|
సెవెన్ సమురాయ్-ఒక సమాలోచనం-3
మొదటి భాగం రెండవ భాగం చిత్రీకరణ ముందటి రెండు వ్యాస భాగాల్లో కథ, పాత్రలూ, పాత్ర చిత్రణ ఎలా ఈ సినిమాని బలోపేతం చేశాయో పరిశీలించాం. కాయితం మీద కథ, స్క్రీణ్ ప్లే రాసుకోవడం ఒక యెత్తు, దాన్ని సమర్ధవంతంగా తెర కెక్కించడం పూర్తిగా ఇంకో యెత్తు. ఈ సినిమా తీసేప్పటికే కురోసావా మంచి దర్శకుడిగా, కనీసం జపాన్‌లో, మంచి పేరే సంపాయించాడని వ్యాసం మొదట్లోనే చెప్పాను. తన చిత్రీకరణ ప్రతిభని ఈ సినిమాలో ఉపయోగించాడో ఈ [...] |
|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 2
మొదటి భాగం తరువాయి పాత్ర చిత్రణ నాయకులు సాధారణంగా తమ బృందంలో సభ్యులందర్నీ తమ లాగా ఆలోచించేట్టూ, తమలాగా ప్రవర్తించేట్టూ తయారు చేస్తారు. మిలటరీ నాయకులు మరీను. ఈ శిక్షణలో వ్యక్తిగత లక్షణాలకి తావుండదు, అవి బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు. సాధారణంగా నాయకులు చేసే ఈ పొరబాటు కాంబే చెయ్యడు .. అదే అతని వ్యక్తిత్వంలో గొప్ప విషయం. తన బృంద సభ్యులకే కాదు, తాము రక్షించ వచ్చిన పల్లీయుల మనస్తత్వానికీ, ఇంకా తాము ఎదుర్కొని [...] |
|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1
సెవెన్ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...] |
|
అవతార్
కథలో కొత్త ఆలోచనలు గానీ సరికొత్తగా ప్రతిపాదించిన సూత్రాలు కానీ ఏవీ లేవు గానీ అవతార్ సినిమా రెండున్నర గంటల సేపు కళ్ళకీ మనసుకీ విందు చేసిందనే నాకనిపించింది. సృష్టిలో అన్నిటినీ కలిపి ఉంచే మూల సూత్రం ఒకటున్నదనీ, ఒక అంతస్సూత్రం ఉన్నదనీ, దాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా కనీసం దాని ఉనికిని గుర్తించి దానితో (లిటరల్‌గా)”టచ్” లో ఉంటే, మనము మన చుట్టూతా ఉన్న ఈ సృష్టితో ఒక సమతుల్యతలో ఉండవచ్చునని అనేక ప్రాచీన [...] |
|
నాన్ కడవుళ్ డవుళ్ వుళ్ ళ్ …
ఈ సినిమా వచ్చేసి చాలా కాలమైంది కాబట్టి ఇది సమీక్ష కాదు, దీన్ని మరీ లోతుగా తవ్వే ఓపిక నాకు లేదు కాబట్టి ఇది విశ్లేషణా కాదు .. సినిమా చూసిన ఒక సగటు ప్రేక్షకుడి ఘోష అనుకోండి. దివినించి శివుడి జటాజూటంలోకి దూకే గంగాప్రవాహంలాంటి ఒరవడితో మొదలై, అనేక వింత వింత మలుపులు తిప్పి, ఎన్నో విచిత్రాలున్నూ చూపించి, ఆఖరికి ఇంటెనక పిల్ల కాలవలా చడీ చప్పుడూ కాకుండా ముగిసిపోయిందీ విచిత్రమైన సినిమా. కానీ ముగింపొక్కటే [...] |
|
అడూర్ తో ముఖాముఖి- ఎనిమిదవ భాగం
ఇండియన్ న్యూ వేవ్ లో తీసిన సినిమాలు చాలా మట్టుకు పల్లెల కథలతో, అక్కడి కుల, వర్గ, హింస సమస్యలతో తీసారు. కానీ అందుకు భిన్నంగా స్వయంవరం పట్టణంలో జరిగే ప్రేమకథ. కేరళలో ఈ పల్లెల కుల హింస ఇలాంటివన్నీ ఎప్పుడో జరిగినాయి, అది వర్తమాన చరిత్ర కాదిక్కడ. అందుకని అలాంటి కథలు సృష్టించడం ఉన్న సామాజిక నిజాన్ని వక్రీకరించడం అవుతుంది. ఎప్పుడో ముప్ఫయ్యేళ్ళ క్రితం కేరళలో తీసిన సినిమా ఇవ్వాళ్టి పేరిసియన్ (Parisian) యువతీ యువకులు ఇష్టపడ్డారంటే చూడండి. అందులో కథ విశ్వాత్మకం. అది ప్రధానంగా యువత గురించి .. వాళ్ళ ఆశలూ, ఆశయాలూ, కష్టాలూ. అది ఒక నిజ జీవిత సంఘటన గురించి .. ప్రేక్షకుణ్ణి పట్టుకుని విడవని గుణం ఒకటుంది అలాంటి సన్నివేశంలో. |
|
అడూర్ తో ముఖాముఖి- ఏడవ భాగం
ప్ర: మీరు డిప్లమా కోసం తీసిన సినిమా దేన్ని గురించి? అడూర్: దానికి “గొప్ప రోజు” (A Great Day) అని పేరు పెట్టాను. ఒక పరమ బద్ధకస్తుడి గురించి, హాస్యభరితమైన కథ. ఆ రోజున ఈ బద్ధకస్తుడు పెళ్ళిచేసుకుందా మనుకున్న అమ్మాయి తండ్రి (కాబోయే మావగారు) మొదటిసారి అతణ్ణి చూడ్డానికి వస్తారు. వీడెంత బద్ధకస్తుడంటే ఎప్పుడూ ఏదీ సర్దడు, తన గదినైనా శుభ్రంగా ఉంచుకోడు. పొద్దున్నే పక్కలోంచి లేవకుండానే గుమ్మం దగ్గర్నించి పాలసీసా లోపలికి తెచ్చుకోడానికి బ్రహ్మాండమైన పద్ధతి కనిపెట్టిన ఘనుడు. ఆ రోజున పాపం గది సర్దుదామని అనుకుంటాడు గానీ వాడి వల్ల కాదు. |
|
అడూర్ తో ముఖాముఖి- ఆరవ భాగం
ప్ర: తిరువనంతపురంలోనా? అడూర్: జోనల్ కార్యాలయం తిరువనంతపురంలోనే కానీ పని కోసం కేరళ అంతా తిరగాల్సి వచ్చేది. పని కూడా ఆసక్తి కరంగానే ఉండేది. ఏమంటే ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాలకి వెళ్ళి, అక్కడక్కడా కొన్నాళ్ళైనా ఉండి వచ్చే అవకాశం అది. ఇలాంటి మారుమూల చోట్లకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఏదైనా కొట్టు పైన చిన్న గది ఖాళీ ఉంటే అందులో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లోనే నెలకి ఆరొందలంటే, మంచి జీతమే. ఒక కాలేజి [...] |
|
అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం
ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక [...] |
|
వాల్ట్జ్ విత్ బషీర్
హెచ్చరిక 1: ఈ సినిమాలో విపరీతంగా కలవరపెట్టే దృశ్యాలూ, అంతకన్నా కలవరపెట్టే ఆలోచనలూ ఉంటాయి. హెచ్చరిక 2: సినిమాలో చివరికి ఏం జరుగుతుందో అనేది మీకు సస్పెన్సు ఐతే, మీరు సినిమా చూడాలని అనుకుంటున్నట్టైతే, ఈ సమీక్ష చదవకండి. యుద్ధం ఎప్పుడైనా కలవర పరిచే ఘట్టమే. కానీ ఒక సారి ముగిశాక, ఆ ఘటనని వెనుదిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకానికి రకరకాల మనోభావాలతో రంగులద్దుకుంటారు మనుషులు. ఏదీ నిజం కాదు, ఏదీ సంపూర్ణం కాదు. కళ్ళ ముందు [...] |
|
అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం
ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి [...] |
|
అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం
ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |