News back to homepage

పట్టువదలని విక్రమార్కుడు

విక్రమార్కుడు నీరసంగా తలపట్టుకుని శక్తి సినిమా మొదటి షో నుండి బయటకువచ్చాడు. తన ఇంటి వరకు నడవాల్సిన దూరం తలచుకుని బాధపడ్డాడు. టికెట్ బ్లాకులో కొనటం వల్ల బస్ టికెట్ కి కూడా డబ్బుల్లేవ్. ఇంతలో తను మొయ్యాల్సిన భారం గుర్తుకు వచ్చింది. అటు ఇటు చూశాడు. ఎక్కడా కనబడలేదు. ఈసురోమంటూ బయటకు వచ్చాడు. అప్పుడతనికి శవం కనబడింది సినిమా హాల్ గుమ్మానికి వేలాడుతూ. శక్తిసినిమా శవం..అన్నిరకాల రిపోర్ట్ లతో తూట్లుపడిన శవం.. వాసనకి జనం భయపడి [...]

khamoshi 1969 – ఖామోషీ

అది ఓ పిచ్చి ఆసుపత్రి. డాక్టర్ కల్నల్ సాబ్ – నసీర్ హుస్సేన్, ఆక్యూట్ మానియా ట్రీట్ చెయ్యడానికి ఓ వినూత్న పద్దతి ఉపయోగిస్తాడు. ప్రతి పిల్లవాడు తన తల్లి దగ్గర నుంచి పరిధులు లేని ప్రేమ కోరుకుంటాడు. ఆమె నుంచి దూరమైన తర్వాత అదే రకమైన ప్రేమ కోసం తపిస్తాడు. అది దొరకనప్పుడు పిచ్చివాడైపోతాడు. అలాంటి ప్రేమ దొరికినప్పుడు తిరిగి మామూలు అవుతాడు. అటుంటి పేషంట్ అరుణ్.. అదే మన రాజేష్ ఖన్నా.. ఓ రచయిత.. [...]

dragon హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్

ఛ ఈ వయసులో కార్టూన్/యానిమేషన్ సినిమాకి ఒక్కడినే వెళ్ళటం ఏమిటి అనుకున్నా. యుఎస్ న్యూస్ లో రివ్యూ బాగుండటం పైగా నా ఫ్లయ్ ట్ కి చాలా టైం ఉండటం తో సర్లే పద అనుకుని ఈ సినిమాకు వెళ్ళాను. 3డి అనుకుని వెళ్ళా కాని ఆ ధియేటర్ లో నార్మల్ ఫార్మాట్ లోనే చూడాల్సి వచ్చింది. అద్బుతం అమోఘం అని చెప్పక తప్పదు. చాలా రోజుల తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో కూర్చుని [...]

road-to-sangam రోడ్ టు సంగం

ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు. పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని సీన్లలో గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ ని చూడచ్చు. తప్ప మిగతా నటులెవ్వర్ని చూడలేదు. కాని ప్రతీ పాత్ర తీర్చి దిద్దినట్లున్నాయి ఓ ఇంగ్లీష్ సినిమా లోలాగా. పరేష్ [...]

noise పాటల పారడీ

ఎన్నో చిత్రాలు వస్తున్నాయి పోతున్నాయి. కొన్ని రోజులు తర్వాత కధలూ, సినిమా పేర్లు మర్చిపోతున్నాము. కాని మంచి పాటలను మాత్రం నెమరు వేస్తూనే ఉంటాము. కొన్ని పాటలు దశాబ్దాలు గడచినా కమ్మగా పాడుకుని ఆనంద పడతాము. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. సలలిత రాగ సుధా(నర్తనశాల).. నీలీల పాడెద దేవా (మురిపించే మువ్వలు) వివాహ భోజనంబు (మాయాబజార్) ఇది మల్లెల వేళ యని (సుఖదుఖాలు) కళ్ళలోకళ్ళు పెట్టి చూడు (భలేమాష్టారు)మామిడి కొమ్మ మళ్ళీ మళ్ళీ (రాము) గోదారి [...]

3-idiots ముగ్గురు మూర్ఖులు

మరి తెలుగు లో రీమేక్ చెయ్యబడుతున్న త్రీ ఇడియట్స్ కి ఇంత కన్న మంచి పేరు నాకు తోచటంలేదు. నవతరంగంలో ఈ సినిమా గురించి ఎవ్వరు రాయకపోవటం కూడా ఆశ్చర్యంగాను ఉంది. ఇది అవుట్ అండ్ అవుట్ అమీర్ ఖాన్ సినిమా. మాధవన్, షెర్మాన్ జోషి చక్కగా నటించినా అమీర్ నటనలో వాళ్ళిద్దరిని పక్కకి తోసేశాడు. గజని లో నటించిన అమీర్ ఇతనేనంటే నమ్మశక్యంగా లేదు.40+ అమీర్ 20- రాంచో గా చక్కగా సరిపోయాడు. 8 పాక్ [...]

wp-1naaoopiri800 నా ఊపిరి . ఇన్ రెట్రో..

వీడెవండీ బాబూ. సినిమా వచ్చిన నాలుగేళ్ళకి రివ్యూ రాస్తున్నాడు అనుకొంటున్నారా. వాకు గుర్తు వుండి నేను ఈసినిమా రివ్యూ చదవలేదు. సినిమా వీడియో కూడా తీసుకుందామా వద్దా మా ఆవిడ ఓ రెండు డాలర్లు వేస్ట్ చేశారని తిడుతుందేమోనని భయపడుతూ తీసుకున్నా. కాని సినిమా చూసినతర్వాత డివిడి కొనుక్కునేంతవరకు నిద్ర పట్టలేదు. వడ్డేనవీన్ నటన, అతని పాత్ర చాలారోజులు గుర్తు ఉండిపోయాయి. ఇక్కడ డివిడి దొరకలేదు. ఇండియా వెళ్ళి విజయవాడ లో డివిడి గురించి అన్ని షాపులూ [...]

pattabhi సంస్కార – 1970

ఈ సినిమా నేను చూసి 35 సంవత్సరాలు గడచిపోయాయి. అయినప్పటికి ఏమాత్రం మర్చిపోలేదు. అంత చక్కని సందేశం ఉన్న సినిమా ఇది. గిరీష్ కర్నాడ్ మొదటి సినిమా అని గుర్తు. తప్పయితే ముందే క్షమార్హుడిని. పట్టాభిరామరెడ్ది దర్శకత్వం చిత్రా రామమనోహర నిర్మాత. ఓ కుగ్రామంలో చంద్రప్ప అనే బ్రాహణ తిరుగుబోతు ఉంటాడు. తాగుతూ వ్యభిచరిస్తూ ఊరు బయటే ఉంటాడు. అందరు అతన్ని వెలివేసి తప్పించుకు తిరుగుతూంటారు. అటువంటి వాడు ఒకరోజున చచ్చిపోతాడు. అతనికి ఎవరు కర్మకాండ చెయ్యాలనేదే [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories