Menu

chakradhar Archive

The straight story – వృద్దుడి ప్రయాణం

ది స్ట్రెయిట్ స్టోరీ..  పేరుకు తగ్గట్టుగానే..చాలా  సూటి, సరళం అయిన కథ. అల్విస్  డెబ్బై ఏళ్ళ ముసలాడు. కూతురు సామానుకోసం వెళ్ళగానే  కిచేన్లో ఏదో సర్దుతూ దభీలున కింద పడతాడు. కూతురొచ్చి  చేయందించే దాకా లేవటానికి రాదు. డాక్టర్ దగ్గరికి తీసుకేల్తే మందూ, మాకూ, టెస్టులూ, ఆపరేషన్లూ ఇవేవీ వద్దంటాడు. బ్లడ్ షుగర్ వల్ల కంటిచూపు తగ్గుతోందనీ, పొగాకు పీల్చటం మంచిది కాదూ  మానేయమంటాడు డాక్టర్. అల్విన్ ఏవీ లెక్కచేయడు. ఓ రాత్రి ఉరుములు మెరుపులతో భారీగా

Talvar – ప్రశ్నార్థక మరణం !!

మరణం ఒక జవాబు.. మరణం ఒక ప్రశ్న.. మరణం ఒక పరిష్కారం.. మరణం ఒక సమస్య.. మరణం ఒక నిజం.. మరణం ఒక అబద్దం. మరణం ఒక మరణం.. మరణం ఒక బ్రతుకు ..మరణం ఒక ప్రశాంతత.. మరణం ఒక అశాంతి..!! మరణం మార్మికమైనది. ప్రతిమరణం ఎంతో కొంత  విషయాన్ని తనలోదాచుకుంటుంది. ఒక వ్యక్తి తాలూకు తనకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు, అంతర్గత మధనం ఆ మరణంలో ఉంటుంది. అది ఎవ్వరికీ ..ఎప్పటికీ తెలియనిది. కొన్ని

Masaan – స్వేచ్చ పొందు చోటు

ఇద్దరు వ్యక్తులు ఏకాంతంలో ఉంటే ఎంత కామమో అనుకుంటారు గానీ.. ఎంత ప్రేమో అని అనుకోరు. – చలం కొందరు ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటారు.  కొందరు ప్రేమిస్తారు జతకట్టాలని అనుకుంటారు. పెళ్ళయినా, జతకట్టటం అయినా ఒక వయసు నిండాక  వ్యక్తిగతం. కానీ అంత స్వేచ్చ ఇచ్చే సమాజాన్ని మనం నిర్మించుకోలేదు. దానికితోడు కాలానుగుణ ప్రమాదాలు ఉండనే ఉన్నాయి. అన్నీ కలిసి జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. ఎదురుకొని నిలవమని సవాలు విసురుతాయి.   ఈ విషయాలని రెండు సమాంతర

The Goob – a Teenage boy

ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగులర్ సినిమా ఫార్మాట్లో ఉండదు. ఒక టీనేజ్ యువకుడి పరిచయం..పరిస్థితులు..కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా. గూబ్  పదహారేళ్ల కుర్రాడు. గూబ్ కి  వేసవి సెలవులు మొదలవుతుతాయి. సెలవుల్లో సరదాగా ఆటాపాటలతో సరదాగా గడుపుదామనుకుంటాడు. గూబ్ కి  తల్లి,  ఆమె మగతోడు (బాయ్ ఫ్రెండ్)  ఉంటారు. తల్లి అమాయకురాలు..తోడులేక బతకలేనిది. ఆమె బాయ్ ఫ్రెండుకి  ఆడపిచ్చి, కనపడ్డవాళ్ళని కావాలనుకునే తత్వం..కోపమెక్కువ, అధికార తత్వం. ఎవ్వరినీ సహించడు,గూబ్ మీద అజమాయిషీ

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