…)

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

సంక్రాంతి రాకముందే తెలుగులో సినిమా పండగ మొదలైంది. ఈ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పెద్ద సినిమాగా “1-నేనొక్కడినే” ఈ రోజు విడుదలైంది. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమైన ఇద్దరు ముగ్గురు దర్శకుల జాబితాలో చేర్చదగ్గవాడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్, మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుగులో అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా “1-నేనొక్కడినే” పై ప్రేక్షకులు భారీ అంచనాలు(…)

Balak-Palak – మరాఠీ మెరుపు

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు.(…)

2013 లో తెలుగు సినిమా

2013 లో తెలుగు సినిమా

కాలం నిత్య సంచారి. ‘నిన్న’నుంచి ‘నేటి’మీదుగా ‘రేపటి’వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎనె్నన్నో జ్ఞాపకాలను, అనుభవాలను మనకు మిగులుస్తుంది. అలా టాలీవుడ్‌కు కూడా 2013 సంవత్సరం ఎనె్నన్నో తీపి కబురులను, చేదు స్మృతులను తెచ్చింది. 82 ఏళ్ళ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎదురులేని స్థానాన్ని, అంతకుమించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఈ సంవత్సరం కూడా యధాశక్తి తమ ‘పరంపర’ను కొనసాగించే ప్రయత్నం చేసాయి. ఈ 365 రోజుల(…)

Lucia – స్వప్నజీవితం

Lucia – స్వప్నజీవితం

చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం. అందులో  ప్రతి కథకీ ఓ నీతి ఉండేది. అయితే రామాయణ భాగవతాల్లాంటి కావ్యాల్లోనూ..నవలల్లోనూ  ప్రతి చోటా నీతులు..జీవన సత్యాలూ , ప్రవచనాలూ అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. సినిమా కూడా విజువల్ గా చెప్పేకథే కనక దానికీ ఓ సారాంశం ఉండాల్సిందే. దీన్నే సినిమా పరంగా మనం ఇతివృత్తం/ ఫిలాసఫీ లేదా /జీవితసత్యం అంటాం.  అయితే పూర్తి వినోదాత్మక చిత్రాలలో సారాంశం గొప్పగా ఉండకపోవచ్చు. వినోదం మరుగున ఆ బలహీనమైన/కొత్తది కానటువంటి  సారాంశాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. (…)

The lunch box –  taste of life

The lunch box – taste of life

ఓ నడివయస్కుడు ! ముప్పై అయిదేళ్ళ గానుగెద్దుబతుకు.. తోడులేని జీవితం.. అదే ఆఫీసు..అదే పని..అదేతిండి.. అదే ఒంటరితనం. ఓ ఇల్లాలు ! ఆదరాబాదరాగా పాపని స్కూలుకి పంపటం.. భర్తకి క్యారేజీ పంపించటం..పైఅంతస్తులో ఉండే ముసలమ్మతో నాలుగు మాటలు..భర్త రాకకోసం , ఆపై అతని ప్రేమ కోసం వేచిచూడటం..కమ్మగా వండి భర్తని దగ్గరచేసుకోమన్న ముసలమ్మ సలహా తో చక్కగా కొత్తరుచులు వండి  పంపిన క్యారేజీ అడ్రస్ మారి అది అతనికి చేరింది. అతడా  రోజు ఆఫీసులో భోజనానికి కూర్చుని(…)

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన(…)

Ship of Theseus

Ship of Theseus

తానే మారెనా? గుణమే మారెనా? నేను ఎవర్ని? ఇన్ని వేల సంవత్సరాల నాగరికత తర్వాత కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ పరిపూర్ణంగా సమాధానం చెప్పలేని ప్రశ్న! అయినా మనిషి తన అస్తిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం మాత్రం మానడు. ఇదీ నేను! అని స్థిరంగా నిర్ణయించుకుని మనిషి జీవితం గడిపేస్తుంటాడు. కానీ ఒకానొక సమయంలో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇదా నేను! అని బయల్దేరి, ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో తనని తాను తెలుసుకుంటాడు.(…)

మహానగర్

మహానగర్

ఈ మధ్యనే సత్యజిత్ రాయ్ తీసిన “ఫెలూదా” సినిమాలు రెండు చూసాను. వాటిల్లో ఒక దాని గురించి నా బ్లాగులో రాస్కుంటే, చూసిన వారు ఒకరు “మహానగర్” చిత్రం యూట్యూబ్లో ఉందని తెలిపారు. వారితో నాకు పరిచయం లేదు కానీ, “సంగీత” గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా గురించి నా ఆలోచనలు: కథ: ఈ కథ యాభైల ప్రాంతానిది అనిపిస్తుంది.  ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం – సంపాదించేది ఒక్కరు. తినేది అయన కాక మరి(…)

నా జీవితం లో  ’రే’ సినిమా

నా జీవితం లో ’రే’ సినిమా

సత్యజిత్ రే సినిమా గురించి వివరణాత్మక వ్యాసం రాసే అనుభవం, ధైర్యం రెండూనాకు లేవని నా గొప్ప నమ్మకం.అందుకే నా జీవితం లొ ’రే’ సినిమా ఎలాంటి గమ్మత్తైన విధంగా ప్రవెశించిందో పంచుకుందామని కూసింత ప్రయత్నిస్తాను. సాధారణంగా ఎ ’పథెర్ పాంచాలి ’ తోనో ’అప్పు triology’ తోనో రే తో పరిచయప్రాప్తి కలగడం సర్వసాధారణం, కాని నాకు మాత్రం ’చారులత’ సత్యజిత్ రే ని పరిచయం చేసింది. 1994 లో ఆంధ్ర దేశమనే నాకు తెలిసిన(…)

షత్రంజ్ కే ఖిలాడి (1977)

షత్రంజ్ కే ఖిలాడి (1977)

ఒక సినిమాను చూస్తూ ఉండగానే – “వావ్…” అనుకుంటూ…పూర్తవగానే…”వావ్వ్వ్వ్వ్” అని అనుకోవడం ఇటీవలి కాలంలో జరగలేదు నాకు. సత్యజిత్ రాయ్ హిందీ చిత్రం ’శత్రంజ్ కే ఖిలాడీ’ చూసాక, అలాంటి అనుభవం కలిగింది. చిన్నప్పుడు దక్షిణభారత్ హిందీ ప్రచార్ సభ పరీక్షల్లో – ఒక పాఠ్యాంశంగా ప్రేంచంద్ ’శత్రంజ్ కే ఖిలాడీ’ ఉన్నట్లు గుర్తు. అదే ఈచిత్రానికి మూలం. చారిత్రక సంఘటన ఆధారంగా రాసిన ఈకథ, ఒరిజినల్ ఎలా చదివానో, అప్పటికి స్కూలు రోజుల్లో నాకేం అర్థమైందో(…)

చిత్రం భళారే తెలుగు చలన సిత్రం

చిత్రం భళారే తెలుగు చలన సిత్రం

సినిమా ఈజ్ బ్యుటిఫుల్. నాకు సినిమాతో పరిచయం ఎర్పడినప్పటి నుండి కల్గిన భావం. సినిమాతో నా మొదటి పరిచయం గ్యాంగ్ లీడర్ తో మొదలైంది. మంచి డ్రామా మూవీ. ఆ తర్వాత కొంత కాలానికి శివ, గీతాంజలి చూశాను. దాంతో సినిమా మీద ఆసక్తితో సినిమాలు చూడ్డం మొదలుపెట్టాను. మణిరత్నం, రాంగోపాల్ వర్మ, వంశీ ఈ బ్యూటిఫుల్ సినిమాలని రెండు దశాద్భాలా పాటు చూపించారు. ఆ తరువాత ఈ వరుసలోకి శేఖర్ కమ్ముల ప్రవేశించి తెలుగు సినిమాకి(…)

కళాత్మక తామరాకు నుంచి అర్బన్ అరిటాకు పైకి…..

కళాత్మక తామరాకు నుంచి అర్బన్ అరిటాకు పైకి…..

కె. విశ్వనాథ్ నుంచి శేఖర్ కమ్ముల వరకూ… (ఉన్నత వర్గాల ప్రేక్షకుల్ని ఉద్దేశించినదిగా చెప్పబడే తెలుగు క్లాస్ సినిమా 30 ఏళ్ళ పాటుగా చేస్తున్న ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్ట్, రచయిత జి. ఎస్ . రామ్మోహన్ ద సండే ఇండియన్ కి రాసిన వ్యాసం)   “శేఖర్ అన్ని ఫంక్షన్లకు నన్ను పిలుస్తూ ఉంటాడు కానీ నాతో సినిమా చేయమంటే మాత్రం చేయడు…” ఇది అక్కినేని నాగార్జున మాట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో ఆవిష్కరణ(…)

చిన చేపను పెద చేప.. అను “గంగపుత్రులు” కథ

చిన చేపను పెద చేప.. అను “గంగపుత్రులు” కథ

“చిన చేపను పెద చేప..పెద చేపను పెను చేపా.. చిన మాయను పెద మాయ..పెద మాయను పెను మాయా..అది స్వాహా ఇది స్వాహా…” – అన్న మాయాబజార్ దృశ్యం గుర్తొస్తోంది నాకు “గంగపుత్రులు” చూసాక. “సొంతఊరు” చిత్రం చూసాక, స్క్రీన్ప్లే విషయం ఎలా ఉన్నా కూడా, ఆ దర్శకుడు అలాంటి కథాంశంతో సినిమా తీసినందుకు కలిగిన గౌరవం కొద్దీ “గంగపుత్రులు” కూడా చూసాను. అంతకుముందే ఈ సినిమా గురించి కూడా ఒక “తప్పక చూడు” రికమెండేషన్ రావడం(…)

Sai Paranjape’s Saaz

Sai Paranjape’s Saaz

“Human relationships are my forte.” అని ఉద్ఘాటించగల  ప్రతిభావంతురాలైన దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా  సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా ఆజ్మీ)(…)

గుల్జార్ విరచిత ’మీరా’!

గుల్జార్ విరచిత ’మీరా’!

వారాంతంలో సినిమాల, సంగీతాల డివిడిల వేటలో అనూహ్యంగా హేమామాలి నటించిన ’మీరా’ చిత్ర డివిడి కనిపించింది.  దృష్టిని ఆకర్షించేంత పెద్దగా ’Gulzar’s Meera’ అని రాసుంది. ముందు, ఏదో ప్రైవేట్ ఆల్బమ్ అనుకున్నాను. తీరా చూస్తే హేమామాలిని ప్రధాన పాత్రగా, వినోద్ ఖన్నా, షమ్మీ కపూర్,భరత్ భూషణ్ తదితర తారాగణంతో రూపొందించిన పూర్తి నిడివి చలనచిత్రం అని తెలియగానే మరో ఆలోచన లేకుండా కొన్నాను. ఇవ్వాళే చూసాను.చిత్రశీర్షిక తెలుపుతున్నట్టు ఇది మీరా బాయి కథ. కృష్ణుని మదిలో(…)

ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)

ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)

పురుషాధిక్య సమాజంలో స్త్రీని కేవలం ఒక మాంసపు ముద్దగా ఒక వినోద వస్తువుగా వ్యాపారం చేసుకుంటున్న ఒక స్థాయి లో ఉన్న రచయితలూ కానీ దర్శకులు కానీ ఇలా వాస్తవికత రియల్ పిక్చర్ అంటూ స్త్రీని అసభ్యంగా చూపించే సినిమాలు తీయడం బాగా అలవాటైన సినీ సమాజం మై పోయింది మనది. సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది(…)

చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా

చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా

గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని,  తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని, అదే నవ్వును అమ్మాయికేసి చూస్తూ కొనసాగించి, బైక్ మీదే ఏదో(…)

గుల్జార్ కవిత్వం సెల్యులాయిడ్ పై: ఇజాజత్

గుల్జార్ కవిత్వం సెల్యులాయిడ్ పై: ఇజాజత్

ముందుగా కొన్ని disclaimers ఇది గుల్జార్ సాబ్ రాసి, తీసిన సినిమా ’ఇజాజత్’ గురించి నా ఆలోచనల వ్యాసం. సమీక్ష కాదు. నాకు సినిమాలంటే అట్టే ఇష్టం ఉండవు. మా కాల్విన్‍గాడు అన్నట్టు, Happiness is not enough for me. I need euphoria. సమిష్టి వ్యవసాయమైన సినిమారంగంలో ఒక అత్యద్భుతమైన ఉత్పత్తి రావాలంటే ఎందరో కల్సి పనిచేయాలి. ఇంకెన్నో కల్సి రావాలి. ఇలా అరుదుగా జరుగుతుంది. అలా జరక్కపోతే సినిమా ఎక్కదు నాకు. అలా(…)

మైనే గాంధీ కొ నహీ మారా

మైనే గాంధీ కొ నహీ మారా

ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం – కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా,(…)

కనుడు … కనుడు రామాయణగాథ

కనుడు … కనుడు రామాయణగాథ

శ్రీరామరాజ్యం’… ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. బాపు-రమణల కాంబినేషన్‌లో చివరి చిత్రం కావడం, బాలకృష్ణ-నయనతార సీతారాములుగా నటించడం…ఇళయరాజా స్వరాలందిస్తున్న తొలి పౌరాణిక సినిమా కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సినిమాను ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార్చాయి. అంతకన్నా మించి తెలుగులో దాదాపు 15 ఏళ్ల తర్వాత 1996 నాటి శ్రీకృష్ణార్జున విజయం తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రంగా కూడా ఈ సినిమా ఆసక్తిని సృష్టిస్తోంది. ఇదే(…)

తెలుగు సినిమాల్లో తెలుగెంత?

తెలుగు సినిమాల్లో తెలుగెంత?

నేతి బీరకాయలో నేయి ఉంటుందా? పులిహోరలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట… అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట…‘తెలుగు భాష(…)

రేపటి సినిమా మాండలిక సినిమా

రేపటి సినిమా మాండలిక సినిమా

తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011(…)

కథానాయికల కథ

కథానాయికల కథ

ఎప్పటికీ సినిమాలో గ్లామర్ అంటే హీరోయినే. హీరోయిన్ లేని సినిమా అంటే ఒయాసిస్సులేని ఎడారే! అందుకే సగటు ప్రేక్షకుడికి సినిమా నటి ఓ స్వప్నం! సౌందర్యం! ఓ మానసిక సంతృప్తి! ఓ అప్సరస! తెరమీద జిలుగు వెలుగులలోని హీరోయిన్ సౌందర్యం వెనుక నీలినీడపూన్నో! హీరోయిన్ సమ్మోహిత నవ్వుల వెనక పైకి కనిపించని బాధపూన్నో! అభిమాన నటి పెదాల లిప్‌స్టిక్ మెరుపుల వెనక కురవని మేఘాపూన్నో! రకరకాల కథలతో ఎందందరో వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించే(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- మరి కొన్ని విశేషాలు

నేషనల్ ఫిల్మ్ ఆవార్డ్స్ లేదా జాతీయ చలనచిత్ర పురస్కారాలుగా పిలువబడే ఈ అవార్డులు మొట్టమొదట 1954 లో ఇవ్వడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ నేడు ఇవ్వనున్న 58 వ పురస్కారాల వరకూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్లో కొన్ని ముఖ్య సంగతులను మనం చలనచిత్ర అవార్డుల పరిణామ క్రమం లో తెలుసుకున్నాము. కానీ జాతీయ చలనచిత్ర అవార్డులు అనగానే మనకి గుర్తొచ్చేవి కొన్నే.ఉత్తమ చిత్రం,ఉత్తమ నటీ నటులు, ఉత్తమ దర్శకుల అవార్డులు మాత్రమే మనకి ఎక్కువగా(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-2

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో అతి ముఖ్యమైన అవార్డులుగా భావించే వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి విభాగాలు ఉన్నాయి. ఇప్పటివరకూ తెలుగులో నిర్మించిన ఏ చలనచిత్రం కూడా ఉత్తమ చలన చిత్రం గా జాతీయ అవార్డు పొందలేదు. అలాగే ఉత్తమ దర్శకుడు మరియు ఉత్తమ నటుడు విభాగాల్లో కూడా మన వాళ్ళకి ఇంతవరకూ అవార్డులు దక్కలేదు. హిందీ తర్వాత అంత పెద్ద చలనచిత్ర పరిశ్రమగా పిలువబడే మన తెలుగు సినిమాకి(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తెలుగు సినిమాలు-1

1954 లో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడానికి ముందే తెలుగు చలనచిత్రమయిన “పాతాళ భైరవి” భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ఎంపికయిన ఏకైక చిత్రం గా గుర్తింపు పొందింది.ఇలాంటి ఖ్యాతి సాధించిన మరో తెలుగు చలనచిత్రం “మల్లీశ్వరి”. ఈ సినిమా బీజింగ్‌లో జరిగిన చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమై, 1953 మార్చి 14న చైనీస్‌ సబ్‌ టైటిల్స్‌ చేర్చి 15 ప్రింట్లతో చైనాలో విడుదలయింది. ఈ విధంగా 1953 కంటే ముందే కొన్ని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దాదాసాహెబ్ ఫాల్కె అవార్డ్

నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు. 1896లో ఆయన బొంబాయిలోని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ సాంకేతిక నిపుణులు

చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీతం ,సాహిత్యం, శిల్పం మరియు ఇతర లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. చలనచిత్రానికి దర్శకుడు ముఖ్యమే కానీ ఒక చలనచిత్ర నిర్మాణం కేవలం దర్శకుడి ఒక్కడి వల్లే కాదు. నిజానికి చలనచిత్రం లోని అన్ని విభాగాల నిపుణుల చేత తనకు కావలసినట్టుగా పని చేయించుకోగలిగేవాడే దర్శకుడు. చలనచిత్ర కళలో చివరిగా మనకి తెరమీద కనిపించేది నటీనటులే అయినప్పటికీ తెర వెనుక దర్శకుడితో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- ఉత్తమ నటీ నటులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు కేవలం ఉత్తమ చిత్రాలను మాత్రమే గుర్తిస్తూ ఈ అవార్డులను అందచేసే వారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు అంటే 1968 లో మొదటి సారిగా చలనచిత్రాల్లో నటించిన ఉత్తమ నటీనటులకు అవార్డులు అందచేయాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ బాల నటీనటుల విభాగాల్లో మొత్తం మూడు అవార్డులు నటీనటులకు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కేటాయించారు. 1968 నుంచి 1974 వరకూ ఉత్తమ నటుడు అవార్డులను(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- దక్షిణ భారత సినిమాలు

