|
అద్వితీయ ప్రతిభాశాలి సచిన్ భౌమిక్ ఇకలేరు
సినిమా అభిమానులకు,ముఖ్యంగా హిందీ చలనచిత్రప్రియులకు ఆశనిపాతం లాంటి వార్త.సచిన్ భౌమిక్ ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ రోజు అనగా ఏప్రిల్12 గుండెపోటుతో మరణించారు. నర్గీస్ నటించిన లజ్జావతి(1958) హిందీచిత్రాలకు రచన ఆరంభించిన సుమారు డెబ్భయ్ సినిమాలకు తనప్రతిభ తో ప్రాణం పోసారు.బహుశా భారతదేశం మొత్తం మీద ఏభాషాచలనచిత్ర పరిశ్రమ లో కూడా సచిన్ భౌమిక్ లా నూరుశాతం విజయవంతమైన సినిమాలను అందించిన వారు లేరనే చెప్పాలి. తాళ్, కరణ్ అర్జున్, సోల్జర్, కోయి మిల్ గయా, క్రిష్, [...] |
|
శ్యామ్ బెనెగళ్ తెలుగు సినిమాలు తీయలేడా? Part 1
మూఢనమ్మకాలపై ఆయన ప్రకటించిన యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? ‘అనుగ్రహం’పై తెలుగు ప్రేక్షకులకు ఆగ్రహమా? మనిషిని నమ్మకం ముందుకు నడిపిస్తుంది.మూఢనమ్మకం దిగజారుస్తుంది,దడిపిస్తుంది,వణికిస్తుంది. ఇది మతపిచ్చి మనిషిని పతనం చేసే మౌఢ్యం.మనదేశంలో ఈ పిచ్చి హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న మాట నిజం.రాజకీయనాయకుల.ధనవంతుల అండ దీనివెనుకాల ఉంది.రగులుతున్న సమస్యల్లో ఈ చాదస్తం కూడా ఒకటి.దేశభవిష్యత్తుకు,సమాజప్రగతికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్న తక్షణ సమస్య ఇది. మూఢనమ్మకాలు ఆత్మవిశ్వాసాన్ని,ఆత్మస్థైర్యాన్ని నశింపచేస్తాయి.వ్యక్తిత్వం కోల్పోతాడు మనిషి.ఆలోచనా శక్తి ఉండదు.పిరికిపందలా,పరాన్నభుక్కులా భయంతో అనుక్షణం గడుపుతుంటాడు. శ్యాం బెనెగల్‘అనుగ్రహం’చిత్రానికి తీసుకున్న,సామాజిక [...] |
|
గొప్పనటుడు,మానవతావాది ‘పాల్ న్యూమన్’
ఆ వార్త విని హాలీవుడ్ ఆశ్చర్యపోయింది,అమెరికా సినిమా పరిశ్రమతో సంబంధమున్న ప్రతివారూ నివ్వెరపోయారు,మరికొందరు మౌనంగా శాపనార్ధాలు పెట్టగా పలువురు సంతోషం పట్టలేక ధారాళంగా అభినందించారు. 2008 సంవత్శరం జనవరి 29న పాల్ న్యూమన్,జొయన్ని తమ యాభయవ వివాహవార్షికోత్శవాన్ని జరుపుకోనుండటమే ఆ సంచలనానికి కారణం.అమెరికాలో చలనచిత్ర పరిశ్రమ ప్రారంభమైన అన్ని యేళ్ళలో అటువంటి ‘విపరీతవార్త’కనీవిని ఎరుగని విడ్డూరమే మరి!నాలుగు,ఆరు,ఎనిమిది ఇలా అసంఖ్యాకంగా జరిగే పెళ్ళిళ్ళు,అక్రమసంబంధాలు,విపరీత లైంగిక ప్రవర్తనలు,మాదకద్రవ్యాలు,మాఫియాతో సంబంధాలు ఇలా ఒకటేమిటి ఎన్ని రకాల అవలక్షణాలు,అనారోగ్యకరధోరణులుండాలో అన్నీ సమృద్ధిగా [...] |
|
తెలుగు సినిమా వ్యాపార రహస్యం !
ఒక సినిమా విజయవంతం కావటానికి ఎన్ని కారణాలుంటాయో,అపజయం పాలుకావటానికి అంతకన్నా ఎక్కువే కారణాలు ఉండొచ్చు.అయితే అటు విజయానికీ,ఇటుపరాజయానికీ గల కారణాలు ఇవీ అని ఇతమిద్దంగా ఎవరూ చెప్పలేకపోవటమే సినిమా వ్యాపారంలో ఉన్న మిస్టరీ.ఆ మిస్టరీనీ ఛేదించటానికి సుమారు శతాబ్దకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.అవి చిత్రనిర్మాణంలో పాల్గొన్నవారు కావచ్చు,ఇతర నిపుణులు కావచ్చు,పత్రికలు,ఇతరమీడియా కావచ్చు.కానీ ఇంతవరకూ ఎవరూ ఖచ్చితమైన నివేదికను ఇచ్చిన దాఖలాలు లేవు. కాకుంటే ఒక సినిమా,రెండుసినిమాల జయాపజయాలను విశ్లేషించి ఫలానా కారణాల వల్ల ఇది సంభవించిదీ అని [...] |
|
పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 2
గతటపాలో విజయనిర్మల,దాసరి నారాయణరావుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించటానికి కారణం,పరభాషా చిత్రాలనుంచి కధలు,సన్నివేశాలు తీసుకున్నవాళ్ళు మరెవ్వరూ లేరనికాదు.నవలాచిత్రాలు,కధాచిత్రాలు,దేవుడే గెలిచాడు లాంటి మానావాతీత శక్తులను చూయించిన చిత్రాలు,పంచాయితీ అని ఒక చిత్రాన్ని పూర్తిగా ఔట్ డోర్ లో కేవలం పదంటే పదిరోజుల్లో తీసిన దర్శకురాలు విజయనిర్మల.ఉదాహరణకు ఆమె దర్శకత్వం వహించిన కవిత,సంఘం చెక్కిన శిల్పాలు,మీనా ల గురించి ఆసక్తి ఉన్నవారు ఎంతైనా పరిశోధన చేసుకోవచ్చన్నంత విషయం ఉన్నవి.అలాగే తాతా-మనవడు నుంచి త్వరలో విడుదలకానున్న యంగ్ ఇండియా వరకూ ఎన్నెన్నో సామాజిక [...] |
|
పైరసీ అనే ఒక పిచ్చ (కాపీ) కామెడీ కథ 1
1981 వ సంవత్శరం.అప్పటికి ఓ రెండేళ్ళ నుంచి మాంఛి ఫామ్ లో ఉన్న చిరంజీవి అనే యువనటుడు నటించిన ‘చట్టానికి కళ్ళులేవు’అనే సినిమా గల్లాపెట్టెల దుమ్మురేపుతుంది.చిరంజీవికి మాధవి జంటకాగా,సీనియర్ నటి లక్ష్మి అక్కగా నటించిన ఈ సినిమా తెలుగుసినిమాల్లో ముఖ్యంగా అప్పటికి కాస్త్ర వెనకబడి ఉన్న క్రైమ్ సినిమాలకు మరొక మారు కాస్త ఊపు తీసుకొచ్చింది.తన కుటుంబానికి అన్యాయం చేసిన విలనాసురలను ఎంతమాత్రం సాక్షాధారాలు లేకుండా హీరో మట్టుబెట్టటం అనేది ఇందులోని కొత్తపోకడ.బహుశా ఈ ఫార్ములాతో ఎన్నో [...] |
|
నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు?
కదిలే బొమ్మలు క్రమంగా చలన చిత్రంగా రూపుదిద్దుకున్న కొద్దికాలానికే సినిమా గురించిన వార్తలు, వాణిజ్య ప్రకటనలు, క్రమంగా ప్రివ్యూలు, సమీక్షలూ మొదలయ్యాయి. కొంచెంఅటూ ఇటూగా ప్రపంచ దేశాలన్నిటిలో ఇదే క్రమం కనిపిస్తుంది. సినిమాలకు సమీక్షలు అవసరమా అంటే నూటికి తొంభై భారతీయ సినిమాలకు అవసరం లేదు. ఆమాటకొస్తే హాలీవుడ్ లో కూడా పెద్దగా అవసరం లేక పోయినా అక్కడ సినిమా సమీక్ష అనేది పెద్ద పరిశ్రమగా, వందలాది మందికి, జీవనోపాధిగా మారటంతో దాని అస్థిత్వానికి తిరుగులేకుండా పోయింది. [...] |
|
GLOBAL: Heroes of HIV – a new series of IRIN short films
ఎయిడ్స్ మహమ్మారి బారినపడి నిత్యమూ వేలాదిమంది ప్రాణాలువదులుతున్నారు.హెచ్ ఐ వి గురించిన అవగాహన పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అహర్నిశలూ కృషి చేస్తున్నారు.వారిలో కొందరి గురించిన లఘుచిత్రాలు ఇవి.బాధ,ఆశ,నిర్లిప్తత,కార్యాచరణ,ఇలా అన్ని భావాలను సమర్ధవంతంగా,సమగ్రంగా చూయించేందుకు ప్రయత్నించిన ఈ లఘు చిత్రాలు మన నవతరంగం మిత్రులలో కొందరినైనా ఇటువంటి చిత్రనిర్మాణానికి పురికొల్పగలవన్న ఆశ నాకుంది. “Heroes of HIV” profiles people involved in the fight against HIV/AIDS. Their stories are sometimes sad, sometimes uplifting, [...] |
|
యస్.డి.బర్మన్ కూడానా?
సచిన్ దేవ్ బర్మన్! భారతదేశపు చలనచిత్రసంగీత దర్శకులలో ఆకాశమంతటి స్థాయి,ప్రతిభావ్యుత్పత్తులు గలమహానుభావుడు.హిందీసినిమాలకు ఎందరో అత్యుత్తమ సంగీతం అందించారు. నౌషాద్,ఒ.పి.నయ్యర్,సి.రామచంద్ర,రవి,హేమంత్ కుమార్,మదన్ మోహన్,ఖయ్యాం,సలీల్ చౌదరి,శంకర్-జైకిషన్,కళ్యాణ్ జీ-ఆనంద్ జీ,తదనంతరం లక్ష్మీకాంత్-ప్యారేలాల్,రవీంద్రజైన్,ఆర్.డి.బర్మన్ ఇలా అనంతమైన జాబితా ఉన్నప్పటికీ అందరిలోకి అగ్రగామి యస్.డి.బర్మన్. యస్.డి.బర్మన్ సినిమాకెరీర్ నో లేక ఆయన చలనచిత్రాలకు అందించిన సంగీతాన్ని గురించిన విశ్లేషణలను ఆయన నూటనాలగవ జయంతి అక్టోబరు ఒకటో తేదీన మరలా చర్చింకుందాము.ఇంతకీ ఈవ్యాసరచనకు గల ముఖ్య ఉద్దేశ్యాన్ని గురించి ముచ్చటించుకునేముందు ఈ గీతాన్ని చదివి చూసి [...] |
|
వరూధిని చిత్రప్రచారం సమీక్షలు
గత అక్టోబరు 27 న ఆ రోజుల్లో ఒప్పందాలు ఎలా ఉండేవి అన్న శీర్షికతో,నటసార్వభౌముడు సామర్ల వెంకట రంగారావు గారి మొదటి సినిమా `వరూధిని’అగ్రిమెంటు గురించి http://navatarangam.com/2008/10/actor-agreements/ మన పాఠకులకు అందించాము.అ సినిమాకు సదరు నిర్మాతదర్శకులు జరిపిన ప్రచారం గురించి ఇక్కడ తెలుసుకుండాం. |
|
సినీనటి భూమిక ‘మాయానగర్’
సినీనటి భూమిక నేతృత్వంలో ఒక సినిమా పత్రిక వస్తుందని కొన్ని పత్రికలు,వెబ్ సైట్లూ కొన్నాళ్ళనుంచి హోరెత్తిస్తున్నాయి.ఫలానా వారు వచ్చి ఆవిష్కరించారని మరలా హోరు మొదలయ్యాక,పెద్ద అంచనాలు లేకపొయినా ప్రారంభసంచికను దాచుకోవచ్చు కదా అని ఎప్పుడూ పత్రికలు కొనే షాపులో అడగ్గా మొదటి సంచిక అయిపోయిందండి,సెకండ్ ఇష్యూ ఉంది పట్టుకెళ్తారా అన్నారు వారు.సరే అని తీసుకొచ్చి తాపీగా చదివాను.పత్రిక పేరు‘మాయానగర్’గ్లాజీ పత్రిక,గ్లేజుడ్ పేపరు మీద కళ్ళు జిగేల్ మనిపించేలా ఉన్న ముద్రణ,ఇవ్వాళ మార్కెట్ లో ఉన్న చాలా సినిమాపత్రికల [...] |
|
చందమామలో భానుమతి ఉండాలొయ్
దివంగత పి.భానుమతి నవంబరు 1947 చందమామలో పాపాయిల కోసం రాసిన ఓ బుజ్జిగీతం ఉండాలోయ్ ఉండాలి పి.భానుమతి ఫిలింకు పాట పిల్లలకు ఆట రాజుకు కోట ఉండాలోయ్ ఉండాలి అత్తకు నోరు దేవుడికి తేరు స్టారుకు కారు ఉండాలోయ్ ఉండాలి స్టేజీకి తెర కత్తికి ఒర చేపకు ఎర ఉండాలోయ్ ఉండాలి యింటికి అమ్మ నిమ్మకి చెమ్మ కొలువుకి బొమ్మ ఉండాలోయ్ ఉండాలి తలుపుకి గడి దేవుడికి గుడి అవ్వకు మడి ఉండాలోయ్ ఉండాలి జూదరికి పేక [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |