Menu

mahesh Archive

అసంపూర్ణ కళాఖండం- రాక్ స్టార్

ఒక కళాకారుడిలోని నిజమైన కళ బయటికిరావాలంటే జీవితం తెలియాలి. బాధ తెలియాలి. ప్రేమ తెలియాలి. గుండెపగలటం తెలియాలి. విరహంలో రగలటం తెలియాలి. సమాజం వెలి తెలియాలి. వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడటం తెలియాలి. స్వేఛ్ఛతెలియాలి. విహంగంలా ఎగరటం తెలియాలి. మొత్తంగా జీవితంలోని ఘాఢత తెలియాలి. అప్పుడే ఒక సంపూర్ణకళాకారుడు జన్మిస్తాడు. అలాంటి కళాకారుడైన ఒక గాయకుడి జీవిత కథ రాక్ స్టార్. రన్బీర్ కపూర్ అద్భుతమైన నటన, ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభ, ఏ.ఆర్.రహమాన్ సంగీతం ఈ సినిమాని

పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’

సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా  పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని

గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ – “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా. ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం. కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే… పరిచయమున్నవాళ్ళు అయితే… బాగా కావలసినవాళ్లైతే… మనం ప్రేమించినవాళ్లైతే… ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు

పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ

చారిత్రకజానపదం “ఉరుమి”

పోర్చుగీసు నావికుడు, వైస్రాయ్ వాస్కోడిగామా గురించి భారతదేశానికి సముద్రమార్గం కనుక్కున్న మహావ్యక్తిగానే మనకు చరిత్రలో తెలుసు. కానీ ఆ చరిత్ర చెప్పని సత్యం అతడి క్రూరత్వం, అధికారలాలస, కుతంత్రం. విజేతల చరిత్రలో ఈ అంశాలకు చోటులేకుండా పోయింది. జనపదాల్లో, జానపదాల్లో ఇది కథగా మిగిలిపోయింది. అలాంటి ఒక కథే ఉరుమి. పదహారవ శతాబ్ధపు కేరళలో వాస్కోడిగామా దురంతాలకు బలైన ఒక పిల్లవాడు, పెరిగి పెద్దవాడై, నవ యువకుడై వాస్కో ను చంపాలనుకుని చేసే ప్రయత్నాల గాధ ఈ