Category: భారతీయ సినిమా

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

Movie Endings
ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్ [...]

మారుతున్న సినిమా కథనం

మారుతున్న సినిమా కథనం

సాధారణంగా మన సినిమాల్లో కథలన్నీ ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి ఉంటాయి. అలాగే కథనం కూడా సరళ రీతిలో ఉంటుంది. ఒక వ్యక్తి తన గమ్యం చేరడానికి లేదా లక్ష్యం నెరవేర్చడానికి పడే ప్రయత్నం, ఆ ప్రయత్నం లో అతనికెదురయ్యే ఆటంకాలు, అవాంతరాలను అధిగమించి చివరకా వ్యక్తి విజయం సాధించడంతో కథ ముగుస్తుంది. కథలో జరిగే సంఘటనలను సరళ రీతిలో చెప్పకుండ, కథలోని కొన్ని భాగాలను flashbackల రూపంలో చెప్పడం కొన్ని కథల్లో జరుగుతుంది.ఈ [...]

నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?

నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?

కదిలే బొమ్మలు క్రమంగా చలన చిత్రంగా రూపుదిద్దుకున్న కొద్దికాలానికే సినిమా గురించిన వార్తలు, వాణిజ్య ప్రకటనలు, క్రమంగా ప్రివ్యూలు, సమీక్షలూ మొదలయ్యాయి. కొంచెంఅటూ ఇటూగా ప్రపంచ దేశాలన్నిటిలో ఇదే క్రమం కనిపిస్తుంది. సినిమాలకు సమీక్షలు అవసరమా అంటే నూటికి తొంభై భారతీయ సినిమాలకు అవసరం లేదు. ఆమాటకొస్తే హాలీవుడ్ లో కూడా పెద్దగా అవసరం లేక పోయినా అక్కడ సినిమా సమీక్ష అనేది పెద్ద పరిశ్రమగా, వందలాది మందికి, జీవనోపాధిగా మారటంతో దాని [...]

"యాంగ్రీ మిడిల్ క్లాస్" సినిమాలు

“యాంగ్రీ మిడిల్ క్లాస్” సినిమాలు

70 వదశకాన్ని మన భారతీయ సినీ చరిత్రలో ‘యాంగ్రీయంగ్ మెన్’ దశకంగా సినీచరిత్రకారులు అభివర్ణిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాల అనంతరంకూడా కొనసాగుతున్న, సామాజిక అసమానతలు. వ్యవస్థీకృత అణచివేత. ధనికులుచేసే చట్టాల ఉల్లంఘన. పేదలకు జరిగే అన్యాయాలు మొదలైన సామాజిక రుగ్మతల నేపధ్యంలో, చట్టాన్ని తనచేతుల్లోకి తీసుకుని న్యాయంచేసే ఒక సూపర్ హీరో భారతీయ సినిమా(ముఖ్యంగా బాలీవుడ్)లో ఉదయించాడు. హిందీనటుడు అమితాబ్ బచ్చన్ ఈ సూపర్ హీరో పాత్రకి రూపమిచ్చాడు. ఇదే మూసలో వివిధభారతీయ భాషల్లో [...]

మాయాబజార్ - పాండవులు లేని భారతం

మాయాబజార్ – పాండవులు లేని భారతం

మాయాబజార్ కొత్తగా రంగులద్దుకున్నవేళ నూతనకళతో మిలమిలా మెరిసిపోతోంది. కొత్తవన్నెలద్దడానికి సరియయిన సినిమానే ఎంచుకున్నారు పెద్దలు. మాయాబజార్ సినిమా ఒక అపూర్వమైన, అనన్యసామాన్యమైన కళాఖండం. ఈ సినిమాకి కథ, కథనం ఒక ఎత్తయితే, పింగళి వారి మాటలు, పాటలు ఇంకో ఎత్తు. నటీనటుల కౌశల్యం సరేసరి. మాయాబజార్ సినిమా తెలుగు సినిమాలోకానికి పెద్దబాలశిక్షవంటిది అని “నరేష్ నున్న” అన్నారు. ఇది అక్షరాలా నిజం.
మాయబజార్ – పాండవులు లేని భారతం. ఈ విషయం, సినిమా ఓ పది సార్లు చూసాకయినా [...]

మూడు ముఖాల తమిళ సినిమా

మూడు ముఖాల తమిళ సినిమా

సినిమా, సినిమా తియ్యడమనే ప్రక్రియతో మాత్రమే అంతమైపోదు. ప్రేక్షకుడి తరఫున్నుంచీ చూశామనిపించినంతమాత్రానా అయిపోదు. సినిమా ఒక సమిష్టి కళ. సినిమా ఒక సామాజిక దర్పణం. సినిమా ఒక వ్యాపార దృక్పధం. సమాజం దాని నేపధ్యం. మనుషుల కథలు,ఆలోచనలూ,ఆదర్శాలూ,అనుభవాలూ ‘చలన చిత్రాలుగా’ మలిచేదే దాని పని. అలాంటి సినిమా తియ్యడం- చూడటంతో సమాప్తమైపోతే సామాజిక (చలచిత్ర) చరిత్రగా ఎలా మిగులుతుంది?
అందుకే సినిమాపుట్టిన దేశాలు. సినిమా పెరిగిన దేశాలు. సినిమాని ప్రేమించే దేశాలు. “సినిమా మాది” లేదా “మా సినిమా [...]

2009-కొత్త దర్శకులు: ఒక షాకయ్యే నిజం

2009-కొత్త దర్శకులు: ఒక షాకయ్యే నిజం

2009 సినీ పరిశ్రమకు దాదాపు 330 కోట్ల వరకూ నష్టాన్ని కలగ చేసిందంటూ ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే 64 మంది కొత్త దర్శకులుకు మాత్రం కెరీర్ లు ప్రారంభం కలిగించే అవకాంశం కల్గించింది. అది వారు నిలబెట్టుకున్నారా  లేదా అనేది ప్రక్కన పెడితో  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినీ ఫీల్డులో ప్రవేశించే చాలామంది అంతిమ లక్ష్యం మాత్రం దర్శకత్వం.
జనవరి
1) జి.ఎల్.బి.శ్రీనివాస్ (మహా నగరంలో శివ -చందు)
2) హర్షా రెడ్డి  (ఇందుమతి)
3) విశ్వ ప్రసాద్ [...]

2009 ఒక సమీక్ష

2009 ఒక సమీక్ష

2009 సంవత్సరాన్ని అత్యంత దారుణమైన సంవత్సరంగా తెలుగు చిత్రపరిశ్రమ అప్రకటితంగా ప్రకటించేసుకున్నారు. ఈ విషయం ఒక ఓపన్ సీక్రెట్. ఈ సంవత్సరంలో వచ్చినన్ని ఫ్లాపులు మరే సంవత్సరంలోనూ రాలేదు. ఆలాగే ఈ సంవత్సరంలో పెట్టినంత పెట్టుబడి మరే సంవత్సరంలోనూ తెలుగు పరిశ్రమ గత 77 ఏళ్ళలో పెట్టలేదు. కలెక్షన్ల పరంగా లెక్కకు నాలుగు హిట్లు. యావరేజ్ అనే పదానికి ప్రేక్షకులు చూసినా పెట్టుబడివెనక్కురాని సినిమాగా ఒక కొత్త అర్థం వచ్చిచేరింది. ఇక ఫ్లాపులంటారా వాటిని లెక్కపెట్టాల్సిన [...]

అనగనగా ఓ చిన్న సందేహం!

అనగనగా ఓ చిన్న సందేహం!

చిన్నప్పటి నుండి నేను సినిమాలు తెగ చూసేవాడిని. ఎన్.టి.ఆర్ దగ్గరనుండీ చిరంజీవి వరకూ ఆ తరవాత నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల సినిమాలు ఇలా అందరి సినిమాలు చూసేవాడిని. అవి నా మెదడులో ఒక  సందేహాన్ని రేకెత్తించాయి.
అది, అసలు సినిమా అంటే ఏంటి?
ఇదేం ప్రశ్నరా బాబు, మా ఊళ్ళో చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు అని అనుకుంటున్నారా! నిజమే సినిమా అంటే తెలీనిదెవరికి! ప్రతి రోజు కొన్ని కోట్ల మంది వీటిని తెర మీదో, టీవి లోనో [...]

ఇంద్ర "గ్రహణం"

ఇంద్ర “గ్రహణం”

ప్రముఖ నటి ఊర్వశి శారదకి మూడు సార్లు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. మొదటి రెండూ మళయాళ సినిమాలయితే, మూడో సారి వచ్చింది తెలుగు సినిమాకి. అది బి.ఎస్. నారాయణ దర్శకత్వంలో వచ్చిన నిమజ్జనం అనే సినిమా. ఇది 1978లో అనుకుంటాను రిలీజయ్యింది. అన్ని అవార్డు సినిమాల్లాగానే ఈ సినిమా కూడా అవార్డులందుకున్నాకే పేరొచ్చింది. ఆ తరువాత రిలీజు చేసినా ఎక్కడా వారం మించి ఆడలేదు. ఏదో పెద్ద సెంటర్లో రిలీజ్ చేసారు. అక్కడే సరిగ్గా [...]

ఎలిపత్తయం

ఎలిపత్తయం

ఎలిపత్తయం (Elippathayam) అంటే ఎలుక బోను. ఇది ప్రముఖ మలయాళ దర్శకుడు అదూర్ గోపాల్ కృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన ఒక గొప్ప సినిమా. ఈ సినిమాకి గానూ బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు అదూర్.
కేరళలో ఫ్యూడల్ వ్యవస్థ అస్తమిస్తున్న రోజుల్లో అదే భావజాలంలో నిండామునిగిపోయిన ఒక వ్యక్తి కథనాన్ని ఎంతో నైపుణ్యంగా ఈ సినిమాలో చిత్రీకరించారు అదూర్. ఈ సినిమా మొదట్లో చూడగానే చాలామంది బాబోయ్ అవార్డు సినిమా అని ఎగిరి గంతేసి [...]

కథన విజయం – ఈరం  (తమిళ్)

కథన విజయం – ఈరం (తమిళ్)

మూడేళ్ళ క్రితం తిరుపతిలో నంది నాటక పోటీలు చూడ్డానికని వెళ్ళాను. ఆ పోటీలకి నేను రాసిన “పంచమ ధర్మం” అనే పద్య నాటకమొకటి కూడా ఎంపికయ్యింది. అందులో అది ప్రదర్శించారు. ఆ సందర్భంలో నాటకాలకీ, టీవీలకీ, సినిమాలకీ మధ్య కొట్టిమిట్టాడుతూ, అవకాశాల కోసం పడిగాపులు కాచే కొంతమంది వర్ధమాన రచయితలూ, దర్శకులూ పరిచయమయ్యారు. సినిమాలంటే నాకున్న ఇంట్రస్టు కొద్దీ వాళ్ళేం చేస్తూ ఉంటారూ, ఏఏ సినిమాలకి పనిజేసారనీ వివరాలు తెలుసుకున్నాను. నేను అమెరికా నుండి వచ్చానని తెలిసి [...]

విషాదాంతాలు -  బాలచందర్ సినిమాలు

విషాదాంతాలు – బాలచందర్ సినిమాలు

“బాలచందర్ ” ఎందుకోగాని ఈ పేరు తల్చుకోగానే మనసు దిగులుగా అయిపోతుంది.  నన్నేడిపించిన సినిమాలన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో  కళ్ళముందు  గింగిరాలు తిరుగుతాయి.  సరిత, శ్రీదేవి , జయప్రద ,జయసుధ, సుహాసిని,మాధవి, జయలక్ష్మి ( ఫటాపట్)  …చక్కనమ్మలందరూ , దిగాలుగా నాకేసి చూస్తారు. చిరంజీవి,  కమల్ హాసన్, రజనీకాంత్, నారాయణరావు , ప్రకాష్ రాజ్  ఆయనే లేకపోతే మేం ఎక్కడా ? అని ప్రశ్నిస్తూ  నిలదీస్తారు .బాలచందర్ సినిమాలు ఎన్ని చూసానో గుర్తులేదుకాని ….అన్ని సినిమాలూ ఏడుస్తూ [...]

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగులో మహిళా దర్శకులు

తెలుగు సినిమా ప్రపంచంలో మొట్టమొదటి మాటల ( టాకీ ) సినిమా తీసి సుమారు 77 ఏళ్ళు కావస్తోంది. ఇన్నేళ్ళలోనూ తెలుగు సినిమా అనేక సాంకేతిక హంగులు సంతరించుకొనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సినిమాలు తీసే భాషా చిత్రాల సరసన చేరింది. ఇంతవరకూ వందల కొద్దీ దర్శకులు పుట్టుకొచ్చారు. అనేక చిత్రాలు తీసారు. ఈ దర్శకుల జాబితా సరిగ్గా పరికిస్తే ఈ దర్శకుల్లో అధిక శాతం పురుషులే! నటులు వేషం మార్చి దర్శకులయ్యారు. రచయితలూ రూపాలు మార్చారు. [...]

అలనాటి సమీక్షలు-2

అలనాటి సమీక్షలు-2

ఈ చిత్రం చూశాక సి.యస్.రావుకి పది కాలాల పాటు బుకింగులు రాకపోయినా ఆశ్చర్యపడనవసరం లేదు. ప్రముఖ దర్సకుడుగా సి.యస్.రావు ఆయన టోటల్ కెరియర్ లో చాలా చెడ్డగా తీసిన చెత్త సినిమాగా ఈ చిత్రం నిలబడిపోతుంది. ఈ చిత్రం చూసాక ఈ చిత్ర దర్శకుడు ఎవరు అని అడిగి తెలుసుకుని మరీ విమర్శస్తున్నారు. సి.యస్.రావు ఈ చిత్రానికి దర్శకుడంటే..ఆయన అభిమానులకు తలమునక ఆశ్చర్యం ఏర్పడుతోంది. ఈ చిత్రం వల్ల యన్.టి.ఆర్ కు వచ్చిన చెడ్డ పేరు ఏమీ [...]

నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ ...

నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ …

ఈ సినిమా వచ్చేసి చాలా కాలమైంది కాబట్టి ఇది సమీక్ష కాదు, దీన్ని మరీ లోతుగా తవ్వే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది విశ్లేషణా కాదు .. సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుడి ఘోష అనుకోండి.
దివినించి శివుడి జటాజూటంలోకి దూకే గంగాప్రవాహంలాంటి ఒరవడితో మొదలై, అనేక వింత వింత మలుపులు తిప్పి, ఎన్నో విచిత్రాలున్నూ చూపించి, ఆఖరికి ఇంటెనక పిల్ల కాలవలా చడీ చప్పుడూ కాకుండా ముగిసిపోయిందీ విచిత్రమైన సినిమా. కానీ ముగింపొక్కటే సినిమా [...]

బాణం-మూడోస్సారి!

బాణం-మూడోస్సారి!

నవతరంగంలో బాణం గురించి జరుగుతున్న చర్చ చూసి ఎలాగైనా ఈ సినిమా చూడాలనిపించింది. (నవతరంగం ఈ సినిమా బాగోలేదని వ్రాసిన సమీక్షలు చదివికూడా ఈ సినిమా చూడాలనుకుని చూసిన చాలామందిలో నేనూ ఒకడిని. ఆ విధంగా నవతరంగం రివ్యూ ఆధారంగా మాత్రమే ప్రేక్షకుడు సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించకోడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ) బాణం సినిమా చైతన్య దంతులూరి అనే నూతన దర్శకుని మొదటి ప్రయత్నం అని తెలిసిందే. ఇక ఈ సినిమా కథ [...]

బాణం

బాణం

అసలు సినిమాలు చూడడం , అందునా తెలుగువి చూడడం చాలా తగ్గించేసిన నేను , ఈవేళ ఒక స్నేహితుడి ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఈ సినిమా చూడాల్సి వచ్చింది.
నా స్నేహితుడు సినిమా అంటే పడిచచ్చిపోయేరకం. తానూ ఏదో కళాఖండం ఏనాటికయినా సృష్టిస్తానని మాతో ఆవేశపడిపోతుంటాడు. సరే… మిత్రుడయినా వాడు మంచి ఫిలింమేకర్‍ అవునో కాదో ఒక సినిమా తీసాక కానీ చెప్పలేము కాబట్టి , ప్రస్తుతానికి వాడికి ఆ అవకాశంరావాలని కోరుకుంటాం. ఈవేళ హఠాత్తుగా వాడినుంచి ఫోన్‍. [...]

యానిమేషను సినిమాలు ...

యానిమేషను సినిమాలు …

ఎందుకనో భారతంలో మామూలు సినిమాలను ఆదరించినట్టుగా యానిమేషను సినిమాలను ఆదరించరేమో అని నాకనిపిస్తుంది. (ఈ మధ్య ట్రెండు మారుతున్నట్టుంది). వాటి గురించి ఎంతో కొంత ఈ వ్యాసంలో చెబుదామని నా ప్రయత్నం.
యానిమేషను సినిమాలు నాకు చాలా బాగా నచ్చుతాయి. అందులో ఇజాలు ఉండవు, స్టార్ నటులు ఉండరు, ఇగోలు చెల్లవు. పాత్రలు మాత్రమే ఉంటాయి.
ఆలోచించండి అసలు ఇవాళ మన సినిమాలలో ఇలాంటి అదృష్టం మనకుందా ? సర్లెండి అదో పెద్ద అంతులేని కథ.
ఇంతకీ యానిమేషను సినిమాలు ఒక [...]

మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే ...!

మన తెలుగు సినిమాలు ఇలా యెందుకు చచ్చాయి అంటే …!

నేను ఇక్కడ ఎప్పటి నుంచో సభ్యుడనే అయినా వారానికోసారి కొన్ని వ్యాసాలు చదువుతున్నా , కామెంట్ రాయడం చాలా అరుదు. ప్రధాన కారణం అట్టే చర్చల్లో ఉండటం నాకు నచ్చదు.  కానీ ఇవ్వాళ అబ్రకదబ్ర అనే సభ్యుడు వ్రాసింది చర్చించక ఉండలేని అంశం.  ఆ వ్యాసంలో చెబుతున్న పాయింట్లు నిజమే అయినప్పటికీ… నిందలను మాత్రం ఒప్పుకోలేకున్నాను
“ప్రేక్షకులు ఇలాంటి సినిమాలే కోరుకుంటున్నారు కాబట్టి ఇవే తీస్తున్నాం” అనే తెలుగు సినీ దర్శక, నిర్మాతల భావదారిద్ర్యాన్ని చూస్తే, చాలా [...]

Page 1 of 612345...Last »