Menu

srinivas Archive

అరువి – ఉప్పొంగే జలపాతం

ఈ మధ్య కాలంలో తమిళనాట అధికంగా మాట్లాడబడిన సినిమా ఇదే. కొన్ని సినిమాలను ఆస్వాధించగలం కాని దాని భావాన్ని విరివిగా మాటల్లో చెప్పలేం. కాని అది దాని ముగింపులో మనపై బలమైన ముద్రను వేస్తుంది. మన మనస్సు పొరల్లో చెరగక నిలిచిపోతుంది. అటువంటి కోవకు చెందినదే ఈ చిత్రం. మనలో చాలా మంది తప్పులు చేసేందుకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, అందులో  అయినవాళ్లే మనల్ని అపార్ధం చేసుకోవడం, దాని మూలంగా నిరాదరణకు గురి కావడం అనేది ఓ ప్రధాన

2016 లో చూడదగ్గ తెలుగు చిత్రాలు

నేను శైలజ :   రామ్ వరుస పరాజయాల తర్వాత తన ఖాతాలో ఓ మోస్తరుగా హిట్  దక్కించుకున్న  చిత్రం. దేవి శ్రీ ప్రసాద్  పాటలు అలరిస్తాయి. విఫల ప్రేమికుడిగా రామ్ ఆకట్టు కుంటాడు, ప్రదీప్ రావంత్ పాత్ర కొంచెం వెరైటీ గా ఉంటుంది. కామెడీ ,ప్రేమ, కుటుంబ విలువలు నేపధ్యంగా సాగే ఈ చిత్రం ఫామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిల్లింగ్ వీరప్పన్ : ఐస్ క్రీం, 365  వంటి చిత్రాల పరాజయం తర్వాత రామ్ గోపాల్ వర్మ

దంగల్ – ఒక తండ్రి కన్న కల

సృష్టిలో ప్రతి జీవికి జననం, జీవనం, మరణం ఇత్యాది మామూలే. అయితే మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణాలు   విచక్షణా జ్ఞానం ,నిర్దిష్ట లక్ష్యాలు, సంకల్పాలు,భావోద్వేగాలు. అనునిత్యం తన ఉనికిని నిరూపించుకొనేందుకు చేసే  పోరాటం ,ఒడిదుడుకులు, వైఫల్యాలు,  అంతిమంగా విజయ శిఖరాలను అధిరోహించడం. కలలు అందరూ కంటారు ,అయితే వాటిని సఫలీకృతం చేసుకునే దిశగా తీవ్రమైన సంకల్పంతోను, కృషితోను కొంతమంది మాత్రమే ముందుకు సాగిపోతారు. దాని మూలంగా ఓ వ్యక్తి కొన్ని సార్లు  సంఘంలోని వ్యక్తుల

మద్రాస్- గోడ కథ

అలెగ్జాండర్ మొదలు కొని అడాల్ఫ్ హిట్లర్ వరకు ప్రపంచ చరిత్రలో జరిగిన యుద్దలు అన్నిటికి కారణం ఒకటి ఆధిపత్యం కోసం అయితే మరొకటి అధికారం కోసం. ఈ యుద్ధాలు మూలంగా అభ్యున్నతి కంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగిన దాఖాలాలే ఎక్కువ.ఈ యుద్ధాలకు మూలం ఆధిపత్యం , అధికార వాంచ అయినప్పటికి వాటికి ఆజ్యం పోసింది మాత్రం కుట్రలు,కుతంత్రలు,రాజకీయ లబ్ది,ద్రోహాలు, వెన్నుపోట్లే.ఇవి ఒక దేశ అభ్యున్నతికి నిత్యం అడ్డుగోడలుగానే నిలుస్తాయి. సరే ఇక మన కథకి వస్తే ‘మద్రాస్’, ఇది తమిళుల రాజధాని అయినటువంటి ఒకప్పటి

కిరుమి – సమస్యకు పరిష్కారం

ప్రతి సమస్యకు ఎదురు వెళ్ళే పరిష్కరించాలనే ఆవశ్యకత ఏమి లేదు. కొన్ని సార్లు తప్పుకోవడానికి పేరే గెలవడం అంటే.మన ఉనికిని మనం కాపాడుకోవడానికి కొన్ని సందర్భాలలో మనల్ని మనం  తగ్గించుకోవడం  తప్పేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఈ కథలోని అంతరార్ధం. దీన్ని ఆధారం చేసుకొనే  ఈ కథ మొత్తం నడుస్తుంది. తమిళంలో కిరుమి అంటే  తెలుగులో సూక్ష్మజీవి అని అర్ధం.