విశ్లేషణ

జగమంత కుటుంబం – ఆనంద్ (1971)

మనిషి జీవితంలో అనుకోని అతిథి “మృత్యువు”. కానీ దాని రాక ముందే తెలిసినప్పుడు దానికి ఆనందంగా ఆహ్వానం పలకాలి, అప్పుడే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ అంశాన్ని సూటిగా స్పృశించిన చిత్రం “ఆనంద్”. “హృషికేష్ ముఖర్జీ” దర్శకత్వంలో “రాజేష్ ఖన్నా”, “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ ను మంచి పాత్రతో పాటు పురస్కారాలను సైతం ఇచ్చి నిలబెట్టింది. మొదట ఈ చిత్రంలోని పాత్రలకు కిషోర్ కుమార్,(…)

సత్యమే శివం

సత్యమే శివం

పరిచయం కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం. ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా. సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని తెరిపించగలదు. నేను రోజు వారీ కూలీనో,(…)

అతడు – ఒక విశ్లేషణ

అతడు – ఒక విశ్లేషణ

చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. నా దృష్టిలో తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని మొదటి పుస్తకం 1957 లో విడుదల అయిన “మాయాబజార్”. తరువాత 1989 లో రాంగోపాల్ వర్మ తీసిన “శివ” అనే పుస్తకం. ఆ తరువాత అలాంటి పుస్తకంలా అనిపించిన చిత్రం 2005 లో వచ్చిన “అతడు”. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ చిత్రం వెండితెరపై పెద్ద విజయం సాధించకపోయినా ఎందరో మనసులకి హత్తుకుంది.(…)

Nostalghia ~ ఓ అసంబద్ధ దృశ్య కావ్యం

Nostalghia ~ ఓ అసంబద్ధ దృశ్య కావ్యం

ఒక్క జాడ కూడా మిగల్చకుండా వేసవి అయిపోయింది సూర్యుడు ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నాడు అది కూడా ఓదార్పుకాదు రాలి పడిపోవాల్సినవన్నీ సరిగ్గా అరచేతి మీద వాలేయి ఐదు వేళ్ళ చిగురాకు లా అది కుడా ఓదార్పు కాదు మంచి కాని, చెడు కాని ఏదీ ఫలించదు. అన్నీ భగ్గుమనాల్సిందే అది కుడా ఓదార్పు కాదు దాచిపెట్టుకున్న రెక్కను జీవితం విప్పింది. అందుకు నేను దీవింపబడ్డాను అది సైతం ఓదార్పుకాదు ఆకులనెవరూ అంటించలేరు కొమ్మలనెవరూ  విరగ్గొట్టలేరు ఆ రోజు(…)

Bahubali – A Magnum Opus?

Bahubali – A Magnum Opus?

Happened to watch Baahubali today to see its portrayal as a magnum opus. Disappointed as it is one more film reflecting much more heavily the present day media and market promotion of the stereotypical heavy muscled masculine body and a thin fair skinned feminine one through Prabhas, Rana and Tamanna. Though Tamanna (roles as Avanthika)(…)

ఓ సామాజిక పరిణామానికి అద్దం-తెవర్ మగన్

ఓ సామాజిక పరిణామానికి అద్దం-తెవర్ మగన్

భారతీయ సమాజంలోని పలు ప్రాంతాలు, సమూహాలు ఒకేసారి, ఒకేలా చట్టం, పాలనా వ్యవస్థలను అంగీకరించలేదు. అలాగని అవన్నీ నేరుగా విభేదించనూలేదు. వారి సామాజిక నేపథ్యంతోనో, అనూచానంగా వస్తున్న అలవాట్లతోనో, లేక రాజకీయ స్థితిగతులతోనో చట్టాలు నేరుగా విభేదిస్తున్న చోట వాటికి అమలు ఉండదు. అలాగని ఆ స్థితి యధాతథంగానూ నిలిచిపోయేదీ కాదు. క్రమంగా సాంఘిక, ఆర్థిక స్థితిగతులు మారుతున్న కొద్దీ ఆ సమాజపు నడవడిక చట్టం పరిధిని అంగీకరిస్తూపోతుంది. సమాంతర వ్యవస్థలు రాజకీయ బలంతోనో, ఆర్థిక స్థితిగతులతోనో(…)

Haider – Analysis

1995 ఖుర్రం – ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయరు, చాలా తెలివయినవాడు. తన వదిన ఘజాల అంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ, ఆరాధనా సర్వస్వం. అతని కలల రాకుమారి ని తనకు దక్కదనే విషయం అర్ధం చేసుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలనుకున్నాడు. కాని విధి అతనికి ఇంకో అవకాశం ఇచ్చింది.   Dr.హలాల్ మీర్ – ఘజాల భర్త , తన ఎకైక సంతానం అయిన హైదర్ అంటె డాక్టర్ కి ప్రాణం, కొన్నాల(…)

The lovely bones – వేదనా కావ్యం !

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ (…)

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు.. చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ?? ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !! ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ(…)

దృశ్యం – జీవితపు  నాటకీయత  !!

దృశ్యం – జీవితపు నాటకీయత !!

అవును.. జీవితంలో అన్నీ ప్లాన్డ్ గా జరగవు.. మనకి తెలియకుండా టపీమని జరిగిపోయే అనర్థాలనే ప్రమాదాలు అంటాం. జరిగేటప్పుడు తెలియకున్నా..జరిగింతరవాత మాత్రం మనకి కొంత టైం ఉంటుంది.. బాధ పడటానికీ,ఏడవటానికి.  జీవితంలో చాలా నాటకీయత ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం.. గుర్తించినా తీరిగ్గా కలియజూసుకోటానికి టైం ఆగదు..మెల్లిగా నడవదు. తన స్పీడ్ లో తాను వెళ్ళిపోతుంది.  అక్కడ మిస్సయిన  ఆ నాటకీయతని..ఆ భావోద్వేగాలనీ పట్టిచూపించేదే సినిమా !! సినిమాలో  ‘అవసరమైన’ సాగదీత లేకుంటే.. కిక్కు ఎక్కదు.(…)

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి(…)

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక అబ్బాయి-ఒక అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమస్య వాళ్ల స్వభావ వైరుధ్యం (ఖుషి)వల్లనైనా రావాలి లేదా బయటనుంచీ వచ్చే ప్రమాదం/అభ్యంతరం/పరిస్థితుల (జయం, నువ్వూ-నేనూ) ప్రభావం వల్లనైనా రావాలి. దాన్ని అధిగమించి ఇద్దరూ ఒకటవ్వాలి. ఒక హ్యాపీ ఎండింగ్ ఉన్న ప్రేమకథలకు అది అత్యంత అవసరం. ఆ ప్రేమ జంట ఒకటవ్వాలని జనాలు/ప్రేక్షకులు బలంగా కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే, వాళ్ళు ముచ్చటైన జంట అయుండాలి. సమస్యతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అయ్యుండాలి. వాళ్ల ప్రేమతో ఎంపతైజ్ అవగలగాలి.ఇవేవీ కాని సినిమా(…)

మౌనరాగం – మనసు తీరు

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .(…)

The hunt – వెంటాడే లోకం !!

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా. లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ(…)

the first grader – స్పూర్తి దాయకం

the first grader – స్పూర్తి దాయకం

  కెన్యాలో,  1953 వ సంవత్సరంలో బ్రిటీషుపాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు  సాయుధ పోరాటం జరిపాయి . ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేలకొద్దీ జైలుపాలయ్యారు. కొందరు  చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్దించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు..బాధలు..గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.   ఓ గుడిసె..  ఎనభైఏళ్ళ ముసలాడు   ఒంటరి జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. కొత్త ప్రభుత్వం అందరికీ  ఉచిత ప్రాధమిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి(…)

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే. జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు. అమె తన ప్రియుడి(…)

Ratcatcher – అంతర్మధనం

Ratcatcher – అంతర్మధనం

   సినిమా అనేది భావవ్యక్తీకరణ మాధ్యమం అయితే దాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించగలిగిన దర్శకులు కొందరే.   జేమ్స్ నీళ్ళకొలను దగ్గర ఆడుతూ ఉంటాడు. కిటీకీ లోంచి రయాన్ చూస్తాడు.తనకీ స్నేహితుడితో ఆడుకోవాలని అనిపిస్తుంది. కానీ తల్లి మాత్రం  జైల్లో ఉన్న తండ్రిని చూడటానికి బయలుదేరమంటుంది. వెంట నడిచినట్టే నడిచి తల్లిని ఏమార్చి స్నేహితుడిని చేరుకుంటాడు రయాన్.  జేమ్స్  రయాన్ని నీళ్లలోకి తోస్తాడు. రయాన్ జేమ్స్ మొహాన బురద కొడతాడు.  అలా సరదాగ మొదలై  కొంచం తీవ్రమవుతుంది.(…)

మా సినిమాలు:బాపు- చివరి భాగం

మా సినిమాలు:బాపు- చివరి భాగం

’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది. రేలంగి గారు చక్రపాణి దగ్గరకెళ్ళి “నాకెందుకు విజయాలో వేషం ఇవ్వలేదు? నేను రమణారెడ్డిలా కామెడీ విలన్ చెయ్యలేననా” అన్నారట. చక్రపాణిగారు – నువు చెయ్యగలవు గానీ జనం చూడద్దూ” అన్నారు. అలాగా – నువ్వు బులెట్టు బాగానే తీశావు – గానీ ఫలానా లాటి సినిమాలు మీనించి expect చేసే జనం చూడద్దూ! ’జాకీ’ రేసుల్లో సరిగ్గా పరిగెట్టలేదు. బాలుగారి సంగీతం “అలా మండిపడకే జాబిలీ” గుర్తుందా! “కళ్యాణ(…)

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే(…)

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ(…)

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో(…)

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు. డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ(…)

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా  అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను(…)

మా సినిమాలు:బాపు-మొదటి భాగం

మా సినిమాలు:బాపు-మొదటి భాగం

సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి…. నవతరంగం లో ఈ వ్యాసాల సీరీస్ ను ప్రచురించే అవకాశం కల్పించిన తెలుగునాడి సంపాదకులకు, మా తెలుగు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – TAL, ) సంపాదకులకు మరియు మనందరికీ (…)

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

మన చుట్టూ వున్న ప్రపంచం,ఆ ప్రపంచంలో వున్న మనం…మన కుటుంబ నేపధ్యం,మన వృత్తి,ఇరుగు- పొరుగు,సంబంధ బాంధవ్యాలు వీటికి తోడుగా మన చుట్టూ అల్లుకు పోయిన సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు వాటి వల్ల మనం ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చే ఉత్పాతాలు,వాటికి మన ప్రతిస్పందన..స్థూలంగా మనం ఎదుర్కొనే సమస్యలు,వాటి ద్వారా మనం పొందే అనుభవాల సమాహారమే కథ. ప్రతి కథానాయకుడు సమస్యల్ని ఎదుర్కొంటాడు….కొందరు ధీరులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొందరు భీరువులు వాటికి లొంగిపోతారు(దేవదాస్)…ఇంకొందరు అవాస్తవిక దృక్పధాలతో సమస్యని తమదైన శైలిలో పరిష్కరించే(…)

పూజాఫలము

పూజాఫలము

పగటి పూట వెన్నెల – ఒక అందమైన అబద్ధం. “కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులని రెచ్చకొట్టకూడదు. ఉత్తమ వులువలని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేసిన బి.ఎన్.రెడ్డి తెలుగు సినీరంగంలో ఓ చరిత్ర. ఆయన తీసింది పదకొండు సినిమాలే అయినా అందులో ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. ఆయన తీసిన చిత్రాల్లో అందరికీ నచ్చిన చిత్రాలు కొన్నయితే,(…)

Citizen Kane

Citizen Kane

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు “సిటిజెన్ కేన్”. ఈ సినిమా పేరు తెలియని ప్రపంచ సినిమా అభిమానులు ఉండరు. ఈ సినిమా తెలియనివారెవరైనా ఉన్నారంటే వారికి ప్రపంచ సినిమా గురించి ఇంకా అంత పరిచయం లేకుండా ఉండి ఉండాలి. వందేళ్లకు పైబడ్డ చలనచిత్ర చరిత్రలో నెంబర్ వన్ సినిమా ఏదంటే ఠక్కున నోటికొచ్చేది ఈ సినిమా పేరే! నేటికీ ఏ ప్రపంచ చలనచిత్రకారుడ్ని అడిగినా దాదాపు అందరూ ఏకకంఠంతో నెంబర్ వన్ సినిమా గా అంగీకరించే(…)

My dinner with Andre

My dinner with Andre

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రే” సినిమా వేరయా!!! సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆందోళన నిండిన మొహంతో షాన్ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. నడుస్తున్నంత సేపూ అతనికి ఎంతో పరిచయమైన ఆ నగరం ఎప్పటిలానే పలకరించింది. కానీ షాన్ ఇవేవే పట్టించుకునే స్థితిలో లేడు. నాటక రచయితగా కొద్దో గొప్పో పేరున్నా ఇప్పుడు(…)

Tokyo Story

Tokyo Story

ఇది నా కథ. మీ కథ. మనందరి కథ! జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే; అసలు అలాంటి(…)

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

యెన్నో రోజులు ఎదురు చూసాక, చివరికి ‘షిప్ ఆఫ్ థీసియస్’ చూసే అవకాశం దొరికింది. ఆ సినిమా దర్శకుడే సినిమాని ఆన్ లైన్ లో ఉంచి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. చాలా గొప్ప, అభినందనీయమైన విషయం అది. కీర్తీ , లాభాపేక్షా లేకుండా తన సినిమాని ఓపెన్ సోర్స్ పద్దతిలో ఆన్ లైన్ లో ఉంచి దాన్ని యెవరికి తోచినట్టుగా యెడిట్ చేసుకుని మరో కొత్త “షిప్ ఆఫ్ థీసియస్” తయారు చేయమనడం ద్వారా ఆనంద్ గాంధీ(…)

Paris, Texas – కలిసిన దూరాలు.

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు(…)

rosetta – గులాబీ కొమ్మ

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!!  కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల(…)

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

సంక్రాంతి రాకముందే తెలుగులో సినిమా పండగ మొదలైంది. ఈ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పెద్ద సినిమాగా “1-నేనొక్కడినే” ఈ రోజు విడుదలైంది. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమైన ఇద్దరు ముగ్గురు దర్శకుల జాబితాలో చేర్చదగ్గవాడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్, మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుగులో అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా “1-నేనొక్కడినే” పై ప్రేక్షకులు భారీ అంచనాలు(…)

One Flew Over the Cuckoo’s Nest

One Flew Over the Cuckoo’s Nest

సినిమా అంటే కేవలం కథ ఒక్కటే కాదు; అందులో చాలా విషయాలు కలిసిపోయుంటాయి. మంచి కథ సైతం చెత్త సినిమా గా తయారవ్వొచ్చు; సాధారణ కథని సైతం అద్భుతమైన సినిమాగా రూపొందిచవచ్చు. అందుకు తోడ్పడే అంశాల్లో స్క్రీన్ ప్లే రచన, కెమెరా పనితనం, ఏడిటింగ్, నటన…ఇలా చాలా ఉన్నాయి. ఇప్పటివరకూ కథాంశం ప్రధానంగానే ఈ వ్యాసాలు కొనసాగినా, ఇక నుంచి సాంకేతిక అంశాలు, తాత్విక విషయాలను కూడా చర్చించాలని ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్త ప్రయత్నం.(…)

About Elly – మనసు నాటకం

About Elly – మనసు నాటకం

కొన్ని మనం వదిలేయాలనుకుంటాం..కొత్తగా జీవించాలని ఆశపడతాం.  కానీ అవి మనని వదలవు ..అంతలోనే కొత్తవి అల్లుకుపోతుంటాయి. ఏం చేయాలోతోచదు..  అప్పుడు మనని మనమే వదిలేయాలని నిర్ణయించుకుంటాం !! తమ సమస్యని కాలం కూడా పరిష్కరించలేదని భావించిన మనిషి ఏం చేస్తాడు ??? !! ఈ సినిమా డౌన్లోడు అవుతుండగా.. మధ్యలో ఒకసారి క్వాలిటీ చెక్ కోసం ప్లే చేసాను. చూడతగ్గ క్వాలిటీ లేకుంటే డౌన్లోడు వేస్ట్ కదా అందుకే !   క్వాలిటీ ఒకే..కానీ ప్లే అవుతున్న (…)

Balak-Palak – మరాఠీ మెరుపు

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు.(…)

Getting Home

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే! కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్(…)

2013 లో తెలుగు సినిమా

2013 లో తెలుగు సినిమా

కాలం నిత్య సంచారి. ‘నిన్న’నుంచి ‘నేటి’మీదుగా ‘రేపటి’వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎనె్నన్నో జ్ఞాపకాలను, అనుభవాలను మనకు మిగులుస్తుంది. అలా టాలీవుడ్‌కు కూడా 2013 సంవత్సరం ఎనె్నన్నో తీపి కబురులను, చేదు స్మృతులను తెచ్చింది. 82 ఏళ్ళ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎదురులేని స్థానాన్ని, అంతకుమించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఈ సంవత్సరం కూడా యధాశక్తి తమ ‘పరంపర’ను కొనసాగించే ప్రయత్నం చేసాయి. ఈ 365 రోజుల(…)

Bicycle Thieves

Bicycle Thieves

జీవితమొక పద్మవ్యూహం . ఇక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఎడతెగని, అలుపెరుగని పోరాటం. అదిగో అక్కడ చూడండి! రోడ్డు మీద వందల సంఖ్యలో, నిరాశ నిస్పృహలు నిండిన కళ్లతో నీరసంగా నిలబడి ఉన్నారే వాళ్లను చూడండి. వాళ్లల్లో ఒకడిని ఎంచుకోండి. ఎవరైనా ఫరవాలేదు. దారిన పోయే అనేక మంది దానయ్యలలో ఎవరో ఒకరు చాలు. అతనే ఈ నాటి మన కథకు హీరో. ముందే చెప్పాను కదా, అతను మనందరి లాంటి వాడే! మన కథకు(…)

The Man from the Earth

The Man from the Earth

ఏది సత్యం…ఏదసత్యం…ఓ మహాత్మా…ఓ మహర్షీ!!! జాన్ ఓల్డ్‌మ్యాన్ ఒక విశ్వవిద్యాలయంలో పదేళ్ల పాటు ప్రొఫెసర్ గా పని చేసి ఒక రోజు అకస్మాత్తుగా రాజీనామా చేసేశాడు. అతనితో పాటు పని చేస్తున్న మిగిలిన ప్రొఫెసర్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపించింది. ఇంకో కొన్ని రోజుల్లో హిస్టరీ డిపార్ట్‌మెంట్ కి డీన్ గా పదోన్నతి పొందుతాడన్న విషయం దాదాపుగా ఖాయం అనుకుంటున్న సమయంలో జాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారెవరికీ అర్థం కాలేదు. జాన్ ఇల్లు ఖాళీ చేసి(…)

Welcome

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.(…)

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

జ్ఞాపకాల్నీ, మనల్నీ కలిపే దారం గజిబిజిగా ఉంది కాబట్టి కొంత నయంగానీ, కుళ్లుమోతు విధి విధించిన సంకెళ్లకి ఇలా మిగిలాం గానీ, అదే కురచైన సరళరేఖైనట్లైతేనా ఇంకెంత నరకం? తుది- మొదలు తెలిసిపోయి, రెండు కొసల చివర్లలో ఏమీలేనితనం ఎడతెగని ఖాళీలా- అవును ప్రియా! ఇప్పుడు, వీడ్కోలు చెప్పుకోవల్సిన పరిస్థితులు దాపురించిన ఈ గుబులు పొగుళ్ల గుంజాటనే ఈవలి కొస అయితే, మన కలయికకి మొదలెప్పుడు? నిజానికి మనది కలయికేనా అసలు? అదొక తత్తర బిత్తరల తమి,(…)

Lucia – స్వప్నజీవితం

Lucia – స్వప్నజీవితం

చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం. అందులో  ప్రతి కథకీ ఓ నీతి ఉండేది. అయితే రామాయణ భాగవతాల్లాంటి కావ్యాల్లోనూ..నవలల్లోనూ  ప్రతి చోటా నీతులు..జీవన సత్యాలూ , ప్రవచనాలూ అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. సినిమా కూడా విజువల్ గా చెప్పేకథే కనక దానికీ ఓ సారాంశం ఉండాల్సిందే. దీన్నే సినిమా పరంగా మనం ఇతివృత్తం/ ఫిలాసఫీ లేదా /జీవితసత్యం అంటాం.  అయితే పూర్తి వినోదాత్మక చిత్రాలలో సారాంశం గొప్పగా ఉండకపోవచ్చు. వినోదం మరుగున ఆ బలహీనమైన/కొత్తది కానటువంటి  సారాంశాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. (…)

Midnight in Paris

Midnight in Paris

నోస్టాల్జియా అంటే బాధాకరమైన వర్తమానాన్ని నిరాకరించడమేనా? వర్షం లో ప్యారిస్ నగరం కొత్త అందాలతో మెరిసిపోతోంది. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి ప్యారిస్ నగరానికి వచ్చాడు గిల్. అమెరికాలో అతనో సినిమా కథలు రాసే రచయిత. కానీ ఇప్పుడు అతనికి సినిమా కథల మీద ఆసక్తి పోయింది. ఒక నవల రాయాలన్నది అతని ఆలోచన. కథ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇక కూర్చోని రాయడమే మిగిలుంది. అతని కథలో హీరో ఒక నోస్టాల్జియా షాప్ లో(…)

Werckmeister Harmonies – ఒక చింతన

Werckmeister Harmonies – ఒక చింతన

పరిచయం: నా జీవితంలో చాలా సినిమాలు చూసాను కానీ, కొన్ని సినిమాల గురించి రాయడానికి కొంత ధైర్యం కావాలి; దానికి మించి ఎంతో అవగాహన కావాలి. ఉదాహరణకి, Tarkovsky సినిమాలు. ఇప్పటికి నేను ఆయన సినిమాలు దాదాపు అన్నీ రెండు మూడూ సార్లు చూశాను కానీ ఆ సినిమాల గురించి రాయాలంటే మాత్రం తెల్ల కాగితం పై ఒక్క అక్షరం పెట్టాలన్నా వీలుకాదు. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న ’వర్ణణాతీతం’ అనే పదం ఇలాంటి సినిమాలు చూసినప్పుడే నిజంగా(…)

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

Beyond the Hills – విశ్వాసాలకి ఆవలివైపు

దేవుడు అనేవాడుంటే మనుషుల మధ్య ప్రేమని ఒప్పుకోక కేవలం తననే ప్రేమించాలని అనుకుంటాడా ? దేవుడిని చేరాలంటే దేవుడికి అంకితమవ్వాల్సిందేనా ?? సాధారణ జీవితం గడుపుతూ దేవుడికి చేరువకాలేమా ?? బ్రహ్మచర్యం/ సన్యాసంతోనే దైవకృప దొరుకుతుందా ? ఇది ఒక విభిన్నమైన ప్రేమ కథ. మతమూ..విశ్వాసమూ..అతీతశక్తులు..అపోహల ని చర్చించే కథ. ఊరికి దూరంగా ఒకగుట్టమీద మతాశ్రమం. అక్కడ ఓ పదిమంది సన్యాసినులు.. ఒక ఫాదర్, ఇహలోకం లోని ప్రతిపనీ ఒక పాపంగా. దేవుడి ప్రేమకి పాత్రులవటమే జీవితంగా(…)

Children of Heaven

Children of Heaven

అందమైన జీవితమంటే అన్నీ ఉండడం కాదు. ఏది అవసరం లేదో తెలుసుకోవడం. సాయంత్రమైంది. ఆలీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే అమ్మ పని చెప్పింది. మొదట చిరిగిపోయిన చెల్లిలి స్కూల్ షూస్ కుట్టించుకు రావాలి. ఆ తర్వాత బేకరీ కి వెళ్లి రొట్టెలు కొనాలి. చివరిగా కూరగాయల షాప్ లో కేజీ ఆలుగడ్డలు కొనాలి. మొదటి రెండు పనులూ అయిపోయాయి. కూరగాయల షాప్లోకి వెళ్తూ చెల్లెలి షూస్ ని, రొట్టెలున్న సంచీ ని బయటే వదిలి లోపలకి(…)

ఏక్ డాక్టర్ కీ మౌత్

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే(…)

As it is in Heaven

As it is in Heaven

కళ నెరిగి, అనుభవైకవేద్యంగా తెలుసుకుంటే- దైవాన్ని ఎరిగినట్లే. పికాసో అనే చిత్రకారుడు ఒక రోజు సాయంత్రం సముద్రతీరాన నుంచొని ఒక తైలవర్ణచిత్రం చేస్తున్నాడు. అతను తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ యధాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా అని ఎందుకో అనుమానం కలిగి, ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు. అతడికే అర్థం కాని ఓ రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు పికాసో. ఆ(…)

shame – వాంచాలోలత్వం .

shame – వాంచాలోలత్వం .

ఈ సినిమా  ఏమిటీ అనేది ఒక  నిశ్చిత అభిప్రాయానికి రాలేము..  దర్శకుడు కూడా ఒక ఖచ్చితమైన ముగింపు ఇవ్వలేదు కూడా . ఇవ్వలేడుకూడా !! ఎందుకంటే ఇది కథకాదు ఏదో ఒక ముగింపు ఇవ్వటానికి. ఇందులో కథ లేదు. ఒక పాత్ర ..దాని స్వభావం అంతే ! ప్రపంచంలో  కోట్లమంది వ్యక్తులు ..ఒక్కో వ్యక్తీ తమ అభిరుచీ.ఇష్టాఇష్టాలకి అనుగుణంగా ఒక్కో ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రపంచంలో బతుకుతుంటాడు. చుట్టు మనుషులే ఉంటారు.కాని తన ప్రపంచంవేరు.పెరుగుదలతో పాటు తన (…)

