News back to homepage

cover story_28 వెండి తెరపై ‘బాలానందం’

‘‘మెరుపు మెరిస్తే- వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అది మాకోసమే అనుకుని’’ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు- పిల్లలు… పాపలు… రేపటి పౌరులు! బాలలు నిత్యోత్సాహులు… నిరంతర కుతూహలురు! వారు ఆశ్చర్యపడే మెరుపును… వారు ఆనందపడే వానను… వారు తన్మయమై తారంగం పాడే హరివిల్లును వెండి తెరపై సృష్టిస్తే ఏమవుతుంది? బాలల చిత్రోత్సవం అవుతుంది…! అంతర్జాతీయ బాలల సినిమా పండగ అవుతుంది…! అలాంటి ఓ జిలుగువెలుగుల… జ్ఞానదీపాల… విజ్ఞాన వీచికల చిత్రోత్సవం నవంబర్ 14నుండి 21వరకూ హైదరాబాద్‌లో జరగబోతోంది… [...]

17heros మన హీరోలు సినిమాలు చూడరా?

  ఓ డాక్టర్ ఎప్పటికప్పుడు తన వృత్తికి సంబంధించి లేటెస్ట్ పరిశోధనలను తెలుసుకుంటూ ఉంటాడు. ఎంబిబిఎస్ చదువు అయిపోగానే వైద్యవృత్తిలో పండిపోయానని అనుకోడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డే టు డే తన ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లలో కొత్త వెర్షన్స్‌ని తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతాడు. ఆఖరికి ఓ కిరాణా కొట్టు వ్యాపారి కూడా మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు… వీళ్లందరు తమ తమ రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలను పరిశీలిస్తూ [...]

coverstory photo మనీ విజన్ – నవంబర్ 21 వరల్డ్ టీవీ డే

ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రభావితమైన వినిమయ వస్తువు ఏది? అని కనుక సర్వే నిర్వహిస్తే టెలివిజన్ కచ్చితంగా నూటికి నూరు శాతం ఓట్లు గెల్చుకుంటుంది. ఆ తరువాతి స్థానం మొబైల్‌ది. నిజానికి అమ్మకాల రీత్యా మొబైల్‌ది మొదటి స్థానం కావచ్చు. ఇంటికి ఒక టీవీ వుంటే అరడజను మొబైళ్లు వుండొచ్చు. కానీ వ్యాపార పరిణామం, పలు రంగాలను ఏకకాలంలో ప్రభావితం చేస్తున్న వైనం, ప్రజలపై చూపిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుంటే కచ్చితంగా టీవీది అగ్రస్థానమే. టెలివిజన్.. [...]

vinda-telangana-News ది లోటస్‌పాండ్ తెరకెక్కిన బాల్య స్వప్నం

రెండేళ్లకోసారి జరిగే ‘అంతర్జాతీయ బాలల చలన చివూతోత్సవాలు’ ఈ సారి హైదరాబాద్ వేదికగా, శిల్పారామంలో జరుగనున్నాయి. వారం రోజులు (నవంబర్ 14 – 21) జరిగే వేడుకలో దాదాపు 151 చిత్రాలు పోటీ పడుతున్నాయి. వాటిలో ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సినిమా ‘ది లోటస్ పాండ్’!ఆ సినిమా దర్శకుడు పి.జి. విందా. ప్రముఖ సినిమాటోక్షిగాఫర్. అష్టాచెమ్మా, వినాయకుడు, స్నేహగీతం, కీ.. తాజాగా ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’.ఆయన సృష్టించిన లోటస్‌పాండ్ ఇప్పుడు బాలల [...]

moogudu మెప్పించని మొగుడు !

* మొగుడు తారాగణం: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్ రాజేంద్రప్రసాద్, నరేష్ హర్షవర్ధన్, ఆహుతి ప్రసాద్ గీతాంజలి, మహర్షి రాఘవ వేణుమాధవ్ తదితరులు. సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ సంగీతం: బి.బాబు శంకర్ నిర్మాణం: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ —- మన తెలుగు సినిమాలలో ’మొగుడు’ సినిమాలది ఓ ప్రత్యేక శైలి. శోభన్‌బాబు పుణ్యమా అని మొగుడు సినిమాలు కొనే్నళ్లపాటు ట్రెండ్‌గా మారాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ మహిళా చిత్రాలు అంటే అప్పట్లో [...]

pilla jamindar కామెడీ డ్రామా! – పిల్ల జమీందార్

తారాగణం: నాని, బిందుమాధవి హరిప్రియ, మేఘనానాయుడు రావురమేష్, ‘వెనె్నల’ కిషోర్ ఎమ్మెస్ నారాయణ తదితరులు. —- సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్ సంగీతం: సెల్వగణేష్ నిర్మాణం: సిరి శైలేంద్ర సినిమాస్ నిర్మాత: మాస్టర్ బుజ్జిబాబు దర్శకత్వం: జి.అశోక్ —- ‘క్యారెక్టర్స్‌లోని ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి నాటకానికుండాల్సిన ప్రధాన లక్షణం’ అని షేక్‌స్పియర్ అన్నారు. అందుకే నాటకాలలో ఈనియమాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఆ మేరకే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసేవారు. నాటకానికి తర్వాతి తరం ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమాలో కూడా ఈ [...]

sri-rama-rajyam-06 కనుడు … కనుడు రామాయణగాథ

శ్రీరామరాజ్యం’… ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. బాపు-రమణల కాంబినేషన్‌లో చివరి చిత్రం కావడం, బాలకృష్ణ-నయనతార సీతారాములుగా నటించడం…ఇళయరాజా స్వరాలందిస్తున్న తొలి పౌరాణిక సినిమా కావడం వంటి ఎన్నో కారణాలు ఈ సినిమాను ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార్చాయి. అంతకన్నా మించి తెలుగులో దాదాపు 15 ఏళ్ల తర్వాత 1996 నాటి శ్రీకృష్ణార్జున విజయం తర్వాత వస్తున్న పౌరాణిక చిత్రంగా కూడా ఈ సినిమా ఆసక్తిని సృష్టిస్తోంది. ఇదే [...]

telugu తెలుగు సినిమాల్లో తెలుగెంత?

నేతి బీరకాయలో నేయి ఉంటుందా? పులిహోరలో పులి ఉంటుందా? మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా? ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట… అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట…‘తెలుగు భాష [...]

Poru-Telangana-Movie-R-Narayana-Murthy-stills రేపటి సినిమా మాండలిక సినిమా

తరాలు మారుతున్న కొద్దీ ‘మెయిన్‌వూస్టీమ్ కల్చర్’లోంచి కొన్ని సబ్ కల్చర్స్ విడివడుతాయి. తమదైన అస్తిత్వాన్ని, సొంత గొంతుకని వినిపిస్తాయి. కళలు, సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే ఇపుడు తెలుగు నుంచి తెలంగాణ మాత్రమే కాదు హిందీ నుంచి భోజ్‌పురి, కన్నడ నుంచి తుళు భాషా చిత్రాలు కూడా రెక్కలను విప్పుతున్నాయి. సొంతంగా సినీవినీలాకాశంలోకి ఎగరడానికి సన్నద్ధమతున్నాయి. స్థానిక మూలాలతో కూడిన కొత్త నేటివ్ ప్రపంచాన్ని స్క్రీన్‌పై సృష్టిస్తున్నాయి. సినిమా: ఒరియరొదరి అసల్ సంవత్సరం: 2011 [...]

Vidya-telangana-News కథానాయికల కథ

ఎప్పటికీ సినిమాలో గ్లామర్ అంటే హీరోయినే. హీరోయిన్ లేని సినిమా అంటే ఒయాసిస్సులేని ఎడారే! అందుకే సగటు ప్రేక్షకుడికి సినిమా నటి ఓ స్వప్నం! సౌందర్యం! ఓ మానసిక సంతృప్తి! ఓ అప్సరస! తెరమీద జిలుగు వెలుగులలోని హీరోయిన్ సౌందర్యం వెనుక నీలినీడపూన్నో! హీరోయిన్ సమ్మోహిత నవ్వుల వెనక పైకి కనిపించని బాధపూన్నో! అభిమాన నటి పెదాల లిప్‌స్టిక్ మెరుపుల వెనక కురవని మేఘాపూన్నో! రకరకాల కథలతో ఎందందరో వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలను రూపొందించే [...]

Women-centric-films1 బాలీవుడ్‌లో మహిళా చిత్రాలజోరు!

‘నో వన్ కిల్‌డ్ జెస్సికా…’! ‘సాత్ ఖూన్ మాఫ్’…! ‘టర్నింగ్ 30’…! ‘ఐ యామ్…’! ఈ సినిమాలన్నింటిల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే ఇవన్నీ మహిళ ఇతివృత్త ప్రధాన చిత్రాలు కావడమే! ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌లో లెక్కకు మిక్కిలి మహిళా చిత్రాలు రూపొందుతున్నాయి. సంఖ్యా పరంగానే కాకుండా, ఈ సినిమాల బడ్జెట్‌లు, వీటిలో నటిస్తున్న నటీమణులు, వీటికి దర్శకత్వం వహిస్తున్న దర్శకులు అందరూ కూడా టాప్ రేంజిలో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో [...]

no_one_killed_jessica రియలిస్టిక్ థ్రిల్లర్-నో వన్ కిల్డ్ జెస్సికా

ఇన్నాళ్లకి బాలీవుడ్‌లో కొత్త సంవత్సరం నిజంగానే ‘కొత్త’ ఫీలింగ్‌ను తెచ్చింది. ప్రతీసారీ కొత్తసంవత్సరం ఆరంభంలో కూడా పాత కథలను, తిరగరాసిన కథలనే తెరమీద చూసే పాతదానికి అలవాటుపడిన ప్రేక్షకులకి నిఖార్సయిన ‘కొత్త’దనాన్ని సినిమాపరంగా ఆవిష్కరించిన సినిమా – ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’! బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమా కథలను అల్లుకునే ట్రెండ్ పెరిగిపోతోంది. ఇది సినిమాటిక్ గ్రామర్‌లో ఓ అద్భుతమైన ధోరణే! అయితే నిజజీవిత సంఘటనలకు ఇన్‌స్పైర్ అయి తీసిన సినిమాలలో అన్ని [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories