|
నవ్య సినిమా
దృశ్య శ్రవణ మాధ్యమాల్ని తనలో ఇముడ్చుకుని ఈ శతాబ్దపు అధ్భుతంగా రూపొందిన సినిమా సర్వకళా సమ్మిశ్రితమై వందేళ్ళుగా విశ్వవ్యాప్తంగా విరాజిల్లుతోంది. శాస్త్ర పరిణామమూ, నవ్య సాంకేతిక పరిశోధనల్లోంచి కళారూపంగా జనించిన సినిమా అన్ని కళల్లాగే స్వీయ కళాత్మకమయిన భావాల్ని సంతరించుకుంది. సామాజికప పరిశీలనే ప్రధాన లక్షణంగా ఎదిగిన సినిమా జీవన వాస్తవాల్ని ఆవిష్కరిస్తుంది. అంతేకాదు మనిషి చేతన, అంత:చేతనలోని అంశాల్ని కూడా వ్యక్తీకరించే స్థాయి సినిమాకుంది. వివిధ కాలాల్లోని సంక్లిష్ట సామాజిక సమస్యల్ని, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం [...] |
|
మేఘే ఢాకా తారా
భారతీయ సినిమా రంగంలో రిత్విక్ ఘటక్ (ఋత్విక్ ఘటక్) ఓ హై ఓల్టేజీ టాలెంట్. ఆయన నిర్మించిన చిత్రాల్లో ఎంచుకున్న సబ్జెక్టు కానీ, నిర్మాణ రంగంలో ఆయన చిత్రీకరణ పధ్ధతి , సంగీతాన్ని దృశ్యాల్ని లయీకరించిన విధానమూ ఆయన స్థాయిని చెబుతాయి. భారతదేశ విభజన పట్ల ఆయన దు:ఖపడడమూ, కళాత్మకంగా స్పందించిన తీరూ ఆయనలోని సున్నితత్వాన్ని, నిజాయితీని స్పష్టపరుస్తాయి.నవ్య వాస్తవిక వాదిగా ఆయన చిత్రాల్లో అత్యంత వేదనా భరితమయిన బతుకుల్ని వెళ్ళదీస్తున్న వారే ప్రధాన పాత్రలుగా నిలుస్తారు.భారతీయ [...] |
|
రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం
దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి. 1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి [...] |
|
లేఖయుదె మరణం-ఒరు ఫ్లాష్ బ్యాక్
సినిమా నిర్మాణం ఆరంభం అయినప్పటి నుంచి అది అత్యంత ఆకర్షణీయ కళా రంగమే. వెలుగు జిలుగుల నడుమ మెరుస్తూ కనిపించే ఆ రంగం పట్ల ఆకర్షితులు కావడం అత్యంత సహజం. కాని పరమపదసోపానం లాంటి ఆ రంగంలోకి అడుగిడి అత్యున్నత స్థానం అందుకున్న వారు కొద్దిమంది వుంటే దయనీయమయిన అనుభవాలు ఎదురై జీవితంలో ఓటమి పాలయిన వారు ఎదగడానికి పడ్డ శ్రమ, ఎదుర్కొన్న చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ మెరుపుల వెనకాల పొంచి ఉన్న [...] |
|
Film society movement in Andhra Pradesh
To create a sizeable audience for realistic, artistic and meaningful cinema and to spread good cinema culture among the people were the principal objectives of the First film society. In addition to the above the film societies had another important activity of inspiring the Film makers to make films with aesthetic and artistic approach towards [...] |
|
భారతీయ సినిమాల్లో స్త్రీ
నాటి నుంచి నేటి దాకా మానవ వ్యక్తీకరణలకు ప్రతిరూపాలైన కళారంగాల్లో స్త్రీలను చిత్రించడంలో కూడా ’వివక్ష’ జీవితమంత విశాలంగానే సాగుతూ వచ్చింది. గత శతాబ్దం మానవాళికి అందించిన మహత్తరమైన కళారూపం సినిమా కూడా స్త్రీలపట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తూనే ఉంది. సమిష్టి కళారూపమై సమాజపు అన్ని కోణాల్ని ఆవిష్కరిస్తూ ముందుకు రావాల్సిన సినిమా మహిళా దృక్పధాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకు సాగింది.ప్రజలపైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని నమోదుచేస్తున్న ఈ దృశ్య శ్రవణ మాధ్యమం స్త్రీలను, స్త్రీల సమస్యల్ని, [...] |
|
మహానగర్
పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన [...] |
|
జాన్ అబ్రహం-ఒక పరిచయం
సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం. ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట [...] |
|
సత్యజిత్ రే-ఒక పరిచయం
ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు [...] |
|
Women in Adoor Gopalakrishnan’s Cinema
Adoor Gopalakrishnan, a name parallel to the artistic cinema of India is a versatile film maker with different shades and his films are centered in Kerala and Malayalam life. He concerts on the Human and societal relationships. Since his first film ‘one’s own choice’ (Swayamvaram) to the latest film ‘four women’ (Naalu Pennungal), all his [...] |
|
సయూద్ అఖ్తర్ మీర్జా – ఒక పరిచయం
వర్తమాన భారతంలో నెలకొని వున్న సామాజిక, రాజకీయ, అర్థిక, మత విచ్చిన్నకర పరిస్థితుల విషయంలో తరపి చేసిన ప్రతిభావంతమయిన వ్యాఖ్య, విమర్శ సయీద్ అఖ్తర్ మీర్జా. ఆయన చిత్రంలోని అరవింద్ దేసాయిలాగా ఆయన కూడా స్పష్టంగా బాధితులవైపు, మైనారిటీల వైపు, వెనకబడ్డ వారి వైపు నిలుచున్నాడు. అంతెందుకు ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ఖచ్చితంగా జీవితాంతం ప్రతిపక్షంలోనే నిలుచుంటాను” అంటాడు. అలా సుస్పష్టమయిన ఆలోచన నిబద్దలతో చిత్రాలు తీస్తున్న సయీద్ మీర్జా తన చిత్రాలకు పెట్టిన పెర్లే ఆయన [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |