Menu

Yashwanth Aluru Archive

ఎన్న నిండె మోయిదీన్ (Ennu Ninte Moideen) – ఓ జ్ఞాపకంలాంటి సినిమా

“హిట్టైనా, ఫ్లాపైనా, సినిమా అనేది ఒక అనుభవంగా మిగిలిపోవాలి” అన్నది దర్శకుడు “రాంగోపాల్ వర్మ” ఎప్పుడో చెప్పిన ఒక మాట. అనుభవానికి తదుపరి దశ “జ్ఞాపకం”. “అనుభవం” ఓ క్షణాన పుట్టి మరికొన్ని క్షణాలకు నశిస్తుంది. గొంగళిపురుగులాంటి ఆ క్షణాల అనుభవం సీతాకోకచిలుకలాంటి జ్ఞాపకంగా మారి మనసు మూలల్లో తన రంగుల రెక్కలు విప్పి చాలాకాలం విహరిస్తూనే ఉంటుంది. ఈ దశలను చవిచూపించిన సినిమాలలో “ఎన్న నిండె మోయిదీన్” ఒకటి. ఓ సీతాకోకచిలుక గుడ్డు మూడు దశలు

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారింది. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కావడం లేదంటే, దాని వెనుక పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో

కాపీ సినిమా

నాకు బాగా గుర్తు! 2009లో “మగధీర” సినిమా వచ్చిన రోజులవి. అందులో, కాలభైరవ వందమంది యోధులతో చేసిన పోరాటం చూసి అబ్బురపోయి ఓ స్నేహితునితో దాని గురించి ఉత్కంఠతో చర్చించే సమయంలో, ఆ స్నేహితుడు అన్నాడు “ఆ సన్నివేశం 300 అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టాడు రాజమౌళి!” అని. అంతే, అప్పటివరకున్న ఉత్సాహం నీరుగారిపోయింది. 1000 మంది ఒక థియేటర్లో ఓ సినిమా చూస్తుంటే అందులో 999 మంది సినిమాను ఆస్వాదిస్తుంటే, ఎక్కడో ఓ

తమాషా (2015) – జీవితం అనే తమాషా కథకు ఓ తమాషా కథనం

ప్రతి కథకు ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకరు కథకుడు, మరొకడు ప్రేక్షకుడు. కథనాలు రెండు రకాలు. ఒకటి బాహ్య కథనం, మరొకటి ఆత్మాశ్రయ కథనం. వీటినే ఇంగ్లీషులో ఆబ్జెక్టివ్ నెరేషన్ మరియు సబ్జెక్టివ్ నెరేషన్ అంటారు. ఆబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు కూడా ఓ ప్రేక్షకుడే. అతడి కళ్ళముందు జరిగిందే అతడు చెబుతాడు, అది ప్రేక్షకుడు వింటాడు. ఉదాహరణకు, టీవీలో విలేఖరి కథనం. సబ్జెక్టివ్ నెరేషన్ లో కథకుడు తన కథను ఓ పాత్ర కోణంలోంచి చెబుతాడు. లేదా ప్రేక్షకుడు కథనాన్ని ఓ

నేను.. శైలజ… (2016)

“మనకు నచ్చిన సినిమాలు చేయడం కాదు, మనకు నప్పే సినిమాలు చేయాలి!” అనే మాట ఎక్కడో ఎవరో చెప్పినట్టు నాకు జ్ఞాపకం. “రామ్” విషయంలో ఈ వాక్యం అక్షరాల ఋజువైంది. “పండగ చేస్కో”, “శివమ్” లాంటి మూస సినిమాలతో విసిగించేసిన రామ్ ఈసారి ఓ చక్కని పసందైన ప్రేమకథతో వచ్చాడు. అదే, కీర్తి సురేష్ తో జంటగా నటించిన “నేను..శైలజ..”. 2015 ఆఖరులో వచ్చిన చెత్త సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కూడా 2016 మొదట్లో ఓ మంచి