Menu

sankar Archive

శ్యామలన్ – ది హ్యాపెనింగ్

శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా

Children of Heaven

అలీ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు బాగుచేయించడానికి తీసుకెళ్ళిన తన చెల్లెలు జహ్ర షూస్‌ను దారిలో పోగొట్టుకుంటాడు. కొత్త షూస్ కొనే స్థోమత తండ్రికి లేకపోవడం , చెబితే కొడతారనే భయం ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచేలా చేస్తాయి. అలీకి ఉన్న చినిగిపోయిన స్నీకర్స్‌నే ఇద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారు. ఒకరు ఉదయం పూటా ఇంకొకరు మద్యాహ్నం పూటా స్కూల్‌కి వెళ్తూ పోయిన షూస్‌ని వెతికే పనిలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ పరిధికి మించి

Massey sahib

కధ(సంక్షిప్తంగా) : ఈ చిత్రం 1930ల కాలానికి సంభందించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేసే ఫ్రాన్సిస్ మస్సెయ్ భారతీయుడు ఐనప్పటికీ బ్రిటీష్ జీవన శైలిని అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పులతో బాధపడే తన కష్టాలు కొత్తగా వచ్చే ఆఫీసర్ ఆడంతో పోతాయనుకుంటాడు. కానీ రోడ్ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఆడంకి సహకరించే క్రమంలో కొన్ని తప్పుడు లెక్కలు సృష్టించి పర్యావశానంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. కొన్నాళ్ళ తర్వాత కూలీలను తన తెలివితో పనికి ఒప్పించి రోడ్ నిర్మాణం

Ikiru ( to live )

కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని తలచుకోని కుమిలిపోతుంటాడు. ఈ

రషొమొన్-సమీక్ష

ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత బోధకుడు,కట్టెలు కొట్టుకొనేవాడు తాము అప్పుడే