Menu

అరిపిరాల Archive

తెరపైన రణ్బీర్, తెరవెనుక అనురాగ్ హీరోలుగా – బర్ఫి

సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లకోసమో, ప్రేక్షకులకోసమో తీయవచ్చు. అవకాశం వున్న కొద్ది మంది దర్శకులు తమకోసమే సినిమా తీసుకోవచ్చు. అదేదీ కాదని సినిమా తీయడం కోసమే సినిమా తీస్తే…? అలాంటి సినిమాకి అద్భుతమైన నటీనటులు దొరికితే..? అప్పుడు తయారయ్యే సినిమా ఒక మాస్టర్ పీస్ లా మిగిలిపోతుంది. సరిగ్గా బర్ఫీ సినిమా లాగే. పుట్టుకతోనే మూగ-చెవిటివాడైన బర్ఫీ (రణ్బీర్ కపూర్) కథ ఇది. అతని జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ఆరు నెలల్లో పెళ్ళి నిశ్చమైన

నివాళి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు

ప్రముఖ సాహితీవేత్త, శాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి మృతికి నవతరంగం ఘనంగా నివాళి ప్రకటిస్తోంది. రోహిణీ ప్రసాద్ గారు సినిమారంగానికి చెందినవారు కాకపోయినా, నవతరంగం పాఠకులుగా, శ్రేయోభిలాషిగా మాకు ఆప్తులు, ఆదరణియులు. వారి తండ్రిగారైన కీ.శే. కొడవటిగంటి కుటుంబరావుగారి సినిమా వ్యాసాలు నవతరంగంలో ప్రచురించేందుకు అనుమతించారు. తరచూ మెయిల్ చేస్తూ నవతరంగం సేవని కొనియాడారు. నవతరంగం వారి అభినందనల స్పూర్తితో ముందుకు సాగగలదని తలుస్తూ, వారికి ఆత్మ శాంతికి ప్రార్థిస్తున్నాము.

ప్రపంచ చలన చిత్ర చరిత్ర 15: త్వరలో విడుదల

కదిలే బొమ్మల్ని చూడాలనుకున్న మనిషి కోరిక ఫోటోలతో మొదలై, క్రమంగా సెల్యులాయిడ్ పైన ఎక్కి మాటలు నేర్చి, రంగులు అద్దుకోని, బ్లాక్ బస్టర్ సినిమాగా, ఆర్ట్ సినిమాగా, సమాంతర సినిమాగా రకరకాలు రూపాంతరాలు చెందుతూ వచ్చిన సినిమా తరువాత ఏ కొత్త పుంతలు తొక్కబోతోంది? ఒకప్పుడు నాటకాలు, బొమ్మలాటలు, సంగీత కచేరిలు (ఒపెరాలు) వంటి వినోధసాధనాలకు అదనంగా వచ్చిన చేరిన సినిమా, అలాంటి కళలనే మింగేసిందనే అపప్రధ కూడా మూటకట్టుకుంది. అయినా ప్రేక్షకులు ఆ సినిమాని ఆదరించారు.

ప్రపంచ చిత్ర చరిత్ర 14: మాస్ హీరోలు… మసాలా సినిమాలు..!

రెండొవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల జీవితంలో సినిమా ఒక ముఖ్య భాగం అయిపోయింది. కేవలం వినోద సాధనంగానే కాకుండా, ఆలోచనలు ప్రేరేపించే కళా ప్రక్రియగా, రాజకీయ వ్యాఖ్యానాలకి, దేశభక్తి ప్రభోదానికి ఒక సాధనంగా కూడా సినిమా మారింది. అయితే ప్రపంచ మొత్తం నెలకొన్న కోల్డ్ వార్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అన్ని చోట్ల ఎక్కువైపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు వంటి కారణాల వల్ల వినోదాత్మక ప్రేమ చిత్రాల జోరు పెరగడం మొదలైంది. ముఖ్యంగా బ్రిటన్ మ్యూజికల్ సినిమాలు,

ప్రపంచ చిత్ర చరిత్ర 13: ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా

1960 ప్రాంతంలొ అమెరికాలో తయారవుతున్న హాలీవుడ్ సినిమాలు వాస్తవికతని వదిలిపెట్టి, కేవలం హీరో హీరోయిన్ల పేరు ప్రఖ్యాతులమీద, స్టార్‌డమ్ మీద ఆధారపడి తీయబడుతున్నాయని విమర్శలు మొదలయ్యాయి. ఇటలీలో నవ్యవాస్తవిక చిత్రాలు, ఫ్రెంచ్ నవతరంగం చిత్రాల రాకతో హాలీవుడ్ సినిమాలలో లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. అయితే  ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సినీ వుద్యమాలని గుర్తించడంలో హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ ప్రభావంలో వున్న యూరోపియన్ సినిమా కూడా విఫలమయ్యాయి. ఇదే అవకాశంగా ఆసియాలో నిర్మాణమౌతున్న ఎన్నో చిత్ర పరిశ్రమలు ఈ కొత్త