|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Pirates of Silicon Valley
ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసించినవాళ్ళు ఇద్దరున్నారు. స్టీవ్ జాబ్స్ టెక్నాలజీ అంటే ఏమిటో తెలిసినవాళ్ళకి ఈ పేరు తెలియకుండా వుండే అవకాశమే లేదు. ఆయన పేరు తెలియకపోయినా కనీసం ఐపాడ్, ఐఫోన్ అనే పేర్లు విని వుండకపోతే ఆ వ్యక్తిని సాంకేతిక నిరక్షరాస్యుడని (technology illiterate) ప్రకటించేయచ్చు. బిల్ గేట్స్ కంప్యూటర్ల గురించి తెలియని సాంకేతిక నిరక్షరాస్యుడికి అయినా ప్రపంచంలోనే అత్యంత ధనికుడుగా బిల్ గేట్స్ సుపరిచితుడు. ఇక కంప్యూటర్ అంటేనే విండోస్ అనేంతగా చొచ్చుకుపోయిన [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: Kung Fu Panda
సినిమాల ద్వారా చదువులు చెప్పచ్చని అనగానే అదేదో సీరియస్ సినిమాలతోనే సాధ్యం అని అనుకోకూడదు. సరదాగా సాగిపోయి, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాల్లో సయితం ఎన్నో పాఠాలు వుంటాయి. ఎటొచ్చీ అవి తెలుసుకోడానికే కొంత ప్రయత్నం చెయ్యాలి. అలా సరదాగా సాగే పిల్లల సినిమా “కుంగ్ ఫూ పాండా” చిత్రంలో వున్న మేనేజ్మెంట్ పాఠాలను తెలుసుకునే ప్రయత్నమే ఈ వారం వ్యాసం. కుంగ్ ఫూ పాండా కథ చాలా మందికి తెలిసే వుంటుంది. Underdog తరహాలో సాగే [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High
మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం. 1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల [...] |
|
సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men
మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను. 1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా [...] |
|
మేనేజ్మెంట్ పాఠాలు నేర్పే సినిమాలు
పాఠం ఎంత గొప్పగా వున్నా, చెప్పడం బాగలేకపోతే ఎలా విసుగనిపిస్తుందో అలాగే ఎంటర్టైన్మెంట్ లేని డాక్యుమెంటరీ కూడా చప్పగా వుంటుంది. ఈ విషయం ఎం.బీ.యే. లాంటి ప్రొఫెషనల్ పట్టా పుచ్చుకున్నవారికీ, తరచూ కార్పొరేట్ ట్రైనింగ్లలో కూర్చునేవారికి ప్రత్యక్షంగా అనుభవం అయ్యే వుంటుంది. అలా బోరు కొట్టే డాక్యుమెంటరీలతో కాకుండా సినిమాల ద్వారానే కార్పొరేట్ పాఠాలు ఎందుకు చెప్పకూడదు? ఒకవేళ అలా చెప్పాలనుకుంటే అలాంటి సినిమాలు వున్నాయా? అన్న ప్రశ్నలకు నేను వెతుక్కున్న సమాధానమే ఈ వ్యాసం. [...] |
|
చిన చేపను పెద చేప.. అను “గంగపుత్రులు” కథ
“చిన చేపను పెద చేప..పెద చేపను పెను చేపా.. చిన మాయను పెద మాయ..పెద మాయను పెను మాయా..అది స్వాహా ఇది స్వాహా…” – అన్న మాయాబజార్ దృశ్యం గుర్తొస్తోంది నాకు “గంగపుత్రులు” చూసాక. “సొంతఊరు” చిత్రం చూసాక, స్క్రీన్ప్లే విషయం ఎలా ఉన్నా కూడా, ఆ దర్శకుడు అలాంటి కథాంశంతో సినిమా తీసినందుకు కలిగిన గౌరవం కొద్దీ “గంగపుత్రులు” కూడా చూసాను. అంతకుముందే ఈ సినిమా గురించి కూడా ఒక “తప్పక చూడు” రికమెండేషన్ రావడం [...] |
|
The Devil’s Eye (1960) – Ingmar Bergman
సైతాను ఆఫీసు గదిని, అందులో ఉన్న లైబ్రరీ ని చూసారా మీరెప్పుడైనా? సైతాను దూత ఒకటి – ఇద్దరు ప్రేమికుల మధ్య తగువులు పెట్టేసి, అక్కడే ఒక మూలన నిలబడి ముసిముసి నవ్వులు నవ్వడం చూసారా? ఇంతటి దుష్ట దూతనూ, “వైన్ బాటిల్ కప్ బోర్డులో ఉంది. కాస్త తీసిస్తావా?” అని అడిగి, అది లోపలి వంగగానే, తోసేసి, కప్బోర్డు మూసేసి తాళం పెట్టేసిన వాడిని? సైతాను “డబ్బూ పోయే శనీ పట్టే” అన్న చందాన దిగులుగా [...] |
|
Sai Paranjape’s Saaz
“Human relationships are my forte.” అని ఉద్ఘాటించగల ప్రతిభావంతురాలైన దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా ఆజ్మీ) [...] |
|
గుల్జార్ విరచిత ’మీరా’!
వారాంతంలో సినిమాల, సంగీతాల డివిడిల వేటలో అనూహ్యంగా హేమామాలి నటించిన ’మీరా’ చిత్ర డివిడి కనిపించింది. దృష్టిని ఆకర్షించేంత పెద్దగా ’Gulzar’s Meera’ అని రాసుంది. ముందు, ఏదో ప్రైవేట్ ఆల్బమ్ అనుకున్నాను. తీరా చూస్తే హేమామాలిని ప్రధాన పాత్రగా, వినోద్ ఖన్నా, షమ్మీ కపూర్,భరత్ భూషణ్ తదితర తారాగణంతో రూపొందించిన పూర్తి నిడివి చలనచిత్రం అని తెలియగానే మరో ఆలోచన లేకుండా కొన్నాను. ఇవ్వాళే చూసాను.చిత్రశీర్షిక తెలుపుతున్నట్టు ఇది మీరా బాయి కథ. కృష్ణుని మదిలో [...] |
|
ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)
పురుషాధిక్య సమాజంలో స్త్రీని కేవలం ఒక మాంసపు ముద్దగా ఒక వినోద వస్తువుగా వ్యాపారం చేసుకుంటున్న ఒక స్థాయి లో ఉన్న రచయితలూ కానీ దర్శకులు కానీ ఇలా వాస్తవికత రియల్ పిక్చర్ అంటూ స్త్రీని అసభ్యంగా చూపించే సినిమాలు తీయడం బాగా అలవాటైన సినీ సమాజం మై పోయింది మనది. సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది [...] |
|
ఫెల్లినీ’s 8 ½
“నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో.. “నేను సినిమాను” అని చాటిన ఇటాలియన్ దర్శకుడు ‘ఫెడెరికో ఫెలినీ’. ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రపంచ సినీ చరిత్ర లో అరుదైన ఆర్టిస్టిక్ జీనియస్ అనిపించుకున్నాడు ఫెలినీ. ఆయన జీవితం గురించి చదివినవారికీ, ఆయన సినిమాలు చూసినవారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కవితాత్మకమైన, భావావేశముతో కూడిన అసమాన దృశ్యాల తో ..సినిమా అనే మాధ్యమం ద్వారా ..మనిషి లోని కాంప్లెక్సిటీ ని చెప్పటానికి ప్రయత్నించిన [...] |
|
చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా
గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని, తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని, అదే నవ్వును అమ్మాయికేసి చూస్తూ కొనసాగించి, బైక్ మీదే ఏదో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |