నవతరంగం » అబ్రకదబ్ర

మన సినిమా – రెండవ భాగం
మొదటి భాగంలో ‘లోపం ఎక్కడ’ అని ఒకటికి రెండు సార్లు అనుకున్నాం. సమాధానం చాలా తేలిక: నిబద్ధత లేమి. దీన్ని మన దర్శకనిర్మాతలు రకరకాలుగా కప్పిపుచ్చుకుంటారు – నిపుణుల కొరత, సమయాభావం, మార్కెట్ పరిమితులు, వగైరా, వగైరా. ‘పురుటి నొప్పుల ఊసొద్దు, బిడ్డని కని చూపెట్టు’ అనే అర్ధంలో ఆంగ్ల వాడుకొకటుంది. వంకలు చెప్పేవాళ్లు విజేతలవరు. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఆలోచన ముఖ్యం. అదున్నప్పుడు ఫలితాలు వద్దన్నా వస్తాయి. ఇది గ్రాఫిక్స్ ఒక్కదానికే వర్తించే విషయం కాదు. కథల ఎంపిక దగ్గరే ఇది మొదలవాలి.

కథలనగానే మన దర్శకుల ముఖాల్లో ఎక్కడలేని నిర్వేదమూ కనిపిస్తుంది. ఎవర్ని కదిల్చినా ‘కథల కొరత సార్, కథకుల కొరత సార్’ .. ఈ మాటలే రాల్తాయి. ‘టెన్ కమాండ్‌మెంట్స్’, ‘ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్’ లాంటి అజరామర చిత్రాలు తీసిన హాలీవుడ్ దర్శకుడు సిసిల్ బి. డిమిల్‌ని కథల కొరత గురించెవరన్నా అడిగితే నవ్వేసి తన జేబులో ఉండే బుల్లి బైబిల్ని చూపిస్తూ ‘నాక్కావలసిన కథలన్నీ ఇందులో ఉన్నాయి’ అనేవాడట. మనకి బైబిల్‌ని తలదన్నే వారసత్వ సంపదుంది. మహాభారతంలో పాత్రల ఆధారంగా మణిరత్నం ‘దళపతి’ తీసి విజయం సాధించలేదా? ఆ మాటకొస్తే - కథల కోసం పురాణాల్లోనే వెదకనక్కర్లేదు. మన చుట్టూనే ఉన్నాయి – చూసే ఓపికుంటే. సరిగా తీస్తే - భావోద్వేగాల కథలు కళ్లు తుడుచుకుంటూ, కర్చీఫులు తడిపేస్తూ చూసే జనాలు మనకి కోకొల్లలు. నిజ జీవిత విజయ గాధల స్ఫూర్తితో హృదయాన్ని కదిలించే సినిమాలు తీయటం హాలీవుడ్‌కి వెన్నతో పెట్టిన విద్య. మనవాళ్లూ అలాంటివి తీయకపోలేదు. ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్ అలాంటి సినిమాలే తీసి అలవోకగా విజయాలు కొల్లగొడుతుండేది. మరి ఇప్పుడేమయింది? పోనీ, నిజగాధల్ని సినిమాలుగా మార్చే నేర్పూ, ఓర్పూ లేదనుకుందాం. సమకాలీన సాహిత్యాన్ని – అంటే నవలల్ని – సినిమా సరుకుగా వాడుకోవచ్చు కదా. తెలుగులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయాయి. మన గురించి మనవాడు రాసిన ‘క్యు & ఎ’ సత్తాని విదేశీయులు గుర్తించి దానితో ఫక్తు వ్యాపారాత్మక సినిమా తీసి అంతర్జాతీయంగా అవార్డులూ రివార్డులూ కొల్లగొట్టారు. కథల కొరత గురించి మాట్లాడే దర్శక నిర్మాతలు సిగ్గుపడాల్సిన విషయమిది.

అసలు – సినిమా కథలు మనవే కానవసరం లేదు. ప్రేక్షకులకి సంబంధించినంతవరకూ ఓ సినిమాకి మూలకథ ఎక్కడిదన్న విషయం అనవసరం. ప్రపంచంలో కథలకెప్పుడూ లోటు లేదు, రాదు. విదేశీ సాహిత్యం నుండి ఆలోచనలు అరువు తెచ్చుకోవటం అనాదిగా ఉన్నదే. దాన్ని మనకి తగ్గట్లుగా మలచుకోవటమే ముఖ్యం. అలనాటి ‘పెద్దమనుషులు’ దీనికో మంచి ఉదాహరణ. అంతెందుకు – నేటి ఫ్యాక్షన్ పగ-ప్రతీకారాల కథలన్నిటికీ ఆధారం ఎప్పుడో నూట యాభయ్యేళ్ల క్రితం అలగ్జాండర్ డ్యూమాస్ రాసిన ‘కౌంట్ ఆఫ్ మాంటెక్రిస్తో’ కాదూ? ఆ ఐడియాకి మార్పులూ చేర్పులూ చేసి తొంభైల మొదట్లో ముకుల్ ఆనంద్ అమితాబ్‌తో ‘హమ్’ తీస్తే, ఆ తర్వాత మూడేళ్లకి సురేష్ కృష్ణ దానికే మరికొన్ని మెరుగులద్ది తమిళంలో ‘బాషా’ తీయటం, మరో నాలుగేళ్లకి ‘సమరసింహారెడ్డి’తో అలాంటి ఇతివృత్తాలు తెలుగులోకి రంగప్రవేశం చెయ్యటం – అప్పట్నుండీ మనవాళ్లు అదే కథాంశాన్ని నమ్ముకుని కుప్పలుతెప్పలుగా సినిమాలు తీయటం జరుగుతుంది. కాబట్టి సమస్య కథల కొరత కాదు, కథకుల కొరతా కాదు. ఒక రకం కథ విజయవంతమైతే ఏళ్లపాటు దాన్నే పట్టుకు వేలాడే దర్శకనిర్మాతల బలహీనతే అసలు సమస్య. ఇదే తెలుగు సినిమా కథల్లో వైవిధ్యం లోపించిన కారణం. కథకులకి చట్రాలు బిగించి మాకిలాంటి కథలే కావాలంటూ బిగుసుకుని కూర్చుంటే కొరత రాకేమవుతుంది?

కొత్త రకం కథలు ప్రయత్నించటానికి ఎందుకంత భయం? నలిగిన దారిలోనే నడవటం శ్రేయస్కరం అనుకుంటూ పాత చింతకాయ పచ్చడినే నమ్ముకునే దర్శక నిర్మాతలు కోకొల్లలు. మరి ఈ పాత పచ్చడి అమ్ముడుపోతుందా అంటే లేదనేదానికి ఏఏటికాయేడు రెండో వారంలోనే తిరిగొచ్చే డబ్బాల సంఖ్య పెరిగిపోతుండటం నిదర్శనం. రిస్క్ సమానమే ఐనప్పుడు కొత్త దారి ప్రయత్నించటానికి మొహమాటమెందుకు? పక్కనే తమిళ రంగం అలాంటి ప్రయోగాలు చేస్తూ విజయవంతమైన సినిమాలు తీస్తుంటే ఇంకా అనుమానమెందుకు? తెలుగులో సైతం ఒకరిద్దరు చిన్న నిర్మాతలు తెగించి అలాంటి సినిమాలు తీసి సఫలమౌతున్నప్పుడు అలాంటివారికి స్ఫూర్తిగా నిలవాల్సిన భారీ నిర్మాతలు మాత్రం పాత సీసాలో మురిగిపోయిన సారా పోసి అమ్మాలనుకోవటం శోచనీయం.

భారీ నిర్మాతనెవరినైనా ఇదే ప్రశ్న అడిగితే వెంటనే వచ్చే సమాధానం: ‘కోట్లతో ముడిపడ్డ వ్యవహారం. అంత డబ్బుతో జూదం ఎలా చేస్తాం?’. మన సినిమాలు ఇలా అఘోరించటానికి అసలు కారణం ఇదే – జూదగాళ్లు నిర్మాతల అవతారమెత్తటం. సరిగా చేస్తే ఇదీ సరైన వ్యాపారమే. లాభాలు లేకపోయినా కనీసం అసలుకి గ్యారంటీ ఇచ్చే వ్యాపారం. వ్యాపారస్తుడికి తను ఉత్పత్తి చేసే వస్తువు ఏ ఏ వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని చేస్తుందీ ఓ అంచనా ఉంటుంది. మరి మన సినిమావాళ్లు చేసేదేంటి? సినిమా తీస్తే ఎనిమిది కోట్ల ఆంధ్రుల్నీ అలరించాలన్న లక్ష్యంతోనే తీస్తారు. అదెలా సాధ్యం? ప్రేక్షకుల్ని క్లాస్-మాస్ అంటూ రెండు వర్గాలుగా విభజించటం సరి కాదు. నిజానికి అంతకన్నా ఎక్కువ వర్గాలే ఉన్నాయి వాళ్లలో. వాటిలో తమ టార్గెట్ ఏ వర్గమో (లేక వర్గాలో) ముందుగానే నిర్ణయించుకుని సినిమా తీయటం ఒక పద్ధతి. అందరికీ నచ్చేలా తీయాలనుకుంటూ కథలో అనవసరమైన హుంగులూ ఆర్భాటాలూ చొప్పించేసి చివరికి అదెవరికీ నచ్చకుండా చేసి అసలుకే ఎసరు తెచ్చుకోవటం మరో పద్ధతి. చిన్న పిల్లలకోసం ప్రత్యేకించిన సినిమాలు తెలుగులో వచ్చి ఎన్నేళ్లయింది? పిల్లల కోసం ఓ మంచి సినిమా తీస్తే వాళ్ల కోసం పెద్దలూ సినిమా హాళ్లకు బయల్దేరక తప్పదు. ఒక్క దెబ్బకి రెండు మూడు పిట్టలు. అతి తేలికైన వ్యాపార సూత్రమిది. రాంగోపాల్‌వర్మ లాంటి తెలివిగల తెలుగోడు ఆ కిటుకు ఎప్పుడో గ్రహించటమే కాకుండా ఓ రకంగా ఒంటి చేత్తో దాన్ని హిందీ వాళ్లకీ వంటబట్టించాడు. అతని సినిమాల్లో భిన్నత్వం ఎంత అనేది కాసేపు అవతల పెడదాం. లక్ష్యిత ప్రేక్షక వర్గం ఏదనేదీ ముందుగానే నిర్ణయించుకుని, సరైన ప్లానింగ్‌తో, ఖర్చులు అదుపులో ఉంచుకుంటూ ఓ పద్ధతి ప్రకారం సినిమాలు తీసుకుంటూ పోతే జయాపజయాలకతీతంగా లాభాలే కానీ నష్టాలుండవనేది అతను గ్రహించిన విషయం. దీన్నతను హాలీవుడ్‌ని బాగా పరిశీలించి నేర్చుకుని ఉండొచ్చు.

హాలీవుడ్ ప్రస్తావన (మళ్లీ) వచ్చింది కాబట్టి ఇక్కడో ఆసక్తికరమైన విషయం. అమెరికా ఆర్ధిక రంగం కుదేలైన ప్రస్తుత పరిస్థితుల్లో మిగతా వ్యాపార రంగాలు గిజగిజలాడుతుంటే, హాలీవుడ్ మాత్రం పచ్చగా కళకళలాడుతుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో హాలీవుడ్ మేజర్ స్టుడియోలు విడుదల చేసిన సినిమాలు అర్జించిన ఆదాయం పోయినేడాది అదే కాలంతో పోలిస్తే అరవై శాతం అధికం! ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రజలు ఇతర ఖరీదైన వినోద ప్రదర్శనలకు (నాటకాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్స్, వగైరా) బదులు చవకలో ఐపోతుందని సినిమాలు చూడటం వైపు మొగ్గు చూపటం దీనికి ప్రధాన కారణం. స్టుడియోలు కూడా ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి ఈ నిరాశాపూరితమైన వాతావరణంలో ప్రేక్షకులకి ఆహ్లాదం పంచే, భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించే కథలతో సినిమాలు తీసి విడుదల చెయ్యటం ద్వారా సొమ్ము చేసుకుంటున్నాయి. అదీ, ప్లానింగ్ అంటే. అదొక్కటే కాదు – సమ్మర్ సెలవుల్లో విద్యార్ధుల్ని దృష్టిలో పెట్టుకుని, క్రిస్మస్ సెలవుల్లో కుటుంబ కథా చిత్రాలు .. ఇలా సీజన్‌కి ఒక రకం సినిమాలు విడుదల చెయ్యటం హాలీవుడ్ రివాజు. ఏ తరహా ప్రేక్షకులకి ఎప్పుడు సినిమాలు ఎక్కువగా చూసే తీరుబడి ఉంటుందనేదానిపై ఆధారపడి చేసుకునే ప్లానింగ్ అది. మనవాళ్లలో లోపించింది అదే. అమెరికన్ ప్రేక్షకులకోసం ఉద్దేశించిన పద్ధతుల్ని మనవాళ్లు అలాగే కాపీ కొట్టేయనవసరం లేదు. మనకీ ప్రణాళికలుండటం ముఖ్యం. మరి మనవాళ్ల పద్ధతో - గుడ్డెద్దు చేలో పడ్డట్లు సినిమాలు తియ్యటం, ఎప్పుడు పూర్తైతే అప్పుడు విడుదల చెయ్యటం, ఆపై తూర్పు తిరిగి దండం పెట్టటం. కోట్లాది రూపాయలతో, కొన్ని వేల జీవితాలతో ముడిపడ్డ వ్యాపారం చేసే పద్ధతి ఇదా? దానిక్కారణం ఏంటంటే పాతుకుపోయిన స్టార్ సిస్టమ్ అని చెబుతారు. హీరోలూ, హీరోయిన్లూ గీసిన గీత నిర్మాత జవదాటలేడంటారు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టే నిర్మాత అంత బలహీనుడన్నమాట. అంటే మనం సినిమాలు తీసే పద్ధతిలోనే మౌలికమైన లోపం ఉంది. అప్పుడు మార్చాల్సింది దాన్నే.

మన సినీ పరిశ్రమ నేటికీ ఓ సంఘటిత రంగంగా రూపొందకపోవటం అసలు సమస్య. దేశవ్యాప్తంగా లక్షలాదిమందికి ప్రత్యక్షంగానో (దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రదర్శనదారులు) పరోక్షంగానో (ధియేటర్లలో దుకాణదారులు, పార్కింగ్ వ్యాపారం, పబ్లిసిటీ రంగం) ఉపాధి కలిగిస్తున్నా, ప్రభుత్వాలకి పన్నుల రూపేణా ఇతోధికంగా ఆదాయం సమకూర్చిపెడుతున్నా సినిమా నిర్మాణం అనేది ఇప్పటికీ చాలావరకూ కిరాణా వ్యాపారంలాగానే జరగటం దీని వెనకున్న అనేక రకాల సమస్యలకీ కారణం. అందినకాడికి అప్పులు తీసుకొచ్చి, నటీనటుల అందుబాటుని బట్టి సినిమా చుట్టేసి, చేసిన అప్పులపై చక్రవడ్డీలు పెరిగిపోతాయన్న భయంతో – సినిమా పూర్తవగానే వచ్చినకాడికి అమ్మేసుకుందాం అనుకునే పరిస్థితిలో నిర్మాతలుంటే ప్రణాళికలకి తావెక్కడ? ఈ పరిస్థితి పోవాలంటే - ఒక సినిమా ఫట్ అంటే పత్తా లేకుండా పోయే నిర్మాతల స్థానంలో జయాపజయాలకి అతీతంగా సినిమాలు తీసే సత్తా కలిగిన నిర్మాణసంస్థలు ఆవిర్భవించాలి; మనకి మళ్లీ స్టుడియో సంస్కృతి రావాలి.

హాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్నట్లు మొదట్లో మనకీ స్టుడియోల సారధ్యంలోనే సినీ నిర్మాణం జరుగుతుండేది. ఆ కాలంలో గొప్ప గొప్ప సినిమాలు చాలానే వచ్చాయి. ఎప్పుడైతే ఎవరుబడితే వాళ్లు నిర్మాతల అవతారాలెత్తి సొంతగా సినిమాలు తీయటం మొదలు పెట్టారో, ఎప్పుడైతే స్టుడియోలు కనుమరుగైపోయాయో అప్పుడే మన సినిమాలూ అధోముఖం పట్టటం మొదలయింది. హిందీ సినిమాలు ఈ మధ్య మెరుగుపడటానికి, అక్కడ మళ్లీ మొలకెత్తుతున్న స్టుడియో సంస్కృతికీ సంబంధముంది - గమనించండి. అన్నట్టు, స్టుడియోలంటే – నా ఉద్దేశంలో రామోజీ ఫిల్మ్ సిటీ, రామానాయుడు స్టుడియోల వంటి సదుపాయాలు సమకూర్చే ప్రాంతాలు కాదు - యూటీవీ మోషన్ పిక్చర్స్‌లా కార్పొరేట్ సరళిలో సినీ నిర్మాణం గావించే సంస్థలు. తెలుగులో ఇప్పుడూ కొన్ని బడా నిర్మాణ సంస్థలున్నాయి, కానీ వాటి పరమార్ధం – ప్రధానంగా – తమ తమ వారసులకి ఉపాధి కల్పనే కాబట్టి వాటివల్ల అంతగా ఉపయోగం లేదు. మనకి అసలు సిసలు స్టుడియో సంస్కృతి రావాలి . నిర్మాత అనేవాడు పెట్టుబడి పెట్టేవాడిలా కాక జెర్రీ బ్రూకమయిర్ లా ఓ ఉద్యోగిగా ఉండాలి. స్టుడియోల్లో – కథల కోసం నిరంతరం అన్వేషిస్తుండే విభాగాలుండాలి. ఈ పద్ధతిలోనైతే – స్టుడియో అంటూ పెట్టాక అది నడవటం కోసం వరుసగా సినిమాలు తీస్తూనే ఉండాలి కాబట్టి - ఒక్కో స్టుడియో ఏడాదికి పదో ఇరవయ్యో సినిమాలు తీయొచ్చు. వాటిలో కొన్ని సినిమాలు ఫ్లాపైనా, కొన్ని హిట్టయ్యే అవకాశముంటుంది. రిస్క్ తక్కువ. ఆ రకంగా దర్శకులు కొత్త రకం కథాంశాలని తెరకెక్కించే, ప్రయోగాలు చేసే అవకాశమూ ఎక్కువుంటుంది. వ్యాపారానికి ఇప్పట్లా ఫైనాన్షియర్ల దగ్గరికి అప్పుల కోసం పరిగెత్తకుండా బ్యాంకు రుణాలు పొందే సదుపాయమూ ఉంటుంది. సొంతగా సినిమాలు తీసే నిర్మాతకన్నా స్టుడియోకి అందుబాట్లో ఉండే నిధులు ఎక్కువ కాబట్టి అందులో కొంత కొత్తరకం సాంకేతిక వనరుల సృష్టికోసం ఉపయోగించే వెసులుబాటూ ఉంటుంది. హాలీవుడ్‌లోలా నాలుగైదు ‘మేజర్ స్టుడియోస్’ మనకీ ఏర్పడితే వాళ్లందరూ ఉమ్మడిగా మనకవసరమయ్యే టెక్నాలజీ సృష్టి, నాలెడ్జ్ పూల్ ఏర్పాటు, నిపుణుల తర్ఫీదు వంటి విషయాలకోసం కృషి చెయ్యనూవచ్చు.

రాసుకుంటూ పోతే ఇంకా బోలెడుంది. ఇప్పటికే పెద్దదైపోయింది కాబట్టి ఇక్కడితో ఆపేస్తాను. సారాంశమేంటంటే – హాలీవుడ్ అనేది ఒక ప్రూవెన్ ఫార్ములా. అప్పుడప్పుడూ వాళ్ల కథలు, సాంకేతిక హంగులు ఎలాగూ మనకి చేతనైన రీతిలో కాపీ కొట్టేస్తున్నాం. ఆ కొట్టేదేదో వాళ్ల సినీ నిర్మాణ శైలిని, వ్యాపార పద్ధతుల్ని కూడా కాపీ కొడితే పోయేదేమీ లేదు. గుడ్డిగా వాళ్లని అనుకరించమని నా సూచన కాదు. మనవైన మార్పు చేర్పులుండాల్సిందే. ఎలాగైనా – ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణ పద్ధతులు పోయి సినీ నిర్మాణాన్ని నిజమైన వ్యాపారంలా చెయ్యగలిగిననాడే మనకి మంచి సినిమాలొస్తాయి. ఒకరిద్దరు వ్యక్తులు పెట్టుబడి పెట్టి నిర్మాతలుగా ఉండే పద్ధతి పోయి నిఖార్సైన నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో సినిమాలు రూపొందే రోజులు రావాలి. అప్పుడు సూపర్‌స్టార్ల దయాదాక్షిణ్యాలపై ఆధార పడటం మానేసి స్టుడియోలే స్టార్లని సృష్టించగలుగుతాయి. అయితే మీలో కొందరనుకోవచ్చు: ‘ఇదంతా జరిగే పనేనా? పిల్లి మెడలో గంట కట్టేదెవరు?’. నాకూ తెలీదు. తెలిసిందొకటే. మనవాళ్లు చెయ్యకపోతే ఈ పనీ త్వరలో మనకోసం హాలీవుడ్ బడా స్టుడియోలే చేసిపెడతాయి. ఇప్పటికే వార్నర్ బ్రదర్స్, ఫాక్స్, యూనివర్సల్ వంటి సంస్థలు మన భాషల్లో చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నాయి. ప్రపంచంలో అతి పెద్ద సినిమా మార్కెట్లలో ఒకదాన్ని వదులుకోటానికి వాళ్లైతే సిద్ధంగా లేరు. మరి మనవాళ్లో?

(ఇంకా ఉంది)

గమనిక:

1. చిత్రరంగం యావత్తూ స్టుడియోల నియంతృత్వంలోకి వెళ్లిపోతే వచ్చే సమస్యలూ కొన్నున్నాయి. వాటి గురించి విపులంగా మరెప్పుడైనా చర్చిద్దాం.

2. ఈ వ్యాస పరంపరలో చివరగా రాబోతున్న మూడవ భాగం ఈ రెండు భాగాలతో పెద్దగా సంబంధం లేనట్లు ఉంటుంది. హాలీవుడ్ పరిభాషలో చెప్పాలంటే, మూడో భాగం ఈ రెండు భాగాల నుండి స్పిన్-ఆఫ్.

మన సినిమా – మొదటి భాగం
‘హాలీవుడ్ స్థాయిలో’ అనేది మన సినీజనులు తమ చిత్రరాజాలకి తరచూ ఆపాదించే పోలిక. కాకిపిల్ల కాకికి ముద్దే. అవి నిజంగా ఆ స్థాయిలో ఉంటాయా లేవా అన్నది వేరే విషయం. ‘వేరెవరితోనో పోలికలు అనవసరం. అసలు మనమే మనదైన స్థాయినొకదాన్ని సృష్టించుకోవాలి’ అన్నది కొందరు తెలుగు సినీ ప్రియుల కోరిక. మంచిదే. అయితే స్వర్గానికెగరబోయే ముందు ఉట్టికెగరటం నేర్చుకోవాలి కదా. హాలీవుడ్‌ని కాపీ కొట్టబోయి చేతులు కాల్చుకోవటం మనవాళ్లకి అలవాటు. ఆ కాపీలు కొట్టటమన్నా సరిగా నేర్చుకుంటే, సొంత క్రియేటివిటీ సంగతి ఆ తర్వాత చూడొచ్చు. ఈ మాటలకి అభిమానధనులు నొచ్చుకోవచ్చు. అయితే ఈ వ్యాసం ఆసాంతం చదివితే నా మాటతో ఏకీభవిస్తారనే అనుకుంటూ .. వ్యాసంలోకి దిగుతున్నాను.

ఈ వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో తెలుగు సినిమాల్లో ‘హాలీవుడ్ స్థాయిలో’ ఉండే గ్రాఫిక్స్ నాణ్యత గురించిన చర్చ ఉంటుంది. రెండో భాగంలో తెలుగు సినిమాల్లో కథల కొరత గురించిన చర్చ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల ప్రస్తావనా ఉంటుంది. వాటికి ఒక పరిష్కార సూచన కూడా ఉంటుంది (అదెంత ఆచరణాయోగ్యం అనేది వేరే చర్చ) మూడో భాగంలో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ పద్ధతుల గురించిన కొన్ని వివరాలు, (అతి తేలిగ్గా పాటించగల) వాటిని తెలుగులో ఎక్కువ మంది దర్శకులు ఎందుకు అలక్ష్యం చేస్తారనే విషయమ్మీద చిన్నపాటి చర్చ ఉంటుంది.

నా దృష్టిలో –  ప్రపంచంలో ఏ ఇతర సినీ రంగమైనా హాలీవుడ్‌తో పోటీ పడాల్సింది రెండు విషయాల్లో: విభిన్న కథాంశాలు, సాంకేతిక హంగులు. పై రెండు విషయాల్లో హాలీవుడ్ సినిమాలు మిగతావాటికన్నాఎక్కువ స్థాయిలో ఉన్నాయన్నది కాదనలేని సత్యం. హాలీవుడేతర సినిమాల్లో మంచివి, గొప్పవి రావటం లేదా – అంటే వస్తున్నాయి (కాన్వర్స్: హాలీవుడ్ చెత్త సినిమాలు తీయటం లేదా? మహరాజులా తీస్తుంది. ఐతే ఏ విషయంలోనైనా పోలికలెప్పుడూ మెరుగైన విషయాల గురించే ఉండటం ఎదుగుదలకి ముఖ్యం). ఇరాన్ కూడా మంచి సినిమాలు తీస్తుంది. కానీ వాటిలో వైవిధ్యం ఏది? ఇరాన్‌ది చిన్న పరిశ్రమ. వాళ్లకుండే పరిమితులెక్కువ. అక్కడ ఎక్కువ వైవిధ్యం ఆశించటం అనవసరం. మనవాళ్లకేమయింది? సంఖ్యలో మనవాళ్లు ఏటా జనాల మీదకొదిలే సినిమాలు – కేవలం తెలుగు, తమిళ రంగాలనే లెక్కలోకి తీసుకున్నా – హాలీవుడ్ మేజర్ స్టూడియోలన్నీ కలిపి తీసే సినిమాలకన్నా ఎక్కువ. వాటిలో ఎన్ని వైవిధ్యభరితమైన కథాంశాలతో వస్తాయంటే వేళ్ల మీద కూడా లెక్కించటానికుండదు. తొంభై శాతం అవే రొడ్డకొట్టుడు కథలు. కుర్ర హీరోలకైతే ప్రేమ కథలు, ముదురు హీరోలకైతే ప్రతీకారం కథలు. హిందీవాళ్లు ఎంతో కొంత మెరుగీ విషయంలో.

సాంకేతిక హంగులు – హాలీవుడ్ ఈ విషయంలో చేసినన్ని ప్రయోగాలు మనమెప్పటికన్నా చెయ్యగలమా? బర్బాంక్ స్టూడియోలు అవసరాన్ని బట్టి కొత్త రకం కెమెరాల నుండి యానిమేషన్ సాఫ్ట్‌వేర్ దాకా సృష్టించుకోగలిగుతాయి. స్టెడీకామ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, త్రీ-డీ టెక్నాలజీ .. ఒకటేమిటి, సినిమాల్లో వచ్చిన, వస్తున్న సాంకేతిక ప్రగతి మొత్తం హాలీవుడ్ సృష్టే కదా. మనవాళ్లు ఆ రకంగా చెయ్యగలుగుతారా ఎప్పటికైనా? లేరు. ఎందుకు? బడ్జెట్ పరిమితులు. అంత డబ్బు ఖర్చు పెట్టటం మనకి వర్కవుట్ కాదు. నిజంగా కాదా అంటే నిజానికి అవుతుంది. కానీ ఇప్పుడు మన సినీరంగం నడపబడుతున్న పరిస్థితుల్లో కాదు. మరెలా అవుతుంది? తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే వేరేవాళ్ల ఇన్నోవేషన్లు అందిపుచ్చుకోటమే మనం చెయ్యగలిగేది. అయితే ఆ అందిపుచ్చుకోవటం ఎప్పటికి? హాలీవుడ్లో ఒక టెక్నాలజీ వచ్చిన ఐదారేళ్లకి. ఆలోగా ఆ టెక్నాలజీని ఎన్ని రకాలుగా ఎక్స్‌ప్లాయిట్ చెయ్యాలో అన్నిరకాలుగానూ హాలీవుడ్ దర్శకులు చేసేస్తారు. ఐదేళ్ల తర్వాత మనవాళ్లు అలాంటి షాట్లు ఎన్ని తీసినా అవన్నీ ఎప్పుడో ఎక్కడో చూసేసినట్లే ఉంటాయి. అయితే సమస్య అది కాదు. మనవాళ్లు ఆ పనీ సరిగా చెయ్యలేకపోవటమే అసలు సమస్య. అందుకే అన్నాను – ముందు కాపీ కొట్టటమన్నా సరిగా నేర్చుకోమనండి, తర్వాత సొంత క్రియేటివిటీ సంగతి చూడొచ్చు అని.

‘అనుకరించటమన్నా సరిగా చెయ్యటం నేర్చుకోమనండి’ అనటానికి చాలా కారణాలున్నాయి. అవన్నీ విడమర్చనవసరం లేదు. మచ్చుకొక్క ఉదాహరణ చాలు. ‘మాట్రిక్స్’ సినిమా విడుదలై పదేళ్లయింది. ఈ పదేళ్లలో, మన వివిధ ‘వుడ్’లలో మాట్రిక్స్ తరహా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటానికి ప్రయత్నించిన దర్శకులు డజన్లలో ఉన్నారు. ఒక్కరూ అందులో విజయం సాధించలేకపోయారు. హాలీవుడ్‌లో వచ్చిన కొత్త తరహా ఎఫెక్ట్స్ వచ్చినట్లు కాపీ కొట్టేసే దక్షిణాది ‘క్రియేటివ్ జీనియస్’ శంకర్ ఆరేడేళ్ల క్రితం ‘బాయ్స్’ సినిమాలో ఓ పాటలో ఆ ప్రయోగం చేసి దారుణంగా విఫలమయ్యాడు (అది దర్శకుల చేతకానితనం కాదు – కెమెరా మరియు పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ల చేతకానితనం అన్నాడో మితృడు. ఆయా నిపుణులతో అవసరమైనట్లు పని చేయించుకోలేకపోవటం మాత్రం దర్శకుడి చేతగానితనమే కదా). ‘బాయ్స్’ విడుదలకన్నా ముందే ఔత్సాహిక మూవీ బఫ్స్ కొందరు కేవలం నాలుగైదు సాధారణ వీడియో కెమెరాలు వాడి శంకర్‌కన్నా మెరుగ్గా ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్ సాధించటం నేను గమనించాను (ఇంటర్నెట్‌లో వెదికితే అలాంటివి బోలెడు దొరుకుతాయి). షూ-స్ట్రింగ్ బడ్జెట్‌తో ఆ కుర్రాళ్లు సాధించిన ఫలితాలు మన దర్శకనిర్మాతలు కోట్లకు కోట్లు వెచ్చించి సైతం సాధించలేకపోవటం నాకెప్పుడూ అర్ధం కాదు. లోపం ఎక్కడ?

ఇక గ్రాఫిక్స్ విషయం. అవసరం లేకున్నా విచ్చలవిడి గ్రాఫిక్స్ వాడకం ఈ మధ్య విరివిగా దర్శనమిస్తుంది మన సినిమాల్లో – ముఖ్యంగా తెలుగు సినిమాల్లో. సినిమా పేరు తెరమీద కనపడ్డప్పుడు ఆ బాంబు పేలుళ్లు, టైటిల్ బద్దలై అందులోంచి గొడ్డళ్లూ విచ్చుకత్తులూ దూసుకురావటం – ఇంత హంగామా ఎందుకు? పోనీ అవన్నా నవ్యంగా ఉంటాయా అంటే అదీ లేదు. అన్నీ ఒకే రకం. సినిమా అనేది టైటిల్స్ దగ్గర్నుండే ప్రేక్షకుడ్ని కథలోకి లాక్కెళ్లాలి. మన దగ్గర మాత్రం (ముఖ్యంగా డీవీడిలో చూసేటప్పుడు) శుభ్రంగా టైటిల్స్ స్కిప్ చేసేసి చూసెయ్యొచ్చు. సరే. టైటిల్స్ గొడవొదిలేసి మళ్లీ గ్రాఫిక్స్ దగ్గరికొద్దాం.

మనవాళ్ల గ్రాఫిక్స్ ఎంత ఘోరంగా అఘోరిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవసరం లేకున్నా ఏవో ఫైట్ సీన్లలోనో, పాటల్లోనో గ్రాఫిక్స్ కుమ్మేస్తారు. (‘అరుంధతి’ లాంటి ఒకట్రెండు సినిమాల్లో అవసరం మేరా వాడుకున్నారనుకోండి, కానీ అలాంటి సినిమాలెన్ని? అలాంటి నిర్మాతలెందరు?) అవసరముందా లేదా అనేది అవతలుంచితే, ఆ తీసేదేదో సరిగా తీయటమూ ఉండదు. కోట్లు ఖర్చు పెట్టాం అని డబ్బాలు కొట్టుకోటమే కానీ, ఆ కోట్లకి వాళ్లు రాబట్టిన ఫలితం తెరపై చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కొందరనొచ్చు, ‘మనకున్న మార్కెట్‌కీ, మనం గ్రాఫిక్స్‌కి ఖర్చు పెట్టేదానికీ అంతకన్నా గొప్పగా చెయ్యటం కుదరదు’ అని. నేనొప్పుకోను. అంతకన్నా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఎఫెక్ట్ సాధించొచ్చు. ఊరికే నా మాట నమ్మనవసరం లేదు. తిరుగులేని ఉదాహరణొకటిస్తాను. కింది మూడు నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూడండి.

405 The Movie

ఇద్దరు ఔత్సాహికులు కలిసి కేవలం నూట యాభై డాలర్ల ఖర్చుతో ఒక సాధారణ వీడియో కెమెరా, ల్యాప్‌టాప్, లైట్‌వేవ్ యానిమేషన్ సాఫ్ట్‌వేర్, మూడు నెలల శ్రమశక్తితో రూపొందించినదీ బుల్లి సినిమా. ఆ ఖాళీ ఫ్రీవే, విమానం, గ్రాండ్ చెరోకీ జీప్ ఏవీ నిజం కావు – కంప్యూటర్ గ్రాఫిక్స్. వాళ్లు పెట్టిన ఖర్చుకి వందల రెట్లు తుది ఫలితంలో కనిపించటంలేదూ? ఇప్పుడు చెప్పండి. తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్‌కోసం పెట్టామని దర్శక నిర్మాతలు చెప్పుకునే ఖర్చుకీ, వాళ్లు సాధించే ఎఫెక్ట్‌కీ ఏమన్నా పొంతనుందా! ఆలోచిస్తే మళ్లీ అదే ప్రశ్న – లోపం ఎక్కడ?

(ఇంకా ఉంది)

ఆర్సన్ వెల్స్ – చివరి భాగం
(మొదటి భాగం తరువాయి)

1915 మే 6న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆర్సన్ వెల్స్ సంగీతకారిణి అయిన తల్లిద్వారా చిన్నతనంలొనే పియానో, వాయులీనం వంటి వాయిద్యాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. అతనికి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి, పదమూడేళ్లప్పుడు తండ్రి కాలం చేశారు. చిన్నప్పటినుండీ వెల్స్ దృష్టి చదువు కన్నా కళల మిద ఎక్కువ ఉండేది. టీనేజ్‌లో కొచ్చేటప్పటికే అతను ఐరోపాని రెండు సార్లు చుట్టిరావటమే కాకుండా, షేక్‌స్పియర్ విరచిత ‘హేమ్లెట్’ నాటకంలో ఓ పాత్ర ధరించటం ద్వారా నాటక రంగ ప్రవేశం కూడా చేశాడు. అతని తొలి నాటక ప్రదర్శన జరిగింది ఐర్లాండ్ దేశం డబ్లిన్ నగరంలో, 1931లో.

ఐర్లాండ్‌లోనే ఏడాది పాటు నాటక ప్రదర్శనలిచ్చిన పిదప స్పెయిన్, మొరాకో వంటి దేశాల్లో ‘రోమియో జూలియట్’ వంటి షేక్‌స్పియర్ నాటక ప్రదర్శనలిస్తూ కొన్నాళ్ల పాటు పర్యటించి, 1933లో అమెరికాకి తిరిగొచ్చాడు. చికాగో, న్యూయార్క్ వంటి నగరాల్లో నాటకాలకి దర్శకత్వం వహిస్తూ, వాటిలో ప్రధాన పాత్రలో పోషిస్తూ కొంత కాలం గడిపాడు. ఇదే సమయంలో స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ‘ది హార్ట్స్ ఆఫ్ ఏజ్’ (The Hearts of Age) అనే లఘు చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఒక రకంగా ఇదే వెల్స్ మొదటి సినిమా. 1935 ప్రాంతంలో వెల్స్ రూపొందించిన నాటకం ‘పానిక్’ (Panic) విజయవంతం కావటంతో దాన్ని రేడియో నాటకంగా కూడా మలిచాడు. అలా ఆర్సన్ వెల్స్ రేడియో రంగప్రవేశం జరిగింది. వయసుకి మించిన గంభీరతని సొంతం చేసుకున్న అతని స్వరం అనతికాలంలోనే రేడియో ప్రయోక్తగా వెల్స్‌కి గుర్తింపు తెచ్చి పెట్టింది. 1937 – 38 మధ్య కాలంలో రేడియో కార్యక్రమాలతో ఆర్సన్ వెల్స్ ఎంత బిజీగా ఉండేవాడంటే, ఒక్కో కార్యక్రమానికీ మధ్య ఉన్న కొద్దిపాటి సమయంలో ఒక స్టుడియో నుండి మరో స్టుడియోకి పరుగుదీయటానికి అతనికి కష్టమైపోయేది. దానికి తోడు న్యూ యార్క్ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అతని పని మరింత కష్టం చేసేది. దీనికి విరుగుడుగా వెల్స్ ఓ చిన్న చిట్కా కనిపెట్టాడు. అదేమంటే, ఒక అంబులెన్స్‌ని అద్దెకి తీసుకుని దాని సైరెన్లు మోగించుకుంటూ స్టుడియోల మధ్య సంచారం చెయ్యటం!

1937లో వెల్స్ మెర్కురీ థియేటర్ నాటక సమాజం స్థాపించి మొదటి ప్రయత్నంగా షేక్‌స్పియర్ ‘జూలియస్ సీజర్’ని ఆధునికీకరించి ప్రదర్శించాడు. 1937 నవంబర్ 11న తొలిసారి ప్రదర్శితమైన ఈ నాటకం విమర్శకుల ప్రశంసలు పొందటమే కాకుండా కొన్ని వివాదాలకూ కేంద్రమయింది. మరుసటేడాది మరో నాలుగు నాటకాలు రూపొందించి ప్రదర్శించిన తర్వాత మెర్క్యురీ థియేటర్ రేడియో రంగ ప్రవేశం చేసింది – కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (సిబిఎస్) లో వారంవారం ప్రసారమయ్యే ‘ఫస్ట్ పర్సన్ సింగ్యులర్’ (First Person Singular) అనే కార్యక్రమంతో. ప్రసిద్ధి చెందిన రచనలను రేడియోకి తగ్గట్లు మలచి డ్రామాలుగా ప్రసారం చేసే ఈ కార్యక్రమం విభిన్న పోకడలతో, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో అప్పటిదాకా చెలామణిలో ఉన్న రేడియో డ్రామాలకు అర్ధాన్ని తిరగరాసింది. ఈ పరంపరలో ప్రసారమైన మొదటి డ్రామా, బ్రామ్ స్టోకర్ విరచిత హారర్ నవల ‘డ్రాకులా’. దాన్ని వెన్నంటి ‘ట్రెజర్ ఐలాండ్’, ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’, ‘ది 39 స్టెప్స్’ వంటి కళాఖండాలూ రేడియో రూపం సంతరించుకున్నాయి మెర్క్యురీ థియేటర్ ద్వారా. ఆ క్రమంలో వచ్చిందే – 1938 అక్టోబర్ 30న ప్రసారమైన ‘వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్’. అది సృష్టించిన సంచలనం గురించి మొదటి భాగంలో చదివారు కాబట్టి ఇప్పుడు వదిలేద్దాం.

అయితే ‘ఫేమ్’ అనేది వెల్స్‌కి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ తో కొత్తగా వచ్చి పడిందేమీ కాదు. అంతకు ముందే స్టేజి, రేడియో రంగాల్లో విభిన్న ప్రయోగాలతో దూసుకొస్తున్న యువకెరటంగా వెల్స్ అమెరికావ్యాప్తంగా పేరుగాంచాడు. 1938 మే 9న – వెల్స్ 23వ పుట్టిన రోజు జరుపుకున్న మూడో రోజు – అతని ముఖం టైమ్ మ్యాగజైన్ ముఖపత్రాన్నలంకరించింది. కాకపోతే, వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ అతన్ని రాత్రికి రాత్రే ‘రైజింగ్ స్టార్’ స్థాయి నుండి ధృవ తారగా మార్చేసింది. దేశదేశాల్లో, అమెరికా ప్రజానీకాన్ని గంటసేపు వెధవల్ని చేసిన ఈ కుర్రాడి గురించి తెలుసుకోవాలనే ఉబలాటం వ్యక్తమయింది. ముఖ్యంగా – అతను తర్వాత ఏమి చేయబోతున్నాడనేది అందర్నీ తొలిచిన ప్రశ్న. అంత గొప్ప ‘షాకింగ్’ ప్రదర్శన తర్వాత దాన్ని మించే ప్రదర్శనతో రావాలంటే వేరేవాళ్లు ఏమి చేస్తారో కానీ, వెల్స్ మాత్రం ఇక్కడా తన విలక్షణత చాటుకున్నాడు – ఎవరూ ఊహించని రీతిలో హాలీవుడ్‌లో అడుగుపెట్టటం ద్వారా.

అప్పటిదాకా వెల్స్‌కి సినిమా రంగం అంటే అంతో ఇంతో చిన్నచూపే ఉండేది. నాటక రంగంలో ఉన్నంత సృజనాత్మకత సినీ రంగంలో ఉండదని అతని అభిప్రాయం. అందుకే అతని దృష్టి సినిమాలమీదికి పోలేదు. అయితే నాటి ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్‌కెఓ (RKO Pictures) నుండి వచ్చిన ఆఫర్ అతన్ని పునరాలోచించుకునేలా చేసింది. ఆర్సన్ వెల్స్ మూడేళ్లలో మూడు సినిమాలు తమ సంస్థకై నిర్మించేటట్లూ, దానికి గాను ఏడాదికి లక్ష డాలర్ల జీతం (అప్పట్లో అమెరికా అధ్యక్షుడి ఏడాది జీతం కన్నా ఎక్కువిది), అతనికి ఇష్టమొచ్చిన కధ, నటీ నటులతో సినిమా, మరియు సినిమా నిర్మాణంపై పూర్తిగా అతని నియంత్రణ – ఇదీ ఆర్కేవో అతనికిచ్చిన ఆఫర్. సినీ రంగంలో ఎటువంటి అనుభవమూ లేని ఓ ఇరవై మూడేళ్ల కుర్రాడికి  హాలీవుడ్‌లో తొట్టతొలి అవకాశమే ఇంత బ్రహ్మాండంగా ఉంటే వదులుకోవటానికి వెల్స్ పిచ్చివాడేమీ కాదు.

1939 ద్వితీయార్ధంలో వెల్స్ తన మెర్క్యురీ థియేటర్ సభ్యులతో కలిసి క్యాలిఫోర్నియాలో అడుగు పెట్టాడు. అతని రాకని హాలీవుడ్ నీరాజనాలతో స్వాగతించింది. తొలి ప్రయత్నంగా జోసెఫ్ కాన్రాడ్ నవల ‘హార్ట్ ఆఫ్ డార్క్‌నెస్’, మరో ఒకట్రెండు నవలలూ అనుకున్నా, చివరికి అతని దృష్టి ‘ది లైఫ్ ఆఫ్ డ్యూమాస్’ (The Life of Dumas) పై పడింది. ఆ కధని క్యాలిఫోర్నియాకే చెందిన సుప్రసిద్ధ మీడియా మొఘల్ విలియమ్ రాండాల్ఫ్ హర్స్ట్ జీవిత కధతో ముడివేస్తూ వెల్స్ తిరగరాశాడు. చిత్తు ప్రతికి మొదట్లో ‘అమెరికన్’ అనే పేరు అనుకున్నారు కానీ స్క్రిప్టు మొత్తం పూర్తయేనాటికి దానికి ‘సిటిజెన్ కేన్’ అనే పేరు స్థిరపడింది.

సిటిజెన్ కేన్ నిర్మాణం, విడుదల ముందూ తర్వాతా అది సృష్టించిన సంచలనం – రాసుకుంటూ పోతే అదో పెద్ద గ్రంధం. దాని గురించి నవతరంగంలో ఇప్పటికే మూడు వివరమైన వ్యాసాలొచ్చాయి. వాటిని తప్పకుండా చదవండి. మొదటిది ఇక్కడ, రెండోది ఇక్కడ, మరియు మూడోది ఇక్కడ.

మొదటి సినిమాతోనే వెల్స్ హాలీవుడ్‌ని తన వేళ్ల మీద ఆడించాడు, దేశంలో అత్యంత పలుకుబడిగల మీడియా ప్రముఖుడితో ముఖాముఖి తలపడ్డాడు – మొత్తానికి ప్రపంచ సినిమా చరిత్రలో కలకాలం నిలిచిపోయే కళాఖండాన్ని సృష్టించాడు. కానీ సిటిజెన్ కేన్ నిర్మాణం వల్ల అతనికి అప్పటికప్పుడు ఒరిగింది మాత్రం – ఆర్ధిక పతనం, సాటి సినీ జీవుల నుండి తిరస్కారం. వీటిని లెక్కజేయకుండా వెల్స్ తన రెండవ సినిమా – ‘ది మాగ్నిఫిసెంట్ ఆంబర్సన్స్’ (The Magnificent Ambersons) – ప్రారంభించాడు. అయితే ‘కేన్’ అనుభవంతో ఆర్కేవో స్టుడియో వెల్స్‌తో తన ఒప్పందాన్ని తిరగరాసింది. దాంతో రెండవ, మూడవ సినిమాలని వెల్స్ పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోయాడు. స్టుడియో అపరిమిత పర్యవేక్షణలో రూపొందిన ‘ఆంబర్సన్స్’ 1942లో విడుదలై పరాజయం పాలయింది. అది విడుదల కాకముందే వెల్స్ మూడో సినిమా ‘జర్నీ ఇన్‌టు ఫియర్’ (Journey Into Fear) మొదలై 1943లో విడుదలయింది. ఇది కూడా పరాజయం పొందింది. ఈ మూడో చిత్రానికి చాలా వరకూ వెల్స్ డమ్మీగానే మిగిలిపోయాడు. దీనికి అధిక శాతం దర్శకత్వం నార్మన్ ఫాస్టర్ నెరిపాడు. ఈ మూడు సినిమాలూ కలిపి ఆర్కేవో స్టుడియోకి పది లక్షల డాలర్లకి పైగా నష్టం తీసుకొచ్చాయి – ఇది 1942 నాటి మాట. అదే ఏడాది జులై ఒకటిన ఆర్కేవో వెల్స్‌ని బయటికి గెంటేసింది. అప్పటికి వెల్స్ మూడో సినిమా ఇంకా విడుదలే కాలేదు. అతనికి మరో అవకాశం ఇవ్వటానికి మరే హాలీవుడ్ స్టుడియో కూడా ముందుకు రాలేదు. హాలీవుడ్ దర్శకుడిగా ఉత్థాన పతనాలు రెండూ చవిచూసేనాటికి ఆర్సన్ వెల్స్ వయసు – ఇరవై ఏడు సంవత్సరాలు!

తర్వాతి మూడు దశకాల్లో వెల్స్ హాలీవుడ్‌తో యుద్ధమే చేశాడు – సినిమాలు సరైన పద్ధతిలో తీయటానికి – అంటే, తనదైన పద్ధతిలో. అప్పుడో అవకాశం, ఇప్పుడో అవకాశం వచ్చేవి. వాటినుపయోగించుకుని అద్భుత దృశ్య కావ్యాలే తీశాడు, కానీ వాటిలో ఎక్కువ పరాజయం పాలైనవే. ‘ది లేడీ ఫ్రమ్ షాంఘై’ (The Lady from Shanghai), ‘మాక్‌బెత్’ (Macbeth), ‘ఒథెల్లో’ (Othello), ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (Touch of Evil) వాటిలో చెప్పుకోదగ్గవి. ఈ కాలంలో వెల్స్ దర్శకుడిగా కన్నా నటుగా ఎక్కువ గుర్తింపు పొందాడని చెప్పాలి – ‘జేన్ ఐర్’ (Jane Eyre), ‘ది థర్డ్ మాన్’ (The Third Man), ‘మాబీ డిక్’ (Moby Dick) వంటివి వెల్స్ ప్రధాన పాత్రల్లో కనపడ్డ చిత్రాల్లో కొన్ని.

ఆర్సన్ వెల్స్ వ్యక్తిగత జీవితానికొస్తే - మొదటి భార్య వర్జీనీయా నుండి విడిపోయాక కొంత కాలం మెక్సికన్ నటి డొలోరెస్ డెల్ రియో తో కలిసి ఉన్నాడు. తర్వాత నాటి ప్రసిద్ధ హాలీవుడ్ నటి రీటా హేవర్త్ ని పెళ్లాడి కొన్నేళ్లకి ఆమెతోనూ విడిపోయాడు. ముచ్చటగా మూడోసారి పౌలా మోరి అనే ఆవిడని పెళ్లాడాడు. ముగ్గురు భార్యల ద్వారా అతనికి క్రిస్టఫర్, రెబెకా, బీట్రిస్ అనే ముగ్గురు కుమార్తెలు కలిగారు.

సినీ రంగంలో పరిచయం ఉండి, వెల్స్ గురించి తెలిసి ఉన్నవారిలో అతనో మేధావి అని ఒప్పుకోని వారుండరు. అతనో అహంభావి అనే వాళ్లూ ఎందరో. అయితే కొందరి దృష్టిలో అది ఆత్మవిశ్వాసం. వెల్స్ దృష్టిలో మాత్రం ‘అహంభావి’ అనేది తనంటే భయంతో హాలీవుడ్ తనకిచ్చిన ముద్దు పేరు. హాలీవుడ్‌పై నిరసనతో 1950 తర్వాత ఎక్కువ కాలం వెల్స్ ఐరోపాలో సినిమాలు తీస్తూ గడిపాడు. వాటిలో పూర్తి కానివే అధికం. అతని చివరి సినిమా కూడా విడుదల కాకుండానే ఆగిపోయింది. 1985 అక్టోబర్ 9 సాయంత్రం ‘ది మేజిక్ షో’ (The Magic Show) సినిమా స్క్రిప్టు సవరించే పనిలో మునిగుండగా గుండె నొప్పితో కూలిపోయి అదే రోజు కన్ను మూశాడు ఆర్సన్ వెల్స్.

వెల్స్ గురించి, అతని మాటల్లోనే: ‘I started at the top and successfully worked my way down’. బ్రతికుండగా చిన్న చూపు చూసిన హాలీవుడ్ కూడా మరణానంతరం అతని ప్రతిభని గుర్తించక తప్పలేదు. నేడు హాలీవుడ్ విమర్శకుల దృష్టిలో, వెల్స్ రూపొందించిన సాధారణ చిత్రాలు కూడా పలువురు ఇతర దర్శకుల గొప్ప చిత్రాల కన్నా మిన్న అనే అభిప్రాయముంది. రేడియో, సినిమా – రెండు ప్రభావశీల మాధ్యమాల్లోనూ నభూతో అనిపించే కళాఖండాలు సృష్టించేనాటికి అతని వయసు కేవలం పాతికేళ్లు. బోయ్ వండరా, మజాకా!

ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం
ప్రపంచాల యుద్ధం

ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక సమాజపు ఆలోచనా సరళిని సమూలంగా మార్చివేసే సంఘటన మరికొద్ది సేపట్లో జరగబోతుందని అప్పుడెవ్వరూ ఊహించలేదు.

టెలివిజన్ ఇంకా అందుబాట్లోకి రాని ఆ రోజుల్లో అమెరికన్లకి కాలక్షేపానికీ, వినోదానికీ, వేడి వేడి వార్తలకీ  రేడియోనే దిక్కు. ఆ రాత్రి యధాప్రకారం ఎన్‌బిసి లో ప్రముఖ కార్యక్రమం ‘ఛేజ్ అండ్ శాన్‌బార్న్ ఘడియ’ (Chase and Sanborn Hour) కార్యక్రమంలో ప్రముఖ వెంట్రిలాక్విస్టు ఛార్లీ మెకార్తీ సమర్పిస్తున్న హాస్యలహరి వింటూ, విరామ సమయంలో వ్యాపార ప్రకటనలు తప్పించుకోటానికి స్టేషన్లు మారుస్తున్న శ్రోతల్లో చాలామంది కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం (సిబిఎస్) స్టేషన్లో వస్తున్న వార్త విని ఉలిక్కిపడ్డారు. దాని సారాంశం: న్యూ జెర్సీ రాష్ట్రంలోని గ్రోవర్స్ మిల్ గ్రామంపై గ్రహాంతరవాసుల దాడి. దాడి గురించి పలువురు ప్రత్యక్ష సాక్షుల కధనాలు వింటూ శ్రోతలు బెంబేలెత్తిపోయారు. మార్స్ నుండి వచ్చిన వింతజీవులు ఒకదాని వెంబడి ఒకటిగా న్యూ జెర్సీ లోని పట్టణాలను, గ్రామాలను ముట్టడిస్తూ ఎదురుపడ్డ మనుషులను లేజర్ తుపాకులతో కాల్చి బూడిద చేస్తున్నట్లు వరుసగా వార్తలు. వారినెదుర్కోవటానికి రంగంలోకి దిగిన సైన్యం కూడా చేతులెత్తేసినట్లు సమాచారం! ఈ వార్తలందిస్తున్న విలేకరులు కూడా గ్రహాంతరవాసుల బారిన పడి మరణించటం, వాళ్ల ఆర్తనాదాలు రేడియోలో వింటూ శ్రోతలు భీతిల్లిపోవటం!! టెలిఫోన్ల ద్వారా ఈ వార్త నిమిషాల్లో అమెరికా తూర్పు తీరమంతా దావానలంలా వ్యాపించింది. గంట గడిచే లోగా దేశమంతా అట్టుడుకిపోయింది. దాడి వార్తని నిర్ధారించుకోటానికి రేడియో స్టేషన్లకి, పోలీస్ స్టేషన్లకి, వార్తా పత్రికల కార్యాలయాలకీ వేలకొద్దీ ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. దాడి మొదలైన గ్రోవర్స్ మిల్‌కి సమీప ప్రాంతాల్లో అనేకమంది ఇళ్లలోంచి పారిపోయారు. కొందరు సమీపంలోని చర్చ్‌లలో తలదాచుకుని ప్రార్ధనలు జరపసాగారు. యుగాంతం సమీపించిందనుకున్నారు వేదాంతులు. ధైర్యవంతులు కొందరు తుపాలు తీసుకుని సైన్యానికి సహాయ పడతామంటూ బయల్దేరారు. పెన్సిల్వేనియా రాష్ట్ర గవర్నర్ ఈ విపత్తుని కాచుకోటానికి తమ దళాలను న్యూ జెర్శీకి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు.ఇంత గందరగోళంలోనూ తెలివిగా ఆలోచించిన కొందరు ఇది గ్రహాంతరవాసుల దాడి కాదని నమ్మారు. హిట్లర్ ఆదేశాలతో జర్మన్లు తమ దేశంపై మెరుపు దాడి చేశారని వీళ్లు ఊహించారు. మొత్తమ్మీద, న్యూ జెర్సీ వాసుల్లో భయాందోళనలు. వాళ్ల భయాలను పెంచుతూ ఫోన్ లైన్లు కూడామొరాయించటం మొదలెట్టాయి. నిమిషానికో కబురు. వార్తేదో, వదంతేదో అంతుపట్టని స్థితి.

కొన్ని గంటలు ఫాస్ట్ ఫార్వార్డ్ చేస్తే ….

…. అసలు కధ

నిజం తెలిసిన జనాలు – కొందరు నవ్వుకున్నారు, కొందరు తమ తెలివితక్కువతనానికి సిగ్గుపడి గమ్మునున్నారు, ఎందరో ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కారణం: వాళ్లందర్నీ అంతలా బెదరగొట్టిన ఆ రేడియో వార్త నిజానికి వార్త కాదు, అచ్చమైన వార్తా ప్రసారంలా రూపొందిన రేడియో నాటకం మాత్రమే. దాని ప్రయోక్త, రేడియో రంగంలో అప్పుడప్పుడే పేరు తెచ్చుకుంటున్న ఆర్సన్ వెల్స్.

అత్యధిక రేటింగ్ ఉన్న ఎన్‌బిసి వారి శాన్‌బార్న్ ఘడియ ప్రసారమయ్యే సమయంలోనే తను సమర్పించే కార్యక్రమాలు సిబిఎస్ లో ప్రసారమవుతుండటంతో, ఎన్‌బిసి శ్రోతలని ఇటువైపుకి మళ్లించేందుకు వెల్స్ వేసిన పాచిక అది. అప్పటికి నలభయ్యేళ్ల క్రితం, 1898లో, సైన్స్ ఫిక్షన్ సాహిత్య పితామహుడు హెచ్.జి.వెల్స్ (ఆర్సన్ వెల్స్‌కీ హెచ్.జి.వెల్స్‌కీ చుట్టరికమేదీ లేదు) రాసిన వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ నవలని రేడియో నాటకంగా మార్చి, అద్భుతమైన సౌండ్ ఎఫెక్ట్స్‌తో, నిజమైన స్థలాల, మనుషుల, సంస్థల పేర్లు వాడుతూ గ్రహాంతరవాసుల దాడి నిజంగా జరిగిందనిపించేలా రూపొందించిన రేడియో కదంబ కార్యక్రమమది. తన నాటకానికి మరింత ఆథెంటిసిటీ ఇవ్వటానికి ఆర్సన్ చేసిన ప్రయోగం – దాన్ని వార్తా ప్రసారంలా రూపొందించటం (ఇప్పట్లో ప్రతి టెలివిజన్ ఛానెల్లోనూ మామూలైపోయిన ‘బకరా’ తరహా కార్యక్రమాలకి స్ఫూర్తి అలనాటి వెల్స్ రేడియో నాటకమే). ఈ కార్యక్రమానికి ముందు కొన్నాళ్లనుండీ దీనికి సంబంధించిన ప్రకటనలు రేడియోలోనూ, వార్తా పత్రికల్లోనూ వస్తూనే ఉన్నా అవి అధికుల దృష్టిలో పడలేదు. కార్యక్రమం మొదట్లో కూడా అది రేడియో నాటకం అన్న సంగతి ప్రకటించినా, అధిక శాతం శ్రోతలు అది వినకపోవటం వల్ల గందరగోళం నెలకొంది. ఏదైతేనేం, ఆర్సన్ వెల్స్ ఊహలకు మించి విజయవంతమైందానాటి కార్యక్రమం. వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ ప్రసారంతో అప్పటిదాకా రేడియో నాటకాలకు ఉన్న లక్షణాలను అమాంతం మార్చిపారేశాడు ఆర్సల్ వెల్స్.

దీని తర్వాత ఆర్సన్ వెల్స్ మీదా, అతని మెర్క్యురీ థియేటర్ మీదా నడిచిన కోర్టు కేసులు మరో పెద్ద కధ. దాని సంగతటుంచితే, అప్పటిదాకా అమెరికన్ ప్రజానీకానికి రేడియోలో విన్నదంతా నిజమే అని నమ్మే అలవాటుండేది. ఒక్క దెబ్బలో దాన్ని పటాపంచలు చేసిపారేశాడు ఆర్సన్ వెల్స్. రేడియో ఎంత ప్రభావశీల మాధ్యమమో ఆనాటితో అందరికీ అర్ధమైపోయింది. ఈనాటికీ, ప్రజల మీద మీడియా ప్రభావం గురించి చర్చించే ప్రతి సందర్భంలోనూ 1938నాటి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ ప్రసారం గురించీ, అది రేపిన అలజడి గురించీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది.

ఒక అంచనా ప్రకారం ఈ ప్రసారం విన్న శ్రోతల్లో సుమారు పన్నెండు లక్షల మంది పానిక్ అయ్యారు. ఈ అంచనా శాస్త్రీయతపై అనంతర కాలంలో విమర్శలొచ్చాయి. ఆ విమర్శల్లో నిజానిజాలెంతున్నా, వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ రేడియో నాటకంతో వెల్స్ పేరు రాత్రికి రాత్రే అమెరికా అంతటా మార్మోగిపోయిందన్నది నిజం. ఒక చిన్న రేడియో ప్రసారంతో ఇంత సంచలనం సృష్టించే నాటికి ఆర్సన్ వెల్స్ వయసు – కేవలం ఇరవై మూడు సంవత్సరాలు. ముఖంలో ఇంకా పసితనపు ఛాయలు పోకుండానే అతను రేపిన సంచలనానికి ముగ్ధులైన విమర్శకులు వెల్స్‌కి పెట్టిన ముద్దు పేరు – బోయ్ జీనియస్. ఈ బోయ్ వండర్ అనంతర కాలంలో స్టేజి, రేడియో, సినిమా మాధ్యమాల్లో సాధించిన విజయాలకి నాటి వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్ నాంది.

(ఆర్సన్ వెల్స్ జీవిత విశేషాలు, తరువాతి భాగంలో)

ది మెజెస్టిక్
హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’,  ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’,  ’బ్రూస్ ఆల్‌మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ఎ స్పాట్‌లెస్ మైండ్’, ‘నంబర్ 23′ వంటి విభిన్న తరహా చిత్రాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించాడు. అతని హాస్య చిత్రాల్లాగే ఇవి కూడా బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసినవే. అయితే - క్యారీ చిత్రాలన్నింటిలోకీ తలమానికమైనదిగా పలువురు విమర్శకులు పేర్కొనే చిత్రం పేరు సైతం చాలామంది వినుండకపోవచ్చు! అది, 2001 డిసెంబర్లో విడుదలైన ‘ది మెజెస్టిక్’. జిమ్ క్యారీ అంటే వెకిలి చేష్టలతో వింత వేషాలేసే ఓ సాధారణ హాస్యనటుడు మాత్రమే అనే అభిప్రాయం మీకుందా? మీరీ సినిమా చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుతీరతారు.

అమెరికాకీ కమ్యూనిజానికీ చుక్కెదురన్నది అరవయ్యేళ్లుగా ప్రపంచానికి ఎరుకే. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐరోపాలో శరవేగంగా విస్తరిస్తున్న సోషలిస్టు భావజాలం తమదేశంలోనూ అడుగు పెడుతుందేమోనని అమెరికన్ ప్రభుత్వం బెదిరిపోయింది. అప్పట్లో అమెరికన్ కమ్యూనిస్టు పార్టీలో సుమారు యాభై వేల మంది సభ్యులు ఉండేవారు. ఆ సంఖ్య మరింత పెరగకుండా చేయటానికీ, కమ్యూనిస్టు పార్టీని మట్టిలో కలిపేయటానికీ ప్రభుత్వం పావులు కదిపింది. అందులో భాగంగా హాలీవుడ్‌లో లబ్దప్రతిష్టులైన పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, కధకులు, ఇతర సాంకేతిక నిపుణులపై కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలున్నట్లుగా అభియోగాలు మోపి వారిని కాంగ్రెస్ ప్రత్యేక కమిటీ ముందు విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశించింది. ఇది 1947 అక్టోబరు నాటి కధ. సినీ మాధ్యమం ద్వారా అమెరికా వ్యతిరేక భావజాలాన్ని అమెరికన్లలో వ్యాపింపజేస్తున్నారనేది వారిపై ప్రధాన ఆరోపణ. నిందితుల్లో కొందరు నిజంగానే కమ్యూనిస్టు సానుభూతిపరులు, ఎక్కువమంది మాత్రం తమకు సంబంధం లేకున్నా ఇందులో ‘ఇరికించబడిన’ వాళ్లు. విచారణకు హాజరు కాని వారు, హాజరయినా కమిటీ ఆశించిన సమాధానాలు ఇవ్వనివారు, కమిటీతో సహకరించటానికి నిరాకరించినవారు తదనంతరం పలు ఇబ్బందులకు, శిక్షలకూ గురయ్యారు. కొందరు కోర్టు ధిక్కార నేరం కింద జైలు పాలవగా, ఎందరో ప్రతిభావంతుల వృత్తి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి (మోషన్ పిక్చర్ అకాడెమీ ఆఫ్ అమెరికాపై కాంగ్రెస్ కమిటీ వత్తిడి తెచ్చి  ఈ నిందితులను హాలీవుడ్ సినిమాలకి పనిచేయకుండా బహిష్కరించేలా చేసింది). 1947లో పదిమందితో ప్రారంభమైన ఈ ‘హాలీవుడ్ బ్లాక్‌లిస్ట్’ ఏ ఏటికాయేడు విస్తరిస్తూ పోయి క్రమంగా ఇతర వినోద రంగాలకూ పాకింది. 1957లో ఉపసంహరించబడేలోపు ఈ బ్లాక్‌లిస్ట్ పాలిటబడి బలయినవారి సంఖ్య సుమారు మూడువందలు!

ఈ నేపధ్యంలో రూపొందిన హాలీవుడ్ ఆణిముత్యం ‘ది మెజెస్టిక్’. కధాకాలం – 1951 ప్రాంతం. పీటర్ ఆపిల్‌టన్ – హాలీవుడ్ ద్వితీయ శ్రేణి చిత్రాల కధా రచయితగా పేరు తెచ్చుకుని అప్పుడప్పుడే ప్రధమ శ్రేణి సినిమాలకేసి అడుగులేస్తున్న యువకుడు. వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ అంతా సజావుగా జరుగుతున్న దశలో ఎవరి పుణ్యానో అతని పేరు హాలీవుడ్‌లో కమ్యూనిస్టు సానుభూతిపరుల కోసం భూతద్దాలతో గాలిస్తున్న ప్రత్యేక ప్రభుత్వ బృందం దృష్టిలో పడుతుంది. కాంగ్రెస్ కమిటీ ముందు హాజరు కావలసిందిగా అతనికి సమన్లొస్తాయి. ఇంకేముంది, తెల్లవారేసరికి స్టూడియోలు అతన్ని ‘హలీవుడ్ బ్లాక్‌లిస్ట్’లో చేరుస్తాయి. అతని సినిమాలు ఆగిపోతాయి. ప్రియురాలు ముఖం చాటేస్తుంది. తెలిసినవారంతా అతన్ని దూరం పెట్టనారంభిస్తారు. అతనితో మాట్లాడితే తమనీ ఎక్కడ కేసుల్లో ఇరికిస్తారోనని వాళ్ల భయం! చేయని తప్పుకు అతని జీవితం నాశనమయ్యే ప్రమాదం. ఒక్క రోజులో తలక్రిందులైన జీవితం.

ఆ బాధలో రాత్రంతా బార్లో తప్ప తాగి కారు నడుపుతూ దారిలో ఓ వంతెనమీద ప్రమాదానికి గురై కారుతో సహా నదిలో పదిపోతాడు పీటర్. ప్రమాదంలో తలకు బలమైన గాయాలై స్పృహనీ, దానితోపాటే జ్ఞాపకశక్తినీ కోల్పోతాడు. మెలకువ వచ్చేసరికి ‘లాసన్’ పేరుగల గ్రామంలో సముద్రతీరంలో పడిఉంటాడు. తనెవరో కూడా తనకి తెలీని స్థితిలో ఉన్న పీటర్ ఆపిల్‌టన్‌ని ఆ గ్రామవాసులు తమ ఊరికే చెందిన లూక్ ట్రింబుల్‌గా భావిస్తారు. ఈ లూక్ ట్రింబుల్ లాసన్ గ్రామస్థుడు హ్యారీ ట్రింబుల్ ఏకైక కుమారుడు. తొమ్మిదేళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడుతూ జాడ తెలియకుండా పోయిన లూక్ కి, జ్ఞాపక శక్తి కోల్పోయిన స్థితిలో తమ ఊరు చేరిన పీటర్‌కి కొట్టొచ్చే పోలికలు ఉండటంతో హ్యారీతో సహా ఊరి వారందరూ అతన్ని లూక్ గా భావిస్తారు.

వెయ్యిలోపు జనాభాగల లాసన్ గ్రామం అరవై రెండుమంది యువకుల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో కోల్పోయింది. ఇప్పుడక్కడ మిగిలిందల్లా వృద్ధులు, ఇంటింటా యుద్ధం మిగిల్చిన గాయాలు. యుద్ధానికి ముందుదాకా హ్యారీ నడిపే ‘ది మెజెస్టిక్’ పేరుగల సినిమా హాల్ ఆ ఊరంతటికీ వినోదాన్నందించే ఒకే ఒక చోటు. కొడుకుని కోల్పోయిన బాధతో హ్యారీ సినిమా హాల్‌ని మూసేస్తాడు. ఇప్పుడా ఊర్లో ఎక్కడ చూసినా నిశ్శబ్దం, నిస్తేజం. ఆ దశలో లూక్ రాక గ్రామంలో ఓ నూతనోత్తేజాన్ని తీసుకొస్తుంది. గ్రామస్తులంతా లూక్‌లో తిరిగొచ్చిన తమ కుమారుల్ని చూసుకుంటారు. మొదట్లో వాళ్లు తనని చూసి పొరబడుతున్నారనుకున్న పీటర్, మెల్లిగా తాను లూక్‌నే కాబోలుననుకోవటం మొదలు పెడతాడు. లూక్ తిరిగొచ్చిన ఆనందంలో హ్యారీ మెజెస్టిక్‌ని పునఃప్రారంభిస్తాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో మళ్లీ సందడి మొదలవుతుంది. ఈ కొత్త లూక్ అందరికీ ఆత్మీయుడవుతాడు.

అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒక రోజు పీటర్‌కి తన గతం గుర్తొస్తుంది. తనెవరో హ్యారీకి చెప్పేద్దామనుకుంటుండగా వయసైన హ్యారీ హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయంలో – హాలీవుడ్ నుండి మాయమైన పీటర్ ఆపిల్‌టన్ కోసం గాలిస్తున్న ఎఫ్‌బిఐ బృందానికి అతను లూక్ ట్రింబుల్ పేరుతో చెలామణి అవుతూ లాసన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయిందో సినిమా చూసి తెలుసుకోండి.

‘ది షాషాంక్ రిడెంప్షన్’, ‘ది గ్రీన్ మైల్’ వంటి అద్భుతమైన చిత్రాలనందించిన ఫ్రాంక్ డరబాంట్ దర్శకత్వంలో రూపొందిన ‘ది మెజెస్టిక్’ చిత్రం నిండా దర్శకుడి శైలి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గ్రాఫిక్కుల గిమ్మిక్కుల మీద అతిగా ఆధారపడకుండా హృదయానికి హత్తుకునే కధలతో సినిమాలు తీసే కొద్దిమంది హాలీవుడ్ దర్శకుల్లో ఫ్రాంక్ డరబాంట్ ఒకడు. ‘ది మెజెస్టిక్‌’లో సైతం అదే బాణీ కనిపిస్తుంది. సినిమా రంగం నేపధ్యంలో తీసిన చిత్రం కావటంతో సహజంగానే అక్కడక్కడా హాలీవుడ్ పనివిధానంపై చురుక్కుమనిపించే చెణుకులు మెరుస్తాయి. మల్టీప్లెక్సుల రంగప్రవేశానికి ముందు అమెరికాలో సినిమా ధియేటర్లు ఎలా ఉండేవో మెజెస్టిక్ ధియేటర్ కళ్లకు కడుతుంది. తన ధియేటర్ గురించి పీటర్/లూక్‌కి వివరిస్తూ ప్రజలు అసలెందుకు సినిమా చూడటనికొస్తారో హ్యారీ తెలియజెప్పే సన్నివేశం – పిచ్చి పిచ్చి సినిమాలు తీసి మనమీదకి వదిలి, అదేమంటే ‘నేనింతే’ అనే పోకిరీ దర్శకులు చూసి తీరాలి. రెండున్నర గంటల సుదీర్ఘమైన చిత్రమైనా, కధనం మెల్లిగా సాగుతున్నా, ఎక్కడా విసుగు పుట్టించకుండా ‘ది మెజెస్టిక్’ కధ నడుస్తుంది. సినిమా నిండా సందర్భోచిత సంభాషణలు. ఏ వాక్యం ఎంతవరకు ఉండాలో అంతే ఉంటుంది. సినిమా అంతా ఒకెత్తు, చివర్లో వచ్చే కోర్టు సన్నివేశం ఒకటీ ఒకెత్తు. ‘టికెట్ డబ్బులు మొత్తం ఈ సీన్‌కే ఇచ్చేయొచ్చు’ అని మనోళ్లంటారే, అలాంటి సన్నివేశమన్నమాట. వ్యక్తి స్వేచ్చకీ, వాక్‌స్వాతంత్రానికీ పెద్దపీట వేస్తూ మొదటి అమెరికన్ రాజ్యాంగ సవరణ ప్రసాదించిన పౌర హక్కుల్ని ప్రస్తావిస్తూ పీటర్ ఆపిల్‌టన్ ‘నేను కమ్యూనిస్టునా కానా అన్నది కాదు సమస్య. అంతకన్నా పెద్ద సమస్య గురించి మాట్లాడుదాం .. ‘ అంటూ మొదలెట్టి లేవనెత్తే ప్రశ్నలు వింటున్నవారిని, సినిమా చూస్తున్నవారిని కట్టిపడేస్తాయి. తన వాగ్ధాటికి పదే పదే అడ్డుతగులుతున్న జడ్జిగారిని లెక్కచేయకుండా పీటర్ సంధించే ప్రశ్నలు తూటాల్లా పేలతాయి. ‘ఈ రాజ్యాంగం లూక్ ట్రింబుల్ వంటి ఎందరో యువకులు రక్తంతో సంతకాలు చేసిన ఒప్పంద పత్రం. దాన్ని మార్చే, ఏమార్చే అధికారం మీకెవరికీ లేదు’ అంటూ బాధతో మిళితమైన ఆవేశాన్ని ప్రదర్శించే ఆ సన్నివేశంలో జిమ్ క్యారీ చూపిన అభినయానికిగానూ అతనికి ఆ ఏడాదికి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు ఇచ్చేసుండొచ్చు (ఆ ఏడాది అకాడెమీ అవార్డు డెంజెల్ వాషింగ్‌టన్‌కి లభించింది).

‘పీరియడ్ సినిమా’ అనేది భారతీయ సినిమాల్లో- ముఖ్యంగా హిందీ సినిమాల్లో - ఇటీవల విరివిగా వినిపిస్తున్న మాట. ‘లగాన్’, ‘మంగళ్ పాండే’ వంటి చిత్రాలు ఈ కోవకి చెందినవి. కధాకాలాన్ని సజీవంగా ప్రేక్షకుల కళ్లముందు నిలపటం ఈ తరహా చిత్రాలకి ప్రాణం. ఆ విషయంలో మనవాళ్లు కొంత ప్రయత్నం చేసినా అంతంత మాత్రమే విజయవంతమయ్యారు. ఫ్రాంక్ డరబాంట్ ఇతర చిత్రాల్లాగానే, పీరియడ్ ఫిల్మ్ అనేది ఎలా ఉండాలో ‘ది మెజెస్టిక్’ చూసి తెలుసుకోవచ్చు. యాభైలనాటి అమెరికన్ గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపటంలో ఫ్రాంక్ మరోసారి విజయం సాధించాడు. ఫ్రాంక్ డరబాంట్ సినిమాల్లో తరచూ నటించే జేమ్స్ విట్‌మోర్, జెఫ్రీ డె-మన్, బ్రెంట్ బ్రిస్కో, బిల్ గ్రాటన్ తదితరులు ఈ సినిమాలోనూ కనిపిస్తారు. జిమ్ క్యారీ తర్వాత ప్రస్తావించి తీరవలసింది లూక్ తండ్రి హ్యారీ ట్రింబుల్ పాత్రలో నటించిన మార్టిన్ లాండౌ గురించి. మిగతా పాత్రధారులూ – పాత్ర చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా – అందరూ తమ సహజ నటనతో ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. వాళ్ల ఎంపికలో ఫ్రాంక్ డరబాంట్‌కి తోడ్పడ్డ కాస్టింగ్ డైరెక్టర్ డెబొరా అకీలా ని ప్రత్యేకంగా అభినందించాలి.

డెబ్భై మిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మితమై 2001 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం రోజర్ ఎబర్ట్ వంటి ప్రఖ్యాత హాలీవుడ్ సినీ విమర్శకుల మన్ననలందుకున్నా, బాక్సాఫీసు వద్ద ముప్పై మిలియన్లలోపే వసూలు చేసి భారీ నష్టాలు చవి చూసింది. కొన్ని సినిమాలంతే. ఎంత బాగున్నా నడవకపోవచ్చు. వాటికి అనేక కారణాలుంటాయి. ‘కాలం కలిసిరాకపోవటం’ అనేది ఈ సినిమాకి బాగా వర్తిస్తుంది. 9/11 దాడుల నేపధ్యంలో ‘ది మెజెస్టిక్’ విడుదలవటంతో ఆశించిన విజయం సాధించలేకపోయింది. దేశభక్తికి అసలు సిసలు నిర్వచనం చెబుతూ, ‘అమెరికా అంటే యుద్ధాలూ, విజయాలూ కాదు; అమెరికా అంటే స్వేచ్ఛ, స్వాతంత్రాలు’ అనే ప్రాధమిక విషయాన్ని గుర్తు చేస్తూ రూపొందిన ఈ సినిమాలోనీ సందేశాన్ని ఆమోదించే స్థితిలో అప్పుడు అమెరికన్ ప్రజానీకం లేకపోవటం చిత్ర పరాజయానికి ఓ ప్రధాన కారణం. అయితే, జయాపజయాలతో నిమిత్తం లేకుండా మంచి సినిమాలు చూడాలనుకునేవారికి తప్పక నచ్చే సినిమా ‘ది మెజెస్టిక్’.

సిటిజెన్ కేన్
1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు తెరవెనక పడ్డ పాట్లు మరో మహాకావ్యాన్ని తలపిస్తాయి. ఆ వివరాలు, ఈ వ్యాసంలో.

మీడియా మొగల్ ఛార్లెస్ ఫోస్టర్ కేన్ మరణంతో సినిమా ప్రారంభమవుతుంది. మరణశయ్యపై అతని చివరి మాట ‘రోజ్ బడ్’ అనేదానికి అర్ధం కనుగొనటానికి జెర్రీ థాంప్సన్ అనే పాత్రికేయుడి ప్రయత్నాలే మిగతా సినిమా అంతా. తన పరిశోధనలో భాగంగా అతను కేన్ స్నేహితులను, బంధువులను, ఉద్యోగులను అనేకమందిని ఇంటర్వ్యూ చేస్తాడు. సినిమా మొత్తం కేన్ జీవితం గురించి వారు చెప్పే వివరాలతో ఒకదాని వెంట ఒకటిగా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల సమాహారంగా నడుస్తుంది.

చిన్నతనంలోనే కేన్ తల్లి పేదరికం తట్టుకోలేక కుమారుడిని ఓ ధనిక కుటుంబానికి దత్తత ఇవ్వటం, పెద్దవాడైన కేన్ ప్రచురణ రంగంలోకి ప్రవేశించి ఒక్కో మెట్టే ఎక్కుతూ అమెరికాలో మీడియా మొత్తాన్నీ శాసించే స్థాయికి ఎదగటం, ఆ క్రమంలో ప్రత్యర్ధులని నిర్దాక్షిణ్యంగా చిత్తుచేయటం, మొదట్లో మంచివాడుగా ఉన్న కేన్ అగ్రస్థానానికెదిగే సమయానికి నిరంకుశుడిగా, ఎవరినీ నమ్మలేనివాడిగా తయారవటం, తనవారిని ఒక్కొక్కరినీ దూరం చేసుకుని ఎంతో సాధించినా ఒంటరివాడిగా మిగిలిపోవటం, హాలీవుడ్ సినీరంగంతో అతని అనుబంధం, ఝనడూ (Xanadu) పేరుతో బ్రహ్మాండమైన సౌధాన్ని నిర్మించుకోవటం, రకరకాల వస్తు సేకరణపై ఆసక్తి .. ఇలా ఒక్కో సన్నివేశమూ కేన్ జీవితంలో ఒక్కో దశనీ విడమర్చి చెబుతాయి.  అప్పటివరకూ కొందరు అంతరంగికులకే తెలిసిన కేన్ జీవిత విశేషాలెన్నిటినో జెర్రీ థాంప్సన్ సేకరించగలుగుతాడు కానీ అతని చివరి మాటలు ఎవరినుద్దేశించినవో కనిపెట్టలేకపోతాడు. క్లైమాక్స్‌లో ఝనడూ పనివాళ్లు కేన్‌కి సంబంధించిన పనికిరాని వస్తువులని ఒక్కొక్కటే మంటల్లో వేసి తగులబెట్టేస్తుండగా, జెర్రీ థాంప్సన్ ‘రోజ్ బడ్’ అంటే ఏమిటో ఇక ఎప్పటికీ అంతుపట్టని రహస్యంగా తేల్చేసి వెళ్లిపోతాడు. కెమెరా మెల్లిగా అగ్నికీలలకాహుతవుతున్న వస్తువులమీదికి కదులుతుంది.  అప్పుడు - ప్రేక్షకులకి కేన్ చివరి మాటల వెనుక రహస్యం అర్ధమవుతుంది. తెరపై కొద్ది క్షణాలపాటే కదలాడే ఆ దృశ్యం కేన్ వ్యక్తిత్వంలో అతని సన్నిహితులెవరూ ఎరుగని మరో కోణాన్ని మౌనంగా ఆవిష్కరిస్తుండగా – సినిమా ముగుస్తుంది.

ఈ చిత్రం దర్శకుడిగా ఆర్సన్ వెల్స్‌కి మొదటిది. దర్శకత్వం వహించటంతో పాటు చిత్రంలో ప్రధానమైన ఛార్లెస్ కేన్ పాత్రని అత్యంత ప్రతిభావంతంగా పోషించాడు వెల్స్. హీరో అంటే ఇలా ఉండాలి, విలన్ అంటే ఇలా ఉండాలి అని పాత్రల లక్షణాలు గిరిగీసినట్లు ఉండే ఆ రోజుల్లో ప్రధాన పాత్రని రాగద్వేషాలుండే మామూలు మనిషిగా రూపుదిద్దటం, కేన్ మంచివాడో, చెడ్డవాడో అర్ధం కాకుండా చూపించి మెప్పించదలచటం కత్తిమీద సామే. ప్రధాన పాత్రని గురించి ఇతర పాత్రలు ఎవరికి తెలిసిన కోణంలో వారు ముక్కలు చెక్కలుగా చెబితే, ఆ పాత్ర అసలు వ్యక్తిత్వం ఏమిటో మీరే గుదిగుచ్చుకోండి అన్నట్లు ప్రేక్షకులకే వదిలేయటం అప్పట్లో పెద్ద ప్రయోగమే.

వెండితెరపై సిటిజెన్ కేన్ కధ చెప్పే పద్ధతిలో ఆర్సన్ వెల్స్ ఇంకా అనేక ప్రయోగాలు చేశాడు. నేడు సర్వసాధారణమైపోయిన లో-యాంగిల్ షాట్స్, డీప్ ఫోకస్, ఎల్-కట్స్, ఆడియో మాంటేజ్ .. ఇవన్నీ వెల్స్ ఈ సినిమాతో పరిచయం చేసినవే. శబ్ద ప్రధానమైన రేడియో రంగం నుండి రావటంతో సిటిజెన్ కేన్‌లో అతను శబ్దంతో చేసిన ప్రయోగాలు అబ్బురపరచాయి. అప్పటిదాకా సినిమాపైనున్న దృశ్య ప్రధానమైన మాధ్యమం అన్న ముద్రని పక్కనబెట్టి సౌండ్ ఎఫెక్ట్స్ ద్వారా కూడా ఓ సన్నివేశానికి మరింత బలం తీసుకురావచ్చని నిరూపించిన మొదటి సినిమా ఇది. ఈ చిత్రంలో పాత్రధారులకి చేసిన మేకప్ కూడా అద్వితీయమనిపించే రీతిలో ఉంటుంది. యవ్వనం నుండీ వృద్ధాప్యం వరకూ వివిధ దశల్లో కేన్ గా కనిపించిన ఆర్సన్ వెల్స్ ఆహార్యం, ఆయా వయసులకి తగ్గట్లు నడకలోనూ, మాట తీరులోనూ వెల్స్ చూపించిన తేడా అద్భుతమనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే – రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, సాంకేతిక నిపుణుడిగా తొలి ప్రయత్నంలోనే విశ్వరూపం చూపించాడు ఆర్సన్ వెల్స్.

విడుదలై డెబ్భయ్యేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వార్తల్లో ఉండే సిటిజెన్ కేన్ నిజానికి నిర్మాణ ప్రకటన వెలువడిన క్షణం నుండే ఎన్నో వివాదాలకు, ఎంతో సంచలనానికీ కేంద్రబిందువయింది. కారణం – ఛార్లెస్ ఫోస్టర్ కేన్ పాత్ర విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్ స్ఫూర్తితో రూపొందటం. ఎవరీ విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్?

1863లో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఓ ధనికుల కుటుంబంలో జన్మించిన విలియమ్ రాండాల్ఫ్ హెర్స్ట్ ఇరవై మూడేళ్ల వయసులో ముద్రణా రంగంలోకి ప్రవేశించి అనతికాలంలోనే అమెరికావ్యాప్తంగా ముప్పైదాకా దినపత్రికలకి, అనేక ఇతర ప్రచురణలకి యజమానయ్యాడు. ఈయన స్థాపించిన హెర్స్ట్ కార్పోరేషన్ అధీనంలోనివే నేటి ప్రసిద్ధ ‘శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్’, ‘కాస్మోపాలిటన్’ వంటి ప్రచురణలు, ‘ఇఎస్‌పిఎన్’, ‘హిస్టరీ ఛానెల్’, ‘ఎ & ఇ’ వంటి టెలివిజన్ ఛానెళ్లు.  ఓ రకంగా, ప్రపంచంలో మొట్టమొదటి మీడియా మొగల్ ఈయనే. రెండు సార్లు అమెరికన్ ఎగువ సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) సభ్యుడుగా కూడా పనిచేశాడు. పత్రికారంగంపై ఆధిపత్యం కోసం హెర్స్ట్‌కి నాటి మరో మీడియా ప్రముఖుడు జోసెఫ్ పులిట్జర్ అధీనంలోని పత్రికలతో జరిగిన హోరాహోరీ చాలా ప్రసిద్ధం (ఈ రెండు సంస్థల ఆధిపత్య పోరాటాల ఫలితంగా పత్రికారంగంలో పుట్టిన కలుపు మొక్కే – ఎల్లో జర్నలిజం). తన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచగల చతురుడు హెర్స్ట్. నాటి అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా హెర్స్ట్ అధీనంలోని న్యూయార్క్ జర్నల్ ప్రచురించిన రెచ్చగొట్టే కధనాల ఫలితంగానే 1901లో అధ్యక్షుడు విలియమ్ మెకిన్లీ హత్య చేయబడ్డాడనేది పలువురు చరిత్రకారుల అభిప్రాయం. తన దినపత్రికల సర్క్యులేషన్ పెంపొందించుకోవటం కోసం ఈయన ప్రచురించిన కధనాలు ప్రజల్ని రెచ్చగొట్టి (1898 వేసవిలో) అమెరికా స్పైయిన్ మీద యుద్ధానికి దిగేలా పురిగొల్పాయంటే హెర్స్ట్ ఎంతటి అసాధ్యుడో తెలుస్తుంది. అటువంటి హెర్స్ట్ జీవితాన్ని సినిమాగా మలచటం సాహసమే. హెర్స్ట్‌ని గుర్తుకు తెచ్చే విషయాలు సిటిజెన్ కేన్ లో ఎన్నో ఉన్నాయి. పత్రికా రంగంపై ఆధిపత్యం, హాలీవుడ్ తో సంబంధ బాంధవ్యాలు, వస్తు సేకరణపై ఆసక్తి, నిరంకుశత్వం, ప్రత్యర్ధులని అణచివేయటంలో దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరించటం మచ్చుకి కొన్ని. విలియం హెర్స్ట్ తనకోసం క్యాలిఫోర్నియా తీరప్రాంతంలో నలభై వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించుకున్న సువిశాల సౌధం ‘హెర్స్ట్ కాజిల్’ (Hearst Castle) కి ప్రతిరూపమే సినిమాలో కేన్ నివాస సౌధం ఝనడూ.

తన జీవితం ఆధారంగా సినిమా రానుండటం హెర్స్ట్‌కి నచ్చలేదు. ఇంకేముంది, సినిమాని ఆపేయటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హాలీవుడ్‌లో తన పలుకుబడి ఉపయోగించి సినిమా తీయటానికి ప్రముఖ స్టుడియోలేవీ ముందుకు రాకుండా చేయటానికి ప్రయత్నించాడు. ఒక వంక వ్యాపారంలోనూ, రాజకీయాల్లోనూ, జీవితంలోనూ తలపండిన హెర్స్ట్ – మరోవంక ఇరవై నాలుగేళ్ల ఆర్సన్ వెల్స్. తెలియనివారికి ఇది కొండను ఢీకొన్న పొట్టేలు కధలా ఉంటుంది. అయితే ఆర్సన్ వెల్స్ కూడా ఆషామాషీ వ్యక్తి కాడు. పట్టుమని పాతికేళ్లు లేకపోయినా అప్పటికే రేడియో ప్రయోక్తగా, స్టేజ్ దర్శకుడిగా దేశవ్యాప్తంగా పేరుగడించినవాడు. ముఖ్యంగా, 1938లో ఆర్సన్ వెల్స్ రూపొందించి రేడియోలో ప్రసారం చేసిన ‘వార్ ఆఫ్ ది వ(ర)ల్డ్స్’ అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందంటే, ఆ కార్యక్రం వింటున్న శ్రోతలు అమెరికాపై నిజంగానే గ్రహాంతరజీవుల దాడి జరుగుతుందని భీతిల్లిపోయారట! ఓ రేడియో కదంబ కార్యక్రమంలా కాకుండా, అసలు సిసలు వార్తా ప్రసారంలా రూపొందించి ప్రసారం చేసి ప్రజల్ని హడలగొట్టిన ఆ కార్యక్రమంతో ఆర్సన్ వెల్స్ పేరు దేశమంతటా మారుమోగిపోయింది.

సిటిజెన్ కేన్ సినిమా తీయటానికి ఎవరూ ముందుకురాకుండా చేయటానికి హెర్స్ట్ ఎన్ని పావులు కదిపినా, ఆర్సన్ వెల్స్ అప్పటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్‌కెఓ స్టుడియోస్ తన సినిమాకి పెట్టుబడి పెట్టేలా ఒప్పించటమే కాకుండా నిర్మాణం మొత్తం తన పూర్తి నియంత్రణలో జరిగేలా ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. చిత్ర నిర్మాణం 1940 జూన్ లో మొదలై అక్టోబర్లో పూర్తయింది. ఈ సినిమా విడుదల చేయకుండా దాని నెగటివ్స్ మరియు అన్ని ప్రతులనూ తగులబెట్టేయటానికి ఆర్‌కెఓ స్టుడియోకి ఎనిమిది లక్షల డాలర్ల మొత్తం ఇవ్వజూపినా స్టుడియో నిరాకరించిందట. ఇక చివరి ప్రయత్నంగా హెర్స్ట్ ఈ చిత్రానికి సంబంధించిన వార్తలేవీ తన అధీనంలోని పత్రికల్లో రాకుండా నిషేధించాడు.

ఇన్ని గొడవలు, వివాదాల మధ్య 1941 మే నెలలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది కానీ బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు (అలాగని నిర్మాతలకు నష్టాలూ తెచ్చిపెట్టలేదు. ఆ ఏడాది విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఆరో స్థానంలో నిలిచిందీ చిత్రం). రెండవ ప్రపంచ యుద్ధం ప్రచండంగా జరుగుతున్న రోజుల్లో విడుదలవటం దానికో కారణం కాగా, హెర్స్ట్ మీడియా సంస్థల సహాయ నిరాకరణ ప్రధాన కారణం. ఆ ఏడాది ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో అకాడెమీ (ఆస్కార్) అవార్డులకు నామినేట్ అయినా చివరికి స్క్రీన్-ప్లేకి మాత్రమే అవార్డు దక్కించుకుందీ చిత్రం. అవార్డు ప్రకటనా కార్యక్రమంలో ఈ చిత్రం పేరు వినిపించినప్పుడల్లా ప్రేక్షకులనుండి అవహేళనగా కేకలు, అరుపులు వినిపించేవి. హెర్స్ట్ దెబ్బకి  హాలీవుడ్ మొత్తం ఆర్సన్ వెల్స్‌కి, సిటిజెన్ కేన్‌కి వ్యతిరేకంగా మారిపోవటం దానికి కారణం. అందువల్లే ఆ ఏడాది అకాడెమీ అవార్డుల్లో ఈ చిత్రానికి తగిన గౌరవం దక్కలేదనటంలో సందేహం లేదు. అయితే పదేళ్ల తర్వాత టెలివిజన్లో ప్రసారమయ్యాక ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల దృష్టినాకర్షించింది, అనతికాలంలోనే హాలీవుడ్ క్లాసిక్‌గా వినుతికెక్కింది.

సిటిజెన్ కేన్‌లో ప్రతి షాట్‌లోనూ ఏదో ఒక సింబాలిజం. చిత్రం ఎత్తుగడ, క్లైమాక్స్ – ఈ రెండూ చాలు దర్శకుడిగా ఆర్సన్ వెల్స్ సత్తా ఏమిటో చాటటానికి. సినిమా ఝనడూ సౌధం ప్రధాన ద్వారం మీదున్న ‘No Trespassing’ అనే బోర్డు మీద క్లోజ్-అప్ షాట్ తో ప్రారంభమై తిరిగి అదే బోర్డు మీద అదే రకమైన షాట్ తో పూర్తి కావటం – ఛార్లెస్ ఫోస్టర్ కేన్ వ్యక్తిత్వంలోనికి తొంగిచూసేందుకు ఎవరికీ అనుమతి లేదు అన్నదానికి అతి పెద్ద సింబాలిజం. సినిమా నిండా ఇటువంటివి మరెన్నో. సినిమా కళని సీరియస్‌గా తీసుకునేవారందరూ తప్పక చూడవలసిన చిత్రం ఇది. సినిమా నిర్మాణంలోని సాంకేతికాంశాలే కాక, తెరవెనుక ఎన్నెన్ని వత్తిడులు తట్టుకోవాలో, అవాంతరాలు అధిగమించాలో తెలుసుకోటానికి సిటిజెన్ కేన్‌ని మించిన కేస్ స్టడీ మరొకటి ఉండదు. అందుకే, నేడు సిటిజెన్ కేన్ ఓ పాఠ్యాంశంగా లేని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ప్రపంచంలో లేదు.

ఎనిమీ ఎట్ ది గేట్స్
‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944′ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941′ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941′ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్ ఎర్ర సైన్యాన్ని కదనరంగంలోకి ఉరికించాల్సిన అవసరం కల్పించిన రోజది. జెర్మనీకి వ్యతిరేకంగా సోవియెట్ యూనియన్ రంగంలోకి దిగకపోయుంటే రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాలు మరోలా ఉండేవనే విషయంలో చరిత్రకారులెవరికీ రెండో అభిప్రాయం లేదు.

రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్-సోవియెట్ సైన్యాల మధ్య చెదురు మదురు సంఘటనలు, చిన్నా పెద్దా సైనిక చర్యలు, పోరాటాలు అనేక చోట్ల జరిగినా, వాటన్నిటిలోకీ తలమానికమైనది జెర్మన్ల చేత కీలక సోవియెట్ పారిశ్రామిక నగరం స్టాలిన్‌గ్రాడ్ ముట్టడి. ఓల్గా నది ఒడ్డునున్న ఈ నగరంపై పట్టు ఇరువర్గాలకూ వ్యూహాత్మకంగా అత్యంత ముఖ్యమైనది. జెర్మన్ల బారినుండి స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోటానికి నగరవాసులు, రెడ్ఆర్మీ కలసికట్టుగా జరిపిన పోరాటం నభూతో.

జెర్మనీ-సోవియెట్ దళాల మధ్య జులై 1942 నుండి ఫిబ్రవరి 1943 వరకూ స్టాలిన్‌గ్రాడ్ వద్ద జరిగిన పోరాటం రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మిత్రరాజ్యాలకు అనుకూలంగా తిప్పింది. స్టాలిన్‌గ్రాడ్‌పై పట్టు కోసం ఇరు దేశాల మధ్య ఏడు నెలలపాటు జరిగిన హోరాహోరీ పోరులో అసువులుబాసిన వారి సంఖ్య అక్షరాలా పదిహేను లక్షల పైమాట! ప్రపంచ చరిత్రలో ఇంతకన్నా రక్తపాతం జరిగిన పోరాటం మరోటి లేదు. జెర్మనీ ఈ నగరాన్ని వశపరచుకోవటం అంటే సోవియెట్ సైన్యానికి ప్రాణాధారమైన ఇంధన నిల్వలున్న కాకస్ ప్రాంతం మీద పట్టు సాధించటమే. స్టాలిన్ పేరుతో ఉన్న ఈ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవటం హిట్లర్‌కు ప్రతిష్టాత్మకం కూడా. ఇవే కారణాలవల్ల స్టాలిన్‌గ్రాడ్‌ని కాపాడుకోవటం సోవియెట్లకు మరింత ముఖ్యం.

స్టాలిన్‌గ్రాడ్‌పై ఏడు నెలలపాటు ఏకబిగిన జరిపిన ముట్టడి విఫలమవటంతో రెండవ ప్రపంచ యుద్ధంలో జెర్మన్ల తిరోగమనం మొదలయింది. స్టాలిన్‌గ్రాడ్ విజయానంతరం రెడ్ ఆర్మీ రెట్టించిన ఉత్సాహంతో జెర్మనీలోకి చొచ్చుకుపోయి అంతిమంగా బెర్లిన్‌ని ఆక్రమించుకోవటం, హిట్లర్ ఆత్మహత్య చేసుకోవటంతో ఒక మహా మారణహోమానికి తెరపడింది. ఆ విధంగా, స్టాలిన్‌గ్రాడ్ పోరాట ఫలితం ప్రపంచ భవిష్యత్తునే మార్చేసిందనటం అతిశయోక్తి కాదు. అయితే ఈ పోరాటంలో మొదట సోవియెట్లు భీకరమైన ఎదురుదెబ్బలు తిన్నారు. ఒకానొక దశలో నగరం అంతా జెర్మన్ల అధీనంలోకి వెళ్లిపోయింది. ఎందరు సైనికులని కోల్పోయినా సరే, నగరాన్ని తిరిగి స్వాధీన పరచుకోవాలన్న స్టాలిన్ హుకుం కారణంగా రెడ్ ఆర్మీ మొండిగా పోరాటం కొనసాగించింది. ఇరు దళాల విచక్షణారహిత బాంబుదాడుల్లో స్టాలిన్‌గ్రాడ్ పూర్తిగా శిధిలమైపోయింది. ఫ్యాక్టరీలన్నీ నేలమట్టమైపోయాయి. జెర్మన్ల ప్రత్యక్ష దాడులు తట్టుకోలేని రెడ్ ఆర్మీ ఓ దశలో గెరిల్లా తరహా యుద్ధ తంత్రాలు అమలు చేసింది. ఆ తరుణంలో, వరుస పెట్టి తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో అడుగంటిన సోవియెట్ ఆత్మవిశ్వాసం తిరిగి ఆకాశాన్ని తాకేలా చేసిన పేరు ‘వస్సిలి జైత్సెవ్’.

వస్సిలి జైత్సెవ్ – పశ్చిమ రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతాలనుండి వచ్చి రెడ్ ఆర్మీలో చేరిన ఒక నిరక్షరాస్యుడు, గొర్రెలకాపరుల కుటుంబానికి చెందినవాడు. రెడ్ ఆర్మీలో అతి తక్కువ స్థాయిలో పనిచేసే ఈ సైనికుడి గురించి ఎవరికీ తెలియకపోయేదే – స్నైపర్‌గా అతని అద్భుత ప్రతిభని ఒకానొక సైన్యాధికారి స్వయంగా గమనించకపోయుంటే. కేవలం ఐదు గుండ్లు మిగిలున్న రైఫిల్‌తో ఐదుగురు జెర్మన్ సైన్యాధికారుల్ని మాటువేసి క్షణాల్లో మట్టుబెట్టిన అతని గురికి అబ్బురపోయిన ఆ సోవియెట్ అధికారి ఇతని గురించి సైనిక అధికారిక పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలతో జైత్సెవ్ రాత్రికి రాత్రే సోవియెట్ యూనియన్‌లో హీరో అయిపోయాడు. అప్పటినుండీ స్టాలిన్‌గ్రాడ్‌లో తిష్టవేసి ఉన్న జెర్మన్ అధికారులను మట్టుపెట్టే బాధ్యత ఇతని చేతిలో పెట్టబడింది. 1942 నవంబర్ 10 నుండి డిసెంబర్ 17 మధ్యకాలంలో ఇతను 225మంది జెర్మన్ సైనికులను మాటువేసి అంతుచూశాడు. జైత్సెవ్ వద్ద శిక్షణ పొందిన సోవియెట్ స్నైపర్లు సుమారు మూడువేల మంది ప్రత్యర్ధులను మట్టుబెట్టినట్లు అంచనా. యుద్ధానంతరం జైత్సెవ్‌కి సోవియెట్ సైన్యంలోని అత్యున్నత మెడల్ ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ లభించింది. అతని రైఫిల్ ఇప్పటికీ స్టాలిన్‌గ్రాడ్ (ఇప్పుడు వోల్వోగ్రాడ్) మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

నలుపు-తెలుపు చిత్రాల జమానా నుండీ యుద్ధగాధలను తెరకెక్కించటమంటే హాలీవుడ్‌కి తగని మక్కువ. ‘కాసాబ్లాంకా’ (1942) నుండి నిన్నామొన్నటి ‘300′ దాకా ఎన్నెన్నో అద్భుత చిత్రాలు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో వచ్చిన చిత్రాలయితే కోకొల్లలు. అయితే, డి-డే ఆధారంగా ‘వేర్ ఈగిల్స్ డేర్’, ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’, ‘బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్’ వంటి సినిమాలు, పెర్ల్ హార్బర్ దాడి నేపధ్యంలో ‘ఫ్రమ్ హియర్ టు ఎటర్నిటీ’, ‘టొరా-టొరా-టొరా’, ‘పెర్ల్ హార్బర్’ వంటి చిత్రాలు రూపొందాయి కానీ వాటిని మించిన ప్రాముఖ్యత ఉన్న స్టాలిన్‌గ్రాడ్ ముట్టడిపై ఈ మధ్యకాలందాకా హాలీవుడ్ దృష్టి సారించకపోవటం విశేషం. ప్రధానంగా అమెరికన్ ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడిన హాలీవుడ్ చిత్రాల్లో నాటి శత్రువు సోవియెట్ యూనియన్ విజయాలను ప్రస్తుతించేలా తీసే సినిమాలకు ఆదరణ ఉండదన్న అనుమానం దానికో కారణం కావచ్చు.

అయితే ప్రఛ్చన్న యుద్ధానంతరం సగటు అమెరికన్లలో రష్యన్ల పట్ల తగ్గుతున్న విరోధభావానికి సూచికగా హాలీవుడ్‌లోనూ మార్పు మొదలైంది. దానికి ఉదాహరణే స్టాలిన్‌గ్రాడ్ పోరులో వస్సిలి జైత్సెవ్ సాధింఛిన రోమాంఛిత విజయాల ఆధారంగా 2001లో పారామౌంట్ పిక్చర్స్ వారు మరో రెండు బ్రిటిష్ చిత్ర నిర్మాణ సంస్థలతో కలిసి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’. జూడ్ లా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోల్డ్ మౌంటెన్, రోడ్ టు పెర్డిషన్), జోసెఫ్ ఫియెన్నెస్ (ఎలిజబెత్, షేక్‌స్పియర్ ఇన్ లవ్, లూధర్), రేఛల్ వైజ్ (ది మమ్మీ, రనవే జ్యూరీ, ది కాన్స్‌స్టంట్ గార్డెనర్), ఎడ్ హ్యారిస్ (అపోలో-13, రేడియో, నేషనల్ ట్రెజర్:బుక్ ఆఫ్ సీక్రెట్స్) వంటి ప్రతిభావంతులైన నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో గత దశాబ్ద కాలంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలలో ‘సేవింగ్ ప్రైవేట్ ర్యాన్’ తర్వాత ఆ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఇది. ఈ చిత్ర కధ ప్రధానంగా వస్సిలి (జూడ్ లా), అతని జెర్మన్ ప్రత్యర్ధి మేజర్ ఎర్విన్ కానిగ్ (ఎడ్ హ్యారిస్) ల మధ్య నడిచే దాగుడుమూతలాట. నిజ సంఘటనలకు కొంత కల్పన జోడించి దర్శకుడు జీన్-జాక్వెస్ అనౌడ్ (సెవెన్ ఇయర్స్ ఇన్ టిబెట్) తీసిన ఈ సినిమా యుద్ధ నేపధ్యంలో రూపొందిన ఆణిముత్యాల్లో ఒకటి.

భీకరమైన బ్రిటిష్ యాసతో మాట్లాడే జూడ్ లా, రేచల్ వైజ్ లను రష్యన్లుగా చూపటం, అచ్చమైన అమెరికన్ యాసలో సంభాషణలు పలికే ఎడ్ హ్యారిస్ ను జెర్మన్ సైన్యాధికారి పాత్రలో నటింపజేయటం మీద విమర్శలున్నా నిజజీవిత పాత్రలను నూటికి నూరుపాళ్లు అనుకరించే ప్రయత్నం చేయకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త అది. ఈ సినిమాలోని చారిత్రక సత్యాల వక్రీకరణపై కూడా విమర్శలొచ్చాయి. అయితే ఎంత చరిత్ర ఆధారంగా తీసినదైనా ఇది ఓ వ్యాపార విలువలున్న సినిమా మాత్రమే, డాక్యుమెంటరీ కాదు. కధాగమనాన్ని ఆసక్తికరంగా మలచటానికి ఆ మాత్రం వెసులుబాటు దర్శకుడు తీసుకోవటంలో తప్పులేదు.

యుద్దం అనగానే ట్యాంకులు, పేలుళ్లు, విమానాల దాడులు, వేలాది మంది సైనికుల గుంపులు అనే మూస ఒరవడికి భిన్నం ఈ చిత్రం. అక్కడక్కడా అవన్నీ ఉన్నా, చిత్ర కధ మాత్రం ప్రధానంగా ఒకరినొకరు తుదముట్టించటానికి ఇద్దరు ప్రత్యర్ధి స్నైపర్ల మధ్య ఎత్తులు, పైఎత్తులతో సాగే చదరంగం. మధ్యలో వచ్చిపోయే అనేక సహాయ పాత్రలు, వాటిలో గుర్తుంచుకోదగ్గది బాబ్ హాస్కిన్స్ పోషించిన నికితా కృశ్చేవ్ పాత్ర. ఇతర యుద్ధ చిత్రాలకు భిన్నమైన క్లైమాక్స్ ఈ చిత్రంలో ప్రత్యేకత. క్లైమాక్స్‌లో కేవలం రెండు బుల్లెట్లు మాత్రమే పేలుతాయిక్కడ.  యుద్ధవాతావరణాన్ని కళ్లకు కట్టే భారీ సెట్టింగులు, అద్భుతమైన కెమెరా పనితనం, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర హంగులతో రూపొందిన ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’ సాంకేతికంగా ’బ్లాక్‌హాక్ డౌన్’, ‘వియ్ వర్ సోల్జర్స్’ వంటి యుద్ధ కావ్యాలతో పోల్చదగ్గది.

యుద్ధగాధలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడవలసిన సినిమా ‘ఎనిమీ ఎట్ ది గేట్స్’.

బెల్లా
సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ తిరుగుతుంది: ప్రేమ, దయ, కుటుంబం. హింస, అశ్లీలత, గ్రాపిక్స్ మాయాజాలం, భారీ సెట్టింగుల మూస ఒరివడిలో కొట్టుకు పోతున్న హాలీవుడ్ చిత్రాల మధ్యలో బెల్లా ఓ పిల్లగాలి తెమ్మెర.

హోసె న్యూయార్క్ నగరంలో తన అన్న మానీ నడిపే రెస్టారెంట్‌లో ప్రధాన వంటవాడు. ఇతనిది అమెరికాలో స్థిరపడిన మెక్సికన్ కుటుంబం. అదే రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేసే నినా ఒక రోజు ఆలస్యంగా రావటంతో మానీ ఆగ్రహోదగ్రుడై ఆమెని ఉద్యోగం నుండి తొలగిస్తాడు. ఒకే చోట పని చేస్తున్నా హోసె, నినాలకు పెద్దగా పరిచయం ఉండదు. అయితే స్వతహాగా మంచివాడైన హోసె, నినా తొలగించబడిందని తెలిసి ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. దారిలో ఆమెని కలిసి ఆలస్యంగా వచ్చిన కారణమడుగుతాడు. తాను గర్భంతో ఉండటం వల్ల రావటం ఆలస్యమయిందని నినా చెబుతుంది. ఆమెకంటూ ఓ కుటుంబం ఉండదు. ఆమె కధ విని జాలిపడ్డ హోసె నినాకి సహాయ పడటానికి ప్రయత్నిస్తాడు. పేదరికంలో ఉన్న నినా బిడ్డని కనే ధైర్యం చేయలేక గర్భస్రావం చేయించుకునే ఆలోచనలో ఉంటుంది. అది తెలుసుకున్న హోసె ఆమెని ఎలాగైనా ఆ పని చేయకుండా ఆపటానికి ఆరాటపడతాడు. పెద్దగా పరిచయం లేని ఓ స్త్రీ అబార్షన్ చేయించుకోబోతే ఇతను అంతగా బాధ పడటానికో కారణముంది. ఆ కారణం ఏమిటి, ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయి ఫుట్‌బాల్ ఆటగాడయిన హోసె క్రీడాప్రపంచానికి దూరంగా ఒక సాధారణ రెస్టారెంట్‌లో వంటవాడిగా ఎందుకు పనిచేస్తున్నాడు, నినా అబార్షన్ చేయించుకుందా లేదా, చివరికి ఏమయింది, అసలింతకీ ‘బెల్లా’ ఎవరు - లాంటి వివరాలు సినిమా చూడాలనుకునేవారి కోసం నేను వెల్లడించట్లేదు.

ఈ సినిమాలో తారాబలం లేదు. ఉందంతా కధా బలమే. ఉన్నంతలో పెద్ద స్టార్ ప్రముఖ మెక్సికన్ నటుడు ఎడ్వార్డో వెరాస్తెగీ (మెక్సికన్ బ్రాడ్ పిట్ గా ఇతనికి పేరు. ఆంతోనియో బందెరాస్ తర్వాత హాలీవుడ్‌లో అంత పేరున్న మెక్సికన్ నటుడితను). పుట్టుకతో కేథలిక్ అయిన ఎడ్వర్డో అబార్షన్‌లకు వ్యతిరేకి. కొన్నేళ్ల పాటు అందరు నటుల్లాగానే మసాలా చిత్రాల్లో నటించాక ఎడ్వార్డో తనా నమ్మకాలకు విరుద్ధమైన చిత్రాల్లో నటించకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. ‘బెల్లా’ దర్శకుడు అలెజాండ్రో గోమెజ్ ఈ కధతో ఎడ్వార్డోని కలిసినప్పుడు కధలోని గాఢతకి కదిలిపోయి, దాన్లో నటించటమే కాకుండా నిర్మాణంలో కూడా భాగం పంచుకోటానికి ముందుకొచ్చాడతడు.

అలెజాండ్రో గోమెజ్ రూపొందించిన ఈ సినిమా దర్శకుడిగా అతనికి మొదటిది. ఈ చిత్రంతో అతను ప్రముఖ దర్శకుడిగా మారిపోయాడు. 2007లో విడుదలైన ఈ చిత్రం అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. అంతర్జాతీయ చిత్రోత్సవాలు అన్నింటిలోనూ పెద్దదిగా పేరొందిన టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ వాటిలో ఒకటి. యాహూ పాఠకుల ఆల్ టైమ్ ఫేవరిట్ చిత్రాల జాబితాలో ఇరవై రెండో స్థానం పొందిందీ చిత్రం (ఈ జాబితా స్థిరంగా ఉండదు). గుబురు గెడ్డంతో ఏప్పుడూ ఏదో కోల్పోయిన వాడిలా ఉండే హోసె పాత్రలో నటించిన ఎడ్వార్డో కళ్లలో పలికించిన కరుణ ఈ సినిమా చూసినవారిని కొన్నాళ్ల పాటు వెంటాడుతూనే ఉంటుంది. నీనా పాత్రలో నటించిన ట్యామీ బ్లాంచర్డ్, మానీగా నటించిన మానీ పెరెజ్, హోసె తండ్రి పాత్రలో జైమీ టిరెల్లి, తల్లి పాత్రలో ఏంజెలికా అరగాన్ కూడా ఆయా పాత్రలకు ప్రాణం పోశారు. ‘ఫీల్ గుడ్’ తరహా చిత్రాలు చూడాలనుకునే వారి జాబితాలో తప్పక ఉండవలసిన సినిమా ‘బెల్లా’.

అలన్ స్మితీ
కధ-స్క్రీన్‌ప్లే-మాటలు-పాటలు-సంగీతం-ఎడిటింగ్-శ్రాద్ధం-పిండాకూడు-దర్శకత్వం అంటూ అన్ని విభాగాల్లోనూ పొడిచేసినట్లు తెగబారెడు టైటిల్ కార్డ్ వేయించుకునే దర్శకరత్నాలు తెలుగు సినీపరిశ్రమలో కొన్నున్నాయి. మీడియా కూడా వీళ్లకి వీరతాళ్లేసి తరించిపోతుంటుంది. అయితే వీళ్లు నిజంగా ఇవన్నీ చేస్తారో లేదో అనుమానమే. పెరుమాళ్లు విప్పే లోగుట్టు ప్రకారం, చాలా సందర్భాల్లో వీళ్లు నిత్య సహాయ దర్శకుల తోడుతోనో, భూతాలనబడే భావి రచయితలు, గేయకర్తలు, సంగీతకారులు తదితరుల చేవతోనో పబ్బం గడిపేస్తుంటారు. అయితే వీళ్లకి పూర్తి భిన్నమైనవాడు హాలీవుడ్‌లో ఒకడున్నాడు. అతడే – అలుపెరగని సినీ స్రష్ట అలన్ స్మితీ.

అలన్ స్మితీ 1967లో అమెరికాలో జన్మించిన ఓ ఆణిముత్యం, ‘చైల్డ్ ప్రాడిజీ’ అనే మాటకి అసలుసిసలు అర్ధం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఏడాది కూడా నిండకుండానే ఓ హాలీవుడ్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిపారేశాడు. దాని పేరు ‘డెత్ ఆఫ్ ఎ గన్ ఫైటర్’. అలన్ స్మితీ ప్రతిభ దర్శకత్వానికే పరిమితం కాలేదు. నలభయ్యేళ్లొచ్చేసరికి హాలీవుడ్ సినీరంగంలో అతను స్పృశించని విభాగం లేదు. సుమారు డెబ్భై సినిమాలు/టివి  ఎపిసోడ్లకి దర్శకత్వం, పన్నెండు సినిమాలకి రచన, మూడిటికి ఎడిటింగ్ బాధ్యతలు, రెండిటికి నిర్మాణం, మరో రెండిటికి సినిమాటోగ్రఫీ చెయ్యటమే కాక ఆరు సినిమాల్లో నటించి కూడా ఉన్నాడు. కళాదర్శకత్వం, మేకప్ చేసిన చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి.

ఇన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నా, విచిత్రంగా అలన్ స్మితీ పేరు ఎక్కువమందికి తెలియదు. అతని మొదటి సినిమా బాగానే నడిచింది కానీ తర్వాతవి అంతగా ఆడలేదు. అతని పేరు వెలుగులోకి రాకపోవటానికి ఇదీ ఓ కారణం కావచ్చు. అయితే, విజయాలే వ్యక్తి ప్రతిభకి కొలమానాలైన సినీరంగంలో అపజయాలెన్నున్నా అలన్ స్మితీకి వెల్లువలా అవకాశాలొచ్చిపడటం గమనార్హం. ఇదే రిడ్లీ స్కాట్, జార్జ్ లూకాస్, టిమ్ బర్టన్ వంటి వారు చేసుంటే కుప్పలు తెప్పలుగా ఆస్కార్లు కొల్లగొట్టుండేవారు. ఓ హాలీవుడ్ దర్శకుడు తన కెరీర్లో ముప్పై సినిమాలు రూపొందిస్తే గొప్ప. ఆ రకంగా చూస్తే రాశి పరంగానన్నా అలన్ స్మితీకి జీవితకాల పురస్కారం పేరుతో ఓ ఆస్కార్ ఇచ్చెయ్యొచ్చు. కానీ అవార్డు సంగతి అవతలుంచితే అతనికి ఒక్క సారన్నా ఏ విభాగంలోనూ నామినేషన్ కూడా రాలేదు. ఎలా వస్తుంది? నామినేషన్ ఇవ్వటానికి ఇతను ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో ఎవరికన్నా తెలిస్తే కదా. అలన్ స్మితీని చూసిన వాళ్లు ఎవరూ లేరు!

వింతగా ఉందా?  హాలీవుడ్‌లో అలన్ స్మితీ పేరుతో ఏ వ్యక్తీ లేడు . కానీ పైన నేను చెప్పిందంతా నిజమే. కావాలంటే బోల్డన్ని హాలీవుడ్ సినిమాల్లో రకరకాల విభాగాల్లో అతని పేరు కనిపిస్తుంది చూడండి - Alan Smithee అంటూ.

‘దర్శకుడే సినిమాకి కెప్టెన్’ అనేది తెలుగు సినీజీవులు తరచూ వేసే అరిగిపోయిన రికార్డు. చాలావరకూ తెలుగు సినిమాల్లో దర్శకుడి నాయకత్వం అనేది నేతిబీరలో నెయ్యి. తొడలు కొట్టే మెగా హీరోబాబుల భారీ చిత్రాల విషయంలో ఇది మరింత పచ్చి నిజం. సినిమా నిర్మాణంలో హీరోగారి పరివారం తలో చెయ్యి వేసి దర్శకుడిని డమ్మీని చెయ్యటం ఇక్కడ సాధారణం. సినిమా ఆడితే అది హీరో మహిమ, పోతే మాత్రం దర్శకుడే బకరా. హాలీవుడ్‌లో దీనికి పూర్తి విరుద్ధం. అక్కడ సినిమాలకి దర్శకుడే నిజమైన సరంగు.  సినిమా ఆడినా పోయినా అతనిదే పూర్తి బాధ్యత. కొబ్బరికాయ కొట్టిన క్షణం నుండీ గుమ్మడికాయ కొట్టేదాకా ప్రతిదీ దర్శకుడి కనుసన్నల్లో జరగాల్సిందే - ఎంత పెద్ద సంస్థ నిర్మిస్తున్నా, ఎందరు మెగాస్టార్లందులో ఉన్నా. అదో అలిఖిత సూత్రం.

అయితే కొండొకచో ఈ సూత్రానికి విరుద్ధంగా జరిగే అవకాశమూ ఉంది. అలాంటి సందర్భాల్లో, సదరు దర్శకుడు ఆ సినిమా నిర్మాణం తన అదుపులో లేదు కాబట్టి దాని జయాపజయాలకి తనది బాధ్యత కాదని డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికాకి నివేదించుకోవచ్చు. అతని వాదనలో నిజం ఉందని డిజిఏ విశ్వసిస్తే ఆ సినిమాకి దర్శకుడిగా అతని పేరు బదులు అలన్ స్మితీ అనే కల్పిత నామాన్ని వాడమని నిర్మాతకి సూచిస్తుంది. ’the alias men’ అనే మాటలో అక్షరాలని తారుమారు చేస్తే పుట్టిందే ఈ Alan Smithee అనే పేరు. ఈ సంప్రదాయం డెత్ ఆఫ్ ఎ గన్ ఫైటర్ (1969) నుండి మొదలయింది. ఇప్పటి దాకా సుమారు డెబ్భై సినిమాలు/టివి ఎపిసోడ్లు అలన్ స్మితీ దర్శకత్వంలో విడుదలయ్యాయి. ఎక్కువగా దర్శకుడి విషయంలో వాడినప్పటికీ, కొన్ని సందర్భాల్లో నటులు, కూర్పరులు వంటి ఇతర విభాగాలవారికి కూడా ఈ పేరు వాడటం జరిగింది. ఒక సినిమాకి ఒకరికన్నా ఎక్కువ మంది దర్శకులు పనిచేసి, వారిలో ఎవరూ ఆ సినిమాకి పూర్తి బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడనప్పుడు కూడా ఇదే పేరు వాడటం జరుగుతుంది.

తెలిసింది కదా. ఈ సారి ఏదైనా హాలీవుడ్ సినిమాకి సంబంధించి అలన్ స్మితీ పేరు కనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించి కానీ చూడొద్దు. ఎంతైనా దర్శకుడే చేతులు దులుపుకున్న చిత్రరాజం కదా – అది చెత్తగా ఉండే అవకాశాలే ఎక్కువ.

కొసమెరుపు: అలన్ స్మితీకి అలెన్ స్మితీ, ఆడమ్ స్మితీ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. 2000లో ఇతనికి థామస్ లీ అనే వారసుడొచ్చాడు. అదే ఏడాది అలన్ స్మితీ వృత్తి విరమణ చేశాడు.