Menu

chakradhar Archive

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ 

The past – చిక్కుముడి

ఇదో గమ్మత్తయిన కథ..ఇందులో ఎవరు తప్పు ఎవరు కరక్టో తెలియదు.అందరి అలోచనలూ..దృక్పథాలూ సరైనవే. కానీ నాటకీయత మాత్రం నిండుగా ఉంటుంది. అదే నాటకీయంగా మన సహానుభూతి ఒకరినించి ఒకరికి మారుతూ ఉంటుంది. అలా అని ఇలాంటివన్నీ మేం టివీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం అనకండోయ్. ఎందుకంటే సినిమాకు ఉండే లక్షణాలన్నీ బలంగా ఉన్న సినిమా. బాగా ఆకట్టుకునే సినిమా..!! మనం ఒక పనిచేసేముందు మనకున్న లాజిక్కు ప్రకారం ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందీ అని చేస్తాం..

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు.. చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ?? ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !! ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ

దృశ్యం – జీవితపు నాటకీయత !!

అవును.. జీవితంలో అన్నీ ప్లాన్డ్ గా జరగవు.. మనకి తెలియకుండా టపీమని జరిగిపోయే అనర్థాలనే ప్రమాదాలు అంటాం. జరిగేటప్పుడు తెలియకున్నా..జరిగింతరవాత మాత్రం మనకి కొంత టైం ఉంటుంది.. బాధ పడటానికీ,ఏడవటానికి.  జీవితంలో చాలా నాటకీయత ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం.. గుర్తించినా తీరిగ్గా కలియజూసుకోటానికి టైం ఆగదు..మెల్లిగా నడవదు. తన స్పీడ్ లో తాను వెళ్ళిపోతుంది.  అక్కడ మిస్సయిన  ఆ నాటకీయతని..ఆ భావోద్వేగాలనీ పట్టిచూపించేదే సినిమా !! సినిమాలో  ‘అవసరమైన’ సాగదీత లేకుంటే.. కిక్కు ఎక్కదు.

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి