కథే ప్రాణంగా ’కహాని’
ఒక సమకాలీన సమస్యను తీసుకొని, దాని పరిష్కారాన్ని యుగయుగాలుగా వేళ్ళూనుకుపోయిన ఒక విశ్వాసంలో నిలుపుతూనే, సార్వజనీనత కోల్పోకుండా ఒక కథ చెప్పటం కత్తి మీద సాములాంటిది. అవినీతి, ఉగ్రవాదం మొదలైన సమకాలీన సమస్యలతో వచ్చిన సినిమాలు ఉండనే ఉన్నాయి. వాటన్నింటిలో విభిన్నంగా నిలిచిపోయే సినిమా ఇవ్వాళ నేను చూశాననే నాకనిపిస్తుంది. ఆ సినిమా, బాలీవుడ్ తాజా విడుదల – ’కహాని’. ఇదో థ్రిల్లర్ సినిమా. మొదటి నుండి చివరి దాకా ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకునికి తెలుస్తూనే(…)















