News back to homepage

images ఒక రచయిత కృషి “ఋషి”

ప్రసాద్ ప్రొడక్షన్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నిర్మాణరంగంలోని అడుగుపెట్టాలనుకుంటే ఖచ్చితంగా అచితూచి అడుగేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. దానితోపాటూ అలాంటి నిర్మాణ సంస్థని ప్రేరేపించి, మళ్ళీ ఒక సినిమా తియ్యాలనే కోరిక కలిగేలా చేసిన కథకుడూ దర్శకుడూ రాజ్ మాదిరాజు ప్రతిభని కూడా అంచనా వెయ్యొచ్చు. ఈ నమ్మకం, అంచనాతోపాటూ, “మెడిసన్ ఒక తపస్సు. డాక్టర్ ఒక ఋషి” అంటూ ప్రోమోలు కలిగించిన ఆసక్తితో థియేటర్ కి వెళితే వేటినీ నిరాశపరచని చిత్రం ‘ఋషి’.   [...]

Rajanna Movie Wallpapers జానపద హీరో ‘రాజన్న’

చాలా రోజుల తరువాత తెలుగులో ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని మిగిల్చిన చిత్రం ‘రాజన్న’. ఒక కాల్పనిక జానపద హీరో కథని చారిత్రక నేపధ్యంలో సృష్టించి ఆ కాలపు చరిత్రతోపాటూ, స్థానిక సంస్కృతిని, నమ్మకాలను, జనపద ఒరవడులను అల్లుకుంటూ హృద్యమైన కథ చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నం. ప్రధానకథ ఊరిమంచి కోసం ప్రధానమంత్రి నెహ్రూకి దొరసాని దౌర్జన్యాల్ని వివరించడానికి చిన్నారి మల్లమ్మ (బేబి ఆనీ) చేసే అద్వితీయ ప్రయాణానిదే అయినా, ఉపకథగా మల్లమ్మ తండ్రి రాజన్న(నాగార్జున) సాహసగాధ [...]

ma ఆత్మ ఉన్నకథ ‘మయక్కమ్ ఎన్న’

హాబీఫోటోగ్రఫర్ గా ఉంటూ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా ఒక గమ్యం వైపు ఎదగాలనుకునే ‘కార్తీక్ స్వామినాథన్’ అనే ఒక సాధారణ యువకుడి గతుకులప్రయాణం “మయక్కమ్ ఎన్న” సినిమా పేరే తెలుగులో చెప్పాలంటే ‘ఎందుకీ మత్తు?’. తన సామర్థ్యం తనకే తెలీని మత్తో, కేర్ లెస్ నెస్ మత్తో, సామాజికచట్రలో ఇమిడి ఎగదాలంటే ఏంచెయ్యాలో తెలీని మత్తో, స్నేహాల మత్తో, అర్థంకాని ప్రేమానుబంధాలమత్తొ, తాగుడుమత్తో…చివరికి విజయం మత్తో… మొత్తానికి జీవితం మత్తోగానీ అన్నిటినీ కలగలిపిన ఒక జీరోటూ [...]

oosaravelli_telugu_movie_wallpapers పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’

సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా  పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని [...]

engeyum-eppodhum--0102 గుర్తుపెట్టుకోవలసిన యాక్సిడెంట్ – “ఎంగెయిమ్ ఎప్పోదుమ్”

భారతదేశంలో సగటున ప్రతి సంవత్సరం 1,30,000 మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతారనేది ఒక అంచనా. ప్రతిరోజూ మనం ఇలాంటి ప్రమాదాల గురించి పేపర్లో చదువుతూ ఉంటాం. ఎంత మంది చనిపోయారో లెక్కలు వింటూ ఉంటాం. కానీ ఆ చనిపోయినవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళైతే… పరిచయమున్నవాళ్ళు అయితే… బాగా కావలసినవాళ్లైతే… మనం ప్రేమించినవాళ్లైతే… ఆ వార్త అక్షరాలు కన్నీళ్ళవుతారు. అంకెలు గుండెల్ని తూట్లు పొడుస్తాయి. ఇలాంటి అనుభవాన్ని రెండు హృద్యమైన ప్రేమకథలతో ముడివేసి, మనం ఖచ్చితంగా మరోసారి రోడ్డెక్కినప్పుడు [...]

small_friends_with_benefits_movie_poster పోస్టర్ లో ఏముంది…!

పోస్టర్ ని చూసి సినిమా కథ చెప్పేరకాలు ప్రతి ఫ్రెండ్షిప్ గ్రూప్ కీ ఖచ్చితంగా ఒకడుండేవాడు ఒకప్పుడు. నిజానికి ఒక్కోసారి సినిమా కంటే ఈ కథలల్లేవాళ్ళ కథకుల కథలే బాగుండేవి. కానీ ఇప్పుడూ! పోస్టర్ చూస్తే కథకాదుకదా కనీసం సినిమా దేని గురించో కూడా తెలియట్లేదు. రాంగోపాల్ వర్మ ‘దెయ్యం’ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజైనప్పుడు జె.డి.చక్రవర్తిని ఎవరో మీడియా వాళ్ళు అడిగారట “సినిమాలో హీరోవి నువ్వేకదా, నువ్వు లేకుందా పోస్టరేంటి?” అని. దానికి జె.డి. వర్మ [...]

Urumi Telugu Movie Review  Rating 3.75  Analysis  Talk  Story  Report చారిత్రకజానపదం “ఉరుమి”

పోర్చుగీసు నావికుడు, వైస్రాయ్ వాస్కోడిగామా గురించి భారతదేశానికి సముద్రమార్గం కనుక్కున్న మహావ్యక్తిగానే మనకు చరిత్రలో తెలుసు. కానీ ఆ చరిత్ర చెప్పని సత్యం అతడి క్రూరత్వం, అధికారలాలస, కుతంత్రం. విజేతల చరిత్రలో ఈ అంశాలకు చోటులేకుండా పోయింది. జనపదాల్లో, జానపదాల్లో ఇది కథగా మిగిలిపోయింది. అలాంటి ఒక కథే ఉరుమి. పదహారవ శతాబ్ధపు కేరళలో వాస్కోడిగామా దురంతాలకు బలైన ఒక పిల్లవాడు, పెరిగి పెద్దవాడై, నవ యువకుడై వాస్కో ను చంపాలనుకుని చేసే ప్రయత్నాల గాధ ఈ [...]

not-a-love-story-wallpaper-1 ఇద్దరు ప్రేమికులు చేసిన ఒక మర్డర్ కథ : నాట్ ఎ లవ్ స్టోరీ

“కోయీ ఖుద్ సె బురా నహీ హోతా,పల్ తో కిసీకా సగా నహీ హోతా” అనేది రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమాలోని పాట సాహిత్యం. తెలుగులో చెప్పాలంటే ‘మనంత చెడ్డ మరెవరూ కారు, ఆ క్షణం ఎవడబ్బ సొత్తూ కాదు’ అని. అదే ఈ సినిమా కథ కూడా. అనుకోని క్షణంలో జరిగే ఒక ఘటన ఇద్దర్ని హంతకుల్ని చేస్తే మరొహరిని హతుడిని చేస్తుంది. ప్రేమికులు హంతకులైతే, ఒక [...]

kandireega_movie_review_online_updated కాటేసిన ‘కందిరీగ’

‘దడ’దెబ్బకు ఝడిసి తెలుగు సినిమాలకు మస్కా కొట్టాలనుకున్న నాకు బాగుంది బాగుందని చాలా మంది రొదపెట్టేసరికీ, ఓహో తియ్యగా కుట్టిందేమో అన్న అపోహతో కందిరీగకు వెళితే, అది తీరా కసితీరా కాటేసిన అనుభవం ఎదురయ్యింది. ఆకట్టుకునే చివరి ఇరవై నిమిషాలు తప్ప  మిగతా అంతా ఎందుకొచ్చాన్రా భగవంతుడా అనే నా బాధలో తెలుగు ప్రేక్షకుడి అల్పసంతోషం 70 mm స్క్రీన్ మీద కనిపించింది. పరమ బేవార్స్, శాడిస్ట్ ఉంటున్న ఊరికే శనిగాడైన విలన్ లాంటి హీరో‘రామ్’. అతగాడి [...]

Zindagi-Na-Milegi-Dobara-2011-Movie-Posters జిందగీ న మిలేగీ దుబారా: Must watch

జీవననైరాశ్యాలని జీవితం చేసుకుని రాజీపడిన జీవితంలో ఆనందం వెతుక్కుంటున్న ముగ్గురు స్నేహితులు, ఎప్పుడో చేసుకున్న బాస కారణంగా ఒక విహారయాత్రని మొదలుపెడతారు. విహారం వినోదమై, వినోదం విన్నూత్న అనుభవమై, ఆ అనుభవం హృదయసంగమమై, ఆ సంగమంలో గుబులుతీరి, భయంజారి జీవన సత్యాల్ని నూతనజవసత్వాల్ని కూర్చుకునే ఒక హాయైన ప్రయాణం “జిందగీ న మిలేగీ దుబారా”. తప్పక చూడండి. మనమో లేక మనకు తెలిసిన ఇంకొకరో ఈ సినిమాలోని పాత్రల్లో కనపడకపోతే మీరు జీవించడం లేదనే కనీస సత్యాన్ని [...]

virodi సైద్దాంతిక గందరగోళం “విరోధి”

నక్సలైట్లు/మావోయిస్టులు ఒక జర్నలిస్టుని కిడ్నాప్ చేసే నేపధ్యంలో ఉన్న సినిమా అనగానే కొంత విషయంపై చర్చ, సామాజిక స్పృహ, ప్రస్తుతం నెలకొని ఉన్న సైద్దాంతిక గందరగోళంపై విమర్శ లాంటివి ఉంటాయని ఆశించివెళితే, కథ కంగాళీ అయి, మావోయిస్టుల సైద్దాంతిక కల్లోలమే కథనంలో కలగలిసి మంచి ప్రయత్నంగానే తప్ప గుర్తుపెట్టుకోదగ్గ సినిమాగా మిగిలిపోని చిత్రం ‘విరోధి’. ‘షో’ నుంచీ ‘మిస్టర్ మేధావి’ వరకూ సైకలాజికల్ డ్రామాలను సినిమాలుగా తీర్చిదిద్దగల నేర్పరిగా పేరొందిన దర్శకుడు నీలకంఠ లేటెస్ట్ చిత్రం విరోధి. [...]

180_movie_wallpapers1 దృశ్యమేతప్ప కావ్యంలేని ప్రేమకథ : 180 (ఈ వయసిక రాదు)

నటీనటుల కాంబినేషన్ నుంచీ టైటిల్ డిజైన్, ప్రోమోలవరకూ విపరీతమైన ఆశల్ని, క్రేజ్ ని ఈ మధ్యకాలంలో సంపాదించుకున్న చిత్రం  180 (ఈ వయసిక రాదు). ముఖ్యంగా ప్రోమోలు, పాటల్లోని దృశ్యాల పొందిక టివిల్లోచూసిన ఎవరైనా ఖచ్చితంగా ఇదొక దృశ్యకావ్యమని నిర్ణయించుకోవడంలో ఎలాంటి తప్పూలేదనుకుంటాను. ఇదొక గొప్ప ప్రేమకథ అని సిద్దార్థ పదేపదే చెప్పడం, ఇద్దరు అందమైన హీరోయిన్లూ తమ చిలక పలుకులతో ఆ విషయాన్ని నొక్కివక్కాణించడంతో ఒక దృశ్యకావ్యాన్ని చూద్దామన్న ఆశతో వెళ్ళిన ప్రేక్షకుడికి కొంత నిరాశ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories