About శంకర్ కేశనకుర్తి

http://www.sankar.me

Posts by శంకర్ కేశనకుర్తి:

రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

రన్నింగ్ కామెంట్రీ: డిజిటల్ వైపు ఓ లుక్కెయ్యండి

ఇప్పుడంటే డిజిటల్ టెక్నాలజీ వల్ల రకరకాల ప్రయోగాలు సులభమయ్యాయికానీ మొదట్లో సినిమాలకి టైటిల్స్ వెయ్యడం అనేది చాలా వ్యయప్రయాసలతో కూడిన పని. హాలీవుడ్ స్టూడియోలు తమ బ్రాండ్ లోగోపైన టైటిల్స్ వేస్తూండెవారు ముప్పైల వరకు. ఈ రోజుల్లో ప్రత్యేకమైన డిజైన్ ఏమీ ఉండేదికాదు, ఒకే రకమైన fontను అందరూ వాడేసేవారు. తర్వాత టైటిల్ డిజైన్‍కు ప్రత్యేకంగా ఒక ఆర్టిస్ట్ ను పెట్టుకోవడం మొదలుపెట్టారు. MGM వాళ్ళు తమ సినిమాలకు ఈ రకంగా ఆర్టిస్టులు తయారు చేసిన టైటిల్స్(…)

కొత్తతరం సినిమాలు

కొత్తతరం సినిమాలు

గత రెండుమూడు సంవత్సరాలుగా consumer కెమెరాలలో వస్తున్న పెనుమార్పుల మూలంగా ఔత్సాహిక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ తమ కలలను నిజం చేసుకోవడానికి కొత్త దారులు తెరుచుకోవడం తెలిసిందే. HD ఆవిర్భావంతో మొదలై HDSLRల రాకతో మరో కొత్త రూపును సంతరించుకుంది ఈతరం ఇండిపెండెంట్ సినిమా. ఒకప్పటి ఫిల్మ్ కెమెరా వాడకపోతే అది సినిమానే కాదనే రోజులుపోయి అంతా డిజిటల్ మయమైపొయింది. రాబోయే panasonic AGAF100, Sony F3 Super 35mm కెమెరాలతో ఈ విప్లవం ఏ రూపు(…)

Ed Wood (1994)

Ed Wood (1994)

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటుల పనితనం వీధినాటకాల వాళ్ల నటనకంటే తీసి కట్టుగా అనిపించిందా?, సెట్టింగుల్లో డొల్లతనం కళ్ళు మూసుకున్నా కనిపించిందా? నాసిరకం నిర్మాణ విలువలు అడుగడుగునా విసుగెత్తించాయా? ఇలాంటి సినిమాలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచన కలిగిందా? .హాలీవుడ్ వాళ్ళు అలాంటి వాటిని ఎడ్‍వూడ్స్ పిల్మ్స్ అని ముద్దుగా పిల్చుకుంటారు. ఈ ఎడ్‍వూడ్ ఎవరా అనుకుంటున్నారా? అయితే మీరు టిమ్ బర్టన్ సినిమా ఎడ్‍వూడ్స్ చూడాల్సిందే. ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్నేహితుల తోడ్పాటు ఉంటే(…)

Katyn-by Andrzej Wajda

Katyn-by Andrzej Wajda

’చరిత్ర ఎప్పుడూ విజేతల చేతే వ్రాయబడుతుంద’ని ఒక నానుడి. అందుకే రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆధారం చేసుకొని వచ్చిన చిత్రాల్లో సామాన్యంగా  ఎప్పుడూ హిట్లర్ అనుయాయులైన నాజీలనే దోషులుగా చూస్తాం. ఏమాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నా చరిత్రని వక్రీకరించారని నింద వేస్తారు. ఎన్నో లక్షలమంది ప్రాణాలు బలిగొన్న రెండవ ప్రపంచ యుద్ధంలో చరిత్ర పేజీల్లోకి ఎక్కని నిజాలెన్నో. కేవలం విజేతల విజయగాధలు, నాజీల అకృత్యాలతో నిండిపోయిన ఈ చరిత్ర పుస్తకంలో మరుగున పడిపోయిన భయంకరమైన మూకుమ్మడి హత్యల్ని(…)

Burn After Reading –  Forget after watching

Burn After Reading – Forget after watching

Coen brothers ఈ సారి meaningless comedyతో ముందుకొచ్చారు. గత సంవత్సరం ఆస్కార్ పంట పండించిన నో కంట్రీ ఫర్ ఓల్డ్ మన్ నే మసిపూసి మారెడుకాయచేసినట్టు ఉన్న ఈ Burn after reading సినిమా కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. సినిమా అంతా చాలా ఆహ్లాదంగా నడిచినప్పటికీ ఎందుకో అనుకున్నంత స్ధాయిలొ లేదనిపిస్తుంది. ఒకవేళ హాలివుడ్ దీగ్గజాలందర్నీ పెట్టుకొని ఇలా spy comedy పేరుతో ప్లాట్‌ని పూర్తిగా మర్చిపోవడమే అందుకు కారణం కావచ్చు. కధలోకి వస్తే CIA(…)

A Wednesday

ఈతరం బాలివుడ్ దర్శకులు చిన్న సినిమాకి పెద్దసినిమాకి మధ్య గీతని చెరిపేయడానికి చాలా కృషి చేస్తున్నారనడానికి ఇదో మంచి ఉదాహరణ.  టెర్రరిజం బ్యాక్‍డ్రాప్‍తో నవతరం బాలీవుడ్ దర్శకులు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. వెస్టెర్న్ సినిమాల్లో క్లాసిక్స్ అని చెప్పుకునే సినిమాలు ఏదో ఒకరకంగా ప్రపంచ యుద్ధాల విషాధగాధల్నో విజయ గాధల్నో పొందుపరచినట్టే, మనవాళ్ళు టెర్రరిజాన్ని వాటి పర్యవశాణాల్ని వెరైటీ కధలతో ముందుకు తీసుకొస్తున్నారు. మొన్నవచ్చిన mumbai meri jaan ఆ జ్నాపకాల్ని మర్చిపోవడానికి మనల్ని మనం ఎలా mold(…)

ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే. తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్(…)

II Mare

II Mare

కొన్నేళ్ళ క్రితం వచ్చిన ప్రేమలేఖ సినిమా గుర్తుందా. ఐతే ఈ కధ గురించి మీకు పెద్దగా వివరించక్కర్లేదు. అందులోలానే ఇక్కడ కూడా హీరోహీరోయిన్లు ఉత్తరాల ద్వారానే ప్రేమించుకుంటారు. ఇక్కడ తేడా ఏంటంటే ప్రేమలేఖ సినిమాలో అజిత్, దేవయాని వేరు వేరు రాష్ట్రాలలో ఉండి కలుసుకోవడం కుదరకపోతే, ఇక్కడ హీరో హీరోయిన్లిద్దరూ వేరు వేరు కాలాల్లో ఉండడం వల్ల కలుసుకోలేరు.ఇలాంటి ఐడియాలతో చాలా హాలీవుడ్ ధ్రిల్లర్స్ చూసే ఉంటాం, కానీ ఒక ఫీల్‍గుడ్ ప్రేమకధను మాత్రం ఊహించలేం. కొరియన్(…)

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్(…)

శ్యామలన్ – ది హ్యాపెనింగ్

శ్యామలన్ తెలివైనవాడో, ఫూలో అర్ధంకాదు. కొన్ని sceneలు అద్భుతమనిపించేలా ఉంటాయి. కొన్ని పిచ్చిగా ఉంటాయి. ఈ సినిమాని క్లైమాక్స్ కట్ చేసేసి విడుదల చేసి ఆ రహస్యమేదో ప్రేక్షకుల్నే తెలుసుకొమ్మని( antonioniలా) వదిలేస్తే సరిపోయేదనుకొంట. అప్పుడు తాను చెప్పాలనుకున్న point (ప్రకృతిని మనిషి జయించలేడు) clearగా pass అయ్యేది. ఇలా చివర్లో తానే ఎదోక justification ఇచ్చేద్దామన్న తొందరపాటులో తనతో ప్రేక్షకులు ఏకీభవించలేరన్న విషయాన్ని మరిచిపోయాడు. అయినా ఈ సినిమాని photograpy కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. ఇంకా(…)

Children of Heaven

Children of Heaven

అలీ అనే తొమ్మిదేళ్ల కుర్రాడు బాగుచేయించడానికి తీసుకెళ్ళిన తన చెల్లెలు జహ్ర షూస్‌ను దారిలో పోగొట్టుకుంటాడు. కొత్త షూస్ కొనే స్థోమత తండ్రికి లేకపోవడం , చెబితే కొడతారనే భయం ఆ అన్నాచెల్లెల్లిద్దరూ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా దాచేలా చేస్తాయి. అలీకి ఉన్న చినిగిపోయిన స్నీకర్స్‌నే ఇద్దరూ జాగ్రత్తగా పంచుకుంటారు. ఒకరు ఉదయం పూటా ఇంకొకరు మద్యాహ్నం పూటా స్కూల్‌కి వెళ్తూ పోయిన షూస్‌ని వెతికే పనిలో ఉంటారు. ఈ ప్రయత్నంలో వాళ్ళ పరిధికి మించి(…)

Massey sahib

కధ(సంక్షిప్తంగా) : ఈ చిత్రం 1930ల కాలానికి సంభందించింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసులో టైపిస్టుగా పనిచేసే ఫ్రాన్సిస్ మస్సెయ్ భారతీయుడు ఐనప్పటికీ బ్రిటీష్ జీవన శైలిని అనుకరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పులతో బాధపడే తన కష్టాలు కొత్తగా వచ్చే ఆఫీసర్ ఆడంతో పోతాయనుకుంటాడు. కానీ రోడ్ నిర్మాణమే ధ్యేయంగా పనిచేసే ఆడంకి సహకరించే క్రమంలో కొన్ని తప్పుడు లెక్కలు సృష్టించి పర్యావశానంగా ఉద్యోగాన్ని కోల్పోతాడు. కొన్నాళ్ళ తర్వాత కూలీలను తన తెలివితో పనికి ఒప్పించి రోడ్ నిర్మాణం(…)

Ikiru ( to live )

Ikiru ( to live )

కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని తలచుకోని కుమిలిపోతుంటాడు. ఈ(…)

రషొమొన్-సమీక్ష

రషొమొన్-సమీక్ష

ముందుగా ఈ ఆర్టికల్ చదివేముందు వీలుంటే సినిమా చూసి చదవండి. ఇది గూగుల్ వీడియోస్ లో ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ నేను ప్రధానంగా ఈ చిత్రం యెక్క విశేషాలను మాత్రమే తెలియజేతలచితిని కాబట్టి కధను క్లుప్తంగా చెప్తాను. ఓ వర్షపు మధ్యాహ్నం పాడుబడ్డ రషొమొన్ గేట్ దగ్గర తల దాచుకోవడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల( మత బోధకుడు, కట్టెలు కొట్టుకొనేవాడు, బాటసారి )మధ్య సంభాషనలతో మొదలవుతుంది ఈ చిత్రం. అందులో మత బోధకుడు,కట్టెలు కొట్టుకొనేవాడు తాము అప్పుడే(…)