Menu

anand Archive

చారులత

భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు రూపమైన సత్యజిత్ రే తన జీవితకాలంలో నిర్మించిన ముప్పైకి పైగా చలన చిత్రాల్లో అత్యంత భావావేశంతో కూడుకున్న చిత్రం “చారులత”. ఆ చిత్రంలో అత్యంత వివేకమూ, అమితమయిన సున్నితత్వమూ, తనపైన తనకు గాఢమైన విశ్వాసమూ కలిగిన అందమయిన స్త్రీ చారులత ముఖ్యాభినేత. ఆమె తన జీవితంలో ఎదిగిన తీరూ, అనుభవించిన ఒంటరితనమూ, తన అభీష్టాలను నెరవేర్చుకునే క్రమంలో ఆమె ముందుకు సాగిన వైనమూ ఈ చిత్రంలో ప్రధానాంశాలు. తన కుటుంబ జీవన

మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన

సత్యజిత్ రే-ఒక పరిచయం

ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు

‘‘తెలుగు చలన చిత్ర అకాడమీ’’ కావాలి!

దేశంలో హిందీ తరువాత అత్యధిక సంఖ్యలో సినిమాలు వచ్చిన ఘనత తెలుగు సినిమా రంగానికి ఉంది. భక్త ప్రహ్లాదతో మద్రాసులో వేళ్ళూనుకుని ఉన్న తెలుగు సినిమాను మాతృభాషాభిమానం తదితర కారణాలతో హైదరాబాద్ తరలించేందుకు అనేక మంది మఖ్యమంత్రులు కృషి చేశారు. సినిమా వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి స్టూడియోలు కట్టుకోవడానికి, డబ్బింగ్, రికార్డింగ్ థియేటర్లు నిర్మించుకోవడానికి రాయితీలు, రుణాలు ఇంకా ఎన్నో వసతులు కల్పించారు. వేలాది ఎకరాల హైదరాబాద్ భూములను అప్పగించారు. తెలుగు సినీ ప్రముఖులు ప్రభుత్వ

రాష్ట్రవ్యాప్తంగా క్యాంపస్ ఫిలిం క్లబ్ లు

ఆధునిక యువత ముఖ్యంగా విద్యార్థులు సమాజంపై దుష్ప్రభావం చూపే కార్యక్రమాలు చూస్తూ వ్యసనాల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి ధోరణి నుంచి నవ సమాజాన్ని రక్షించడమే కాకుండా వారిలో సృజనాత్మకత శక్తిని పెంచుతూ ఉపాధి అవకాశాలు విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సృజన, కళలు, సందేశాత్మక, పర్యావరణం, విద్యాపరంగా గుణాత్మక విజ్ఞానం అందించే మంచి సినిమాలు చూపించి విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం డిగ్రీస్థాయి విద్యార్థులను పరిగణనలోకి తీసుకుంది. భారత సినిమా సంస్థల సమాఖ్య సంకల్పం దీనికి