Menu

venkat Archive

Tokyo Story

ఇది నా కథ. మీ కథ. మనందరి కథ! జపనీస్ సినిమా అనగానే సాధారణంగా అకిరా కురసావా పేరే గుర్తొస్తుంది. అకిరా కురసావా తో పాటు యసుజిరో ఓజు మరియు కెంజి మిజొగుచి లు కూడా జపనీస్ సినిమాకే కాకుండా ప్రపంచ సినిమా చరిత్రలో తమకంటూ ఒక స్థానాన్ని కల్పించుకున్నారు. వీరు ముగ్గురిని జపనీస్ సినిమా స్వర్ణయుగపు నాటి త్రిమూర్తులుగా వర్ణించవచ్చు. వీరి ముగ్గురిలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడం కష్టమే; అసలు అలాంటి

నవతరంగం కి సహాయం చేయండి.

నవతరంగం పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరేళ్ల క్రితం, నవతరంగం వెబ్సైట్ మొదలుపెట్టినప్పుడు ఇన్నాళ్లపాటు నడుస్తుందని ఊహించలేదు. కానీ నవతరంగం సభ్యులు, పాఠకులు, అభిమానుల ప్రోత్సాహంతో విజయవంతంగా ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల పాటు ఆదరాభిమానాలు చూపించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఏడేళ్లే కాదు సినిమా ఉన్నంతవరకూ నవతరంగం ఉండాలనేది మా ఆకాంక్ష. అయితే నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. ఆరు సంవత్సరాల పాటు నవతరంగం నిర్వహణలో

1:నేనొక్కడినే

ప్రేమంటే ఏమిటి? ఒంటరితనం వల్ల వచ్చే భయాన్ని పోగొట్టి ప్రశాంతతనిచ్చే ఆసరా. భయమంటే ఏమిటి? ఆ ఆసరాని కోల్పోతామేమోనన్న మానసిక భావన. మనిషి ఎప్పుడూ తోడు కోరుకుంటూ ఉండేది అందుకే – మొదట తల్లిదండ్రుల నుంచీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళ నుంచీ, తరువాతి కాలంలో స్నేహితులనుంచీ, ఆపై జీవిత భాగస్వామినుంచీ, చివర్న బిడ్డలూ మనవలనుంచీ. మరి అలాంటిది, ఒక వ్యక్తికి వీళ్ళెవ్వరూ లేకపోతే? జీవితం మొదట్లోనే అతను తల్లిదండ్రులని కోల్పోతే? అదీ ఇంకెవ్వరో వాళ్ళని తన కళ్ళముందే చంపటం

1:నేనొక్కడినే – కమర్షియల్ తెలుగు సినిమా కీర్తి కిరీటంలో మేలిమి రత్నం

సంక్రాంతి రాకముందే తెలుగులో సినిమా పండగ మొదలైంది. ఈ సంవత్సరంలో వచ్చిన మొట్టమొదటి పెద్ద సినిమాగా “1-నేనొక్కడినే” ఈ రోజు విడుదలైంది. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమైన ఇద్దరు ముగ్గురు దర్శకుల జాబితాలో చేర్చదగ్గవాడిగా పేరు తెచ్చుకున్న సుకుమార్, మంచి ఫామ్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెలుగులో అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా “1-నేనొక్కడినే” పై ప్రేక్షకులు భారీ అంచనాలు