Menu

mahesh Archive

అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సీక్రెట్ ‘ఏజంట్ వినోద్’

విచ్చినమైన రష్యానుంచీ ఒక సూట్ కేస్ న్యూక్లియర్ బాంబ్ ఓపన్ మార్కెట్ లోకి వచ్చింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలన్నిటికీ అది కావాలి. అది ఎవరి చేతిలో పడినా ఒక మహావిస్ఫోటనం తధ్యం. ఒక మహానగరంలో మంటలు రేగడం ఖాయం. కొన్ని లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితం. ఈ ప్రమాదాన్ని ఆపాల్సిన బాధ్యత భారతీయ ‘రా’ ఏజంట్ వినోద్ ది. తొమ్మిది దేశాలు, ఎన్నో ప్రయాణాలు, మరెన్నో ప్రమాధాల నుంచీ తప్పించుకుని ఆ బాంబుని కనుక్కుని అది

ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.  

జానపద హీరో ‘రాజన్న’

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ

ఆత్మ ఉన్నకథ ‘మయక్కమ్ ఎన్న’

హాబీఫోటోగ్రఫర్ గా ఉంటూ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఒక గమ్యం వైపు ఎదగాలనుకునే ‘కార్తీక్ స్వామినాథన్’ అనే ఒక సాధారణ యువకుడి గతుకులప్రయాణం “మయక్కమ్ ఎన్న” సినిమా పేరే తెలుగులో చెప్పాలంటే ‘ఎందుకీ మత్తు?’. తన సామర్థ్యం తనకే తెలీని మత్తో, కేర్ లెస్ నెస్ మత్తో, సామాజికచట్రలో ఇమిడి ఎగదాలంటే ఏంచెయ్యాలో తెలీని మత్తో, స్నేహాల మత్తో, అర్థంకాని ప్రేమానుబంధాలమత్తొ, తాగుడుమత్తో…చివరికి విజయం మత్తో… మొత్తానికి జీవితం మత్తోగానీ అన్నిటినీ కలగలిపిన ఒక జీరోటూ

Cult classic – RAAKH

కొన్ని సినిమాల్నే “టైం లెస్” అంటాం. ఒక్కోసారి వాటి సబ్జెక్ట్ అలా ఉంటే ఒకోసారి ఎంత టెక్నాలజీ మారినా ఇప్పటికీ కొత్తసినిమాలాగానే ఉండే సినెమాటిక్ అచీవ్మెంట్ చేసిన సినిమాలు అలా ఉంటాయి. రెంటినీ కలిపిన అరుదైన కల్ట్ క్లాసిక్స్ కొన్నే ఉంటాయి. ఒకవైపు బలమైన కథాంశం, మరోవైపు సాంకేతిక నైపుణ్యం కలగలిపిన టైం లెస్ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్ “రాఖ్”. చిత్రమేమిటంటే ఈ విషయం దర్శకుడికి ముందే తెలుసేమో అన్నట్టు, కథ ఒక కాల్పనిక కాలంలో, కాల్పనిక