Author Archive for మేడేపల్లి శేషు

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా - 'నీచా నగర్'

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand [...]

మన  కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు

కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను.
మామన్, అతని [...]

 మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (నాలుగవ భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు:

మొదటి భాగం
రెండో భాగం
మూడో భాగం

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు
నా శరీరం అణువణువునా చురుకైన పోట్లు పొడుస్తున్నట్టుగా ఉంది. నా చేతులు రెండూ ఎత్తుగా ఉన్న ఒక కొయ్యదూలానికి కట్టేశారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తులో ఉందది. గాలిలో వేలాడుతున్న నా కాళ్ళు, దూలానికి కట్టేసిన నా చేతులూ మిగిలిన శరీరంనుంచి [...]

మన కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మూడో భాగం)

ఈ శీర్షికలో వచ్చిన మిగిలిన రెండు భాగాలు:
మొదటి భాగం

రెండో భాగం
‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు
నేను అరెస్టయ్యాను – ఒక క్విజ్ షోలో గెలిచినందుకు.
రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పోలీసులు నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చారు. వీధికుక్కలు కూడా అరిచి అరిచి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాయి. వాళ్ళు భళ్ళున తలుపులు తోసుకునివచ్చి, సంకెళ్ళు వేసి నన్ను దూరంగా ఆగిఉన్న ఎర్రలైటు వెలుగుతున్న [...]

మన కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (రెండవ భాగం)

ముంబాయిలోని అతిపెద్ద (ఆసియాలోనే) మురికివాడ అయిన ధారవిలో పెరిగే పిల్లలు – సలీం, జమాల్. సలీం, జమాల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఒక మతకలహాల సందర్భంలో వాళ్ళ తల్లి మరణిస్తుంది. అప్పటినుంచీ వాళ్ళు అనాథలవుతారు. వాళ్లకు మరో అనాథపిల్ల లతిక తోడవుతుంది. అనుకోకుండా ఒకసారి వాళ్లకు మామన్ అనే వ్యక్తితో పరిచయమవుతుంది. మామన్ వాళ్లకు తినడానికి మంచి తిండి పెట్టి, తన దగ్గరకు తీసుకువెళతాడు. తీరా అక్కడికెళ్ళాక వాళ్లకు అతను చిన్నపిల్లలను ప్రలోభపెట్టి, వాళ్ళను వికలాంగులను చేసి, వాళ్ళతో భిక్షాటన చేయించే ఒక ముఠానాయకుడని తెలుస్తుంది. మామన్ పిల్లలకు మత్తును కలిగించడానికి ఉపయోగించే క్లోరోఫాంను అతని అనుచరుడు పున్నోజ్ ముఖాన చిందించి వాళ్ళు అక్కడినించి తప్పించుకుంటారు. లతిక మాత్రం వాళ్ళు తప్పించుకోవటానికి పరుగెత్తుతూ ఎక్కిన రైలును అందుకోలేక అక్కడే ఉండిపోతుంది.

మన కథ, వాళ్ళ సినిమా - స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (మొదటి భాగం)

ఈ సినిమా గురించి ‘నవతరంగం’ లో మొట్టమొదట సమీక్షించినది సాయి బ్రహ్మానందం గారు (డిసెంబర్ 1, 2008). అప్పటికి ఈ సినిమా ఇంకా ఇండియాలో విడుదల కాలేదు. అప్పుడు ఈ సమీక్షకు రాసిన వ్యాఖ్యల్లో నేను ఇది ఎందుకూ పనికిరాని సినిమా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తూ రాశాను.
ఆ తర్వాత ‘స్వాతి’ మాసపత్రికలో (జనవరి, 2009) ఈ సినిమా మాతృక అయిన వికాస్ స్వరూప్ రాసిన ‘Q & A’ నవల గురించిన సమీక్ష – మాలతి [...]

 నటన + జీవితం = ఒక మంచి 'షో'   (రెండవ భాగం)

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (రెండవ భాగం)

ఈ వ్యాసం లోని మొదటి భాగం కోసం ఇక్కడ చూడండి.
Art is a lie that makes us realize truth – Pablo Picasso
ఒక సినిమాని చూసి కథ చెప్పటం ఒక ఎత్తయితే, దాన్ని విశ్లేషించటం మరొక కష్టమైన పని (ఇప్పుడొస్తున్నతెలుగు చిత్రాల్లో చాలా వాటి విషయంలో రెండోదానికి తావే లేదనుకోండి). ఈ సినిమాను నాకు చేతనైనంతలో, నాకు అర్థమయినంతవరకూ విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను.
సినిమా వినోదప్రధానమైన సాధనం కావటం అటుంచి, కొన్ని [...]

నటన + జీవితం = ఒక మంచి 'షో'   (మొదటి భాగం)

నటన + జీవితం = ఒక మంచి ‘షో’ (మొదటి భాగం)

సినిమా చూడటం అంటే చిన్నప్పుడు ఓ సరదా. అంతకుమించి మరేమీ లేదు. కాని ఆ బాల్య, కౌమారావస్థలు దాటి ఒక విధమైన మానసిక పరిణితి వచ్చిన తర్వాత, సినిమా అనే కాదు, ఏ విషయం పట్లైనా మన అభిప్రాయాలు మారిపోతాయి (మారాలి కూడా). ఎన్నిరోజులని, సంవత్సరాలని ఈ కాకమ్మ కథలతో తయారయ్యే చిత్రాలు చూస్తూ కూర్చుంటాం? కొత్త విషయాలు తెలుసుకోవటంలో మన చుట్టూ ఉండే వాతావరణం, మనకు లభించే వనరులు మొదలైనవి కూడా ప్రధానపాత్ర వహిస్తాయి. [...]

'ఆలోచన'కు అక్షరాభ్యాసం చేయించిన బి. నర్సింగరావు

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం చేయించిన బి. నర్సింగరావు

‘ఆలోచన’కు అక్షరాభ్యాసం అన్న ఈ శీర్షిక పేరు చూడగానే “అంటే! అంతకుముందు వచ్చిన చిత్రాలు ఆలోచనలను రేకెత్తించేవి కావా?” అని ఆవేశానికి లోనవకండి. కావొచ్చు. కానీ, ఆ ఆలోచనలకూ, నర్సింగరావు రేకెత్తించే ఆలోచనలకూ చాలా తేడా ఉంది. ఏ సగటు తెలుగు సినిమాను తీసుకున్నా, అది తయారుచేయటానికి ముడిసరుకు (ఫార్ములా అని మనం అనేది) ఒకటే. ఒక హీరో, హీరోయిన్, [...]

కాపీయా? ప్రేరణా? - ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

కాపీయా? ప్రేరణా? – ఓ సినిమా పాటా, నీ పేరేమిటి?

తీరిగ్గా ఉన్న ఒక సెలవురోజు సాయంత్రం వాలుకుర్చీలో కూర్చుని, రేడియోలోనో, టివిలోనో లేదా మీ టేప్ రికార్డరులోనో మీకిష్టమైన పాటొకటి వింటున్నారు. అందులోని రిథంకీ, సంగీతానికీ అనుగుణంగా మీకు తెలియకుండానే మీ కాళ్ళు నేలను తాటిస్తూ ఉన్నాయి (మెలొడీ ఐతే ‘మనసు పులకరిస్తుంది’ అనుకోవచ్చు). హఠాత్తుగా, ఎక్కడో ఒకచోట “అరె! ఈ ట్యూనును ఇదివరకెక్కడో విన్నట్టుందే.” అనుకున్నారు. మీ మెదడు పొరల్లోని ఆర్కివ్స్ లోకి వెళ్ళాక, ఆ ట్యూను ఎక్కడిదో మీకు అర్థమైంది. అంతే! అంతకుముందు “ఎంత [...]

గులాబీలు

గులాబీలు

తీసుకోవటంలో కాదు, ఇవ్వటంలోనే ఆనందం ఉందని చెప్పిన చిత్రం ‘గులాబీలు’
ఈ సినిమా గురించి సమీక్ష రాయడానికి ముందు, అసలు ఈ సినిమా గురించి నాకు ఎలా తెలిసిందో చెపుతాను. 2006 వేసవిలో, ఒక రోజు హైదరాబాదునుంచి మా స్నేహితుడు రవీందర్ ఫోన్ చేసి, తనకు తెలిసిన కుటుంబం ఒకరు ఢిల్లీకి వస్తున్నారని, వాళ్లకు ఏర్పాటు చేసిన వసతి గురించి చిన్న సమస్య వచ్చినందువల్ల, వాళ్లు ఢిల్లీకి చేరిన రోజునుంచి కాకుండా ఆ మర్నాటినుంచి వసతి ఇచ్చారని, అందువల్ల, [...]

'ఇది’ సినిమా కాకూడదు

‘ఇది’ సినిమా కాకూడదు

గత వారం ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో ఒక వార్త చూశాను. అది చదివిన తర్వాత ఎందుకో ’నవతరంగాని’ నా మనసులో మాట రాసి గుండె బరువు దింపుకోవాలనిపించింది.
అదేంటంటే – బొంబాయిలోని తాజ్ హోటల్లో ఆటవిక ఉగ్రవాదుల నాలుగురోజుల ’విలయతాండవం’ ముగిసిన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ ముఖ్ వచ్చి తాజ్ హోటల్ ని సందర్శించారు- జరిగిన నష్టం గురించి తెలుసుకునేందుకు. ఆయనతోపాటు సినీ నటుడైన ఆయన కొడుకు రితేష్ దేశ్ ముఖ్ కూడా [...]

మనకు తెలియని మన ఘంటసాల

మనకు తెలియని మన ఘంటసాల

ఈ రోజు డిసెంబర్ 4వ తారీఖు. ‘అయితే ఏమిటి?’ అంటారా? ఈ రోజు మన గాన కళానిధి, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం. 1922 జనవరి నాలుగున కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో జన్మించారాయన.
అంతకుమించి, మిగిలిన వివరాలలోకి వెళ్ళకుండా, ‘మనకు తెలియని మన ఘంటసాల’ అని ఎందుకన్నానో చెప్తాను. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం [...]

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం - 'మొగ్గిన జడే'

సలక్షణమైన బాలల/కుటుంబ చిత్రం – ‘మొగ్గిన జడే’

కనీసం ఓ ఇరవై, పాతికేళ్ళ క్రితం, ప్రైవేటు చానెళ్ళు ఏవీ లేని రోజుల్లో దూరదర్శన్లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం వివిధ భాషలకు చెందిన classic movies వచ్చేవి. అలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూడాలనుకుంటే దానికి చక్కని చిరునామా ‘Lok Sabha TV’ చానెల్. ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమవుతాయి. అదే సినిమా మళ్ళీ మరుసటి రోజు (అంటే ఆదివారం) మధ్యాహ్నం రెండు గంటలకు పునఃప్రసారమవుతుంది.
ఇలాంటి చిత్రాల కోవలో ఒక [...]