|
నంది విజేతలకు..అభినందనలు
2008 సంవత్సరానికి గాను నంది చలన చిత్ర పురస్కారాలను ప్రకటించారు. నంది ఫిల్మ్ అవార్డుల కమిటి ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ ఆధ్వర్యంలోని జ్యూరీ బృందం ప్రతినిధులు సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.మొత్తం ఏడు విభాగాల్లో అవార్డుల ఎంపిక కోసం ఎంట్రీలు స్వీకరించామని, జ్యూరి ప్రతినిధులు పలుమార్లు సమావేశమై అన్ని కోణాలను క్షణ్ణంగా పరిశీలించి ఉత్తమమైన వాటిని మాత్రమే అవార్డులకు ఎంపిక చేసామని ఈ సందర్భంగా చెప్పారు. ఉత్తమ చిత్రం : గమ్యం ద్వితీయ [...] |
|
బెండు అప్పారావు(రివ్యూ)
అప్పుల అప్పారావు,ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామిడీలు తీసిన ఇవివి కొత్త సినిమా రిలీజ్ అంటే ఉషారే. అయితే ఫిటింగ్ మాస్టర్,పెళ్లయింది కానీ..అంటూ వదిలిన సినిమాలు గుర్తుకు వచ్చి కాస్త భయం కలిగిన మాట వాస్తవం. అయితే ఆయన పాత సినిమాలతో పోల్చదగినదీకాదు.. మరీ అంత రోత పుట్టించే వ్యవహారం కాదు..ఈ బెండు అప్పారావు. ట్రీట్ మెంట్ (స్టోరీ)సమస్యగా వచ్చినా డైలాగులతో లాక్కెళ్ళిపోయాడు.అయినా ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు అన్నట్లు..వరసగా వస్తున్న [...] |
|
హా..మహాత్మా!!( రివ్యూ)
బ్యానర్: గోల్డెన్ లయిన్ ఫిలింస్ నటీనటులు: శ్రీకాంత్, బావన,జయప్రకాష్ రెడ్డి,ఉత్తేజ్,రామ్ జగన్,పరుచూరి వెంకటేస్వరరావు,జ్యోతి,ఆహుతి ప్రసాద్ తదితరులు. సంగీతం: విజయ్ ఆందోని కెమెరా: శరత్ ఎడిటింగ్ : శంకర్ ఫైట్స్ : విజయ్ డైలాగులు: పరుచూరి బ్రదర్శ్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కృష్ణవంశి నిర్మాత: సి.ఆర్.మనోహర్ రిలీజ్ డేట్: 09,అక్టోబర్ 2009 శశిరేఖా పరిణయం చూసాక ఇక కృష్ణవంశి సినిమాలు చూడకూడదని ఒట్టు పెట్టుకున్నా..అయితే మహాత్మా టైటిల్,పోస్టర్స్ చూసాక మనసాగక..మాట తప్పి ధియోటర్లో అడుగుపెట్టా..అయితే అందుకు తగిన ఫలితం స్పష్టంగా [...] |
|
రాజన్ పి.దేవ్ మృతి
ఆది,ఖుషి,యోగి వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన మళయాళ నటుడు రాజన్.పి.దేవ్ ఈ రోజు (బుధవారం)ఉదయం కొచ్చిన్ లో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా లివర్ సమస్యతో భాదపడుతున్నారు. నోటి నుండి రక్తం పడటంతో ఆయనను లేక్ షోర్ హాస్పటిల్ జాయిన్ చేసారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే ఆయన ప్రాణం పోయింది. రాజన్ పి.దేవ్ వయస్సు 58 సంవత్సరాలు. ఎనభైల్లో విలన్ గా సినిమాల్లో ప్రవేశించిన ఆయన తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో [...] |
|
కరెంట్-సమీక్ష
ఓ ఫైన్ మార్నింగ్ వర్షం కురుస్తూండగా…మీ ప్రేయసి వచ్చి ..నువ్వే నాలో ప్రేమను మొలకెత్తించావు కాబట్టి నువ్వే నాలో ప్రేమను తీసెయి..అంటే మీరేం చేస్తారు..కంగారుపడి ఓ తింగరి చూపు చూస్తారు..లేదా ఆమెకు మానసికంగా ఏదన్నా సమస్య ఉందేమోనని అర్జెంటుగా డౌట్ తెచ్చేసుకుంటారు. అయితే ఈ రెండూ పనులు చేయక క్యాజువల్ గా ఆమెలో ప్రేమను తీసేయటానికి రెడీ అయ్యే హీరో కథే కరెంట్.మొదట ఇంటర్వెల్ పాయింటు అనుకుని ఆ తర్వాత దానికి పైనా క్రిందా కథ అల్లేసికుని [...] |
|
వర్మ నిర్మాతగా మీ దర్శకత్వంలో…
రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా మీరు దర్శకుడు కావాలనుందా .. అయితే ఇది మీకోమే అంటున్నారు వర్మ.ఆయన తాజా చిత్రం అజ్ఞాత్ (తెలుగులో అడవి)సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను అందిస్తున్నారు. యు.టివి వారితో కలిపి రూపొందించిన ఈ కాంటెస్ట్ లో పాల్గొనాలంటే మీరు చేయవల్సిందల్లా కేవలం ఓ షార్ట్ ఫిల్మ్ ని రూపొందించటమే. అయితే ఆ షార్ట్ ఫిల్మ్ భయపెట్టాలి లేక షాక్ కు గురిచెయ్యాలి లేదా ఆశ్చర్యపరచాలి అంటున్నారు [...] |
|
‘బోణి’(రివ్యూ)
ఏం పులిహోర సెంటర్ పెట్టాలనుకునే వాడు హీరో కాదా..ఎప్పుడూ రొట్టకొట్టుడు కథలేనా..కాస్తంత క్రియేటివిటీతో ఆలోచిస్తే మన చుట్టూ ఎన్నోకథలు..వాటిని తెరపై చక్కగా ప్రెజెంట్ చేస్తే చాలు..అని నమ్మి,నమ్మించిన ఎన్నారై దర్శకుడు రాజ్ పిప్పళ్ళ ..నిర్మాతను ముంచినట్లే కనపడుతోంది. అంతేగాక బోణి అనే వెరైటీ టైటిల్ పెట్టి,మళ్ళీ ఆ అక్షరాలను చింతగింజలు ఆకారంలో డిజైన్ చేసి సినిమా చూస్తే తెలుస్తుంది ఆ చింతగింజలకూ,కథకూ ఉన్న లింకేంటో అని గంభీరంగా స్టేట్ మెంట్ ఇచ్చి..చివరకు ప్రేక్షకులుకు రెండు గంటలు బోర్ [...] |
|
కావ్యాస్ డైరీ-సమీక్ష
లో బడ్జెట్లో లాభాలొచ్చే సినిమా తీయాలంటే మంచి ఐడియా ధ్రిల్లర్ లేదా హర్రర్ అని మనవాళ్ళు మన చిన్నప్పటి నుంచీ ఫిక్సయినట్లు ఉన్నారు. పోనీ అవైనా ఆసక్తితో ప్రారంభం అవుతాయా అంటే ఈ మధ్య ఓ మిత్రుడు భూమికతో హర్రర్ తీద్దామని ప్లాన్ చేసారు. ఏంటి మీకు లాభం అంటే..సినిమా మొత్తం సింగిల్ లొకేషన్లో చుట్టేయచ్చు. షాట్స్ స్లోగా తీసి స్క్రీన్ టైమ్ తినేయచ్చు…పాటలకు పెద్ద ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు..చివరగా బాబుల చుట్టూ డేట్స్ కోసం తిరగక్కర్లేదు అన్నాడు. [...] |
|
ప్రయాణం (రివ్యూ)
