Menu

sasi Archive

బొమ్మలోల్లు Trip

పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, ఆప్త మిత్రుడు అమర్ ఈ డాక్యుమెంటరీ కోసం పడిన కష్టం చాలా దగ్గరగా చూస్తున్న.అమర్ చాలా  సార్లు చూద్దామని అడిగినా కుదరలేదు.మా

సినిమా లాంగ్వేజు – గ్రామరు – రూల్సు – గాడిద గుడ్డు …. పార్టు వన్

హెచ్చరిక : ఫిలిం స్కూల్లో చదివిన,చదువుతున్న,చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఇది చదివితే ‘హర్ట్’  అయే అవకాశం ఉంది… లాంగ్వేజు – గ్రామరు – రూల్సు ఈ మూడు పదాలు స్కూల్, కాలేజ్ తరువాత విన్నది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాకే. నేను cameraman అవుదామని సినిమాల్లోకి వచ్చాను,వ్యూ ఫైండర్ బొక్కలోంచి చూసి తీసేస్తే చాలు అనుకున్న నాకు దాని వెనక ఉన్న “కెమికల్” కెమిస్ట్రీ ఫిజిక్సు మేథమెటిక్స్ చూసి భయమేసింది;మళ్ళీ ఇవన్నీ చదవాలా? అనే ఆలోచనే నన్ను వణికించింది,

పదకొండు రూపాయల పాట

శీష్ మహల్లో పాటలు ఉంటాయి అని నేను ఎపుడు అనుకోలేదు, ఉంటె ఒక థీమ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్న. కానీ ఇప్పుడు ఆరు పాటలు, మూడు హిందీ,ఒక తెలుగు,ఒక తమిళ్,ఒక ఇంగ్లీష్ పాట ఉన్నాయి.ఇవి కాక background లో ఒక బెంగాలీ పాట, ఒక సిట్యుయేషన్ లో ఇళయరాజా తమిళ్ పాట బిట్ ఉన్నాయి. ఫస్ట్ అనుకున్న హిందీ పాట అంతరించిపోతున్న  “సింగిల్ స్క్రీన్స్” మీద. ఈ పాట “single screens “ గురించి

నేను – RGV-2

continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ పార్క్ లో చెప్పిన షాట్ తీసిన తీయకపోయిన నేను మాత్రం తీయాలని డిసైడ్ అయిపోయా…నేను జాయిన్ అయిన

నేను – RGV

నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని చేయకూడదు…జస్ట్ ఆయన సినిమాలు