News back to homepage

ఇజాజత్ చిత్రం నుంచి ఒక మధురగీతం యూట్యూబ్ సౌజన్యంతో

ఇజాజత్ చిత్రం నుంచి ఒక మధురగీతం యూట్యూబ్ సౌజన్యంతో http://youtube.com/watch?v=M9W6kpupwhA

నిండు మనిషి శోభన్

ఇటీవల స్వర్గస్తులైన శోభన్ బాబు తన సుదీర్ఘ చలనచిత్రజీవితంలో అంతఃసంఘర్షణ,సామాజికనిబద్దత వాస్తవజీవితానికి దగ్గరగా నిలిచిన పాత్రల ద్వారా సాధారణప్రేక్షకులకు మాత్రమే కాక ఆనాటి విమర్శకులకూ అభిమాన నటుడయ్యారు.ఉదాహరణకు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బలిపీఠం.చావుకు చేరువౌతున్న బ్రాహ్మణవితంతువును పెళ్ళి చేసుకుని ఆమె జీవితంలో వసంతాన్ని కురిపించి,అపార్ధాలకు గురయ్యే దళిత యువకుడి పాత్రలో శోభన్ బాబు ను తప్ప మరొకరిని ఊహించుకోవటం కష్టం.శోభన్ బాబు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన చిత్రం వీరాభిమన్యు.భారతయుద్ధం నాటి యుద్ధవ్యూహాలను అధ్భుతంగా చిత్రించిన ఈ [...]

జొధాఅక్బర్ అనే సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే..

ఈ సినిమా దర్శకుడు అశుతోష్ ని అందరూ అభినందించాలి.చాలా విభిన్నమైన కధను ఎంచుకుని,తాపీగా,భారీగా తీసినందుకు.చాలా వరకు ఇవ్వాళ వస్తున్న హిందీ సినిమాలు,మల్టీప్లెక్సుల కోసం,విదేశాల్లోని భారతీయులకోసం రూపొందుతున్న నేపధ్యంలొ నాయికానాయకులను చిన్నప్పటి నుంచీ చూపటమనేది అరుదై పోయింది.కానీ ఇందులో ఇద్దరినీ చిన్నతనం నుంచి చూయించి పాత సాంప్రదాయానికి మళ్ళీ ఒక సారి ఊపిరి పోసాడు.హృతిక్ రోషన్,లక్ష్య సినిమా తర్వాత కాస్త నటించేందుకు ప్రయత్నించాలని చాలా కష్టపడ్డాడు.ఐశ్వర్య ని క్లోజప్ లో చూయించినప్పుడల్లా ఆమె కళ్ళల్లో ఆస్కార్ ఉత్సవంలో ఫొటోగ్రాఫర్ల [...]

మూతబడ్డ స్టేజ్6

ఇది కాస్త బాధతో రాస్తున్నది.గతకొంత కాలంగా నన్ను, నాలాంటి లక్షలాదిమందిని ఉర్రూతలూగించిన స్టేజ్6.కాం ఫిబ్రవరి28నుంచి శాశ్వతంగా మూటపడింది.వేలాది సినిమాలు,లక్షలకొద్దీ వీడియోలతో,కళ్ళు చెదిరిపోయె నాణ్యతతో ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన స్టేజ్6.కాం రకరకాల కారణాలతో తెర దించేసింది.నావరకూ నేను కొన్ని వందల సినిమాలు ఈ స్టేజ్6.కాం  పుణ్యమా అని చూడగలిగాను.మనకు ఇంకెక్కడా దొరకవూ అని నిర్ధారించుకున్న సిన్మాలు కూడా పైసా ఖర్చు కాకుండా మన ఇంట్లోబ్రహ్మాండమయిన క్వాలిటీతో చూడగల అవకాశాన్ని ఇక ముందు మనం కోల్పోయాం.స్టేజ్6.కాం  వారు [...]

కధను గాలికి వదిలేసిన తెలుగు సినిమా

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన [...]

విమర్శపై విమర్శ

ఎందరో విద్యావేత్తలు తమ భాషాపాటవాన్ని సినిమా విమర్శలు, సమీక్షలు రాసేందుకు ఉపయోగించుకున్నారు. కొ.కు లాంటి ఎందరో బహుముఖ ప్రజ్ఞాశాలులు వందలాది వ్యాసాలతో దశాబ్దాల క్రితమే పాఠకులకు చలంచిత్ర రంగానికి చెందిన అన్ని అంశాలను పరిచయం చేసి వారి అవగాహనా పటిమను పెంచారు. అన్ని శాస్త్రాల లాగానే సినిమ నిర్మాణం లోఎన్నో సాంకేతికమైన మార్పులు చేర్పులు, చాలా కొత్తవిభాగాలు కాలక్రమంలో భాగాలవుతున్నాయి. నిర్మాతలు, నటీనటులకు ఈవిషయాల మీద పెద్ద అవగాహన అవసరంలేక పోయినా మిగిలిన సాంకేతిక నిపుణులకు, దర్శకుడికీ [...]

balance2 తొలి తెలుగు భారతీయ సినిమా పత్రిక – చిత్ర

తెలుగువారి సాహితీమాస పత్రిక భారతి,1939,సెప్టెంబరు నెల సంచికలో ఒక సినిమా పత్రిక గురించి పరిచయం చేసింది. పత్రిక పేరు ‘ చిత్ర ‘ సంపాదకుడు కే.వి.సుబ్బారావు. సినిమా పరిశ్రమ అభివృద్ధి నిమిత్తం వెల్వడిన ఈ మాసపత్రికా రత్నం మొదటి సంపుటం మొదటి సంచిక,జులై నెలది మా కార్యస్థానం చేరింది.ఇంగ్లీషులో సరే,పలు రంగుల మిరుమిట్లు గొలిపే ఇట్టి మాసపత్రికలెన్నో వున్నాయి.కానీ హిందూస్తానమంతలోనూ డిల్లీనుంచి వెలువడే “చిత్రపటమ”నే మాసపత్రిక తప్ప యావద్భారత సినిమాకళాభివృద్ధిని గురించి తెలిపే పత్రికే లేకుండేది ఆంధ్రదేశములో.ఇప్పుడు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories