Menu

chakradhar Archive

where is my grandpa – సంపూర్ణ ఆనందం

ప్రేమ.. ప్రపంచంలో ప్రతివాళ్ళూ అంగలార్చేది ప్రేమకోసమే.  మంచి పండులో  తియ్యదనం ఎలా దాగుంటుందో…మంచి హృదయంలో ప్రేమ ఆలా దాగుంటుంది.  వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషికీ తన మనుషుల ..సాటి మనుషుల ప్రేమ కావాలి… కావాలని కోరుకుంటారు. ఏ మనిషి ‘ప్రేమ’ అక్కరలేదంటాదు చెప్పండి ?? ప్రేమ అనేది ప్యూర్ బ్లిస్..సంపూర్ణ ఆనందం. ప్రేమకోసమే పొత్తిళ్లలోని బిడ్డ కాసేపు తల్లి స్పర్శ ..పలకరింపు లేకుంటే ఏడుపు అందుకుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ నిరంతరం కోరుకుంటారు పిల్లలు. ఈ స్కూలూ

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు

rosetta – గులాబీ కొమ్మ

సినిమా అంటేనే కథ..అందరినీ ఆకట్టుకునే ఓ కథ. సినిమాగా తీస్తే ..పదిమందీ చూస్తే..చూసి  అహా అనగలిగితే..ఆ  నటీనటులకీ..దర్శకనిర్మాతలకీ డబ్బు,  గొప్ప గుర్తింపు… అదేగా  సినిమా పరమావధి ?!!  కానీ కొన్ని సినిమాలు అలాకాదు. సమాజంలోని సమస్యని ప్రశ్నిస్తాయి..లోపాలని ఎత్తి చూపుతాయి..ప్రజలకి సమస్యగురించీ…సమస్య తీవ్రతగురించీ అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అలాంటి సినిమాలు అరుదు. అయితే ఈ సినిమా కథ కాదు..సమాజ సమస్యలని ప్రశ్నించే ప్రయత్నమూ కాదు.  కానీ సినిమా తనకి తెలియకుండానే కొన్ని సమస్యలని చెప్పింది. చట్టాన్నే  సవరించగల

About Elly – మనసు నాటకం

కొన్ని మనం వదిలేయాలనుకుంటాం..కొత్తగా జీవించాలని ఆశపడతాం.  కానీ అవి మనని వదలవు ..అంతలోనే కొత్తవి అల్లుకుపోతుంటాయి. ఏం చేయాలోతోచదు..  అప్పుడు మనని మనమే వదిలేయాలని నిర్ణయించుకుంటాం !! తమ సమస్యని కాలం కూడా పరిష్కరించలేదని భావించిన మనిషి ఏం చేస్తాడు ??? !! ఈ సినిమా డౌన్లోడు అవుతుండగా.. మధ్యలో ఒకసారి క్వాలిటీ చెక్ కోసం ప్లే చేసాను. చూడతగ్గ క్వాలిటీ లేకుంటే డౌన్లోడు వేస్ట్ కదా అందుకే !   క్వాలిటీ ఒకే..కానీ ప్లే అవుతున్న 

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు.