Author Archive for జోస్యుల సూర్యప్రకాశ్

"టింగ్యా"-ప్రాంతీయ పరిమళం

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే [...]

ముచ్చటైన రంగులతో 'మాయాబజార్' కి మేకప్

ముచ్చటైన రంగులతో ‘మాయాబజార్’ కి మేకప్

విజయావారి ‘మాయాబజార్’ కలర్లో,స్కోప్, డీటీఎస్ వంటి ఆధునిక హంగులు జత చేర్చుకుని త్వరలో మన ముందుకు వాలనుంది. ఈ తరం వారిని కూడా ఆ చిత్రం తన మాయాజాలంతో మాయచేసి ఆకట్టుకునే ప్రయత్నం చేయబోతోంది. 53 ఏళ్ల క్రితం విజయా సంస్థ సృష్టించిన ఈ సెల్యులాయిడ్‌ దృశ్య కావ్యాన్ని గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ సంస్థ మూడు సంవత్సరాల శ్రమకు ఓర్చి భారీ వ్యయంతో, కలర్‌లో తీర్చిదిద్దారు.కొత్త రూపుతో తయారైన ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్‌ [...]

 సంగీత దర్శకుడు చక్రధర్‌ ఇక లేరు

సంగీత దర్శకుడు చక్రధర్‌ ఇక లేరు

‘మగమహారాజు’, ‘చట్టానికి కళ్లు లేవు’ వంటి చిత్రాలకు హిట్ సంగీతం అందించిన సంగీత దర్శకుడు చక్రధర్‌ (72) శనివారం కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారు.ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు ప్రథమ శిష్యునిగా గుర్తింపు పొందిన చక్రధర్‌ మరో ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సుమారు 950 సినిమాల [...]

మిస్సవుతున్నాం అని గుర్తుచేసే  "మిస్సమ్మ NRI"

మిస్సవుతున్నాం అని గుర్తుచేసే “మిస్సమ్మ NRI”

వలస వెళ్ళిన పక్షులు సైతం  సీజన్ అయిపోగానే తిరిగి తమ సొంత గూటి వైపు ప్రయాణం పెట్టుకుంటాయి. కానీ మనం మాత్రం…? అనే పాయింట్ ఎప్పటికీ హృద్యమైనదే..హత్తుకునేదే. ఎన్నారైలు తమని తాము ఆ పాత్రలలో ఐడింటిఫై అయి తమ గుండె తడిని తడముకుంటే…ఇక్కడ(ఇండియాలో)వాళ్లు తమని వదిలి దేశాలకు వెళ్ళిన పిల్లలని,స్నేహితులని,సన్నిహితులను తలుచుకుని జ్ఞాపకాల్లోకి అలవోకగా వెళ్ళటం సహజంగా జరిగేదే. సరిగ్గా ఇలాంటి ఎమోషన్ ని తట్టి లేపే  ప్రయత్నం చేసింది..కొందరు ఎన్నారైలు చేసిన ఈ “మిస్సమ్మ ఎన్నారై [...]

"సినిమా విమర్శ" - కొడవటిగంటి కుటుంబరావు

“సినిమా విమర్శ” – కొడవటిగంటి కుటుంబరావు

సినిమా విమర్శలు రాసేవారికి గల అర్హత లేవన్న ప్రశ్న ఒకటి ఈ మధ్యన కలుగుతున్నది. ఈ విమర్శకులందరికీ సినిమా చిత్రం నిర్మాణం గురించి,ఫొటోగ్రఫీ గురించి, డైరక్షన్ గురించి, పాత్ర పోషణ గురించీ, నటన గురించీ, ఏం తెలుసు అని కొందరడుగుతారు. సినిమా చిత్ర నిర్మాణంలోకి దిగేవారికే(కొందరికి) ఈ విషయాలు తలాతోకా తెలియనప్పుడు సినిమా విమర్శకులకు ఇవన్నీ తెలిసుండటం సాధ్యం కాదు. ఈ ప్రశ్న వేసే చిత్రనిర్మాతలు ఇంకొక విషయం కూడా మరుస్తున్నారు. నిజంగా చిత్రాలకు బతుకు నిర్ణయించేది [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-5

‘పాల మనసులు’  చిత్రంలోని ‘ఆపలేని తాపమాయె’  అన్న డా.నారాయణ రెడ్డి గారి గీతికను గాయని కుమారి ఎల్.ఆర్.ఈశ్వరితో పాడేందుకు శ్రీ సత్యం గారి దగ్గరనుంచి ఆహ్వానం వచ్చింది.  అదే ఆయన సంగీత దర్శకత్వంలో నే పాడిన తొలిపాట. ఆ పాట ఆయన ఆలపించిన పద్దతి ఆలకించి, అలాగే ఆలపించినా ఆయన తృప్తి పడలేదు. ఆయన పాడిన విధంగానే పాడినా ఆయనకు నచ్చలేదు. చివరకి ఆయన చిరాకుతో నా చేత పాడించవద్దనుకునేంత మటుకు వచ్చింది వ్యవహారం. ప్రక్కన ఎల్.ఆర్. [...]

కన్నడ  హీరో విష్ణువర్థన్‌ మృతి

కన్నడ హీరో విష్ణువర్థన్‌ మృతి

కన్నడ  హీరో డాక్టర్ విష్ణువర్థన్‌(59)   నిన్న రాత్రి  మైసూరులో హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. ఇప్పటివరకూ 199 చిత్రాల్లో నటించిన ఆయన 2005 లో బెంగుళూరు యూనివర్సటీ నుంచి  డాక్టరేట్ పొందారు. పుట్టణ్ణ కణగాల్‌ దర్శకత్వం వహించిన ‘నాగరహావు’ సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఏడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అనేక మార్లు స్టేట్ గవర్నమెంట్ అవార్డులును పొందారు. 2004లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ అచీవ్‌మెంట్‌, 2009లో డా.రాజకుమార్‌ అవార్డులు ఆయన పొందారు.
1950 [...]

2009-కొత్త దర్శకులు: ఒక షాకయ్యే నిజం

2009-కొత్త దర్శకులు: ఒక షాకయ్యే నిజం

2009 సినీ పరిశ్రమకు దాదాపు 330 కోట్ల వరకూ నష్టాన్ని కలగ చేసిందంటూ ట్రేడ్ లో అంచనాలు ఉన్నాయి. అయితే 64 మంది కొత్త దర్శకులుకు మాత్రం కెరీర్ లు ప్రారంభం కలిగించే అవకాంశం కల్గించింది. అది వారు నిలబెట్టుకున్నారా  లేదా అనేది ప్రక్కన పెడితో  ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే సినీ ఫీల్డులో ప్రవేశించే చాలామంది అంతిమ లక్ష్యం మాత్రం దర్శకత్వం.
జనవరి
1) జి.ఎల్.బి.శ్రీనివాస్ (మహా నగరంలో శివ -చందు)
2) హర్షా రెడ్డి  (ఇందుమతి)
3) విశ్వ ప్రసాద్ [...]

సినీనటుడు  నర్రా వెంకటేశ్వరరావు మృతి

సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి

ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు (62) ఈ రోజు(ఆదివారం)
ఉదయం స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు.
ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
సుమారు 500 చిత్రాల్లో నటించిన
నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు.
ఆయన తొలి చిత్రం ‘మల్లెల మనసులు’.
చివరి చిత్రం మేస్త్రీ(దాసరి).
తొలుత సినిమాల్లో విలన్‌గా చేసినా అనంతరం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి
గుర్తింపు తెచ్చుకున్నారు.
స్వర్గీయ టి.క్రిష్ణ ఈయనను బాగా ప్రోత్సహించేవారు.
నేటి భారతం చిత్రంలో ఆయన నటన ప్రేక్షకులు ఎప్పటికీ [...]

హాలీవుడ్ చిత్రం 'అవతార్' చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ చూడద్దు: రామ్ గోపాల్ వర్మ

జేమ్స్ కెమెరాన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘అవతార్’ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మ…”ఈ సినిమాను చూడకండి..అనుభవించండి”..అంటూ తన అనుభూతులను వివరిస్తున్నారు.ఆయన మాటల్లో… నేనెప్పుడూ దేముడ్ని నమ్మను..కానీ దర్శకుడు జేమ్స్ కెమరాన్ దేముడు కన్నా గొప్పవాడని మాత్రం అనిపించింది.ఎందుకంటే ఆయన అవతార్ లో చాలా అధ్బుతమైన, అందమైన,ఉత్సాహవంతమైన. ఉద్వేగభరిత అనుభవానికి గురిచేసే ప్రపంచాన్ని సృష్టించాడు. దేముడు కూడా ఇట్లాంటి ప్రపంచాన్నిసృష్టించటానికి. ఊహించి ఉండడు .అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజాగా ఐమాక్స్ లో అవతార్ [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-4