తొలి చూపులోనే ఆ అమ్మాయి తెగ నచ్చేసింది…తప్పదు..పడేయ్యాలి…కాని టైమ్ మాత్రం టు అవర్స్ మాత్రమే ఉంది..ఎలా ప్రోసీడ్ అవ్వాలి..అనేది క్యూరియాసిటీ పాయింటే. అందులోనూ ఐతే,అనుకోకుండా ఒక రోజు వంటి విభిన్నమైన చిత్రాల దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ తానే స్వయంగా నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ఇది. మరో ప్రక్క ఆయన రెగ్యులర్ ధ్రిల్లర్ కాకుండా సాప్ట్ రొమాంటిక్ కామిడీ చూపుతానంటూ ప్రొమోలు ఢిపెరెంట్ గా వేస్తున్నారు. దాంతో ఆయన అభిమానుల్లో మరింత ఎక్సపెక్టేషన్స్ పెరుగుతూ పోయాయి. అయితే [...] |
|
రాజావారి చేపల చెరువు
ఒకే టిక్కెట్టు పై రెండు సినిమాలు స్కీము పెట్టుకుని, నాకు లంచంగా నీ పెళ్లాం కావాలి,ఓటున్న రిక్షావాడూ మెగాస్టారే ,చూసింది గోరంత,చూడాల్సింది కొండత వంటి వ్యంగ్య పూరిత డైలాగులుతో ముస్తాబై వచ్చింది రాజావారి చేపల చెరువు.అలాగే కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా,ప్రజారాజ్యం ప్రచార చిత్రంగా సినిమా తీసారంటూ ప్రచారం జరిగినా పెద్దగా ఆ ఛాయలు ఏమీ లేకపోవటం మరో విచిత్రం. అందులోనూ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారని ఆశించిన ఈ వ్యంగ్య చిత్రం రకరకాల కారణాలతో ఎలక్షన్ రిజల్టుకు [...] |
|
కిక్ (రివ్యూ)
టైటిల్ క్యాచీగా బాగుంది..రవితేజ కామిడి చేసాడంటున్నారు..నవ్వుకోవచ్చు..అందులోనూ అతనొక్కడే సురేంద్రరెడ్డి..సినిమా ధైర్యం చేయచ్చు..అనుకుంటూ కిక్ కోసం ధియోటర్స్ లోకి దూరాను. అయితే నేనూహించినంత కాదు కదా..అందులో సగం కూడా కిక్ నాకు దొరకలేదు.అందలోనూ ఇంటర్వెల్ అయిన తర్వాత మరీ ఘోరం. మరి మేము ధైర్యం చేయచ్చా అంటారా..ఫస్టాఫ్ లో రవితేజ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది..బ్రహ్మానందం కాంబినేషన్ లో మంచి నవ్వులు ఉన్నాయి. ఇలియానా కొద్దిగా ఒళ్ళు చేసి బావుంది..లక్కిగా సురేంద్రరెడ్డి ఫ్రేమ్స్ ఆపి వెనక్కి ముందుకు వెళ్లే కార్యక్రమం [...] |
|
మిత్రుడు(రివ్యూ)
రాజేంద్రప్రసాద్ రాంబంటు చూసారా…పోనీ తారకరత్న భద్రాధ్రి రాముడు చూసారా..మంచి పాయింటు బాగుంది కదా ..అవి సరిగ్గా తీయక వర్కవుట్ అవలేదు..మళ్ళీ ఆ పాయింట్ తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది..మంచి ఐడియా..ఈ మధ్య హాలీవుడ్ కామిడీ సమ్ ధింగ్ ఎబౌట్ మేరి చూసా..చాలా బాగుంది..ముఖ్యంగా ఆ హీరోయిన్ ని పడేయిటం కోసం ఒకడు వికలాంగుడులా నటిస్తూంటాడు..భలే క్యారెక్టర్. అయితే అతన్ని విలన్ గా అనుకుని,ముందునుకున్న ఆ పాయింట్ ని మార్చి చేసేద్దాం..అని అనుకుంటే పుట్టినట్లున్న చిత్రం మిత్రుడు. [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |