Menu

mahesh Archive

ఇద్దరు ప్రేమికులు చేసిన ఒక మర్డర్ కథ : నాట్ ఎ లవ్ స్టోరీ

“కోయీ ఖుద్ సె బురా నహీ హోతా,పల్ తో కిసీకా సగా నహీ హోతా” అనేది రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాలోని పాట సాహిత్యం. తెలుగులో చెప్పాలంటే ‘మనంత చెడ్డ మరెవరూ కారు, ఆ క్షణం ఎవడబ్బ సొత్తూ కాదు’ అని. అదే ఈ సినిమా కథ కూడా. అనుకోని క్షణంలో జరిగే ఒక ఘటన ఇద్దర్ని హంతకుల్ని చేస్తే మరొహరిని హతుడిని చేస్తుంది. ప్రేమికులు హంతకులైతే, ఒక

కాటేసిన ‘కందిరీగ’

‘దడ’దెబ్బకు ఝడిసి తెలుగు సినిమాలకు మస్కా కొట్టాలనుకున్న నాకు బాగుంది బాగుందని చాలా మంది రొదపెట్టేసరికీ, ఓహో తియ్యగా కుట్టిందేమో అన్న అపోహతో కందిరీగకు వెళితే, అది తీరా కసితీరా కాటేసిన అనుభవం ఎదురయ్యింది. ఆకట్టుకునే చివరి ఇరవై నిమిషాలు తప్ప  మిగతా అంతా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే నా బాధలో తెలుగు ప్రేక్షకుడి అల్పసంతోషం 70 mm స్క్రీన్ మీద కనిపించింది. పరమ బేవార్స్, శాడిస్ట్ ఉంటున్న ఊరికే శనిగాడైన విలన్ లాంటి హీరో‘రామ్’. అతగాడి

జిందగీ న మిలేగీ దుబారా: Must watch

జీవననైరాశ్యాలని జీవితం చేసుకుని రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంజారి జీవన సత్యాల్ని నూతనజవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణం “జిందగీ న మిలేగీ దుబారా”. తప్పక చూడండి. మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని

సైద్దాంతిక గందరగోళం “విరోధి”

నక్సలైట్లు/మావోయిస్టులు ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసే నేపధ్యంలో ఉన్న సినిమా అనగానే కొంత విషయంపై చర్చ, సామాజిక స్పృహ, ప్రస్తుతం నెలకొని ఉన్న సైద్దాంతిక గందరగోళంపై విమర్శ లాంటివి ఉంటాయని ఆశించివెళితే, కథ కంగాళీ అయి, మావోయిస్టుల సైద్దాంతిక కల్లోలమే కథనంలో కలగలిసి మంచి ప్రయత్నంగానే తప్ప గుర్తుపెట్టుకోదగ్గ సినిమాగా మిగిలిపోని చిత్రం ‘విరోధి’. ‘షో’ నుంచీ ‘మిస్టర్ మేధావి’ వరకూ సైకలాజికల్ డ్రామాలను సినిమాలుగా తీర్చిదిద్దగల నేర్పరిగా పేరొందిన దర్శకుడు నీలకంఠ లేటెస్ట్ చిత్రం విరోధి.

దృశ్యమేతప్ప కావ్యంలేని ప్రేమకథ : 180 (ఈ వయసిక రాదు)

నటీనటుల కాంబినేషన్ నుంచీ టైటిల్ డిజైన్, ప్రోమోలవరకూ విపరీతమైన ఆశల్ని, క్రేజ్ ని ఈ మధ్యకాలంలో సంపాదించుకున్న చిత్రం  180 (ఈ వయసిక రాదు). ముఖ్యంగా ప్రోమోలు, పాటల్లోని దృశ్యాల పొందిక టివిల్లోచూసిన ఎవరైనా ఖచ్చితంగా ఇదొక దృశ్యకావ్యమని నిర్ణయించుకోవడంలో ఎలాంటి తప్పూలేదనుకుంటాను. ఇదొక గొప్ప ప్రేమకథ అని సిద్దార్థ పదేపదే చెప్పడం, ఇద్దరు అందమైన హీరోయిన్లూ తమ చిలక పలుకులతో ఆ విషయాన్ని నొక్కివక్కాణించడంతో ఒక దృశ్యకావ్యాన్ని చూద్దామన్న ఆశతో వెళ్ళిన ప్రేక్షకుడికి కొంత నిరాశ