Menu

sankar Archive

Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు. కధలోకి వస్తే CIA

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold

ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే. తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్

II Mare

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రేమలేఖ సినిమా గుర్తుందా. ఐతే ఈ కధ గురించి మీకు పెద్దగా వివరించక్కర్లేదు. అందులోలానే ఇక్కడ కూడా హీరోహీరోయిన్లు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకుంటారు. ఇక్కడ తేడా ఏంటంటే ప్రేమలేఖ సినిమాలో అజిత్, దేవయాని వేరు వేరు రాష్ట్రాలలో ఉండి కలుసుకోవడం కుదరకపోతే, ఇక్కడ హీరో హీరోయిన్లిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉండడం వల్ల కలుసుకోలేరు.ఇలాంటి ఐడియాలతో చాలా హాలీవుడ్ ధ్రిల్లర్స్ చూసే ఉంటాం, కానీ ఒక ఫీల్‍గుడ్ ప్రేమకధను మాత్రం ఊహించలేం. కొరియన్

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్