Menu

pavan Archive

తెలుగు ఆడబడుచు మనసులో మాట – కలికి చిలకల కొలికి పాట

పల్లవి: కలికి చిలకల కొలికి మాకు మేనత్త; కలవారి కోడలు కనకమాలక్ష్మి అత్తమామల కొలుచు అందల అతివ; పుట్టిల్లు ఎరుగని పసిపంకజాక్షి అనుపల్లవి: మేనాలు తేలేని మేనకోడలిని, అడగవచ్చా నిన్ను ఆడ కూతురిని వాల్మీకినే పోలు వరుస తాతయ్య, మా ఇంటికంపించవయ్య మావయ్యా ||కలికి చిలకల|| చరణం: ఆ చెయ్యి ఈ చెయ్యి అద్దగోడలికి, ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి నేటి అత్తమ్మా నాటి కోడలివి, తెచ్చుకోమాయమ్మ నీదు ఆ తెలివి తలలోని నాలుకై తల్లిగా చూసి, పూలల్లొ

సినిమాని సినిమాగా చూడడం

పాట పాడుకుంటే సినిమా పాటే అవుతోంది, మాటలో చమత్కారం దొర్లితే సినిమా నుంచి రిఫరెన్స్ ఉంటోంది, సరదాగా ఎక్కడికైనా వెళ్ళబోతే చాలాసార్లు సినిమానే అవుతోంది, సెలబ్రెటీల లిస్టు చెప్పమంటే పదిమందిలో కనీసం ఆరేడుగురు సినిమావాళ్ళే ఉంటారు. మన నిత్యజీవితంలో ఇంతగా ప్రభావం చూపిస్తున్న సినిమా, నిజానికి మనలో ఎలాంటి ఆలోచనలు విత్తుతోంది, ఎటువంటి అభిరుచులు మప్పుతోంది, ఏమేం ధోరణులు చెప్తోందని పరిశీలించబోయిన ప్రతివారికి రెడీగా ఎదురయ్యే సమాధానం – సినిమాని సినిమాగా చూడండి. ప్రపంచవ్యాప్తంగా సినిమా అనే

మేఘ సందేశ సినీ కావ్యం

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్ద: పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు: తచ్ఛేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాణి అందమైన వస్తువును చూసినప్పుడు, మధురమైన శబ్దం విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా తెలియని ఆవేదన కలుగుతుంది. బహుశా ఆ సమయంలో, ఆ ప్రాణి మనసులో మరచిపోయిన గతజన్మ అనుబంధాలు కలతపెడుతుంటాయి.  -కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం. నూటికి తొంభైమంది జీవితాలు తామేమిటో, తమలో ఉన్న తపనేమిటో తెలియకుండానే గడచిపోతుంటాయి. ఒకవేళ తెలిసినా పరిస్థితుల మూలంగా

North by Northwest

కొంత తక్కువ ఎత్తులో ఎగురుతూ, పొలాలకు పురుగుల మందు కొట్టే క్రాప్ డస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ హఠాత్తుగా ఓ మనిషిని గుద్ది చంపడానికి కిందికి దిగి, పరుగులు పెట్టిస్తుంది. అమెరికా జాతీయ నాయకుల బొమ్మలు చెక్కిన రష్మోర్ పర్వతం మీద నుంచి ఆ నాయకుల ముఖాల మీదుగా హీరోహీరోయిన్లు విలన్లతో పోరాటం చేస్తూ దిగుతూంటారు. ఒకపక్క ఇలాంటి విచిత్రమైన ఐడియాలు, మరోపక్క, సినిమా మూడ్ ని పట్టుకున్న థీమ్ మ్యూజిక్, విషయం ఏంటి అనేది ఒకేసారి కాక