సంగీత రాజేశ్వరులు  శ్రీ రాజేశ్వరావుగారిని 1962 లో గూడూరులో శ్రీ కాళిదాస కళానికేతన్ వారు నిర్వహించిన సంగీత పోటీల బహుమతి ప్రదాతలుగా కలిశాను. ఆ పోటీలలో నారు మొదటి బహుమతి లభించింది. అప్పుడు నా గాత్రం విని, నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో మీరు అనతికాలంలోనే గొప్ప నేపధ్య గాయకులవుతారు అని వ్రాశారాయన.
ఆయన సంగీత దర్శక్తవంలో మొట్టమొదట నేను పాడినది వీరాంజనేయలో హనుమా..పావన రుద్రతేజమున అన్న -బ్రహ్మ పాడే పద్యం,పద్యాన్ని కానడ  రాగంలో స్వరకల్పింతం చేశారు. ఆయన సన్నివేశాన్ని [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర-2

“నేను పుట్టడానికి ఆర్నెల్ల ముందు నుంచీ నన్ను చంపటానికి హత్యా ప్రయత్నాలు జరిగాయి. ఈ ఎత్తుగడ ఎంత బావుంది. కుతూహలం కలిగిస్తుంది. ఇంకో వాక్యంలో ఆ హత్యా ప్రయత్నం చేసేది వాళ్ల అమ్మే అన్నాడు. మరికొంత కుతూహలం, ఒక సాంఘిక సమస్య. బోలెడెంత పాత కథ అన్ని వచ్చేసాయి. అయ్యో పాపం అని మొదటే అనిపిస్తుంది…”అంటూ ప్రముఖ రచయిత(సినీ)ఆరుద్ర కాబోయో కథకులుకు ఆయన చక్కని చిట్కాలు చెప్తున్నారు.
ఈ ఏడు చేపల కథలోనే మరొక సుగణముంది. అది కొసమెరుపు. [...]

ఫైట్ మాస్టర్ రాజు ఇక లేరు

ఫైట్ మాస్టర్ రాజు ఇక లేరు

ఎన్టీఆర్,చిరంజీవి,బాలకృష్ణ వంటి స్టార్ హీరోల చేత ఫైట్స్ చేయించి ఎంతో పేరు తెచ్చుకున్న ఫైట్ మాస్టర్ రాజు ఆకస్మిక మృతి చెందారు.  చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో హార్ట్ ఎటాక్ కి  ట్రీట్మెంట్ తీసుకుంటూ  ఆదివారం తెల్లవారు ఝామున మరణించారు.
ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం వేటపాలెం తరలిస్తున్నారు.అక్కడే కుటుంబ సభ్యుల సమక్షంలో  అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్ని వందల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా చేసిన ఆయన ముంబయి నుంచి ఫైటర్స్ దిగుమతి చేసుకునే కాన్సెప్ట్ కు నాంది పలికారు. [...]

‘సలీం’...దుమ్ముకొట్టాడు ! (రివ్యూ)

‘సలీం’…దుమ్ముకొట్టాడు ! (రివ్యూ)

చరిత్రలో సలీం(అనార్కలితో)ప్రేమ కథ విషాదాంతం. సేమ్ టు షేమ్ తెలుగు సినీ చరిత్రలోనూ సలీం ది విషాదమే మిగిల్చింది. తనపైనో,తన హీరోపైనో మరిదేనిమీదో నమ్మకం లేక దర్శకుడు వైవియస్ కేవలం తన టాలెంట్ ను మొత్తం ఇలియానా స్కిన్ షో కే ఖర్చుపెట్టాడు. దాంతో  దాదాపు ఇరవై మూడు కోట్ల భారీ ఖర్చు,కావాలని సన్నబడి మరీ నటించిన హీరో ఈ కలిసిరాని కథలో కొట్టుకుపోయారు. వరస ఫ్లాపుల సునామీలో ఈ చిత్రమూ కలిసిపోయింది. చివరకు క్లైమాక్స్ దాకా [...]

సాయిరాం శంకర్ 'వాడే కావాలి'  (రివ్యూ)

సాయిరాం శంకర్ ‘వాడే కావాలి’ (రివ్యూ)

‘వాడే కావాలి’ సినిమా కెళితే ఓ బెనిఫిట్ ఉంది.ఇట్లాంటి చెత్త కథలుతో కూడా సినిమాలు తీస్తారా..అయితే మన దగ్గరున్న కథలను తెలుగు ఫీల్డులో అమ్మకానికి పెట్టచ్చు  అనే ధైర్యం బోలెడెంత వచ్చేస్తుంది. పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ కెరీర్ బాలారిష్టాలు దాటనట్లుంది. తాజాగా ఈ సినిమా కూడా అతని వరస ఫ్లాఫుల లిష్టులో మొహమాటం లేకుండా చేరిపోయి వెక్కిరించింది. అయితే ఈ సినిమాకు ఓ విచిత్రమైన ఆపరేషన్ సక్సెస్..పేషెంట్ డెడ్ అన్న పరిస్ధితి  ఉంది.  ఎప్పుడో [...]

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు: ఆరుద్ర

చాల్లేవయ్యా..ఆపాటి అనుభవం మాకూ ఉంది. ఊ కొట్టడం వచ్చిన దగ్గర్నుంచీ కథలు వింటున్నాం. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కథలు చదివేస్తున్నాం. కంపోజిషన్లు రాయటం మొదలెట్టిన మర్నాటినుంచీ కథలు రాస్తున్నాం. ఇంతకన్నా ఇంకేం కావాలి. అని మీలో ఏ ఒక్కరైనా అనగలిగితే మీకు అనుభవముందని తప్పుకుండా ఒప్పుకుంటాను. చిన్నప్పటినుంచీ కథలు వినాలనీ,చదవాలనీ,వ్రాయాలనీ తహ తహ ఉన్నవాళ్ళు మంచి కథకులవడానికి అవకాశాలున్నాయి అంటున్నారు ప్రముఖ(సినీ)కవి స్వర్గీయ ఆరుద్ర.. ఆయన “కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు!” అంటూ కథలు [...]

వెండితెర అధ్బుతం బీనారాయ్ ఇక లేరు

వెండితెర అధ్బుతం బీనారాయ్ ఇక లేరు

బాలీవుడ్ అనార్కలి గా పేరు గాంచిన బీనారాయ్ మంబయిలోని తన స్వగృహంలో హార్ట్ స్ట్రోక్ తో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. బీనారాయ్‌ ఆదివారం తెల్లవారుజామున అయిదుగంటలకు గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుమారులు ప్రేమ్‌కిషన్‌, కైలాష్‌నాథ్‌లు తెలిపారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆమె మరణసమయానికి ఆమె పెద్ద కొడుకు ప్రేమ్ కిషోర్  బెలబోర్న్  లో ఉన్నారు.  ఇక ఆమె మనవడు సిద్దార్ధ మల్హోత్రా(ధర్మా ప్రొడక్షన్  లో దర్శకత్వం చేస్తున్నారు) ఈ వార్త తెలియగానే [...]

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతానుభవాలు-3

శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) [...]

అడ్డూ అదుపూ లేని క్రియేటివిటీ-ఆర్య:2

అడ్డూ అదుపూ లేని క్రియేటివిటీ-ఆర్య:2

పేరు గొప్ప..ఊరు దిబ్బ..పబ్లిసిటీ అదుర్స్..సినిమా బెదుర్స్ అన్నట్లు తయారైంది తెలుగు సినిమా. ఏ సినిమాకైనా ఎగేసుకుంటూ వెళ్ళటం..కళ్ళు తేలేసి,తల నోప్పి తెచ్చుకుని పారిపోయి బయిటపడటం. తాజాగా రిలీజైన ఆర్య-2 పరిస్ధితి కూడా అలాగే తయారైంది. ఏదో సుకుమార్ తెలివైన వాడే..కాస్త జగడంతో దారి తప్పాడు కానీ అని లోపాయికారీ గా అనుకోనే మాటలు చెరపేయటానికా అన్నట్లు ఈ సినిమా తీసి వదిలాడు. ఇంత గ్యాప్ తీసుకుని ఇంత ఇలాంటి దారణమైన సినిమా తీస్తారని ఎవరూ ఊహించరు. [...]

కుర్రాడు

కుర్రాడు


డైరక్టర్ గా పరిచయమయ్యే వారు సాధారణంగా రీమేక్ లు చేయటానికి ఇష్టపడరు.ఎందుకంటే హిట్టయితే ఆ క్రెడిట్ ఒరిజనల్ చిత్రానికి వెళ్ళిపోతుంది. ఫ్లాఫ్ అయితే..చూసీ కాపీ చేయటం కూడా చేతకాలేదనే విమర్శలు వస్తాయి. కానీ ఐతే,అమృతం వంటి విభిన్న కాన్సెప్ట్ లతో ముందుకొచ్చిన గుణ్ణం గంగరాజు గారి కుమారడు సందీప్ గుణ్ణం ఆ ధైర్యం చేసాడు. తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ ని తీసుకొచ్చి కుర్రాడుగా అనువదించాడు. అయితే అక్కడ కథ,కథనంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా దించాడు. దాంతో అక్కడ [...]

Page 1 of 512345