|
కామెడీ డ్రామా! – పిల్ల జమీందార్
తారాగణం: నాని, బిందుమాధవి హరిప్రియ, మేఘనానాయుడు రావురమేష్, ‘వెనె్నల’ కిషోర్ ఎమ్మెస్ నారాయణ తదితరులు. —- సినిమాటోగ్రఫీ: సాయ శ్రీరామ్ సంగీతం: సెల్వగణేష్ నిర్మాణం: సిరి శైలేంద్ర సినిమాస్ నిర్మాత: మాస్టర్ బుజ్జిబాబు దర్శకత్వం: జి.అశోక్ —- ‘క్యారెక్టర్స్‌లోని ట్రాన్స్‌ఫర్మేషన్ మంచి నాటకానికుండాల్సిన ప్రధాన లక్షణం’ అని షేక్‌స్పియర్ అన్నారు. అందుకే నాటకాలలో ఈనియమాన్ని తప్పనిసరిగా ఫాలో అవుతూ ఆ మేరకే క్యారెక్టర్స్‌ని డిజైన్ చేసేవారు. నాటకానికి తర్వాతి తరం ఎంటర్‌టైన్‌మెంట్ అయిన సినిమాలో కూడా ఈ [...] |
|
వెర్నర్ హెర్జోగ్ చిత్రాల ప్రదర్శన
ఆధునిక జర్మన్ చిత్రాలనే కాకుండా ప్రపంచ చలన చిత్రాలనే ప్రభావితం చేస్తున్న జర్మన్ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ చలనచిత్రాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభమౌతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం. 1లోని లామకాన్ ఇందుకు వేదిక కానుంది. నవతరంగం, గోథే జంత్రం, దాక్యుమెంటరీ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్, అలెయన్స్ ఫ్రాంచైస్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్, లామఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ చిత్ర ప్రదర్శన మూడు రోజులపాటు వుంటుంది. సమయం 7 గంటల నుండి అందరూ ఆహ్వానితులే [...] |
|
“అము” (2005): ఒక పరిచయం
బోస్ సినిమా చూసాక, లక్ష్మీ సెహగల్ గురించి చదువుతూ, వాళ్ళ అమ్మాయి “అము” అనే సినిమాలో నటించిందని చదివాక, ఆ సినిమా ఏమిటా అని ఆరా తీస్తే, అందులో బృందా కారత్ కూడా ప్రధాన పాత్రధారి అని తెలిసేసరికి కుతూహలం కలిగి, చూడ్డం మొదలుపెట్టాను. ఈ సినిమా ౧౯౮౪ సిక్కుల ఊచకోత నేపథ్యంలో జరిగే ఆధునిక జీవితాల కథ. ప్రధాన పాత్రధారులు: కొంకనసేన్ శర్మ, బృందా కారత్, అంకూర్ ఖన్నా, యశ్పాల్ శర్మ తదితరులు. కథ, నిర్మాణం, [...] |
|
P O E T R Y – ఓ హృద్యమైన కవిత
పక్షులు కిలకిలారావాలతో ఆ ప్రాంతం సందడిగా ఉంది. పరిమళ భరితమైన మలయ మారుతం లేలేత చిగురాకులను పలుకరిస్తూ, ఊసులాడుతున్నది. నీలి రంగు తివాచీలా ఉన్న ఆకాశపు ప్రతిబింబాన్ని తనలో చూపెడుతున్న ఆ సరస్సు ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకున్నది. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి హొయలుబోతున్నది. స్వప్న సీమలా ఉన్న ఆ వనము సంతోషానికి చిరునామాలా ఉన్నది. అలాంటి చోట ఎవరికైనా కవిత్వం ఉప్పొంగి వస్తుంది. కానీ ఒక విషయం. ఈ రోజుల్లో కవిత్వమంటే ఎందరికి ఆసక్తి ఉంది? [...] |
|
“L O V E” – it just happens.
కొన్ని విషయాలు చాలా సరళంగా ఉంటాయి.. కాని ఆ సరళత్వం లోనే సంక్లిష్టత ఉంటుంది.జీవితం కూడా అంతే. చాలా సరళంగా కనపడుతుంది. ఈ స్నేహాలు,బాంధవ్యాలు.. ఒడిదుడుకులు..జీవితం విసిరే సవాళ్లు,కలయికలు..విడిపోవటాలు..తెలిసి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. తద్వారా మనం గొప్ప భావోద్వేగాలకి గురి అవుతూనే ఉంటాం.ఆ భావోద్వేగాలే మనకి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి,ఒకింత దృష్టి పెడితే తద్వారా గొప్ప జీవిత సత్యాలని గ్రహిచగలుగుతాం. Ask Tesadüfleri Sever (Love Likes Coincidences) ఈ సినిమా కూడా అంతే… చాల సరళంగా [...] |
|
జగ్జీత్ -ఒక అమర గీతం
సరిగ్గా రెండు మూడు వారాల క్రితం. నిండా పది సంవత్సరాలు లేని ఒక చిన్న కుర్రాడు.. నీలాకాశం లాంటి నీలి కళ్ళు, అమాయకత్వపు చూపులు , చూసిన వారికి ముద్దే కాదు బోలెడెంత ప్రేమ కలిగించే కనిపించే చూపులతనివి. అతను వచ్చిన ఒక మూరుమూల వెనకపడిన గ్రామానికి ఛిహ్నంలా అనిపిస్తుంది బక్కపలుచని దేహం. అంత బలహీన దేహం నుంచి వెలువడుతున్న స్వరం మనల్ని ఒక సంగీత ప్రపంచంలోకి తీసుకు వెళ్ళి పోయే ఓ హిందీ పాటను ఆలాపిస్తోంది. [...] |
|
పరమసిల్లీ కథనంతో ‘ఊసరవెల్లి’
సినిమా చూసొచ్చి రివ్యూ రాయడానికి టైప్ కొడుతూ, కథ కష్టపడి వెతుక్కునే స్థాయికి తెలుగు సినిమా గత పదిపదిహేను సంవంత్సరాలుగా దిగజారుతూనే ఉంది. కథకు కావలసిన సామాగ్రిని అడ్డదిడ్డమైన స్క్రీన్ ప్లే పేరుతోనో లేక హీరోని కూడా కామెడీ కోసం కథకు సంబంధంలేని నానాగడ్డీ కరిపించో అసలు కథను అద్భుతంగా పారేసుకొనే సాంప్రదాయం మన ప్రత్యేకత. ఊసరవెల్లి సినిమా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. కథగా చెప్పాలంటే కొంచెం కష్టమే అయినా ప్రయత్నిస్తాను. గమ్యంలేకుండా చిన్నచిన్న గూండాగిరీచేసుకుని [...] |
|
Bose: The Forgotten hero (2005)
౨౦౦౪-౦౫ ప్రాంతంలో నాంపల్లి లోని గృహకల్ప కాంప్లెక్స్ లో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారి ఎగ్జిబిషన్లో సుభాష్ చంద్రబోసు గురించి శిశిర్ కుమార్ బోస్ రాసిన జీవితచరిత్ర పుస్తకం ఒకటి కొన్నాను. అప్పట్లోనే శ్యాం బెనెగల్ తీసిన “నేతాజీ సుబాష్ చంద్ర బోస్: ది ఫర్గాటెన్ హీరో” సినిమా గురించి కూడా తెలిసింది. నా ఖర్మ కొద్దీ బాగా కత్తిరించిన డీవీడీ దొరికి, గంటన్నర నిడివి ఉన్న సినిమా చూసి, అదే సినిమా అనుకుంటున్నప్పుడు చివరకి [...] |
|
గుల్జార్ కవిత్వం సెల్యులాయిడ్ పై: ఇజాజత్
ముందుగా కొన్ని disclaimers ఇది గుల్జార్ సాబ్ రాసి, తీసిన సినిమా ’ఇజాజత్’ గురించి నా ఆలోచనల వ్యాసం. సమీక్ష కాదు. నాకు సినిమాలంటే అట్టే ఇష్టం ఉండవు. మా కాల్విన్‍గాడు అన్నట్టు, Happiness is not enough for me. I need euphoria. సమిష్టి వ్యవసాయమైన సినిమారంగంలో ఒక అత్యద్భుతమైన ఉత్పత్తి రావాలంటే ఎందరో కల్సి పనిచేయాలి. ఇంకెన్నో కల్సి రావాలి. ఇలా అరుదుగా జరుగుతుంది. అలా జరక్కపోతే సినిమా ఎక్కదు నాకు. అలా [...] |
|
మైనే గాంధీ కొ నహీ మారా
ఈ సినిమా ౨౦౦౫లొ వచ్చినప్పుడు, చూడాలి చూడాలి అనుకున్నా కూడా, ఇప్పటికి చూసాను. అద్భుతమైన సినిమా. అర్రే! దీన్నా నేను మిస్సయింది! అనిపించింది. అందుకే, ఈ సినిమా గురించి ఒక చిన్న పరిచయం – కథ: ఇది హిందీ సాహిత్యం లో ఆచార్యులుగా పనిచేసి విశ్రమిస్తున్న ఉత్తమ్ చౌదరి అన్న వ్యక్తి కథ, అతని కుటుంబం కథానూ. ఆయనకి క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ, మొదట డిమెంషియా అనీ, తర్వాతా అల్జీమర్స్ అనీ….ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉండగా, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |