Menu

venkat Archive

సత్యమే శివం

పరిచయం కదిలే బొమ్మల కళా రూపం. కలలని సైతం కళ్ళ ముందుంచగలిగే అద్భుతం. బొమ్మలకు ప్రాణం పోయగల ఔషధం. ఊహకందని ప్రపంచంలోకి ఇట్టే మనల్ని లాక్కెళ్లిపోగల సాధనం సినిమా. సినిమా అమృతం కాదు. క్యాన్సర్ ని నయం చేయలేదు. కానీ జీవితాన్ని కాపాడే శక్తి కలదు. సినిమా తో బంగారం తయారు కాదు. కానీ మేధస్సుని మేలిమి బంగారంలా మెరిపించగలదు. సినిమా ద్వారా అంతిమ జ్ఞానం పొందలేము. కానీ జ్ఞాననేత్రాన్ని తెరిపించగలదు. నేను రోజు వారీ కూలీనో,

పూజాఫలము

పగటి పూట వెన్నెల – ఒక అందమైన అబద్ధం. “కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులని రెచ్చకొట్టకూడదు. ఉత్తమ వులువలని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేసిన బి.ఎన్.రెడ్డి తెలుగు సినీరంగంలో ఓ చరిత్ర. ఆయన తీసింది పదకొండు సినిమాలే అయినా అందులో ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. ఆయన తీసిన చిత్రాల్లో అందరికీ నచ్చిన చిత్రాలు కొన్నయితే,

Citizen Kane

మోక్షము గలదా? భువిలో జీవన్ముక్తులుగాని వారలకు “సిటిజెన్ కేన్”. ఈ సినిమా పేరు తెలియని ప్రపంచ సినిమా అభిమానులు ఉండరు. ఈ సినిమా తెలియనివారెవరైనా ఉన్నారంటే వారికి ప్రపంచ సినిమా గురించి ఇంకా అంత పరిచయం లేకుండా ఉండి ఉండాలి. వందేళ్లకు పైబడ్డ చలనచిత్ర చరిత్రలో నెంబర్ వన్ సినిమా ఏదంటే ఠక్కున నోటికొచ్చేది ఈ సినిమా పేరే! నేటికీ ఏ ప్రపంచ చలనచిత్రకారుడ్ని అడిగినా దాదాపు అందరూ ఏకకంఠంతో నెంబర్ వన్ సినిమా గా అంగీకరించే

My dinner with Andre

సినిమాలలో “మై డిన్నర్ విత్ ఆంద్రే” సినిమా వేరయా!!! సాయంత్రం ఏడయింది. షాన్ తన ఇంటి నుంచి బయల్దేరాడు. అతని మనసు పరిపరివిధాలా ఆలోచిస్తోంది. ఆ ఆలోచనల ప్రభావం అతని మొహం మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆందోళన నిండిన మొహంతో షాన్ రైల్వే స్టేషన్ వైపు నడిచాడు. నడుస్తున్నంత సేపూ అతనికి ఎంతో పరిచయమైన ఆ నగరం ఎప్పటిలానే పలకరించింది. కానీ షాన్ ఇవేవే పట్టించుకునే స్థితిలో లేడు. నాటక రచయితగా కొద్దో గొప్పో పేరున్నా ఇప్పుడు