Author Archive for అబ్రకదబ్ర

avatar

మన సినిమా - రెండవ భాగం

మన సినిమా – రెండవ భాగం

మొదటి భాగంలో ‘లోపం ఎక్కడ’ అని ఒకటికి రెండు సార్లు అనుకున్నాం. సమాధానం చాలా తేలిక: నిబద్ధత లేమి. దీన్ని మన దర్శకనిర్మాతలు రకరకాలుగా కప్పిపుచ్చుకుంటారు – నిపుణుల కొరత, సమయాభావం, మార్కెట్ పరిమితులు, వగైరా, వగైరా. ‘పురుటి నొప్పుల ఊసొద్దు, బిడ్డని కని చూపెట్టు’ అనే అర్ధంలో ఆంగ్ల వాడుకొకటుంది. వంకలు చెప్పేవాళ్లు విజేతలవరు. నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఆలోచన ముఖ్యం. అదున్నప్పుడు ఫలితాలు వద్దన్నా వస్తాయి. ఇది గ్రాఫిక్స్ ఒక్కదానికే వర్తించే విషయం కాదు. కథల ఎంపిక దగ్గరే ఇది మొదలవాలి.

మన సినిమా - మొదటి భాగం

మన సినిమా – మొదటి భాగం

ఈ వ్యాసం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో తెలుగు సినిమాల్లో ‘హాలీవుడ్ స్థాయిలో’ ఉండే గ్రాఫిక్స్ నాణ్యత గురించిన చర్చ ఉంటుంది. రెండో భాగంలో తెలుగు సినిమాల్లో కథల కొరత గురించిన చర్చ ఉంటుంది. అలాగే కొన్ని సమస్యల ప్రస్తావనా ఉంటుంది. వాటికి ఒక పరిష్కార సూచన కూడా ఉంటుంది (అదెంత ఆచరణాయోగ్యం అనేది వేరే చర్చ) మూడో భాగంలో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణ పద్ధతుల గురించిన కొన్ని వివరాలు, (అతి తేలిగ్గా పాటించగల) వాటిని తెలుగులో ఎక్కువ మంది దర్శకులు ఎందుకు అలక్ష్యం చేస్తారనే విషయమ్మీద చిన్నపాటి చర్చ ఉంటుంది.

ఆర్సన్ వెల్స్ - చివరి భాగం

ఆర్సన్ వెల్స్ – చివరి భాగం

(మొదటి భాగం తరువాయి)

1915 మే 6న అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం కెనోషా పట్టణంలో ఓ ధనిక కుటుంబంలో జన్మించిన ఆర్సన్ వెల్స్ సంగీతకారిణి అయిన తల్లిద్వారా చిన్నతనంలొనే పియానో, వాయులీనం వంటి వాయిద్యాలను ఉపయోగించటం నేర్చుకున్నాడు. అతనికి ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఎనిమిదేళ్ల ప్రాయంలో తల్లి, పదమూడేళ్లప్పుడు తండ్రి కాలం చేశారు. చిన్నప్పటినుండీ వెల్స్ దృష్టి చదువు కన్నా కళల మిద ఎక్కువ ఉండేది. టీనేజ్‌లో కొచ్చేటప్పటికే అతను ఐరోపాని రెండు సార్లు చుట్టిరావటమే కాకుండా, [...]

ఆర్సన్ వెల్స్ - మొదటి భాగం

ఆర్సన్ వెల్స్ – మొదటి భాగం

ప్రపంచాల యుద్ధం
ఆ రోజు 1938 అక్టోబరు 30, ఆదివారం రాత్రి. తెల్లవారితే హాలోవీన్ అనబడే ప్రేతాత్మల పండగ. అది అమెరికా దేశం. చలికాలం అప్పుడే మొదలవుతుంది. అమెరికన్ సమాజం ఇంకా మహామాంద్యపు కోరలనుండి బయటపడలేదు. ఐరోపాలో హిట్లర్ ముప్పు ముంచుకొస్తున్న రోజులవి. ఐరోపాలో యుద్ధమంటూ వస్తే, పులిమీద పుట్రలా, ఆ సెగ తమనూ తాకుతుందని అమెరికన్ల మనసులో ఏమూలో బెదురు. జెర్మన్ల యుద్ధ యంత్రాలపై, తంత్రాలపై రోజుకో కధనం. ఈ నేపధ్యంలో, అతి మామూలుగా మొదలయిందా ఆదివారం సాయంత్రం. ఒక సమాజపు [...]

ది మెజెస్టిక్

ది మెజెస్టిక్

హాలీవుడ్ హాస్య చిత్రాలనగానే నేటి తరం ప్రేక్షకులకి గుర్తొచ్చే మొదటి పేరు: జిమ్ క్యారీ. ‘ది మాస్క్’, ‘ఏస్ వెంచురా: పెట్ డిటెక్టివ్’,  ‘లయర్-లయర్’, ‘డంబ్ అండ్ డంబర్’, ‘హౌ ది గ్రించ్ స్టోల్ క్రిస్మస్’,  ’బ్రూస్ ఆల్‌మైటీ’ వంటి హిట్ చిత్రాలతో హాస్యనటుడిగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడీ ప్రతిభావంతుడు. క్యారీ పేరు చెప్పగానే అతని ఎలాస్టిక్ ముఖమే మదిలో మెదులుతుందెవరికైనా. ఐతే జిమ్ క్యారీ హాస్య చిత్రాలకే పరిమితమవకుండా ‘ది ట్రూమాన్ షో’, ‘ఎటర్నల్ సన్‌షైన్ [...]

సిటిజెన్ కేన్

సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు [...]

ఎనిమీ ఎట్ ది గేట్స్

ఎనిమీ ఎట్ ది గేట్స్

‘రెండవ ప్రపంచ యుద్ధాన్ని మలుపు తిప్పిన రోజు ఏది’ అన్న ప్రశ్నకి కొందరు చరిత్రకారులు ‘జూన్ 6, 1944′ (నార్మండీ వద్ద జరిగిన డి-డే పోరాటం) అంటే మరి కొందరు ‘డిసెంబర్ 7, 1941′ (పెర్ల్ హార్బర్ మీద జపాన్ వైమానిక దాడి) అంటారు. ఎక్కువమంది మాత్రం ముక్త కంఠంతో ‘జూన్ 22, 1941′ అని చెబుతారు. హిట్లర్ ఆదేశాలతో జెర్మన్ దళాలు సోవియెట్ యూనియన్ మీద మెరుపు దాడి చేసిన రోజది; ఇష్ఠమున్నా లేకున్నా స్టాలిన్ [...]

బెల్లా

బెల్లా

సినిమాలు రకరకాలు. నచ్చేవి, నచ్చనివి, మళ్లీ మళ్లీ చూడాలనిపించేవి, ఒక్క సారికే విసుగెత్తించేవి, వెంటనే మర్చిపోయేవి, ఎన్నాళ్లైనా వెంటాడేవి. ‘బెల్లా’ (Bella, 2007 విడుదల) చివరి కోవకి చెందింది. ఇటువంటి సినిమాలు తీయటం కత్తిమీద సాము. మసాలాలు ఏవీ లేని ఈ కధని జనరంజకంగా మలచి విజయవంతం చేయటం దర్శక నిర్మాతల ప్రతిభ, ధైర్యం. చిన్న సంఘటనలు కొన్ని జీవితాలని ఎలా మలుపు తిప్పుతాయో ఈ చిత్రం చెబుతుంది. చిత్ర కధనం అంతా మూడు విలువల చుట్టూ [...]

అలన్ స్మితీ

అలన్ స్మితీ

కధ-స్క్రీన్‌ప్లే-మాటలు-పాటలు-సంగీతం-ఎడిటింగ్-శ్రాద్ధం-పిండాకూడు-దర్శకత్వం అంటూ అన్ని విభాగాల్లోనూ పొడిచేసినట్లు తెగబారెడు టైటిల్ కార్డ్ వేయించుకునే దర్శకరత్నాలు తెలుగు సినీపరిశ్రమలో కొన్నున్నాయి. మీడియా కూడా వీళ్లకి వీరతాళ్లేసి తరించిపోతుంటుంది. అయితే వీళ్లు నిజంగా ఇవన్నీ చేస్తారో లేదో అనుమానమే. పెరుమాళ్లు విప్పే లోగుట్టు ప్రకారం, చాలా సందర్భాల్లో వీళ్లు నిత్య సహాయ దర్శకుల తోడుతోనో, భూతాలనబడే భావి రచయితలు, గేయకర్తలు, సంగీతకారులు తదితరుల చేవతోనో పబ్బం గడిపేస్తుంటారు. అయితే వీళ్లకి పూర్తి భిన్నమైనవాడు హాలీవుడ్‌లో ఒకడున్నాడు. అతడే – అలుపెరగని సినీ స్రష్ట అలన్ స్మితీ.
అలన్ [...]

Powered By Indic IME