Menu

mahesh Archive

మణిరత్నం హ్యాంగోవర్ తో “అందాల రాక్షసి”

  మౌనరాగం-గీతాంజలి-ప్రేమిస్తే సినిమాలు చూశారా! బహుశా మొదటి రెండూ ఈ తరంవాళ్ళు చూసుండరు. అందుకే వీటిని కలగలిపి ఈ తరంవాళ్ళ కోసం కొత్తప్యాకేజిలో కాకుండా అవే సినిమాల్ని అదే పాత ప్యాకేజిలో కొత్త నటీనటులతో తీసిన అందమైన రాకాసి (బడ్జెట్) సినిమా “అందాల రాక్షసి”. సినిమా కథాకాలంకూడా 1991-92 కాబట్టి బహుశా ఆ కాలపు భావావేశాల్ని పండించడానికి తీసిన ఒక మిథికల్ లవ్ స్టోరీగా చెప్పుకోవచ్చు. గౌతమ్ (రాహుల్ రవీంద్రన్) డబ్బున్న కుర్రాడు. మిథున(లావణ్య) అనే అమ్మాయిని

అతిశయోక్తుల “జులాయి”

హీరోకి విలన్ ఒక ఛాయారూపం మాత్రమే. ఇద్ధరి వేగం, ఆలోచన, శక్తి సమానమే కానీ ఉద్దేశాలే హీరోని హీరో చేస్తే విలన్ ని విలన్ గా మిగులుస్తాయి. ఇలాంటి ఫ్రార్మాట్ లో హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. సోనూసూద్ లాంటి స్మార్ట్ విలన్స్ బొంబాయి నుంచీ దిగుమతి అయ్యాక విలన్ ప్రాధాన్యతతో కొన్ని (కందిరీగ లాంటి) సినిమాలు వచ్చినా, విలన్ హీరోకి ఒక ఆల్తర్ ఇగో అనేస్థాయి ట్రీట్మెంట్ తో వచ్చిన సినిమా ఇదే. కథాకథనపరంగా ’జులాయి’

దివ్యమైన మిక్సప్ – కాక్ టెయిల్

వెరోనికా (దీపికా పడ్కోనే) గౌతమ్ (సైఫ్ అలీ ఖాన్) ని ప్రేమిస్తే గౌతమ్ మీరా(డయానా పెంటీ)ని ప్రేమిస్తాడు. అబ్బే! రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనిపిస్తోందా? ఇక్కడే రచయిత ఇంతియాజ్ అలీ తన వైవిధ్యం చూపిస్తాడు. వెరోనికా-గౌతమ్-మీరా ముగ్గురూ కలిసి ఒక ఫ్లాట్లో ఉంటారు. వెరోనికా-గౌతమ్ లు సహజీవనం చేస్తుంటారు. కానీ గౌతమ్, శారీరకంగాకలిసి ఉంటుంన్న వెరోనికాతో కాకుండా వెరోనికా స్నేహితురాలైన మీరాతో ప్రేమలో పడతాడు. వెరోనికా స్నేహం పోగొట్టుకోలేక,తనను మోసం చేస్తున్నానేమో అనే ఫీలింగ్ లో

కొంత ఆశ కొంత నిరాశ మిగిల్చిన భాగాహారం : సశేషం

ఆలోచన కొత్తగా ఉన్న ఆచరణలలో కొత్తదనం లేకపోతే ఏ లెక్కలో అయినా తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా భాగాహారంలో శేషాలు మిగలకూడదు. నిశ్శేషంగా మిగిలితేనే లెక్క సక్సెస్.   ఆమధ్య వచ్చిన ‘వైశాలి’ లాంటి జాన్రా మిక్సింగ్ తరహా కథతో వచ్చిన సశేషం సినిమా వెనకనున్న ఆలోచన చాలా విన్నూత్నంగా ఉంటుంది. కానీ సస్పెన్స్ జాన్రా నుంచీ, సైకో జాన్రా మీదుగా హార్రర్ రివీల్ అయ్యేసరికీ ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో వచ్చే హాస్యం కొంత

మూసలోకూడా ఒదగని ‘రచ్చ’

ఐదు ఫైట్లు, ఆరు పాటలు, వీలైనంత మంది కామెడియన్సూ, సాధ్యమైనన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ, ఫ్యూడల్ ఫ్లాష్ బ్యాక్, కథకు సంబంధం లేకుండా సినిమా అంతా స్లీప్ వాకింగ్ చేసే హీరో, కథతోపాటూ కథానాయకుడి గమ్యాన్నీ నిర్దేశించే ఆపద్ధర్మ హీరోయిన్ ఇవి ‘రచ్చ’ సృష్టించిన కొత్త కమర్షియల్ సినిమా ఫార్ములా. మాస్ సినిమాలు అనబడే ఫార్ములా చిత్రాలు చాలా అవసరం. ఎందుకంటే, అవి అసెంబ్లీలైన్ ప్రొడక్షన్స్ లాంటివి. సఫల ప్రయోగాల ఆధారంగా తయారయ్యే ప్రోడక్టుల్లాంటివి. అందుకే చిరంజీవి,