Ikiru

Ikiru

జీవితం ఒక తెల్లకాగితం లాంటిది; చాలా కొద్దిమంది మాత్రమే దానిమీద తమ సంతకాలను వదిలివెళ్లగలరు. ఈయన పేరు వతానబే. ఇతనే మన కథకి నాయకుడు. ఈయనంత బోరింగ్ మనిషి ఇంకెవరూ ఉండబోరు. శాశ్వతమైన ఈ జీవన ప్రవాహంలో, తమ సంబంధమేమీ పెద్దగా లేకుండానే కొట్టుకుపోతున్న కోట్లాదిమందిలో ఈయనా ఒకడు. ఈయన ఒక ప్రభుత్వ అధికారిగా ముప్ఫై ఏళ్లకు పైగా గానుగెద్దులా, ఏ ఒక్క రోజూ శెలవు తీసుకోకుండా పని చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి బతికుండడానికి, బతకడానికి మధ్య(…)

when we leave – ఓ స్త్రీ కథ

when we leave – ఓ స్త్రీ కథ

పిల్లాడికి ఆమె కథ చెపుతోంది.  పిల్లాడు ప్రశ్నలు సందించాడు. అమ్మా మనం ఎందుకు వదిలి వెళ్ళాలి ? కొన్నిసార్లు వదిలి  దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ వాళ్లని కనుగొంటాం..వాళ్ళ ప్రేమని  కనుగొంటాం “ ” కానీ మనం వెళ్ళిపోయేటప్పుడు  ఏదోటి వదిలి వెళ్లాలి కదా ”  ఎప్పుడో తల్లి చెప్పిన మాటే తిరిగిచెప్పాడు వాడు. అవును అంది తల్లి. ………………………………………… బొమ్మగీస్తావా ? లేదు ఆడుకుంటావా ?? లేదు.. ఆకలేస్తోందా.? లేదు.. నాకు ‘అమ్మమ్మని’  చూడాలని ఉంది. …………………………………………… స్త్రీ కోరుకునేదేమిటి(…)

A Separation

A Separation

ఇది సామాన్య శాస్త్రం. ఇక్కడి సమీకరణాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.   పై ఫొటో లో ఉన్న వీరి పేర్లు సిమిన్, నాదెర్.ఇద్దరూ ఉన్నత కుటుంబాలకు చెందిన వారే! ఉద్యోగస్థులు; చాలామందితో పోలిస్తే బాగా ఉన్నవాళ్లు. పన్నెండేళ్ల కి పైగానే దాంపత్య జీవితం; పదకొండేళ్ల కూతురు. వీళ్లు నిన్నమొన్నటి వరకూ అన్యోన్య దాంపత్యంలో భాగస్వాములు; నేడు విడాకులు కావాలని కోర్టుకెక్కిన అర్జీదారులు. తమ దేశంలో కంటే విదేశాల్లోనే తమకీ, తమ కూతురుకీ సరైన భవిష్యత్తు ఉంటుందని భావించి,(…)

Dark Blue Almost Black

Dark Blue Almost Black

Azuloscurocasinegro /  Dark Blue Almost Black  is a 2006 Spanish drama film society is a collection of individuals united by certain relations or modes of behavior which mark them off form others who do not enter into these relations or who differ from them in behavior. – Ginsberg.  family is system of relationships, as a(…)

Blow-Up

Blow-Up

అంతా శూన్యమే, మనిషీ శూన్యమే ! ఉదయాన్నే వికసించి కళ్ళకు అందంగా కనిపించిన పువ్వు, సాయంకాలానికి వాడి నేల రాలుతుంది. బహుశా అశాశ్వతమైన ఆ పువ్వు అందాన్ని శాశ్వతం చెయ్యాలనుకోవడంలో కళ పుట్టి ఉండొచ్చు. ఆ పువ్వు యొక్క చిత్రాన్ని తనకి దొరికిన పనిముట్లతో కొండ గుహల్లో చిత్రీకరించి ఉంటాడు ఆదిమ మానవుడు. మానవుడి ఎదుగుదలతో పాటే ఎదుగుతూ వచ్చింది కళ. కళ్ళ ముందు కనిపించిన పువ్వు ని ఉన్నదున్నట్టుగా, ఇది నిజంగా పువ్వేమో అని అనుమానపడేంతగా(…)

smashed –  ఓ గెలుపు  కథ.

smashed – ఓ గెలుపు కథ.

                     మొదట వ్యసనం శరణార్థిలా వస్తుంది – తరవాత యజమానిలా శాశిస్తుంది. తాగినపుడు  ప్రపంచం కాళ్లకింద ఉన్నట్టనిపిస్తుంది… పెద్ద విషయం చిన్నదిగా..చిన్న విషయం పెద్దదిగా కనపడుతుంది. మనసులోని మాటలు అలా తన్నుకొస్తాయి…గుండెల్లోని ప్రేమ పెళ్ళుబుకుతుంది… కోపం కట్టలు తెగుతుంది… మనుషులని చూస్తే జాలేస్తుంది…కరుణ రసంపొంగి కన్నీళ్ళోస్తాయి.. మనమీద మనకి పిచ్చి నమ్మకం కలుగుతుంది.. ధైర్యం పొంగుతుంది.. ఆత్మవిశ్వాసం నాలుగింతలవుతుంది… కవిత్వం నోటివెంట పారుతుంది. కొత్తబాషలు వచ్చేస్తాయ్.. మొత్తంమీద మనకి మనం ఒక కొత్త మనిషిలా, మనం  ఎలా(…)

edge of heaven – LOVE

edge of heaven – LOVE

ఇది మనుషుల మనసుల్లో దాగున్న ప్రేమ కథ. ఓ తండ్రి కొడుకును ప్రేమిస్తుంటాడు.. ఆ కొడుకు తన  తండ్రిని ప్రేమిస్తున్నాడా ?? ఓ తల్లి కూతురిని ప్రేమిస్తుంది .. మరి ఆ కూతురు తన తల్లిని ప్రేమిస్తూందా ?? ‘ప్రేమ’ మానవసంభందాల్లో ముఖ్యమైనది, అందులోనూ  పిల్లల మీది వాత్సల్యం. తల్లి దండ్రులు పిల్లలని  కనీ పెంచి పోషిస్తారు.చదువు చెప్పిస్తారు,ప్రయోజకులని చేస్తారు, చేయాలని కలలు కంటారు. కానీ పిల్లలకి,  కొన్ని కారణాలవల్ల తమ తల్లిదండ్రుల  ప్రవర్తనో..చేసే పనులో..ఉద్దేశాలో ..మరోటో  నచ్చక పోవచ్చు. దాంతో వాళ్లకి(…)

Grave of the Fireflies

Grave of the Fireflies

మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం చూతము రారండి సెప్టెంబర్ 21, 1945. నేను ఆఖరి శ్వాస విడిచింది ఆ రోజు రాత్రే! రైల్వే స్టేషన్లో జనాల హడావుడి. ప్లాట్‍ఫాం పై ఒక మూల కూర్చుని ఉన్నాను. ఒంట్లో నీరసం. అక్కడ్నుంచి అడుగు వెయ్యలేని దుస్థితి. ఎంత సేపు అక్కడ కూర్చున్నానో, ఎప్పుడు నా ప్రాణం పోయిందో కూడా తెలియదు; దిక్కులేని చావు చచ్చిన నా శవాన్ని అసహ్యంగా చూస్తూ జనాలు ముందుకు కదుల్తున్నారు. ప్లాట్‍ఫాం శుభ్రపరిచే ఒకతను నా(…)

The lunch box –  taste of life

The lunch box – taste of life

ఓ నడివయస్కుడు ! ముప్పై అయిదేళ్ళ గానుగెద్దుబతుకు.. తోడులేని జీవితం.. అదే ఆఫీసు..అదే పని..అదేతిండి.. అదే ఒంటరితనం. ఓ ఇల్లాలు ! ఆదరాబాదరాగా పాపని స్కూలుకి పంపటం.. భర్తకి క్యారేజీ పంపించటం..పైఅంతస్తులో ఉండే ముసలమ్మతో నాలుగు మాటలు..భర్త రాకకోసం , ఆపై అతని ప్రేమ కోసం వేచిచూడటం..కమ్మగా వండి భర్తని దగ్గరచేసుకోమన్న ముసలమ్మ సలహా తో చక్కగా కొత్తరుచులు వండి  పంపిన క్యారేజీ అడ్రస్ మారి అది అతనికి చేరింది. అతడా  రోజు ఆఫీసులో భోజనానికి కూర్చుని(…)