మన దేశంలో హిందీ తర్వాత అత్యధిక సంఖ్యలో చలనచిత్రాలు నిర్మించే భాషల్లో తెలుగు, తమిళం, మళయాళం మరియు కన్నడ ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల సంఖ్య కలిపితే ప్రపంచం లోనే అత్యధికంగా సినిమాలు నిర్మించే ప్రాంతంగా దక్షిణ భారతదేశాన్ని పేర్కొనవచ్చు. 1954 లో మొట్టమొదటి చలనచిత్ర పురస్కారాలు అందచేసినప్పటినుంచీ 1966 వరకూ దక్షిణ భారతదేశానికి చెందిన కథాచిత్రాలేవీ స్వర్ణ కమలం గెలుచుకోలేదు. డాక్యుమెంటరీ మరియు ఇతర విభాగాల్లో స్వర్ణ కమలం అవార్డులు గెలుచుకున్నప్పటికీ మొదటిసారిగా దక్షిణాదికి చెందిన(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – బెంగాలీ సినిమాలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలందుకున్న సినిమాలను సాధారణంగా అవార్డు సినిమాలని అంటుంటారు. అలాంటి అవార్డు సినిమాలనగానే మనకి గుర్తుకొచ్చేవి బెంగాలీ లేదా మళయాళీ సినిమాలే. గత కొన్ని రోజులుగా మనం జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి తెలుసుకుంటున్నాం. అయితే గత 58 ఏళ్ళగా కొనసాగుతూ వస్తున్న ఈ పురస్కారాల్లో 22 బెంగాలీ సినిమాలు ఉత్తమ చిత్రంగా ఎంపిక కాబడ్డాయంటే బెంగాలీ సినిమాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరాలాల్ సేన్ దర్శకత్వంలో వచ్చిన మొట్టమొదటి భారతీయ(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- పథేర్ పాంచాలి

మొదటి రెండు సంవత్సరాల పాటు అవార్డులు వచ్చిన సినిమాల సంగతి ఒక ఎత్తైతే ఆ తర్వాత 1956 లో భారత ప్రభుత్వం ప్రకటించిన మూడవ జాతీయ అవార్డులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలోనే ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన తొలి చిత్రం “పథేర్ పంచాలి” జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. గతంలో ఇచ్చిన అవార్డులన్నీ కూడా కథా ప్రధానమైన, భక్తి ప్రధానమైన లేదా ప్రబోధాత్మక సినిమాలకే(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు- తొలి రోజులు

ఇక మనం 1954 లో మొట్టమొదటి సారిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్న చిత్రాల వివరాలు చూద్దాం. శ్రీ మంగల్ దాస్ పక్వాసా అధ్యక్షుడిగా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించారు. ఇప్పుడు ఉన్నన్ని అవార్డులు ఆ రోజుల్లో లేవు. జాతీయ ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణ పతకం అందచేసేవారు. పీకే ఆత్రే దర్శకత్వంలో వచ్చిన మరాఠీ చిత్రం “శ్యాంచీ ఆయ్” ఈ అవార్డు గెలుచుకుంది. శ్యాం అనే అల్లరి కుర్రవాడిని అతని(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-పరిణామ క్రమం

భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందుతూండగా ఎన్నో మార్పులు సంభవించాయి. మొదట్లో అత్యధిక శాతం సినిమాలు హిందీ నిర్మించబడేవి. కానీ ఈ రోజు తమిళం మరియు తెలుగు సినీ పరిశ్రమలు హిందీ సినిమా పరిశ్రమకు ధీటుగా నిలిచాయి. ఈ మార్పుల కారణంగానే జాతీయ చలన చిత్ర పురస్కారాలు అందచేయడంలో కూడా మార్పు సంభవించిందనే చెప్పాలి. ముఖ్యంగా 1970 మరియు 1980 లలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏర్పడిన మార్పులు ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు – చరిత్ర

1953 లో భారతదేశంలో నిర్మింపబడిన వివిధ భాషా చిత్రాలనుంచి ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ చిత్రాలకు పురస్కారాలు అందచేయాలని 1954 లో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా నిర్ణయించింది. ఆ విధంగా భారతదేశంలో ఉత్తమ చలనచిత్రాలకు పురస్కారాలు అందచేయడమనే ప్రక్రియ మొదలయిందని చెప్పుకోవచ్చు. ఈ పురస్కారాలను అప్పట్లో “స్టేట్ అవార్డ్స్ ఫర్ ఫిల్మ్స్” గా పిలిచే వారు. నిజానికి 1949 ఆగష్టు నెలలో అప్పటి మద్రాస్ ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డ్ ప్రెసిడెంట్ రాసిన ఒక లేఖలో ఆ యేడు(…)

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

జాతీయ చలనచిత్ర పురస్కారాలు-ప్రపంచ చలనచిత్ర పురస్కారాల చరిత్ర

వచ్చే నెల 9వ తేదీ 58 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రధానం చేయబడే రోజు. ఈ సందర్భంగా జాతీయ చలనచిత్ర పురస్కారాల గురించి మనం తెలుసుకుందాం. యాభై ఎనిమిది ఏళ్ళ పాటు నిరంతరంగా కొనసాగుతూ వస్తున్న ఈ చలనచిత్ర పురస్కారాల చరిత్ర తెలుసుకోవాలంటే, ముందు చలనచిత్ర కళ యొక్క ఆవిర్భావం నుంచి మొదలుపెట్టాలి. 1895 లో లూమియర్ సోదరులు తొలిసారిగా ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. లండన్ లో ఈ ప్రదర్శన జరిగిన(…)

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!

వేలాది ‘ పూరో’ ల వేదన ఒక ‘ పింజర్’!

ఆధునిక భారత దేశ చరిత్ర లో ‘ దేశ విభజన’ అనేది ఎప్పుడు తలుచుకున్నా హృదయాన్ని బద్దలు చేసే సమయం, సందర్భం, సన్నివేశం.అప్పటి రక్తపాతం, హింస తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుట్టించే భయానక దుస్వప్నం. లక్షలాది మంది చనిపోయారు. లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు జరిగాయి. మనసుని దుఃఖంతో మెలిపెట్టే ఆ జ్నాపకాలు ఇండియా, పాకిస్తాన్ కి చెందిన ఏ ఒక్కరూ ఎప్పటికీ మరిచిపోలేని కఠిన వాస్తవం. మానవత్వం సిగ్గుతో తలదించుకున్న క్షణాలు అవి. ఒకరినొకరు చంపుకున్నారు.(…)

Waiting for Zoya

Waiting for Zoya

Amar Akbar Anthony had three men. It was larger than life and it was unnecessarily dramatic. It was silly in parts, unconvincing and stereotypical. Over the top acting and total Masala. Which meant you excused all trivialities in the name of cinema. It was the cinema of the 80s and a hit. With three big(…)

ఓ పేద హృదయపు ప్రేమ కథ

ఓ పేద హృదయపు ప్రేమ కథ

ఆదిమనసు మాయో..లేక హార్మోనుల ప్రభావమో తెలియదుకాని యవ్వనపు తొలినాటి నుండి అవతలివ్యక్తి మీద ఆకర్షణ మొదలవుతుంది.ఆది బలమై ప్రేమగా మారుతుంది.ప్రేమ మనసుకు ఆనందాన్నిస్తుంది.ఆ ఆనందం కోసం మనిషి పరితపిస్తుంటాడు..కాని విధి ఆడే వింత నాటకంలో ప్రేమని పొందలేక పోతారు కొందరు…… ప్రతి మనిషి జీవితంలోఇలాంటి స్థితిని ఎదురుకొంటాడు. జీవితం ఒక సర్కస్ అయితే, బాధలన్నీ గుండెమాటున దాచుకొని..మోహంలో ఆ భావాలు కనపడకుండా రంగుపులుముకొని…ప్రేక్షకులని నవ్వించటమే  ఓ జోకర్ చేయాల్సింది. అతని జీవితంతో…పేదరికంతో..బాధలలో.. దేనితోను ప్రేక్షకులని సంబంధం లేదు.(…)