రచయితలు

కొత్తపాళీ

View this author's posts

General Info

Real Name: కొత్తపాళీ
Member Role: Contributor
Member Since: December 17, 2007 | 3:44 pm

About me

పుట్టిందీ, ఇంటరుదాకా చదివిందీ విజయవాడలో. మెకానికల్ ఇంజనీరింగు చదువు వరంగల్లో మొదలై, కాంపూరులో సాగి, ఫిలడెల్ఫియాలో ముగిసింది. ఫిలడెల్ఫియాలో రిట్జ్ సినిమా హాళ్ళలో పలు అంతర్జాతీయ సినిమాలు చూశాకే సినిమాల గురించి నాకో అభిరుచి ఉందని తెలుసుకున్నా. అందుబాటులోనే అంతర్జాతీయ సినిమాల విడియో షాపు ఉండటం ఈ అభిరుచి పెరగడానికి దోహదం చేసింది. అదే తరవాత ఏనార్బర్, మిషిగన్ లో కొనసాగింది.
అన్ని రకాల సినిమాలూ చూస్తా ... లార్డాఫ్ ద రింగ్స్ నించీ పల్ప్ ఫిక్షన్ దాకా, ఇటు అర్జెంటీనా నించీ అటు జపాన్ దాకా .. ఒక పద్ధతి ప్రకారం చూడను. అభిమాన దర్శకులూ నటులూ అంటూ ఎవరూ లేరు. చాలా సార్లు చూసిన సినిమాల, దర్శకుల పేర్లు గుర్తుండి చావవు. సినిమా చూడంగానే నాకోసం నేను ఒక చిన్న రివ్యూ రాసుకోవాలని చాలా సార్లు అనుకున్నా గానీ ఆచరణలో పెట్టలేదు. ఇప్పుడు బ్లాగుల పుణ్యమా అని కొంత రెగ్యులర్ గానే చూసిన సినిమాల గురించి రాస్తున్నా.
http://vinnakanna.blogspot.com

Where to contact

Website: navatarangam.com

Recent user posts:

Latest comments on:


Comments are closed.