News back to homepage

Best Filminute_MISSING ఒక్క నిమిషం సినిమాల పోటీ – 2010

ఒక నిమిషం సినిమాపోటీలు 2010 సంవత్సరానికి గానూ మొదలైపోయాయి. ఆగష్టు 20 ఆఖరి తేదీ. పోటీకి పంపాల్సిన సినిమాల నియమాలు కొన్ని క్రింద ఉన్నాయి. మిగతా వివరాలకు ఈ లంకె నొక్కండి. 10 Points to Consider Your film must be 60 seconds – no more, no less. Produce your one-minute piece at broadcast quality. Consider your viewing audience – from mobile phones, to broadband [...]

21 027 వేశ్యావృత్తిపై … మై ఔర్ మేరీ సచ్చాయీ : నేను నా నిజం

హైదరాబాద్ ఫిల్మ్ సర్కిల్స్ లో రాజేష్ టచ్ రివర్ పేరు తెలీనివాళ్ళు చాలా తక్కువమంది. ఒక  ఫిల్మ్ మేకర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా, షార్ట్ ఫిల్మ్ మేకర్ గా, మ్యూజిక్ వీడియో దర్శకుడిగా అందరికీ పరిచయమున్నా, రాజేష్ పేరు ఎక్కువసార్లు తలుచుకునేది మాత్రం సామాజికస్పృహ ఉన్న  ఫిక్షన్ లేక డ్రామాల గురించి మాట్లాడుకునేప్పుడు.  బోరుకొట్టే డాక్యుమెంటరీలు, కేవలం మెదడు ఇంట్లోపెట్టొచ్చి చూసే సినిమాల మధ్యన డాక్యుమెంటరీల నిజాన్ని, చక్కెరగుళికల్లాంటి కథనంతో తెరకెక్కించే నైపుణ్యం రాజేష్ [...]

sampno ke desh me స్క్రిప్టు నుంచీ స్క్రీన్ వరకూ డిజిటల్ – సప్నోం కే దేశ్ మే

చేతన్ షా దర్శకత్వంలో వస్తున్న పూర్తిస్థాయి ఇండిపెండెంట్ డిజిటల్ సినిమా ‘సప్నోం కే దేశ్ మే’ – కలల దేశంలో. ‘Sapno Ke Desh Mein’ (CBFC ‘U’. 106 minutes) is about a group of college students who think that a harmless prank has resulted in their Dean’s death. They cover their tracks making it look like an accident but as the [...]

wp-6raktacharitra800 రక్త చరిత్ర – టీజర్

“యుద్దానికి కారణం ఏదైనా గెలుపు ప్రధానం. గెలుపు శాశ్వతం కాదు. ఓడినవాడు మరోసారి గెలవొచ్చు. గెల్చినవాడు మళ్ళీ ఓడిపోవచ్చు. ఇక్కడ ఎవడు తప్పు ఎవడు కరెక్టు అనేదానికన్నా, వారివారి ధృక్కోణాల్లో నుంచీ కథ చెబితే ఎలా ఉంటుంది అనేదే రక్తచరిత్ర సినిమా” – రామ్ గోపాల్ వర్మ. పరిటాల రవి -  మద్దెలచెరువు సూరి ల నిజజీవిత కథను నాటకీయత జోడించి సినిమాగా వర్మ తెరకెక్కించడం మొదలెట్టిన్నపటినుండీ వివాదాలతో పాటూ ఆసక్తిని రేకెత్తించింది.  వివేక్ ఒబెరాయ్, సూర్య, [...]

privatelessons6131ls ప్రైవేట్ లెస్సన్స్ – ఒక ‘కల్ట్’ సినిమా

1988-89 లో అనుకుంటాను మా చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా చిన్న టౌన్లలో అర్లీమార్నింగ్ షోలూ (ఉదయం 8.45) ఈవెనింగ్ షోలూ (సాయంత్రం 5.00) మొదలయ్యాయి. ఎవరికి వచ్చిన ఆలోచనోగానీ, మామూలు నాలుగాటల సినిమా ఏదైనా మెయిన్ స్ట్రీం సినిమా వేసి, ఈ ఖాళీసమయాన్ని చిన్న నిడివి ఉండే ఇంగ్లీషు సినిమాలతో నింపేవాళ్ళు. అంటే రోజుకు ఆరుషోలన్నమాట. ముఖ్యంగా ఈ షోలు శుక్ర,శని,ఆది వారల్లో అంటే వారాంతరాలాల్లో ఎక్కువగా ఉండేవి.  జాకీచాన్ సినిమాలు, షావోలిన్ కుంఫూ సినిమాలు, ఇంకా [...]

prasthanam_11 గమ్యానికి చేరువగా ‘ప్రస్థానం’ (సమీక్ష)

తొంబై దశకంలో వచ్చిన  కోడిరామకృష్ణ తరహా అచ్చతెలుగు ఆంధ్రా పొలిటికల్ థ్రిల్లర్ల తరువాత శంకర్ తరహా “అవినీతిని అంతంచేద్ధాం!” టైపు ఫాంటసీ ఆదర్శాల సినిమాలొచ్చాయి. మొన్నమొన్న వచ్చిన ‘లీడర్’ కూడా శంకర్ తరహా ఫాంటసీకి మరోరూపం. కానీ దేవకట్టా ‘ప్రస్థానం’ ఒకడుగు పక్కకొచ్చి పొలిటికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ జాన్రా ను తెలుగు తెరకు పరిచయం చేసింది. ‘రాజకీయ వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించడమో లేక ఫాంటసీ సొల్యూషన్లు ఇవ్వడమో ఈ సినిమా ఉద్దేశం కాదు. రాజకీయనేపధ్యంలో ఒక కుటుంబ [...]

Picture1 ‘మహా’ ప్రస్థానం

ప్రస్థానం సినిమా చూసి బయటకు రాగానే నాకొచ్చొన ఫీలింగ్, “ఎంత కాలానికి తెలుగులో మంచి సినిమా చూశానూ!” అని. ఆ తరువాత నిజంగానే ఆలోచించా, “ఈ మధ్యకాలంలో నాకు బాగానచ్చిన తెలుగు సినిమా ఏమిటా?”. గుర్తుకురాలేదు… నిజంగా….అస్సలు గుర్తుకురాలేదు. అందుకే “తప్పక చూడండి” అని చెప్పడానికి ఇది రాస్తున్నాను. ప్రస్థానం…DON’T MISS IT. నటీనటులు: శర్వానంద్‌, రూబి పరిహార్‌, సందీప్‌ కిషన్‌, కిషోర్‌, జయప్రకాష్‌ రెడ్డి, జీవా, పవిత్రా లోకేష్‌, సురేఖావాణి తదితరులు. సంగీతం: మహేష్ సంకర్ [...]

angaditheru అంగడి తెరు (తమిళ్) – అద్భుతం !

గత పది సంవత్సరాలుగా మనకళ్ళ ముందే కొన్ని వందల షాపింగ్ మాల్స్ వచ్చేశాయి. వచ్చేపొయ్యేవాళ్ళ హడావుడి. సంతను మరిపించే సందడి. ఉత్సవాన్ని గుర్తుతెచ్చే ఒరవడి.సూపర్ మార్కెట్ల జిలుగుల్లో, నియోన్ లైట్ల వెలుగుల్లో మనల్ని మనం మర్చిపోయి వస్తువులతో పాటూ అనుభవాల షాపింగ్ చేసుకొచ్చేయ్యడమే మనకు తెలిసిన ఆనందం. ఆ అందమైన అనభవాన్ని మనకు అందించేవారి వెనుక కొన్ని చీకటి కోణాలుంటాయని గానీ, కొన్ని వందల బ్రతుకులు అడకత్తెరలో పోకచెక్కల్లా మారిపోయాయని మనకు తెలీదు. బహుశా తెలియాల్సిన అవసరం [...]

23-712154-712172 ఒరే కడల్ (2007)… ఒక అనుభవం

నవతరంగంలో ఒక వ్యాసానికి వ్యాఖ్యానిస్తూ, ‘గడ్డిపూలు’ సుజాతగారు మళయాళ సినిమా “ఒరే కడల్” చూసి  నన్ను సమీక్షించమన్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి వినివున్నా, బలంగా చూడాలనే కోరిక కలగక ప్రయత్నించలేదు. కానీ, సుజాతగారి కోరిక విన్నతరువాత, పనిగట్టుకుని, ఒక మిత్రుడిచేత కేరళ నుంచీ DVD తెప్పించుకుని మరీ చూసాను. తీరాచూసిన తరువాత, ఈ మధ్యకాలంలో, ‘నాక్కొంచెం మతిపోగొట్టిన సినిమా ఇదే’ అని నిర్ధ్వందంగా అనుకున్నాను. ఎవరూ సినిమాగా తియ్యడానికి సాహసించలేని కథ. కష్టమైన కథను వీలైనంత [...]

love_sex_aur_dhokha_01_10x7_30277_420x315 LSD – హిందీ సినిమా పెద్దమనిషి అయ్యింది !

నిన్నరాత్రి సెకండ్షో చూసొచ్చాను. సినిమా పేరు ‘లవ్ సెక్స్ అన్డ్ ధోకా’. సినిమా ప్రారంభమగానే కాసేపు నవ్వుకున్నాను. తరువాత అబ్బురపడ్దాను… ఫిల్మ్ మేకర్ ఆలోచనను అభినందించాను. సినిమాను ఆనందించాను. సినిమా అయిపోయిందేమో అనిపించినప్పుడు ‘పక్కవాళ్ళు ఏమనుకుంటారో’ అని చూడకుండా చప్పట్లు కొట్టాను. కానీ నాతోపాటూ థియేటర్లో చాలా మంది చప్పట్లు కొట్టడంతో ఈ సినిమా పవరేమిటో అర్థమయ్యింది. రాత్రి నిద్రపట్టింది. ఇప్పుడే నిద్ర లేచి ఇదొక మాస్టర్ పీస్ అని డిసైడ్ అయ్యాను. మాస్టర్ పీస్ అనగానే [...]

DigitalCinemaRioSilverTitle2mock డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

గత పదేళ్ళుగా “డిజిటల్ సినిమా వచ్చేసింది ! వచ్చేసింది!!” అని వినడమేగానీ నిజంగా ప్రధానస్రవంతి చిత్రాలను అది ఎంతగా ప్రభావితం చేసింది అనేది ప్రశ్నార్థకమే. ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీరికార్డింగ్, కలరింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం విరివిగా పెరిగినా అది కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితమే తప్ప  మన సినిమా కంటెన్ట్ (కథాకథనం)లో తెచ్చిన మార్పు పెద్దగా కనిపించదు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్ల సంఖ్య పెరిగినా సినిమాల డిస్ట్రిబ్యూషన్లో [...]

Oscar 2 82 వ ఆస్కార్ అవార్డులు

ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది. అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories