Menu

Yashwanth Aluru Archive

Children of Heaven – ఓ అందమైన సమస్య

కళాభిమానానికి భాష, ప్రాంతం లాంటివి ఎప్పుడూ ఎల్లలు కావు. ఒకప్పుడు సినిమాలు చూడడం హాబీగా ఉన్న నాకు అది అలవాటుగా మారిన తరుణంలో, ఆ అలవాటు ఆంధ్ర దేశాన్ని దాటి, భారతదేశాన్ని దాటి అమెరికా వరకు చేరింది. ఇవే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లోనూ సినిమాలు చూసే అలవాటు జనాలకు ఉందని తెలిసింది. అలా ఓ స్నేహితుడి సిఫార్సుతో చూసిన మొదటి “ఇరానీ” చిత్రం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”. “మజిద్ మజిడి” దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని

19th ICFFI – Dummie De Mummie

భాగ్యనగరం వేదికగా ఈ ఏడాది జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పలు దేశాలకు సంబంధించిన చిత్రాలు ఈ నెల 14వ తేది నుండి పలుచోట్ల ప్రదర్శించబడుతున్నాయి. వాటిలో 15వ తేది ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలోని శివపార్వతి ధియేటరులో నెథర్లాండ్ కు చెందిన “Dummie De Mummie” ప్రదర్శించబడినది. “టోస్కా మెంటన్” (Tosca Menten) అనే డచ్ రచయిత్రి రచించిన “Dummie De Mummie” అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి “టిస్ వాన్ మార్లే”

మైత్రి (2015) – ఓ గౌరవనీయమైన చిత్రం

వాణిజ్యపరంగా మిగతా దక్షిణ చిత్ర పరిశ్రమలకంటే వెనుకబడిన పరిశ్రమని, మూస చిత్రాలు ఎక్కువగా వస్తాయని కన్నడ చిత్ర పరిశ్రమ మీద విమర్శలున్నాయి. నేను ఎక్కువ కన్నడ చిత్రాలు చూడలేదు. నేను చుసిన మొదటి చిత్రం “చార్మినార్” (తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ). కొన్ని రోజులుగా “మైత్రి” అనే చిత్రం గురించి వింటూనే ఉన్నాను. విమ్మర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు చూడటం జరిగింది. మైత్రి ఓ ద్విభాషా చిత్రం. కన్నడ మరియు

ముకుంద (2014) – స్పష్టత లేని సహజత్వం

సినిమాకు కొన్ని ప్రమాణాలు అవసరం. మరికొన్ని ప్రమాణాలు అత్యంత అవసరం. ఈ మధ్య వచ్చే చిత్రాల్లో “అత్యంత అవసరం” నుండి “అవసరం” కు వెళ్ళిన మొదటి ప్రమాణం “కథ“. కథ లేకపోయినా “కథనం” బాగుంటే విజయం సాధించవచ్చు అని కొన్ని చిత్రాలు నిరూపించాయి. ప్రస్తుత చలనచిత్రాలకు కథకన్నా కథనమే ముఖ్యమైనది. దానికి సహజత్వం, స్పష్టత తోడై ప్రేక్షకుడు పాత్రల్లో తనను, కథనంలో తన జీవితాన్ని చుసుకోగలిగేలా చేస్తే అభినందనలు తప్పవు. అలాంటి ప్రమాణాలతో చిత్రాలు తీసే దర్శకుల్లో శ్రీకాంత్ అడ్డాల

జగమంత కుటుంబం – ఆనంద్ (1971)

 మనిషి జీవితంలో అనుకోని అతిథి “మృత్యువు”. కానీ దాని రాక ముందే తెలిసినప్పుడు దానికి ఆనందంగా ఆహ్వానం పలకాలి, అప్పుడే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఈ అంశాన్ని సూటిగా స్పృశించిన చిత్రం “ఆనంద్”. “హృషికేష్ ముఖర్జీ” దర్శకత్వంలో “రాజేష్ ఖన్నా”, “అమితాబ్ బచ్చన్” ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ చిత్రం అప్పుడప్పుడే పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమితాబ్ ను మంచి పాత్రతో పాటు పురస్కారాలను సైతం ఇచ్చి నిలబెట్టింది. మొదట ఈ చిత్రంలోని పాత్రలకు కిషోర్ కుమార్,